సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఆఫీసుల్లో సీఐడీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీలు చేపట్టింది. ఇక, మార్గదర్శి చిట్‌ఫండ్‌లో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక, తాజాగా మార్గదర్శి చిట్‌ఫండ్‌లో రికార్డులు, పన్నులు చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 37 మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల సేకరించిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. నిన్న(బుధవారం) మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావును సీఐడీ విచారణకు పిలిచింది. నేడు(గురువారం) మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, వీరిద్దరూ విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా రామోజీ, శైలజ కిరణ్ గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రాకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా?
Comments
Please login to add a commentAdd a comment