Gold biscuits seized
-
రూ.4.56 కోట్ల బంగారం బిస్కెట్లు సీజ్
సాక్షి, చెన్నై: సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడులోకి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని మదురై రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.4.56 కోట్ల విలువైన 6.6 కేజీల బంగారం బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం సముద్ర తీరంలో నిఘా వేశారు.శ్రీలంక నుంచి ఓ పడవలో వచి్చన ఇద్దరు వ్యక్తులు కారులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి, వారిని వెంబడించారు. తిరుప్పాచెట్టి టోల్గేట్ వద్ద కారును చుట్టుముట్టి అందులో ఉన్న 6.6 కేజీల బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న కీలకరైకు చెందిన సాధిక్ అలీ, షేక్ సద్దార్ను అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
బస్సులో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి బిస్కెట్లు
కర్నూలు: హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.5.04 కోట్ల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, నగదును ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా స్వామి అయ్యప్ప ట్రావెల్స్ బస్సులో సేలం పట్టణానికి చిందిన దేవరాజు, సెల్వరాజు, కుమారవేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌లకు చెందిన బ్యాగుల్లో 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, రూ.90 లక్షల నగదు బయటపడ్డాయి. పట్టుబడిన వెండి విలువ రూ.18.52 లక్షలు, బంగారం విలువ రూ.3.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నగలు, నగదుకు సంబంధించి జీఎస్టీ, ఈ–వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ వంటివి చూపకపోవడంతో సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
కారులో బంగారం బిస్కట్లు పట్టివేత
-
భారీగా బంగారు బిస్కట్లు స్వాధీనం
సాక్షి, చెన్నై: సముద్ర మార్గంద్వారా దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి బోటులో అక్రమంగా తరలిస్తున్న అయదున్నర కిలోల బంగారం తనిఖీల్లో పట్టుబడింది. తమిళనాడులోని రామేశ్వరంలోని మండపం తీరం ద్వారా రవాణా చేస్తుండగా నిఘా అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌పై రహస్య సమాచారాన్ని అందుకున్న పోలీసులు, కస్టమ్స్ శాఖ అధికారులతో కూడిన బృందం శ్రీలంక నుంచి వస్తున్న పడవను అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన నాజిర్ అనే వ్యక్తిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అతనినుంచి 5.5 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటిన్నర రూపాయలని ప్రకటించారు. నజీర్ తోపాటు పడవను కూడా స్వాధీనం చేసున్నామని, విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. -
బూట్లలో బంగారం బిస్కెట్లు
► రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం ► బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఒకరి అరెస్ట్ బెంగళూరు : ఎవరికీ అనుమానం రాకూడదని వేసుకున్న బూట్లలో బంగారాన్ని దాచాడు. కానీ అలా వేసుకున్న బూట్లతో సరిగ్గా నడవలేక దొరికిపోయాడు. మంగళవారం వీఎం ఫహాద్ (37) అనే ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి బెంగుళూరుకు వచ్చాడు. కెంపెగౌడ విమానాశ్రయంలో దర్జాగా దిగిన ఆ యువకుడు విమానాశ్రయంలో అటుఇటుగా నడుస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అతడి నడక తీరులో తేడా కనిపించడంతో అనుమానంతో ఆ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. తేడాతో నడుస్తున్నందున ముందుగా అతడు వేసుకున్న బూట్లను విప్పించగా... ఆశ్చర్యం... దాచిన బంగారం బయటపడింది. అయితే ఆ ప్రయాణికుడు ఏకంగా 58 లక్షల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను బూట్లతో దాచి తరలిస్తున్నాడు. తులాల్లో కాదు ఏకంగా రెండు కిలోల బంగారు బిస్కెట్లను బూట్లతో ఉంచినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో అధికారులు ఫహాద్ నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఫహాద్ గోవాకు చెందిన వ్యక్తి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడు తరలిస్తున్న బిస్కెట్ల ధర మార్కెట్ లో సుమారు 58.60 లక్షల రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. -
లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్.. మహిళల అరెస్టు
చెన్నై: విదేశాల నుంచి చాటుమాటుగా బంగారం తరలిస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఒకే రోజు ఏడుగురు మహిళలు పట్టుబడడం చెన్నై విమానాశ్రయం చరిత్రలో ఇదే ప్రథమం. కౌలాలంపూర్ నుంచి గురువారం రాత్రి చెన్నైకి వచ్చిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో దిగిన రాణి (43)ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె లోదుస్తుల్లో 14 బంగారు బిస్కెట్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్క బంగారం బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉందని చెప్పారు. అలాగే సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో నగరానికి వచ్చిన శ్రీలంకకు చెందిన వడివళగి (48) పింగారా (40) శివగంగైకి చెందిన మారియమ్మాళ్ (50), జీనత్ (38)లను తనిఖీ చేశారు. ఈ నలుగురు మహిళలు 1550 గ్రాముల బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డారు. సింగపూర్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి చెందిన కనియమ్మాళ్ (39) తన సెల్ ఫోన్లో బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్‌ను ఉంచి తెస్తుండగా దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురు మహిళల నుంచి ఒకే రోజు రూ. కోటి విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరందరినీ విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో పట్టుబడిన మహిళలంతా స్మగ్లింగ్ ముఠాకు చెందిన వారుగా నిర్థారించినట్లు చెప్పారు. -
మలద్వారంలో 349 బంగారు బిస్కెట్లు
చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సినీపక్కీలో పట్టుకున్నారు. విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. నాగపట్నం జిల్లా నాగూరు నుంచి కారులలో భారీ ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిఘాపెట్టారు. తెల్లవారుజామున వాంజూరు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు నిలపకుండా వెళ్లిపోయింది. అధికారులు వెంటనే ఆ వాహనాన్ని వెంబడించారు. ఎట్టకేలకు కారైక్కాల్ సమీపం పట్టిన్నం అనే ప్రాంతంలో కారును పట్టుకోగలిగారు. కారు సీటు కింద ఉన్న పార్శిల్‌ను విప్పిచూడగా అందులో 14 కిలోల బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. కారులో ఉన్న నాగూర్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా మరో బంగారు అక్రమరవాణా కేసులో శ్రీలంక నుంచి తిరుచ్చీకి గురువారం సాయంత్రం శ్రీలంకన్ విమానం వచ్చింది. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నడకతీరుపై అధికారులకు అనుమానం కలిగింది. అతన్ని ప్రత్యేక గదికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, మలద్వారం వద్ద దాచిపెట్టి ఉన్న రూ.10 లక్షల విలువైన 349 బంగారు బిస్కెట్లు లభ్యమైనాయి. చెన్నై సాలిగ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (59) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
షూలో 20 లక్షల బంగారం
తిరువొత్తియూరు: కోవై విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు రూ. 20 లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి కోవై విమానాశ్రయానికి శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో సింగపూర్ ఏయిర్‌లైన్స్ విమానం వచ్చింది. విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీ చేయగా అతని షూలో బంగారం బిస్కెట్లను ముక్కలుగా కట్‌చేసి దాచినట్టు తెలిసింది. అతని నుంచి 850 గ్రాముల బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో ఆ యువకుడు తిరుపూర్ జిల్లా పట్టుకోట్టైకు చెందిన నవూస్‌ఖాన్ కుమారుడు జాహీర్హుస్సేన్(30) అని తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. -
7 కేజీలకు పైగా బంగారపు బిస్కెట్లు స్వాధీనం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగం గత రాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించిన తమిళనాడు ఎన్నికలు అధికారులకు ఒక్కసారిగా కళ్లు చెదిరాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు కేజీలకు పైగా బంగారపు బిస్కెట్లను ప్రయాణికుడి వద్ద కనుగొన్నారు. అతని వద్ద నుంచి బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సదరు ప్రయాణికుడిని ఎన్నికల అధికారులు తమిళనాడు పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని వేదారణ్యం జిల్లాలో గత రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. పట్టుబడిన బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.