![6. 6 kg of gold smuggled from Sri Lanka seized in Tamil Nadu](/styles/webp/s3/article_images/2024/08/14/biscuits%20seized.jpg.webp?itok=oprSL3Lb)
సముద్రమార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడుకు..
ఇద్దరు నిందితుల అరెస్టు
సాక్షి, చెన్నై: సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడులోకి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని మదురై రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.4.56 కోట్ల విలువైన 6.6 కేజీల బంగారం బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం సముద్ర తీరంలో నిఘా వేశారు.
శ్రీలంక నుంచి ఓ పడవలో వచి్చన ఇద్దరు వ్యక్తులు కారులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి, వారిని వెంబడించారు. తిరుప్పాచెట్టి టోల్గేట్ వద్ద కారును చుట్టుముట్టి అందులో ఉన్న 6.6 కేజీల బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న కీలకరైకు చెందిన సాధిక్ అలీ, షేక్ సద్దార్‌ను అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment