Revenue Intelligence
-
రూ.4.56 కోట్ల బంగారం బిస్కెట్లు సీజ్
సాక్షి, చెన్నై: సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడులోకి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని మదురై రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.4.56 కోట్ల విలువైన 6.6 కేజీల బంగారం బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం సముద్ర తీరంలో నిఘా వేశారు.శ్రీలంక నుంచి ఓ పడవలో వచి్చన ఇద్దరు వ్యక్తులు కారులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి, వారిని వెంబడించారు. తిరుప్పాచెట్టి టోల్గేట్ వద్ద కారును చుట్టుముట్టి అందులో ఉన్న 6.6 కేజీల బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న కీలకరైకు చెందిన సాధిక్ అలీ, షేక్ సద్దార్ను అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
ఏపీవ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల్లో అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఆఫీసుల్లో సీఐడీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీలు చేపట్టింది. ఇక, మార్గదర్శి చిట్‌ఫండ్‌లో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా మార్గదర్శి చిట్‌ఫండ్‌లో రికార్డులు, పన్నులు చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 37 మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల సేకరించిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. నిన్న(బుధవారం) మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావును సీఐడీ విచారణకు పిలిచింది. నేడు(గురువారం) మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, వీరిద్దరూ విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా రామోజీ, శైలజ కిరణ్ గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రాకపోవడం గమనార్హం. ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
‘మార్గదర్శి’ సహాయ నిరాకరణ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలపై సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఏపీ అధికారుల బృందానికి ఆ సంస్థ యాజమాన్యం పూర్తిగా సహాయ నిరాకరణ చేసింది. చట్ట ప్రకారం సమర్పించాల్సిన పత్రాలు, సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు, ఇతర అక్రమాలపై రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష న్లు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు జరిపిన అనంతరం నిధుల దారి మళ్లింపుపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్‌లో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో మూడు రోజులపాటు సోదాలు చేశారు. సోదాలు శుక్రవారం ముగిశాయి. చిట్‌ఫండ్స్ వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలు, రశీదులు, ష్యూరిటీలు తదితర వివరాలను సమర్పించాలని అధికారుల బృందం ముందుగానే నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది తమ యాజమాన్య సూచనలు, ఆదేశాలను పాటిస్తూ అధికారుల దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదు. సంస్థ సమాచారాన్ని అధికారులకు తెలపాల్సిన మార్గదర్శి డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. వెంకటస్వామి కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయా రు. కార్యాలయంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ (అడ్మిన్) రారాజీ తనకు ఏ సమాచారం తెలీదని చెప్పడం విడ్డూరం. తాము కోరిన సమాచారాన్ని తెలిపేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ తమ ముందు హాజరవ్వాలని లేదా తగిన అధికారిని నియోగించాలని దర్యాప్తు బృందం ఆయనకు సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్‌ను సంప్రదించి చెబుతామన్న ఆయన ఆ తర్వాత ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. సోదాల్లో తాము గుర్తించిన సమాచారం వివరాలను వెల్లడిస్తూ నమోదు చేసిన పంచనామా నివేదిక కాపీని తీసుకుని రశీదు ఇవ్వాలని దర్యాప్తు అధికారులు వైస్ ప్రెసిడెంట్ రారాజీని అడిగారు. తమ లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించి అక్నాలడ్జ్మెంట్ ఇస్తామని తొలుత చెప్పిన ఆయన, కాసేపటికే అందుకు కూడా నిరాకరించారు. దీంతో పంచనామా నివేదిక ప్రతిని మార్గదర్శి కార్యాలయంలో గోడకు అతికించి దర్యాప్తు బృందం వెనుదిరిగింది. -
గోల్డ్‌కు హెన్నా టచ్!
సాక్షి, హైదరాబాద్: హెన్నాతో(మెహెందీ పొడి) కలిపి, పేస్ట్‌లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. ఇటీవలే పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు ఓ స్మగ్లర్ చిక్కగా తాజాగా శుక్రవారం డీఆర్ఐ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.71 లక్షల విలువైన రెండు కిలోలకుపైగా బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మస్కట్‌కు చెందిన సూత్రధారులు బంగారాన్ని మెత్తని పొడిగా చేశారు. దానిని గోధుమ రంగులో ఉన్న హెన్నాలో కలిపేశారు. ఇలా తన రంగును కోల్పోయి, పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చాక్లెట్ తయారీకి వినియోగించే ద్రావణాలను వాడారు. నడుముకు కట్టుకొని.. లోదుస్తుల్లో.. ఈ గోధుమరంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేశారు. ఇలా తయారు చేసిన రెండు ప్యాకెట్లలో ఒకదాన్ని ఒమన్ జాతీయుడు తన నడుముకు ఉన్న నల్లరంగు వస్త్ర బెల్టులో పెట్టి తీసుకురాగా, హైదరాబాద్‌వాసి తన లోదుస్తుల్లో దాచి తెచ్చాడు. వీరిని డీఆర్ఐ అధికారులు పట్టుకొని తనిఖీ చేశారు. ఒమన్వాసి నుంచి 1,850 కిలోల పేస్టు, హైదరాబాదీ నుంచి 900 గ్రా ముల పేస్టును స్వాధీ నం చేసుకున్నారు. సూ త్రధారులు తనకు తెలియదని, కమీషన్ తీసు కుని హైదరాబాద్‌కు దీనిని చేరుస్తుంటానని నగరవాసి విచారణలో చెప్పాడు. ఒమన్ జాతీయుడు మాత్రం తన స్నేహితుడి కోరిక మీదటే ఇలా చేశానని, ముఠాకు చెందిన రిసీ వర్లే తమ వద్దకు వచ్చి ప్యాకెట్లు తీసుకువెళ్తారని పేర్కొన్నాడు. డీఆర్ఐ అధికారులు 2,750 గ్రాముల పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసి కిరో సిన్ పోసి నిప్పుపెట్టారు. ఈ మంటల ప్రభావానికి అది పొడిగా మారింది. ఈ పొడిని కొలిమిలో వినియోగించే గిన్నెలో వేసి కరిగించగా 2.136 కిలోల బంగారు బిస్కెట్లు తయారయ్యాయి. వీటి విలువ మార్కెట్లో రూ.70,82,669 ఉంటుందని అధికారులు తెలిపారు. -
రూ. 11 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సెంట్రల్ సిటీ చెన్నైలో ఓ హోటల్లో నిర్వహించిన సోదాల్లో 7 కిలోల బంగారం, 11 కోట్ల రూపాయల హవాలా సొమ్మును చెన్నై రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త మైలాపూర్‌లో ఉన్న ప్రముఖ హోటల్లో విదేశీ వ్యక్తుల నుంచి హవాలా సొమ్మును తీసుకోనున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ హోటల్లో గురువారం ఇంటెలిజెన్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో హోటల్లో నుంచి పార్కింగ్ చోటుకు వెళ్లిన ఓ పారిశ్రామికవేత్త తన చేతిలో ఒక తోలు సంచి కలిగి ఉన్నాడు. ఆ బ్యాగును తనిఖీచేయగా అందులో విదేశాల నుంచి తీసుకువచ్చిన ఒక కిలో బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా, ఆ హోటల్లో బసచేసి ఉన్న విదేశీయుల నుంచి ఆ బంగారు బిస్కెట్లను పొందినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ హోటల్లో ఉన్న ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసి విచారించగా, ఒకరోజు క్రితమే తాము దక్షిణ కొరియా నుంచి వచ్చినట్లు, తామే ఆ బంగారు బిస్కెట్లను చెన్నై విమానాశ్రయంలో అధికారుల కళ్లుగప్పి తీసుకువచ్చినట్టు చెప్పారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చెన్నై రెవెన్యూ ఇంటలిజెన్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక దుస్తుల దుకాణ వ్యాపారిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి ఒక కిలో బంగారు బిస్కెట్ ఒకటి, రూ.5.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్ల నుంచి రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బంగారు బిస్కెట్లు హవాలా నగదు తరలింపునకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అదే విధంగా హవాలా సొమ్ము తరలించడానికి ఉపయోగించిన ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
కోయంబత్తూరు(కేరళ): కోయంబత్తూరు విమానాశ్రయంలో సోమవారం రూ.25 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పలక్కడ్ ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ సోమవారం ఉదయం షార్జా నుంచి కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగాడు. అతని తీరును అనుమానించిన అధికారులు లగేజిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని స్పీకర్ బాక్స్‌లో దాదాపు 700 గ్రాముల బరువున్న బంగారు కడ్డీలు లభించాయి. ఈ మేరకు విచారణ నిమిత్తం ప్రభాకరన్‌ను పోలీసులకు అప్పగించారు. -
రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం
-
రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు రట్టు చేశారు. అక్టోబర్ 28న రాజస్తాన్‌లోని ఉదయపూర్‌కి చెందిన మరుధార్ డ్రింక్స్ కంపెనీ ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు జరిపి, రూ.3 వేల కోట్ల విలువైన మాండ్రాక్స్ అనే నార్కోటిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధమున్న బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానిని పోలీసులు అరెస్ట్ చేశారు. 23.5 మెట్రిక్ టన్నుల మాత్రలను సీజ్ చేశామని, వీటి సంఖ్య రెండు కోట్ల వరకు ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) చైర్పర్సన్ నజీబ్ షా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.3 వేల కోట్లు ఉంటుందన్నారు. వీటిని మొజాంబిక్, దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నారని నజీబ్ తెలియజేశారు. -
‘50వేల కోట్ల నల్లధనం అపోహే’
న్యూఢిల్లీ: భారత్ నుంచి విదేశాలకు తరలిన నల్లధనం దాదాపు రూ. 50 వేల కోట్లు ఉంటుందనేది కేవలం అపోహ మాత్రమేనని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) విభాగం నల్లధనంపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి ఆదివారం విన్నవించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ షా ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పడింది. వాషింగ్టన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎటువంటి లాభాపేక్షా లేని గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటెగ్రిటీ(జీఎఫ్ఐ) సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల నల్లధనంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం తెలిసిందే. 2004 నుంచి 2013 వరకు భారత్ నుంచి ఇతర దేశాలకు తరలిన నల్లధనం విలువ 50 వేల కోట్లకు పైగానే ఉంటుందని జీఎఫ్ఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నల్లధనం వివరాలను రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం జీఎఫ్ఐని కోరింది. జీఎఫ్ఐ వెల్లడించిన వివరాలు సరిగా లేవని, ప్రకటించిన సమాచారానికి ఇచ్చిన వివరాలకు తారతమ్యాలున్నాయని డీఆర్ఐ సుప్రీంకు స్పష్టం చేసింది. కేంద్రం విఫలం: యోగా గురు రాందేవ్ చండీగఢ్: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో తనతోపాటు దేశప్రజలు అసంతృప్తిగా ఉన్నారని యోగా గురు రాందేవ్‌బాబా వ్యాఖ్యానించారు. చట్టసభ సభ్యులు ఈ అంశంపై పార్లమెంట్లో చర్చిస్తే.. తామెవరమూ వీధుల్లో మాట్లాడాల్సిన అవసరం రాదని స్పష్టం చేశారు. అదేసమయంలో అవినీతి లేకుండా కేంద్రప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని ప్రశంసించారు. -
దిగుమతి ఆంక్షలతో పెరిగిన బంగారం స్మగ్లింగ్
న్యూఢిల్లీ: దిగుమతులపై ఆంక్షల కారణంగా బంగారం అక్రమ రవాణా గతేడాది భారీగా పెరిగింది. 2013-14లో ఏకంగా రూ.678 కోట్ల విలువైన పసిడిని అధికారులు స్వాధీనపర్చుకున్నారు. అంతకుముందు ఏడాది స్వాధీనపర్చుకున్న బంగారం విలువ రూ.94 కోట్లు. గత సంవత్సరం ముంబై, ఢిల్లీ, చెన్నై, కాలికట్ విమానాశ్రయాల్లో బంగారాన్ని అత్యధికంగా జప్తు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు అందించిన సమాచారంలో కస్టమ్స్, రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. పసిడి అక్రమ రవాణాకు సంబంధించి గతేడాది 2,419 కేసులను కస్టమ్స్ విభాగం నమోదు చేసింది. అంతక్రితం ఏడాది 919 కేసులు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో(ఏప్రిల్-జూన్) 1,264 కేసులలో రూ.354 కోట్ల విలువైన పుత్తడిని అధికారులు సీజ్ చేశారు. ఏప్రిల్‌లో 461 కిలోలు, మేలో 362 కిలోలు, జూన్‌లో 464 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరెంట్ అకౌంట్ లోటును అదుపు చేసేందుకు కేంద్రం గతేడాది పసిడి దిగుమతులపై ఆంక్షలతో పాటు దిగుమతి సుంకాన్ని 10%కి పెంచింది.