ఆధారాలు లేని నగదు, నగలను స్వాధీనం చేసుకుని, రవాణాదారుల అరెస్ట్ చూపుతున్న పోలీసులు
కర్నూలు: హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.5.04 కోట్ల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, నగదును ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్‌ఈబీ సీఐ మంజుల, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా స్వామి అయ్యప్ప ట్రావెల్స్ బస్సులో సేలం పట్టణానికి చిందిన దేవరాజు, సెల్వరాజు, కుమారవేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌లకు చెందిన బ్యాగుల్లో 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, రూ.90 లక్షల నగదు బయటపడ్డాయి.
పట్టుబడిన వెండి విలువ రూ.18.52 లక్షలు, బంగారం విలువ రూ.3.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నగలు, నగదుకు సంబంధించి జీఎస్‌టీ, ఈ–వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ వంటివి చూపకపోవడంతో సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment