margadarshi
-
మహా విష్ణువుకు ఇష్టం.. మార్గశిర మాసం
కడప కల్చరల్ : మార్గశిరం.. మహా విష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. వైష్ణవులకు ముక్తిదాయకమైన మాసం.. వరుస పర్వదినాలతో అధిక పుణ్యం సంపాదించుకునే మార్గం.. మార్గశిరమాసం.. ఈ మాసం, ఈ సందర్భంగా వచ్చే పర్వదినాలు, నిర్వహించే పూజల గురించిన వివరాలు..అన్ని మాసాలలో మార్గశిరం తనకెంతో ఇష్టమైనదని మహావిష్ణువు స్వయంగా చెప్పినట్లు పౌరాణికులు చెబుతుంటారు. ఇతర మాసాలన్నింటికంటే ఈ మాసం వైష్ణవులకు అత్యంత పుణ్యదాయకమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే పలు పర్వదినాల్లో చేసే పూజలు తమకెంతో పుణ్యాన్ని ఇస్తాయన్నది వారి విశ్వాసం.కార్తీక మాసపు అమావాస్య తర్వాతి రోజు సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభం కానుంది. ఇది హేమంతంలో వచ్చే మొదటి నెల. సౌరమానం ప్రకారం ధనుర్మాసం, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం వస్తాయి. ఈ మాసంలో భక్తులు ఎక్కువ సమయం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ప్రకృతి కూడా మనోహరంగా కనువిందు చేస్తూ ఉంటుంది. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది గనుక దీన్ని మార్గశిరమాసమని పేర్కొంటారు. ఈ మాసంలో ఏ పూజచేసినా అధిక పుణ్యం లభిస్తుందని పెద్దలు పేర్కొంటారు.మార్గశిరంలో పర్వదినాలుఈ మాసంలో శివ పుత్రుడు సుబ్రమణ్యస్వామికి సంబంధించిన సుబ్రమణ్యషష్ఠి పండుగను ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రమణ్యషష్ఠిగా కుమారస్వామికి పూజలు నిర్వహిస్తారు. ఫలితంగా యోగా, ఆరోగ్యబలం చేకూరుతాయని భక్తుల్లో విశ్వాసం ఉంది. శుక్లపక్ష సప్తమి నాడు లోకమిత్రుడు, ప్రత్యక్ష నారాయణుని ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఆరోజున దినకరుని పూజ ఆరోగ్యాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతి వస్తుంది. ఈ సందర్భంగా విశ్వమానవాళికి ఉత్తమ మార్గదర్శనం చేసే జ్ఞాన గ్రంథం భగవద్గీత పారాయణం పుణ్యదాయకమని పేర్కొంటారు. శుక్ల ద్వాదశి నాడు మహా విష్ణువుకు సంబంధించిన వ్రతాలు, త్రయోదశి నాడు అంజనీపుత్రుడు హనుమంతుని పేరిట వ్రతాలు నిర్వహిస్తారు. ఈ పూజల ద్వారా దుష్ట గ్రహాల నుంచి వచ్చే బాధలు తొలగిపోతాయన్న నమ్మకం ఉంది. ఈ మాసంలోనే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినంత వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెలలో కాలభైరవాష్టమి కూడా వస్తుంది. ఆరోజున నిర్వహించే పూజలు ఆరోగ్యదాయకమంటారు. మార్గశిర శుద్ధ పౌర్ణమినాడు దత్తాత్రేయ జయంతి నిర్వహిస్తారు. -
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను ఉద్దేశించి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
-
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు.. 18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అ«దీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది.వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచి్చంది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆరి్థక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అ«దీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచి్చంది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచి్చన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చి0ది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచి్చన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమరి్థంచారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చి0ది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చి0ది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచి్చన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
నిజాయితీగా వాస్తవాలు చెప్పండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిన విధంగా ఆయనకు పెన్‌డ్రైవ్‌లో చందాదారుల వివరాలను అందచేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడకుండా అరుణ్ కుమార్‌ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్లొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టుచట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది.ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ ధర్మాసనాన్ని కోరారు.ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యర్థన మాత్రం పెన్‌డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణకన్నా ముందే పెన్‌డ్రైవ్‌ను అందజేస్తే, కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్‌కు మంచి రోజని లూథ్రా వ్యాఖ్యానించగా.. అవునని, ఆ రోజున తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీ ఉపన్యాసం వింటానని ఉండవల్లి చెప్పారు. చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. చందారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శే అంగీకరించిందని «తెలిపారు. గత 10–15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.5.30 కోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటివరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందుకే ఈ విషయంలో కోర్టుకు సహకరించదలిచానని, ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావడంలేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపైనా అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవల్లి పత్రికా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూథ్రా కోరారు.గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో మీరు (లూథ్రా) కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. ఈరోజు (సోమవారం) మార్గదర్శి కోర్టు ముందుంచిన 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలన్నారు. ఇది సంచలన కేసు అని, మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకి మీ మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించింది.‘సన్‌లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెడ్’ (పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం, వాస్తవాలను బహిర్గతం చేయడం) – మార్గదర్శిని ఉద్దేశించి ధర్మాసనం చెప్పిన యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి లూయిస్ బ్రాండీస్ కొటేషన్ -
మార్గదర్శి విజ్ఞప్తికి అంగీకరించని హైకోర్టు!
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను మీడియా ముందుకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని మార్గదర్శి భావించింది. అయితే.. అందుకు హైకోర్టు బ్రేకులు వేసింది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి.. తరచూ మీడియా ముందుకు వచ్చి మార్గదర్శి అవినీతి తుట్టెను కదిలిస్తున్నారు. దీంతో ఆయనను మీడియా ముందుకు రానివ్వకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది మార్గదర్శి. అయితే.. విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం మార్గదర్శి లాయర్ సిద్ధార్థ లూథ్రాకు స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. లూథ్రా తీరుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.‘‘సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో హైకోర్టుకు సహకారం అందిస్తున్నా. నేను ఏ ఒక్కరి తరఫు లాయర్ కాదన్నది గుర్తుంచుకోవాలి. మీడియాతో నేను మాట్లాడి మూడు నెలలు దాటింది. మార్గదర్శి లాయర్ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.అనంతరం.. ఉండవల్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణ జరపకుండా ఉండవల్లికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని మార్గదర్శి లాయర్‌కు తేల్చి చెప్పింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇ బ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్గదర్శితోపాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.అలాగే తీర్పులోని కొంత భాగంపై అ భ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ రావు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై సోమవారంమరోసారి విచారణ ప్రారంభించింది.లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరంవిచారణకు ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ డొల్లగానే ఇ ృచ్చారని అన్నారు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం చేస్తున్నానని చెప్పారు. మార్గదర్శి తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూ చనలు పొంది చెబుతానని లూథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. -
‘మార్గదర్శి’కి చంద్రబాబు ఉపకారం దారుణం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు అడ్డాగా నిలిచిన మార్గదర్శికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపకారం చేయడం దారుణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. దీంతో మార్గదర్శి, చంద్రబాబు ముసుగు తొలగిందన్నారు. బాబు చరిత్రలో ఇది అతిపెద్ద మచ్చగా నిలిచిపోవడం ఖాయమని చెప్పారు. గత ప్రభుత్వం మార్గదర్శిపై దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతానన్నారని గుర్తు చేశారు.ఆయన అన్నట్లే ఇప్పుడు కాపాడుతున్నారని ఆరోపించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పన్నారు. డిపాజిట్లపై ఫ్యూచర్ సబ్‌్రస్కిప్షన్ ఉండకూడదని నిబంధన ఉన్నా.. మార్గదర్శి దీన్ని కొనసాగించిందన్నారు. చంద్రబాబు మార్గదర్శిపై అఫిడవిట్ ఉపసంహరించుకున్నా కేసు ఆగదని.. ఆయనను ఇందులో పార్టీ చేసే పరిస్థితి వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారు.. సీఎం చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు.. కానీ మార్గదర్శికి బహిరంగంగా సాయం చేసి తన ముసుగు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యూచర్ సబ్‌్రస్కిప్షన్ పేరుతో మార్గదర్శి సేకరిస్తున్న డిపాజిట్లు చట్టవిరుద్ధమని దాని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1,051 కోట్లను అటాచ్ చేశారు. ఇది అన్యాయమని అప్పట్లో మార్గదర్శి కోర్టుకు వెళ్లలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకునేలా చేసింది. అటాచ్ చేసిన ఆ నగదు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణం. సెపె్టంబర్ 11న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వాయిదాకు వస్తున్న సమయంలో ఇలా చేయడం తగదు. అక్కడ కూడా ఏదో చేయబోతున్నారని అర్థమవుతోంది. మార్గదర్శి చేసింది తప్పేనని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది.. మార్గదర్శి చేసింది తప్పేనని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం.. చిట్‌ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధన ఉంది. రామోజీరావు అన్ని వ్యాపారాలు, ఆయన సామ్రాజ్య విస్తరణ మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నడుస్తున్నవే. గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచ్‌లను మూసేశారు. దీంతో వారి ఖాతాలన్నింటినీ తెలంగాణలోని ఇతర బ్రాంచ్‌లకు మార్గదర్శి తరలించింది. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో తమ సంస్థను వ్యతిరేకించరని తెలుసు. ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలు ఏమనుకుంటారోనని సీఎం ఆలోచించాలి. మార్గదర్శిలో ఉన్న మొత్తం డబ్బులో 70 శాతం అన్ అకౌంటబుల్. దీన్ని ఖచి్చతంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది.దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు తమకు రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు 2024 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.900 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో ఈ మొత్తం రూ.వేల కోట్లు ఉంటుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మాత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ వద్ద తమ ఆస్తి రూ.25 వేల కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎక్కడి నుంచి అంత ఆస్తి వచి్చందని ఎవరైనా ప్రశి్నంచారా? చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో లేవు. పీఎస్సార్ ఆంజనేయులు మంచి అధికారి. ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదు. -
రామోజీ రావు ఎదుగుదల ఆ ఒక్క అడుగుతో మొదలైంది
-
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
రామోజీ అక్రమాలు సుప్రీం తీర్పుతో బయటకు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీ రావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రామోజీ.. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారని స్పష్టం చేశారు. కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది. రామోజీ రావు అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. రామోజీ అక్రమాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయి. 2024 ఎన్నికలను కూడా శాసించాలని రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు. వాళ్లు సృష్టించిన అబద్ధాలనే బ్యానర్ కథనంగా ఇస్తున్నారు. అంతేకానీ, మార్గదర్శి గురించి చిన్న వార్త అయినా ఈనాడులో రాశారా?. అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను పాటించలేదు. రామోజీ ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారా? అని ప్రశ్నించారు. వాలంటీర్లపై తప్పుడు రాతలు రాశారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారు. ఒక్కప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు. ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు. నాలుగు ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు విషయం కక్కారు. ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయి. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఉంటారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయి. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైంది. గొడవలు వాళ్లు సృష్టించి మాపై నిందలు వేస్తున్నారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం సాధిస్తుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారు. వృద్ధులు చనిపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చూస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ గొడవలు సృష్టిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్‌యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్‌యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్‌యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్‌ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్‌మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది. -
‘గురివింద’ బండారం బట్టబయలు
విశాఖ సిటీ/సాక్షి, అమరావతి: రాజ గురివింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ లెక్కా పత్రం లేకుండా విశాఖ నగరంలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో రామోజీ ఆరి్థక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసు బృందాలు, కేంద్ర బలగాలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరం ద్వారకానగర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ31సీజీ 7825 నంబరు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్‌కేస్‌తో వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వారి వద్ద ఉన్న సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో రూ.500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.51,99,800 నగదు ఉన్నట్లు తేలింది. రూ.36,88,675 విలువైన 51 చెక్కులను గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని పోలీసులు ప్రశి్నంచారు. ఇందుకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ డబ్బు మార్గదర్శి చిట్స్‌కు సంబంధించినదని, ఎవరికీ ఇవ్వడానికి కాదని, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళుతున్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధారాలు చూపించాలని అడిగినప్పటికీ వారు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. అందులో ఒకరు లక్ష్మణరావు మార్గదర్శి చిట్స్‌లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా, మరొకరు శ్రీనివాస్ ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వారు ఆ డబ్బుకు ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అందజేశారు. వారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలింపు! ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి చెందిన సంస్థకు తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భీమిలిలో ఉన్న ప్రైవేటు పరిశ్రమ నుంచి టీడీపీ నేతలకు రూ.కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి మార్గదర్శి, ఆ పరిశ్రమ సిబ్బంది చేతుల మీదుగానే రూ.కోట్ల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లోనూ అదే పంథాలో డబ్బు పంపిణీకి పూనుకున్నట్లు ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. డిజిటల్ చెల్లింపులేవి రామోజీ! 2022 డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడంలేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసివేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల్లో చిట్టీ గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖపట్నం బ్రాంచిలో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే రూ.51 లక్షలు నగదు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్టు. ఇక రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది. ప్రస్తుతం కిళ్లీ దుకాణాలు, బజ్జీ దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి నగదు లావాదేవీలు జరపకూడదని రామోజీ ఈనాడులో పదేపదే వార్తలు రాయిస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా భారీగా నగదు లావాదేవీలే నిర్వహిస్తుండటం గమనార్హం. చందాదారుల నుంచి డిజిటల్/ఆన్ౖలెన్ చెల్లింపులు ఎందుకు స్వీకరించడం లేదు? నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్నప్రశ్న తలెత్తుతోంది. మార్గదర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్కా మనీ లాండరింగే.. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడటంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో భారీగా నల్లధనం దందా మరోసారి ఆధారాలతోసహా వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిదని మార్గదర్శి సిబ్బందిని పోలీసులు ప్రశి్నంచగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యతి్నంచారు. చివరగా గత మూడు రోజుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగదు, చెక్కులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలీసులు వాటిని జప్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం ఒక బ్రాంచిలో వసూలు చేసే మొత్తాన్ని అదే బ్రాంచి పరిధిలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఇతర బ్యాంకుల్లోని ఖాతాల్లోకి మళ్లించకూడదు. రామోజీరావు ఈ నిబంధనలను ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చందాదారుల సొమ్మును హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయం ఖాతాకు మళ్లిస్తూ వచ్చారు. అదే రీతిలో చందాదారుల సొమ్మును సోమవారం విశాఖలో ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ పోలీసులకు చిక్కినట్లు స్పష్టమైంది. -
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్‌ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది కాల్‌మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
అయినా రామోజీ మారలేదు... అక్రమ డిపాజిట్లు ఆగలేదు
సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్‌విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్‌ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది... భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్‌గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆర్బీఐ నిబంధన ప్రకారం చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. యాజమాన్య టికెట్ల పేరుతో దందా యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్‌ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్‌పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్‌ను భర్తీ చేయవచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది. అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది. ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు. సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది కేంద్ర చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. -
సుప్రీంకోర్టు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్‌యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
రామోజీకి షాక్.. మార్గదర్శికి సుప్రీంకోర్టు ఝలక్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు.. ఆంధ్రప్రదేశ్‌లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్ నేరాలకు పాల్పడింది. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు. ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏటా రూ.3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది. సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి. ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు. ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పింది. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం. కేసులో దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేస్తోంది. మార్గదర్శిపై ఏపీ సీఐడీ దర్యాపు.. మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే, అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు?. రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్‌భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్‌భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ►ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ►ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. ►మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు. ►ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు ►విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు ►రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. ►చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. ►చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. ►పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ►ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే.. 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ►ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
రామోజీకి షాక్.. సుప్రీంకోర్టుకు యూరీ రెడ్డి
సాక్షి, అమరావతి: మార్గదర్శి విషయంలో ఈనాడు అధినేత రామోజీరావుకు మరోసారి షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్ లీవ్ పిటిషన్‌ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. అయితే, ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఛాలెంజ్ చేస్తూ యూరీ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, మార్గదర్శిలో తన షేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని యూరీ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, యూరీ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇది కూడా చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు: యూరీ రెడ్డి -
’మార్గదర్శి’పై పోలీసుల అప్పీళ్లను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీరాల, విశాఖపట్నం, సీతంపేట బ్రాంచీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాము మార్గదర్శి చిట్ గ్రూపుల్లో చందాదారు కాకపోయినప్పటికీ, తమ సంతకాలను ఫోర్జరీ చేసి చందాదారులుగా చూపారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని, ఇలా చేసినందుకు మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు చందాదారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే చీటీ పాట పాడుకున్నా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ మరో చందాదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరానికి సంబంధించినదని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు నోటీసులిచ్చారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం విచారణ జరిపింది. -
రామోజీ, శైలజా కిరణ్‌పై చర్యలన్నీ 8 వారాలు నిలిపివేత
సాక్షి, అమరావతి : మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి (జీజే రెడ్డి) షేర్లను అక్రమంగా బదలాయించిన వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీకి ఒక్క రోజే గడువిచ్చిన న్యాయస్థానం తన తండ్రి జీజే రెడ్డికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి, తమ వాటాలను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదలాయించారంటూ యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఈ నెల 16న రామోజీ, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధారణంగా క్వాష్ పిటిషన్లలో ఆ కేసు పూర్తి వివరాలను తెలుసుకొని, కోర్టు ముందుంచేందుకు పోలీసులకు న్యాయమూర్తులు వారం, మూడు రోజులు ఇలా కొంత గడువు ఇస్తారు. రామోజీరావు, శైలజా కిరణ్ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు రెండు రోజులు గడువివ్వాలన్న సీఐడీ స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒక్క రోజే గడువిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, శైలజా కిరణ్ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. షేర్లు కొన్నందుకు యూరి రెడ్డికి చెక్కు రూపంలో చెల్లించామని, వాటాలను బదలాయిస్తూ ఆయన సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు అక్కడ పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నాం కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశారు సీఐడీ తరఫున వై.శివకల్పనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎస్‌హెచ్–4 ఫారంను వ్యాజ్యాలతో జత చేయలేదని, దీనిని కోర్టు తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి ఫిర్యాదుదారు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. మార్గదర్శికి ఏపీలో కూడా శాఖలున్నాయన్నారు. వాటాల బదిలీ డాక్యుమెంట్లపై ముద్రించిన స్టాంపు ఎక్కడిదో పరిశీలించాల్సి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ కేసు గురించి శివకల్పన ప్రస్తావించారు. అన్ని కేసులూ తనకు తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి అన్నారు. రామోజీ, శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నీ 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్‌భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్‌భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి.