7 కేజీలకు పైగా బంగారపు బిస్కెట్లు స్వాధీనం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగం గత రాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించిన తమిళనాడు ఎన్నికలు అధికారులకు ఒక్కసారిగా కళ్లు చెదిరాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు కేజీలకు పైగా బంగారపు బిస్కెట్లను ప్రయాణికుడి వద్ద కనుగొన్నారు.
అతని వద్ద నుంచి బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సదరు ప్రయాణికుడిని ఎన్నికల అధికారులు తమిళనాడు పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని వేదారణ్యం జిల్లాలో గత రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. పట్టుబడిన బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.