సాక్షి, విజయవాడ: ఏదైనా చిట్‌ఫండ్స్‌లో సేవింగ్స్ చేసేది ఆస్తులు కొనుక్కోవడానికే కాని.. అమ్ముకోవడానికి కాదని మార్గదర్శి బాధితురాలు అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శిలో ఎనిమిదేళ్లుగా చిట్‌లు వేసి వేధింపులు ఎదుర్కొన్నానని.. వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని సైతం అమ్మేసుకున్నానని.. తనలాంటి వాళ్ల జీవితాలను నాశనం చేసిన మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని కంటతడి పెట్టారామె.
నా తల్లిదండ్రులు కొంత అమౌంట్ ఇచ్చారు. ఫ్రౌల్టీ ఫామ్ పెట్టుకుని.. ఆ తర్వాత మార్గదర్శిలో చిట్ వేశాను. మొదట్లో.. బాగానే ఇచ్చారు. దాని తర్వాత ఒత్తిడి చేసి ఒక చిట్ నుంచి రెండు.. రెండు నుంచి నాలుగు.. నాలుగు నుంచి ఎనిమిది.. ఇలా 90 చిట్‌ల వరకు తీసుకువెళ్లారు. ఆ ఆర్థిక భారాన్నంతా నా నెత్తి మీద రుద్దారు. వేసిన చిట్ డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడ్డారు. నేను వేసిన 17 చిట్స్‌లో నన్ను డిఫాల్ట్ చేశారు. మా గ్యారెంటీర్లను వేధించారు. మా ఇంటి పరువును బజారుకు కీడ్చేలా చేశారు.
నా కూతుళ్ల పెళ్లి చేయలేకపోయా. వాళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు కూడా ఇచ్చేశా. నాలుగు ఫ్లాట్లు అమ్మించి డబ్బు కట్టించుకున్నారు. చదువుకున్న వాళ్లను కూడా సులువుగా మోసం చేయగలిగారు. ఇన్ని చిట్‌లు వేస్తే.. మాకు చివరగా వచ్చింది రూ.210 మాత్రమే. ఈ రకమైన కుట్రకు పాల్పడి.. తన లాంటివాళ్లెందరో రోడ్డున పడేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె మీడియా సాక్షిగా అధికారులను కోరారు.
బాధితురాలు అన్నపూర్ణ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారని.. ఎఫ్‌ఐఆర్‌లో పూర్తి వివరాలు పొందుపరిచామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment