Margadarsi Chit Fund Scam: AP CID Attached Another 242 Crores - Sakshi
Sakshi News home page

మార్గదర్శికి మరో భారీ షాక్‌.. ఈసారి రూ. 242 కోట్ల ఆస్తుల జప్తు

Published Thu, Jun 15 2023 7:29 PM | Last Updated on Thu, Jun 15 2023 9:14 PM

Margadarsi chit fund scam: AP CID Attached Another 242 Crores - Sakshi

సాక్షి, విజయవాడ: మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. 

మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్‌) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది.

ఇదీ చదవండి: సూర్య నారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement