న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు. అక్టోబర్ 28న రాజస్తాన్‌లోని ఉదయపూర్‌కి చెందిన మరుధార్ డ్రింక్స్ కంపెనీ ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు జరిపి, రూ.3 వేల కోట్ల విలువైన మాండ్రాక్స్ అనే నార్కోటిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రాకెట్‌తో సంబంధమున్న బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానిని పోలీసులు అరెస్ట్ చేశారు. 23.5 మెట్రిక్ టన్నుల మాత్రలను సీజ్ చేశామని, వీటి సంఖ్య రెండు కోట్ల వరకు ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) చైర్‌పర్సన్ నజీబ్ షా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.3 వేల కోట్లు ఉంటుందన్నారు. వీటిని మొజాంబిక్, దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నారని నజీబ్ తెలియజేశారు.
రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం
Published Thu, Nov 3 2016 2:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement