Sailaja kiran
-
పాపం పండింది.. ఇక చిప్ప కూడే..
-
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
అయినా రామోజీ మారలేదు... అక్రమ డిపాజిట్లు ఆగలేదు
సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్‌విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్‌ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది... భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్‌గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆర్బీఐ నిబంధన ప్రకారం చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. యాజమాన్య టికెట్ల పేరుతో దందా యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్‌ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్‌పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్‌ను భర్తీ చేయవచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది. అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది. ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు. సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది కేంద్ర చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. -
రామోజీ, శైలజా కిరణ్‌పై చర్యలన్నీ 8 వారాలు నిలిపివేత
సాక్షి, అమరావతి : మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి (జీజే రెడ్డి) షేర్లను అక్రమంగా బదలాయించిన వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీకి ఒక్క రోజే గడువిచ్చిన న్యాయస్థానం తన తండ్రి జీజే రెడ్డికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి, తమ వాటాలను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదలాయించారంటూ యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఈ నెల 16న రామోజీ, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధారణంగా క్వాష్ పిటిషన్లలో ఆ కేసు పూర్తి వివరాలను తెలుసుకొని, కోర్టు ముందుంచేందుకు పోలీసులకు న్యాయమూర్తులు వారం, మూడు రోజులు ఇలా కొంత గడువు ఇస్తారు. రామోజీరావు, శైలజా కిరణ్ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు రెండు రోజులు గడువివ్వాలన్న సీఐడీ స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒక్క రోజే గడువిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, శైలజా కిరణ్ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. షేర్లు కొన్నందుకు యూరి రెడ్డికి చెక్కు రూపంలో చెల్లించామని, వాటాలను బదలాయిస్తూ ఆయన సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు అక్కడ పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నాం కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశారు సీఐడీ తరఫున వై.శివకల్పనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎస్‌హెచ్–4 ఫారంను వ్యాజ్యాలతో జత చేయలేదని, దీనిని కోర్టు తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి ఫిర్యాదుదారు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. మార్గదర్శికి ఏపీలో కూడా శాఖలున్నాయన్నారు. వాటాల బదిలీ డాక్యుమెంట్లపై ముద్రించిన స్టాంపు ఎక్కడిదో పరిశీలించాల్సి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ కేసు గురించి శివకల్పన ప్రస్తావించారు. అన్ని కేసులూ తనకు తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి అన్నారు. రామోజీ, శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నీ 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీరావు, శైలజా కిరణ్ గురించి సంచలన విషయాలు..
-
మాపై సీఐడీ కేసు కొట్టేయండి
సాక్షి, అమరావతి : తమపై సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. రామోజీరావు తమను తుపాకీతో బెదిరించి, సంతకాలు ఫోర్జరీ చేసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమకున్న షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ అయిన శైలజా కిరణ్ పేరు మీద అక్రమంగా బదలాయించుకున్నారని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో వాటాదారు అయిన జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో సీఐడీ అధికారులు రామోజీరావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. రామోజీరావు, శైలజా కిరణ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సీఐడీ తరఫున స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలు మొదటిసారి విచారణకు వస్తున్నందున కేసు పూర్తి వివరాలను తెలుసుకుని, వాటిని కోర్టు ముందుంచాల్సి ఉందని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని శివకల్పనారెడ్డి కోరారు. లూథ్రా జోక్యం చేసుకుంటూ.. ఈలోపు పిటిషనర్లను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఈలోపు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈలోపు పిటిషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోబోతున్నారా.. అని శివకల్పనారెడ్డిని ప్రశ్నించారు. ఈలోపు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని శివకల్పనారెడ్డి చెప్పారు. బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోబోమంటే విచారణను వాయిదా వేస్తానని న్యాయమూర్తి తెలిపారు. దీంతో అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని శివకల్పనారెడ్డి చెప్పారు. దీనిని రికార్డ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు. తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తుపాకితో బెదిరించి.. మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా అన్నయ్య మార్టిన్ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి 2016లో హైదరాబాద్‌లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్ కింద చెక్ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్‌ను కూడా నగదుగా మార్చుకోలేదు. చట్ట ప్రకారం ఇది చెల్లదు కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం. చేతి అప్పు అంటూ బుకాయింపు మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్వోసీకి ఫిర్యాదు మేము సమ్మతించకపోయినా, చెక్‌ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్వోసీకి ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి.. రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది. దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది. సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు. మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి.. మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం. శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్ పేరిట 388 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆరుగురు షేర్ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని ఇతర షేర్ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు. -
Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు నుంచి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆయనపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు వెళ్లింది. మార్గదర్శిలతో తమక రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు గాదిరెడ్డి యూరిరెడ్డి. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి రెడ్డి కొడుకే ఈ యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని.. గతంలో స్వయంగా కలిసి షేర్ల గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్యే తమ షేర్‌హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు. యూరిరెడ్డి ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి జీజే రెడ్డి.. జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. అదే జిల్లాలోని పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావుని.. కమ్యూనిస్ట్ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డికి రికమండ్ చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీరావుకు టైపిస్ట్ కమ్ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే రామోజీరావు తన బిజినెస్ స్కిల్స్ చూపించి.. తన తండ్రికి దగ్గరయ్యారని, ఆపై చిట్‌ఫండ్‌కంపెనీ కోసం రూ.5 వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. ప్రతిగా మా నాన్నకు(జీజే రెడ్డికి) రామోజీరావు షేర్లు కేటాయించారు.. అని ఫిర్యాదులో యూరిరెడ్డి పేర్కొన్నారు. 1985లో తన తండ్రి జీజే రెడ్డి మరణించిన తర్వాత షేర్ల గురించి తెలియదు. అయితే.. 2014లో సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగానే తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. గుమాస్తా రామోజీ .. మరి ఎలా ఓనర్ అయ్యాడు? వాటాల కోసం పలుమార్లు సంప్రదించే యత్నం చేశాం. కానీ, రామోజీరావు మమ్మల్ని కలవలేదు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు రామోజీరావు. నా తండ్రి పేరు మీద ఉన్న షేర్లు నా పేరు మీద బదలాయించామని ఆయన్ని కోరాను. దానికి ఆయన.. కొంతకాలానికి బదిలీ చేస్తానని చెప్పారు. తిరిగి ఆయన్ని కలిశాక.. నా పేరిట షేర్లు బదిలీ చేయడానికి నా సోదరుడిని నుంచి అఫిడవిట్‌పై నో అబ్జెక్షన్ సంతకం చేయమన్నారు. అయితే అక్కడ ఓ ఖాళీ అఫిడవిట్ కాగితలం ఉండడంతో మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో కోపంతో ఉన్న తుపాకీతో బెదిరించి కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ, ఆ కాగితాలు చెల్లవని.. ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండడం, ఆ షేర్లు శైలజా కిరణ్ పేరు మీద బదలాయించడంతో.. దర్యాప్తు సంస్థను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అలా ఫిర్యాదు, ఇలా క్వాష్ పిటిషన్ యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు ఎక్కడ లేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఈ కేసు నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. ఈ FIRను సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ వేసింది రామోజీ టీం. -
మార్గదర్శి కేసు: దర్యాప్తునకు చెరుకూరి శైలజ సహకరించడంలేదు: ఏపీ సీఐడీ
-
రామోజీ, శైలజాలకు బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీళ్లలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది. విచారణ 18కి వాయిదా.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు.. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండటం మరో విశేషం. ఈ రెండు కోర్టులిచ్చిన ‘రిటర్న్’ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టులో గత వారం క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై సోమవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ -
చందాదారులకు మార్గదర్శి బెదిరింపులు 'చెప్పింది చేయండి'
సాక్షి, అమరావతి: సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులను ఆ సంస్థ యాజమాన్యం బెదిరిస్తోందా? మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందా? ఇంతగా బరితెగించడం నిజమేనా? దీనిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారా? తదితర ప్రశ్నలన్నింటికీ సీఐడీ విభాగం అవునని స్పష్టం చేస్తోంది. ఘోస్ట్ చందాదారుల పేరిట అక్రమాలకు పాల్పడుతుండటాన్ని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీస్తుంటే బెంబేలెత్తిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని కుండబద్దలు కొట్టింది. చందాదారులు, ఏజంట్లను మోసగిస్తూ మార్గదర్శి భారీగా అక్రమాలకు పాల్పడుతోందని పలువురు బాధితుల ఫిర్యాదుతో విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేటలో తాజాగా ఆ సంస్థపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫకీరప్పతో కలసి విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఘోస్ట్ చందాదారుల పేరిట ఆర్థిక దందా ► మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రతి చిట్టీ గ్రూపులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున మొత్తం మీద రాష్ట్రంలో 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల పేరిట భారీగా ఆర్థిక మోసానికి పాల్పడుతోంది. ఆ 3 వేల మందికి తెలియకుండానే వారిని చందాదారులుగా చూపిస్తూ వారి పేరిట అక్రమంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఇతరత్రా సేకరించిన వారి గుర్తింపు కార్డులతో వ్యవహారం నడుపుతోంది. వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతోంది. ► ఘోస్ట్ చందాదారుల పేరిట చెక్‌లు జారీ చేస్తున్నప్పటికీ, ఆ చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం వారి వద్దే అట్టిపెట్టుకుంటోంది. ఆ చెక్కుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. బ్యాంకులో జమ చేయడం లేదు. ఇదో అతి పెద్ద ఆర్థిక మోసం. అలాంటి 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల్లో వంద మందిని సీఐడీ విచారిస్తోంది. ► దాంతో బెంబేలెత్తిన మార్గదర్శి యాజమాన్యం ఆ ఘోస్ట్ చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని, తర్వాత తాము అన్నీ సెటిల్ చేస్తామని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ తన పీఏ శశికళ ద్వారా చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అక్రమ డిపాజిట్లుగా నల్లధనం ► రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే తిరిగి బుకాయిస్తోంది. రాబోయే నెలలకు చిట్టీ గ్రూపులకు చెల్లించాల్సిన చందాలను అడ్వాన్స్‌గా జమ చేస్తున్నారని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అసలు చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే చందాదారుల పేరిట నాలుగైదు నెలల ముందే డిపాజిట్లు సేకరించిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. ► చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే ఎవరైనా చందాల మొత్తం చెల్లిస్తారా? ఎవరూ చెల్లించరు కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు దాదాపు 2 వేల మందిలో రూ.కోటికి పైగా విలువైన అక్రమ డిపాజిట్లు చేసిన, చిట్టీ గ్రూపుల్లో చందాదారులుగా ఉన్న వారు ఏకంగా 800 మందికిపైగా ఉన్నారు. చాలా కంపెనీల పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. ► ఆ 800 మందికిపైగా డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అంత భారీగా డిపాజిట్లు ఎలా చేశారు.. ఆ నిధులు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయనే కోణంలో విచారిస్తోంది. విజయవాడలో ఓ బిల్డర్ ఏకంగా రూ.50 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా ఉన్నారు. ► ఇలాంటి భారీ మొత్తాల డిపాజిట్‌దారులు, చిట్టీ గ్రూపుల్లో సభ్యుల గురించి ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా సీఐడీ సమాచారమిచ్చింది. అక్రమ డిపాజిట్ల ముసుగులో నల్లధనం చలామణిలోకి తీసుకువస్తున్నారా అన్నది సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఏజంట్లకూ కుచ్చుటోపి ► మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ చందాదారులు, ఏజంట్లను కూడా మోసగిస్తోంది. కుట్ర పూరితంగా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారి ఆస్తులు రాయించుకుంటోంది. దీనిపై చందాదారులు, ఏజెంట్లు, ఘోస్ట్ చందాదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిశీలించి తగిన ఆధారాలు ఉన్న వాటిపై సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. ► విజయవాడలో కోళ్ల ఫారం యజమాని బొండు అన్నపూర్ణా దేవి అనే మహిళను ఏకంగా 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్పించి ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. కుట్ర పూరితంగా విజయవాడలోని లబ్బీపేట, గుడివాడ మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. ష్యూరిటీలు ఇచ్చినా సరే కొర్రీలు వేస్తూ ఆమెను డిఫాల్టర్‌గా చూపిస్తూ వారి ఆస్తులు కూడా రాయించుకున్నారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ఆమె రూ.14 కోట్ల విలువైన 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా ఉన్నారు. ఆమె రూ.8 కోట్లు చందా మొత్తం చెల్లించారు. కానీ చిట్టీ పాట పాడితే ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.48 లక్షలు మాత్రమే. ఇందులో రూ.8 కోట్ల విలువైన 45 చిట్టీ గ్రూపుల్లో ఆమె రూ.1.7 కోట్లు చందా మొత్తంగా చెల్లిస్తే.. చిట్టీ పాట పాడిన తర్వాత ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.8 వేలు. ఆమెను డిఫాల్టర్‌గా చూపిస్తూ వారి కుటుంబ ఆస్తులు కూడా రాయించుకుంటున్నారు. ► విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన పిలక లలిత కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఆమెను విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఘోస్ట్ చందాదారుగా చేర్చారు. ఆ విషయం తెలిసి ఆమె చిట్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. అక్కడ ఉన్న పత్రాల్లో ఉన్న సంతకాలు చూసి అవి తాను చేయలేదని ఫోర్జరీ చేశారని తెలిపారు. ► ఆమె చిట్టీ పాడినట్టు.. ఆమెకు చిట్టీ మొత్తం చెల్లించినట్టు కూడా రికార్డుల్లో ఉంది. అందుకు ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేశారు. తనకు తెలియకుండానే తనను చందాదారుగా చేర్చడంతోపాటు తన సంతకాలు ఫోర్జరీ చేయడంపై లలిత కుమారి విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో విశాఖపట్నం డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏజెంట్ కె.సంతోష్, సాక్షి సంతకాలు చేసిన జి.నరసింగరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్, ఎండీ శైలజ కిరణ్, ఆమె పీఏ శశికళ, విజయవాడ లబ్బిపేట బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావు, గుడివాడ బ్రాంచి మేనేజర్ వైవీవీడీ ప్రసాద్, పాతూరి రాజాజీ, పాపి నాయుడులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ► పల్పాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏజంట్‌నే ఆ సంస్థ మోసం చేసింది. ఏజంట్ సంతకాన్ని బ్రాంచి మేనేజర్ ఫోర్జరీ చేశారు. ఏజంట్ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మా కుటుంబాన్ని దోచేసి రోడ్డున పడేశారు – బోరున విలపించిన బొండు అన్నపూర్ణా దేవి ‘మార్గదర్శి చిట్ ఫండ్స్ మమ్మల్ని పూర్తిగా మోసం చేసి ఆర్థికంగా కుదేలయ్యేట్టు చేసింది. మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మా ఆస్తులు, బంగారం, వృద్ధాప్యంలో అవసరాల కోసం దాచుకున్న మొత్తం అంతా మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు ధారపోశాం. అయినా సరే ఇంకా మమ్మల్ని వేధిస్తూ మిగిలిన ఉన్న ఇంటిని కూడా తీసుకునేందుకు వేధిస్తోంది. మా కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడింది. నా భర్త ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడు. నేను కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాను. నేను మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఒక గ్రూపులో చందాదారుగా చేరాను. ఆ తర్వాత ఏకంగా 65 గ్రూపుల్లో నన్ను చందాదారుగా చేర్చింది. నిబంధనల ప్రకారం మేము ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్‌గా చూపించింది. మా ఆస్తులు తీసుకుంది. నా భర్త జీపీఎఫ్ డబ్బులు కట్టి, పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించాం. అయినా సరే ఇంకా బకాయి ఉన్నారంటూ మా ఇల్లు వేలం వేయించారు. మా ఇంటికి వచ్చి అల్లరి చేశారు. మా అమ్మాయి విదేశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది? ఎలా వేలం పాటలో పాల్గొంది? తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది? ఇంత దారుణంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ మమ్మల్ని మోసం చేసింది. మమ్మల్ని కుట్ర పూరితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం, మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.’ రూ.9.43 కోట్ల జగజ్జనని చిట్ ఫండ్స్ ఆస్తులు అటాచ్ కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడిన రాజమహేంద్రవరానికి చెందిన జగజ్జనని చిట్ ఫండ్స్‌కు చెందిన రూ.9,43,52,020 విలువైన స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. వాటిలో భవనాలు, భూములు, ఖాళీ స్థలాలతో కూడిన మొత్తం 12 స్థిరాస్తులను అటాచ్ చేయనుంది. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీ ప్రతిపాదనకు హోమ్ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆమోదం కోసం సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. న్యాయస్థానం అనుమతి అనంతరం ఆ ఆస్తులను అటాచ్ చేస్తుంది. -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్‌లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
ఆందోళనలో మార్గదర్శి చందాదారులు
తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వారికి సైతం చెల్లింపులు చెల్లించని వైఖరిని మార్గదర్శి అవలంభిస్తోంది. దీంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అధికారిక తనిఖీల్లో మార్గదర్శి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడోరోజూ మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సోదాలలో డిపాజిటర్ల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. బ్యాంక్ ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్క్‌లను అధికారులు జప్తు చేశారు. ఇవాళ్టి తనిఖీలలో మరిన్ని అక్రమాలు బయటపడొచ్చనే భావిస్తున్నారు. ఆ వర్గానికి మాత్రమే చెల్లింపులా? ఇప్పటికే తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వాళ్లకు మార్గదర్శి యాజమాన్యం చెల్లింపులు చెల్లించలేదు. అదే సమయంలో కాల పరిమితి ముగిసినా ప్రైజ్‌మనీ అందించని పరిస్థితి ఉంది. దీంతో మార్గదర్శి చందాదారుల్లో ఆందోళన నెలకొంది. చందాదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది మార్గదర్శి. దీంతో చందాదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి తెస్తున్న ఓ సామాజికవర్గం వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామోజీకి దెబ్బ! చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదే సమయంలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టింది. నిధుల మళ్లింపు పాపం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు కాబట్టి. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదొక్కటే దారి రామోజీ పాపం ఫలితంతో.. 50 వేల మంది చందాదారుల సొమ్ము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ‘అగ్రిగోల్డ్’ తరహాలో మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణపైనా సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
రామోజీ, శైలజాకిరణ్ మళ్లీ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజాకిరణ్ మరోసారి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారు. తద్వారా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదన్న వైఖరిని పునరుద్ఘాటించారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల నిధులను మళ్లించిన కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు రామోజీరావు, శైలజాకిరణ్‌కు నోటీసులు జారీ చేశారు. వీరు ఈ నెల 16న (బుధవారం) విచారణకు హాజ రు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరుకాలేదు. సీఐడీ దర్యాప్తునకు రామోజీరావు, శైలజాకిరణ్ ముఖం చాటేయడం ఇది రెండోసారి. ఈ కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జూలై 5న విచారణకు హాజరు కావాలని గతంలో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు కూడా కేవలం మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగానే తాము చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కానీ రామోజీరావు, శైలజాకిరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. తాము విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేమని సీఐడీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు. మళ్లీ కూడా అదే వైఖరి రామోజీరావు, శైలజాకిరణ్‌కు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఈ నెల 9న నోటీసులు జారీ చేసింది. ఈసారీ వారిద్దరూ విచారణకు ముఖం చాటేశారు. ఈ కేసులో రామోజీరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఓసా రి, శైలజాకిరణ్‌ను రెండుసార్లు సీఐడీ అధికారులు విచారించారు. ఆ విచారణ సమయంలో ఇంటి గేట్లు ఉద్దేశ పూర్వకంగా తెరవకుండా అధికారులను వేచి చూసేలా చేశారు. ఆపై విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల నిధులు మళ్లించినందున.. అంటే నేరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగినందున వారిద్దరినీ రాష్ట్రంలోనే విచారించాల్సి ఉంది. అందుకే ఏపీలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
ఏపీవ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల్లో అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఆఫీసుల్లో సీఐడీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీలు చేపట్టింది. ఇక, మార్గదర్శి చిట్‌ఫండ్‌లో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా మార్గదర్శి చిట్‌ఫండ్‌లో రికార్డులు, పన్నులు చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 37 మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల సేకరించిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. నిన్న(బుధవారం) మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావును సీఐడీ విచారణకు పిలిచింది. నేడు(గురువారం) మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, వీరిద్దరూ విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా రామోజీ, శైలజ కిరణ్ గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రాకపోవడం గమనార్హం. ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
రామోజీ, శైలజకు మరోసారి నోటీసులు
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్‌కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్‌లను చేర్చింది ఏపీ సీఐడీ. ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు -
మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం
-
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు: ఛీటింగ్ ‘మార్గం' మూత!
అతిపెద్ద కార్పొరేట్ మోసంమార్గదర్శి చిట్‌ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మార్కెట్లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ కుంభకోణంలో ఎన్రాన్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్ కేంద్ర చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్‌లో ఉన్న వాటాలను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు, శైలజా కిరణ్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్ చేస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలను అటాచ్ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌లో 44.55 శాతం వాటా అటాచ్ కానుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్ చేయనుంది. రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు (ఫోర్‌మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్‌షీట్ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్ బర్దర్ తెలిపారు. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్సైట్ ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తమ వెబ్‌సైట్‌ను మూసివేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల్లో వాటాల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దన్ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వెబ్‌సైట్‌ను మూసివేయడం గమనార్హం. మార్గదర్శి డాట్‌కామ్ పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్ కావడం లేదు. వెబ్‌సైట్‌పై క్లిక్ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్సైట్ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్సైట్ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్‌సైట్‌ను మూసివేసినట్లు భావిస్తున్నారు. -
మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం మరోవైపు.. హైదరాబాద్‌లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్‌లకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు. చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
విచారించాలి.. ఏపీకి రండి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థి క అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్‌ను ఆంధ్ర ప్రదేశ్‌లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది. దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్‌ను రెండుసార్లు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరిని గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది. న్యాయ సూత్రాల ప్రకారం.. రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో నేరానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మళ్లించింది. ఎఫ్ఐఆర్లు కూడా ఇక్కడే నమోదయ్యాయి. దీంతో న్యాయ సూత్రాల ప్రకారం ఈ కేసులో నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోనే విచారించాల్సి ఉంది. రామోజీరావు, శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించినప్పుడే సీఐడీ అధికారులు వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి విచారిస్తామని సీఐడీ అధికారులు గతంలోనే మీడియాకు తెలిపారు. దేశంలో అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. హాజరు కావడం ఆనవాయితీ నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాలు ఇదే రీతిలో నిందితులను విచారిస్తున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు, శైలజా కిరణ్ ప్రముఖులు కావడం, వారికి ఈనాడు పత్రిక, సొంత మీడియా ఉన్నందున ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యులకు ఒక విధానం, మీడియా బలం ఉన్న వారికి మరో విధానమా? వారికి చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్‌లో శైలజా కిరణ్‌ను విచారించిన సందర్భంగా సీఐడీ అధికారులను తన నివాసంలోకి రానివ్వకుండా గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టి అవమానకర రీతిలో వ్యవహరించినా సంయమనంతో వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సీఐడీ భావిస్తోంది. గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి జూలై 5న రామోజీరావు, శైలజా కిరణ్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్‌పేట బ్రాంచి కార్యాలయ మేనేజర్(ఫోర్మేన్)కు కూడా నోటీసులు జారీ చేశారు. -
A1 రామోజీ, A2 రామోజీ శైలజకు నోటీసులు రండి మాట్లాడాలి..
-
రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్‌కి హాజరు కావాలని సీఐడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు ఉండగా, ఏ-2గా శైలజా కిరణ్‌లు ఉన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది సీఐడీ.ఈ నెల మొదటివారంలో ఏ-2గా ఉన్న శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. శైలజా కిరణ్ నివాసంలోనే ఆమెను సీఐడీ విచారించింది. కాగా, విచారణ కోసం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ . ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు. శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: రామోజీ రాసిందే రశీదు! -
మార్గదర్శి కి మరో షాక్
-
మార్గదర్శికి మరో భారీ షాక్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. ఇదీ చదవండి: సూర్య నారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు -
తొంగి చూసినట్లే రాతలు!.. ఆ ప్రశ్నలకు బదులేవీ?
మనిషికి , మనిషికి కొలమానాలు ఎలా మారిపోతాయో చూడండి. వివేకా కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏడుసార్లు విచారించినా.. మళ్లీ ,మళ్లీ విచారణ చేయాలనడం కరెక్టట!. అదే మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తే మాత్రం తప్పట!. ఏమి లాజిక్!. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ. దాని జోలికి వెళ్లకుండా.. సీబీఐ వాళ్లు అలా చేశారు... ఇలా చేశారు.. అవినాశ్.. దానికి సమాధానం చెప్పలేదు.. దీనికి చెప్పలేదు అంటూ ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. చివరికి ఎంతవరకు వెళ్లారంటే అవినాష్‌కు బెయిల్ ఇవ్వకుండా చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో మీడియాలోని ఒక వర్గం ఏకంగా న్యాయ వ్యవస్థకే కళంకం ఆపాదిస్తూ చర్చలు జరిపింది. ✍️ అవినాష్ రెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారిస్తున్న తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కోణంలోనే విచారణ సాగుతోందని, రెండో కోణంలో దర్యాప్తు జరగడం లేదన్న అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో.. గౌరవ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సిబిఐ నీళ్లు నమిలింది. కాగా, మార్గదర్శి ఆర్దిక లావాదేవీల అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ అయినా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారిస్తుంటే.. అది కక్ష అని ప్రచారం చేస్తున్నారు. తమ చేతిలో మీడియా ఉంది కనుక సీఐడీపై ఆరోపణలు గుప్పించారు. అదే మరోచిట్ ఫండ్ సంస్థ కాని, ఇంకో ఆర్థిక సంస్థ కాని ఇలా కేసులో చిక్కుకుంటే, ఆ కంపెనీ ఎండీని, డైరెక్టర్లను సీఐడీ విచారిస్తుంటే ఇదే ఈనాడు మీడియా ఎన్ని రకాల కథనాలు వండి వార్చేది?. ✍️ కొన్నేళ్ల క్రితం అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసును తీసుకుంటే ఈనాడు మీడియా ఎన్ని వార్తలు ఇచ్చి ఉంటుంది!. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబులు కలిసి కేసులు పెట్టినప్పుడు సీబీఐ విచారణ సందర్భంలో ఎంత ఘోరంగా ఈనాడు మీడియా వార్తలు ఇచ్చింది గుర్తు లేదా!. జగన్ పై కేసు నిలబడుతుందా?లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా, ఏకపక్షంగా.. సీబీఐ అధికారి ఇచ్చిన లీకులు, తమకు ఏది తెలిస్తే దానిని మొదటి పేజీలలో పుంజీలకొద్ది కథనాలు ఇచ్చారే!. ఏకంగా జగన్ పై ఈడీ కేసులు వచ్చాయని, తీహారు జైలుకు తరలిస్తారని పలుమార్లు వార్తలు ఇచ్చారే! అప్పుడు సీబీఐ వాళ్లకు గొప్పసంస్థగా కనిపించింది. ఆ దర్యాప్తు సంస్థ అధికారిని గొప్ప ఆఫీసర్‌గానూ పబ్లిసిటీ చేశారు. తీరా ఆ అధికారి ఆ తర్వాత కాలంలో ఒక రాజకీయ పార్టీలో చేరి ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందారు. అంతగా ఆ మీడియా ఆయనను ప్రభావితం చేసిందన్నమాట. ✍️ ఇప్పుడు మార్గదర్శి కేసులో ఏమి రాస్తున్నారు?.. ఏమి చెబుతున్నారు?.. మార్గదర్శిని దెబ్బ తీయడమే అసలు లక్ష్యం అని హెడ్డింగ్‌లు పెడుతున్నారు. ఏడు గంటల పాటు ఎండీ శైలజా కిరణ్‌ను విచారించిన సీఐడీ, మళ్లీమళ్లీ అవే ప్రశ్నలు. పొంతనలేని అంశాలు అంటూ ఈనాడు వార్త ఇచ్చింది. మరి సీబీఐ అవినాష్‌ను కాని, ఆయా కేసులలో కాని పలుమార్లు విచారించినప్పుడు ఇలా ఎందుకు రాయదు!. సీబీఐ వేసిన ప్రశ్నలు వేయడం కాకుండా కొత్త ప్రశ్నలు వేసిందని ఈనాడు కనిపెట్టిందా!. ఏ దర్యాప్తుఅధికారి అయినా, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పదే,పదే ఒకే ప్రశ్న అడుగుతుంటారట. తద్వారా ఏదో టైమ్ లో భిన్నమైన సమాచారం వస్తుందేమోనని పరిశీలిస్తుంటారట. వేధింపులే లక్ష్యంగా అధికారులు వ్యవహరించారని ఈనాడు ఆరోపణ. ✍️ సాధారణంగా నిందితులు పోలీస్ స్టేషన్ లేదా, నిర్దిష్ట పోలీసు కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరు కావల్సి ఉంటుంది. కాని ఇక్కడ ఏపీ సీఐడీ రామోజీరావును కాని, ఆయన కోడలు శైలజా కిరణ్ ను కాని వారి ఇంటికే వళ్లి విచారిస్తున్నారే!. దేశంలో ఎంత మందికి ఇలాంటి గౌరవం లభిస్తుంది. అయినా వేధింపులే అని వీరు వాపోతున్నారు. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించారని అంటున్నారు. అవేమిటో చెప్పలేదు. అవినాష్ కేసు అయినా, మరోకేసు అయినా, దర్యాప్తు సంస్థ వేసిన ప్రశ్నలు, వీరు ఇచ్చిన జవాబులు అంటూ వార్తలు ఇచ్చే మీడియా శైలజా కిరణ్ విషయంలో అలా ఎందుకు చేయలేదు?. ఏ ప్రశ్నకు ఆమె ఏ సమాధానం ఇచ్చారో రాసి ఉంటే వాస్తవాలు తెలిసేవి కదా!. ✍️ గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై విపరీతమైన దాడి చేస్తూ , నిత్యం తప్పుడు వార్తలతో నింపుతున్న ఈనాడు మీడియాకు తమదాకా వచ్చేసరికి అమ్మో,అబ్బో అంటున్నారే. సీఐడీ వారు మార్గదర్శిలో ఫలానా అక్రమాలు జరిగాయని అంటున్నారు. వందల కోట్లో, వేల కోట్లో బ్లాక్ మనీ సర్కులేట్ అయిందని చెబుతున్నారు. వాటికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. వాటిని శైలజా కిరణ్ కు కూడా చూపించి ప్రశ్నిస్తే, ఆమె వాటికి జవాబు ఇవ్వలేకపోయారని వేరే మీడియాలో వార్తలు వచ్చాయే!. డిపాజిట్ దారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారా?లేదా? అన్నదానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వవచ్చు కదా?. అన్నిటికి మించి CID వారు మార్గదర్శి ఆఫీస్ లలో సోదాలు జరిపినప్పుడు వారు అడిగిన రికార్డులు అన్నింటినీ ఇచ్చేసి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు కదా!. ✍️ ఏపీలో జరిగిన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. మార్గదర్శి నిధులను మళ్లించిన విషయాన్ని ఒప్పుకున్నారు. కాని, ఎక్కడికో తెలియదని ఆమె అన్నారట. ఆ డబ్బును షేర్లలో పెట్టారా?లేదా? అందుకు చట్టం అనుమతిస్తుందా? అలాగే ఆ నిధులను రామోజీ గ్రూపు ఇతర సంస్థలలో పెట్టారా?లేదా? అది చెల్లుతుందా? నల్లధనం మార్పిడికి మార్గదర్శిని వాడుకున్నారన్న అభియోగానికి ఏమి సమాధానం ఇచ్చారు?. ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదన తప్ప, చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా అనేవాటికి జవాబు ఇవ్వడం లేదు. విచారణకు శైలజ సహకరించలేదని అధికారులు అంటున్నారు. అయితే ఒక అధికారి సహకరించారని అన్నారని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. నిజంగానే శైలజా సహకరించి ఉంటే మంచిది!. సీఐడీకి కాని, ఇతరత్రా సాధారణ ప్రజలకు కాని వస్తున్న సందేహాలను తీర్చే విధంగా తమ మీడియాలో ప్రముఖంగా ఇస్తే అంతా తేలిపోతుంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఇదీ చదవండి: ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే.. -
విచారణకు శైలజా కిరణ్ సహకరించలేదు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని, అయినప్పటికీ తాము చట్టానికి లోబడే విచారణ జరుపుతున్నామని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఈనాడు, ఈటీవీ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే సీఐడీ విచారణపై నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము శైలజ కిరణ్‌ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, .ఆమె పట్ల పూర్తి మర్యాదతో వ్యవహరించామని చెప్పారు. ఆమె భోజనం, టీ, మందుల కోసం అవసరమైన ప్రతిసారీ అవకాశం కల్పించామన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు లభించాయని రవికుమార్ స్పష్టం చేశారు. విచారణ కోసం మంగళవారం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు. ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు. శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?
సాక్షి, అమరావతి: తనకు నచ్చినవారిని నెత్తిన పెట్టుకుంటూ.. నచ్చనివారిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నిధులను చట్టానికి విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు రామోజీరావు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆ కేసుపై ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నించడం విస్మయపరుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ, రామోజీ కోడలు శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో రెండోసారి మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తమకు చట్టాలు, నిబంధనలు వర్తించవనే రీతిలో సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ అధికారులు ప్రశ్నలు అడిగినా ‘తెలియదు’ అంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తాను విదేశాల నుంచి వచ్చానని, తనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరుగుతున్నాయంటూ సాకులు చెబుతూ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. విచారణకు అడుగడుగునా అడ్డుపడుతూ.. మంగళవారం దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణ ప్రక్రియలో సీఐడీ అధికారులు తాము ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిలో కనీసం 25శాతం ప్రశ్నలను కూడా శైలజను అడగలేకపోయారు. దీన్ని బట్టి ఆమె అడుగడుగునా విచారణకు అడ్డుపడుతూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని స్పష్టమవుతోంది. ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించేందుకు సీఐడీ అధికారులు అవకాశం ఇచ్చారు. భోజనానికి, మందులు వేసుకోవడానికి కూడా విరామం ఇచ్చారు. అయినప్పటికీ శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం గమనార్హం. అంతే కాకుండా విచారణకు సీఐడీ అధికారులతోపాటు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులైన ఆర్థిక వ్యవహారాల నిపుణులను ఇంటిలోకి రానీయకుండా అడ్డుకునేందుకు యత్నించడం రామోజీ కుటుంబం బరితెగింపునకు నిదర్శనం. అసలు వాస్తవం ఇది.. కాగా అసలు వాస్తవం ఏమిటంటే.. తమ విచారణకు శైలజా కిరణ్ ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దర్యాప్తు అధికారి చెప్పిన విషయాలను కాకుండా తమకు అనుకూలంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే తన విష పత్రికలో అబద్ధపు రాతలు రాయించారు. ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రామోజీరావు అక్కసు వెళ్లగక్కారు. శైలజా కిరణ్ విచారణ ప్రక్రియకు సబంధించిన వార్తలు సాక్షి మీడియాలో ప్రసారం చేశారని గగ్గోలు పెట్టారు. వాస్తవానికి సాక్షి మీడియానే కాకుండా ఇతర చానళ్లు కూడా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించడంపై ప్రముఖంగా వార్తలను ప్రసారం చేశాయి. ఓ సంచలనాత్మకమైన కేసులో.. అందులోనూ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత. కానీ, తాము ఎవరిపైన అయినా విషం చిమ్ముతాం.. ఇంకెవరూ తమపై మాత్రం వాస్తవాలను కూడా రాయకూడదనే తీరులో రామోజీరావు ఉండటం విడ్డూరంగా ఉంది. దశాబ్దాలుగా చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు నాడు ఎన్టీ రామారావు నుంచి ఇతర ప్రత్యర్థి పార్టీల నేతలపై పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసిన రామోజీ నేడు శ్రీరంగ నీతులు చెబుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ ఆర్థిక అక్రమాల సామ్రాజ్యమైన ‘మార్గదర్శి’ కుప్పకూలుతుండటంతో సీఐడీ దర్యాప్తును కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది. ‘ఈనాడు’లో అబద్ధపురాతలు షురూ.. విచారణకు ఏమాత్రం సహకరించని రామోజీ కుటుంబం తమ పత్రిక ‘ఈనాడు’లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శైలజా కిరణ్ విచారణకు పూర్తిగా సహకరించారని సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ తెలిపినట్టుగా ‘ఈనాడు’ తనకలవాటైన రీతిలో అబద్ధపు రాతలు వండి వార్చేసింది. అంతేకాదు.. ఇక శైలజా కిరణ్ విచారణ పూర్తయిపోయిందని.. ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన వెల్లడించినట్టు కూడా నిర్ధారించేసింది. -
చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం. ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నాం మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయి. చట్టం పరిధిలోనే విచారిస్తున్నాం. మేము ఎక్కడ వేధించలేదు. మేము వారి పట్ల పూర్తి మర్యాదగా వ్యవహరించి విచారిస్తున్నాం. వారికి భోజనం, టీ, మందులకు అవసరమైన స్వేచ్ఛ కూడా ఇస్తున్నాం. నిజం రాబట్టడం కోసం పారదర్శకంగా విచారణ చేస్తున్నాం. వాళ్లు సమాధానం లేక చెప్పిందే చెబుతున్నారు’’ అని రవికుమార్ పేర్కొన్నారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ‘‘నిన్న మేము విచారణకు వెళ్లినప్పుడు 10 మంది ని ఆబ్జెక్ట్ చేశారు. టెక్నికల్ ఆఫీసర్స్‌ను తీసుకెళ్లొద్దని అభ్యంతరం తెలిపారు. ఎండి శైలజ మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు.ఎండిగా ఈ సమాచారం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 25 శాతం ప్రశ్నలకు మాత్రమే ఎండి శైలజ సమాధానం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి ఎదో వంకలు పెట్టి ఆలస్యం చేస్తున్నారు. మేము మళ్లీ ఎండి శైలజను విచారణ చేస్తాం. అవసరమైనప్పుడు మళ్లీ రామోజీరావుని కూడా విచారిస్తాం’’ అని రవికుమార్ తెలిపారు. -
నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
తమ చందాదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో తెలియదు! బ్రాంచీలు, ప్రధాన కార్యాలయంలో ఉన్న నిధులెన్నో తెలియదు! మిగిలిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా తెలియదు! కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం గురించి ఏమాత్రం తెలియదు! అసలు నాకేమీ తెలియదు.. తెలియదు.. తెలియదు!! –సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజ తీరు ఇదీ సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–2గా ఉన్న సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో మరోసారి విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకోగా దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మీరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ కదా? మీ పేరిటే చెక్ పవర్ కూడా ఉంది. నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇవిగో..! మరి వీటిపై ఏమంటారు..?’ అని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో ‘నాకు ఆరోగ్యం బాగా లేదు! నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా.. ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శైలజా కిరణ్ తప్పించుకునేందుకు యత్నించారు. విచారణకు సహకరించకుండా.. తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు. సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్ పేర్కొన్నారు. విచారణను అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించగా సీఐడీ అధికారులు పూర్తి సహనం వహిస్తూ విచారణను కొనసాగించారు. మళ్లించాం... ఎక్కడికో తెలియదు! మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు సమాచారం. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్ చెప్పడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. మరోసారి విచారణ విచారణకు శైలజా కిరణ్ సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టి! మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ద్వారా చెరుకూరి రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలి. అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ రూ.వేల కోట్లను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్‌ఫండ్స్ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్ రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. చిట్‌ఫండ్స్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా రశీదులిస్తూ 4 – 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది. గత డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తుతెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోంది. -
రామోజీ ఇంటి వద్దకు సీఐడి అధికారులు వస్తే గేటు తీయకుండా ఓవర్ యాక్షన్!
-
శైలజా కిరణ్‌ను మరోసారి విచారించాల్సి ఉంది: సీఐడీ
Updates: శైలజా కిరణ్‌ను మరోసారి విచారించాల్సి ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే నోటీసులిస్తామని సీఐడీ డీఎస్సీ రవికుమార్ తెలిపారు. నేటి విచారణలో కొంతమేర సమాధానాలు మాత్రమే ఇచ్చారని, అందుచేత మరోసారి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యం సమస్య ఉందనడంతో శైలజాకిరణ్‌ను వైద్యులు పరీక్షించారని సీఐడీ డీఎస్పీ పేర్కొన్నరు. ► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈరోజు(మంగళవారం) ఈ కేసులో ఎ-2లో ఉన్న మార్గదర్శ ఎండీ శైలజా కిరణ్‌ను సుదీర్ఘంగా విచారించారు. నేటి ఉదయమే శైలజా కిరణ్ ఇంటికి చేరుకున్న అధికారులు సుమారు 10 గంటల పాటు ఆమెను విచారించారు. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు సీఐడీ అధికారులు. ►మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎ-2గా ఉన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు గత ఎనిమిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఐవో రవికుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. విచారణలో సీఐడీ ఎస్పీలు హర్షవర్ధన్‌రాజు, అమిత్ భర్ధర్లు పాల్గొన్నారు. ఒక మహిళా ఏసీపీ సహా మొత్తం 30మంది అధికారులు విచారణలో పాల్గొన్నారు. మార్గదర్శి ఖాతాదారుల నగదు దారి మళ్లింపుపై విచారణ చేపట్టారు. నిబంధనలు ఉల్గంఘనలపై సీఐడీ ప్రశ్నిస్తోంది విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న మార్గదర్శి చైర్మన్ రామోజీరావును సీఐడీ ఇప్పటికే ప్రశ్నించింది. ► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్ దారి మళ్లింపుపై విచారణ జరుగుతుండగా.. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్నారు. విచారణను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి సీఐడీ ప్రశ్నిస్తోంది. సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. మార్గదర్శికి సంబంధించిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు, చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్) నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించిన సీఐడీ.. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్మెంట్ నిర్ణయం తీసుకుంది. చిట్‌ఫండ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపిన విషయం తెలిసిందే. చదవండి: మార్గదర్శి కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయండి -
అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ..
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్పీఎల్)లో వందల కోట్ల రూపాయల చందాదారుల సొమ్మును ఇతర మార్గాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజా కిరణ్ ఎలాంటి అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఆమె తిరిగి రావడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడంలేదని తెలిపింది. తనపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారని, దాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రాన్ని, ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ శైలజా కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీపీ లలితా గాయత్రి వాదనలు వినిపిస్తూ.. వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి అక్రమ మార్గాలకు మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారన్నారు. విచారణకు హాజరు కావాలని అంతకు ముందు మూడుసార్లు ఆమెకు సీఐడీ నోటీసులు జారీ చేసినా.. హాజరుకాలేదని వెల్లడించారు. ఏపీలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని, ఈ పిటిషన్‌పై విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని చెప్పారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, ఆదేశాలు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. శైలజపై ఎల్ఓసీ జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అనురాగ్ చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పు వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, లుక్ అవుట్ సర్క్యులరే జారీ చేయనప్పుడు పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందన్నది చర్చనీయాంశం అయ్యింది. ఇది కూడా చదవండి: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఏపీ చరిత్రలోనే రికార్డు.. -
మార్గదర్శి కేసు: ఈనెల 6న శైలజాకిరణ్‌ను విచారించనున్న సీఐడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఆ నోటీసులపై సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజాకిరణ్‌ను ఇప్పటికే సీఐడీ హైదరాబాద్‌లో వారి నివాసంలో వేర్వేరుగా విచారించింది. ఈ కేసులో మరోసారి విచారించాల్సి ఉంటుందని ఆమెకు సీఐడీ విభాగం ఇటీవల సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లో ఆమె అందుబాటులో ఉండే తేదీలు తెలపాలని సూచించింది కూడా. జూన్ 3 తరువాత తాను విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె సీఐడీకి తెలిపారు. దీంతో జూన్ 6న హైదరాబాద్‌లో శైలజాకిరణ్ నివాసంలోనే ఆమెను విచారిస్తామని సీఐడీ నోటీసులిచ్చింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఆమెగానీ ఆమె తరఫు న్యాయవాదులుగానీ సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఇటీవల ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆమె విమానాశ్రయానికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము -
మోసాల మార్గదర్శి
-
చందాదారుల డబ్బును అక్రమంగా దారి మళ్లించారు: సిఐడీ ఏడీజీ
-
చట్టాలకు రామోజీ అతీతుడా! చట్టాన్ని ఇప్పుడే తెచ్చినట్లు ‘ఎల్లో’ పెడబొబ్బలు
సాక్షి, అమరావతి: ఇది నా దేశం... అనుకున్న వాళ్లెవరైనా ఇక్కడి చట్టాలను గౌరవించి తీరాలి. ఆ చట్టాలకు లోబడే పనిచేయాలి. అసలు ఒక వ్యాపారం చేస్తూ... ఆ వ్యాపారాన్ని ఏ చట్టం కింద రిజిస్టర్ చేశారో ఆ చట్టం తనకు తెలియనే తెలియదని... దాన్ని తాను పాటించనని నిస్సిగ్గుగా... నిర్భీతిగా చెప్పే మనుషులను ఏం చేయాలి? తమకు ఏ చట్టాలూ వర్తించవని చెప్పే పెద్ద మనుషుల్ని ఏమనాలి? ఇక్కడైతే చెరుకూరి రామోజీరావు అనో... చెరుకూరి శైలజా కిరణ్ అనో పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నాటి మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి నేటి మార్గదర్శి చిట్స్ వరకూ... మేం డిపాజిట్లు సేకరించలేదని కానీ, మేం నిధులు మళ్లించలేదని గానీ వాళ్లు చెప్పటం లేదు. చట్టప్రకారం అలా చెయ్యకూడదు కదా? అంటే... ఆ చట్టాలేవీ తమకు వర్తించవంటున్నారు. ఆ చట్టాలు తాము పాటించబోమని చెబుతున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో... ఆ కంపెనీ ద్వారా తాము చేసినవన్నీ చట్ట విరుద్ధమైన పనులే అని తేలటంతో... తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఏకంగా ఆ సంస్థనే మూసేశారు. ఇపుడు ఆ సంస్థే లేదు కదా? అని వాదిస్తున్నారు. ఒక బ్యాంకు తన వద్దకు వచ్చిన డిపాజిట్లను ఇష్టం వచ్చినట్లు సొంత అవసరాల కోసం వాడేయొచ్చా? సొంత కంపెనీల్లోకి మళ్లించొచ్చా? అలా మళ్లిస్తే బ్యాంకు కుప్పకూలిపోదా? కృషి, చార్మినార్.. ప్రుడెన్షియల్ బ్యాంకుల నుంచి బిచాణా ఎత్తేసిన బ్యాంకులన్నీ ఇలా చేసినవే కదా? మార్గదర్శి చిట్స్‌లో ప్రస్తుతం వేలకోట్ల రూపాయల మనీ లాండరింగ్, అక్రమ నిధుల మళ్లింపు జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రబుత్వం విచారణ జరుపుతోంది. నిజాలు బయటికొస్తున్నాయి. కానీ దీన్ని ఈ నిజాలు వెలుగుచూడకుండా 86 ఏళ్ల రామోజీరావు కొత్త నాటకానికి తెరతీశారు. ‘ఈనాడు’ పత్రికను అడ్డంపెట్టుకుని, తటస్థుల ముసుగులో తన వాళ్లను తెరపైకి తెస్తున్నారు. అడ్డగోలు బుకాయింపులకు దిగుతున్నారు. మార్గదర్శిపై ఏ ఒక్క ఫిర్యాదూ రాలేదు కదా? అలాంటపుడు సీఐడీ విచారణ ఎందుకంటున్నారు. ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నందుకే ప్రభుత్వం కక్ష గట్టి ఇలా చేస్తోందని... తన వాళ్లచేత కేంద్రానికి లేఖలు కూడా రాయిస్తున్నారు. ఇక్కడ మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారు, డిపాజిటర్లు గమనించాల్సింది ఒక్కటే. యావత్తు దేశాన్ని కుదిపేసి దివాలా తీసిన శారదా చిట్ఫండ్స్గానీ, వేల మందిని ముంచేసిన సుదర్శన్ చిట్స్గానీ కూలిపోవటానికి ముందు చాలా బలంగా కనిపించినవే కదా? కూలిపోయేదాకా వాటిపై ఎవ్వరూ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదే!!. ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోబట్టే... చట్టాలు ఉల్లంఘిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్లే అవి కుప్పకూలాయి. వేల మంది దాచుకున్న కష్టార్జితాన్ని స్వాహా చేసేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్గదర్శి చిట్స్‌ను... చట్టప్రకారం నడుచుకోవాలని కోరటం తప్పా? చట్టాలను అనుసరించాలని అడగటం నేరమా? ఇదెక్కడి తీరు!!. అయినా డిపాజిట్లు సేకరించకూడదన్న ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఎన్ని ఎన్బీఎఫ్సీలు మూతపడలేదు? కనీసం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎన్బీఎఫ్సీ కూడా కాదు. ఒక 50 మంది చిట్ సభ్యులుంటే... ప్రతినెలా ప్రతి ఒక్కరి దగ్గరా సొమ్ములు వసూలు చేసి.. వాటిని చిట్ పాడుకున్న ఎవరో ఒక్కరికి ఆ నెల్లోనే ఇవ్వటం దాని పని. మరి ప్రతినెలా అలా ఎవరి చిట్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తున్నపుడు వేల కోట్ల రూపాయల మిగులు మొత్తాలు దానిదగ్గర ఎలా ఉంటాయి? వాటిని తన సొంత సంస్థల్లోకి మళ్లించే అధికారం ఎవరిచ్చారు? వాటిని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఉల్లంఘనలు కావా? పత్రికాధిపతి... వ్యాపారవేత్త అనే రెండు టోపీల్ని రామోజీరావు ధరిస్తుంటారని... వ్యాపారాల్లో అక్రమాలేవైనా బయటపడినపుడి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోబోయినపుడల్లా... అది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ఎదురుదాడికి దిగుతారని సాక్షాత్తూ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే గతంలో చెప్పింది. గతమంతా రామోజీ చేసింది ఇదే. కాకపోతే ఇపుడలా మాటలు పనిచేయటం లేదు. నమ్మేవారెవరూ లేరు. దీంతో ఆ మాటలు తాను చెప్పకుండా... తటస్థుల ముసుగులో తనకు కొమ్ముకాసే కొందరితో చెప్పిస్తున్నారు. అయినా అక్రమాలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకుంటుంటే మధ్యలో ఈ తటస్థులెవరు? వీళ్లేమైనా మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారా? వీళ్లకేం సంబంధం? వీళ్లకసలు అక్రమాలకు పాల్పడుతున్న రామోజీని రక్షించే బాధ్యతను ఎవరిచ్చారు? రామోజీరావా... చంద్రబాబు నాయుడా? ఈ చట్టాలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాదే? కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999లను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్టు, అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీన్ని వక్రీకరిస్తూ రామోజీరావు మీడియా, చంద్రబాబు పార్టీ గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి ఈ రెండు చట్టాలూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసినవేమీ కావు. చిట్‌ఫండ్ చట్టాన్ని కేంద్రం 1982లో రూపొందించింది. ఇక ఏపీ డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది 1999లో చంద్రబాబు ప్రభుత్వమే. వాటిని అమలు చేస్తుంటే... దాన్ని రామోజీరావుపై వేధింపులుగా వక్రీకరిస్తున్నారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ తరవాత దివాలాయే!! చిట్‌ఫండ్ చట్టాన్ని, డిపాజిటర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందన్నట్టుగా రామోజీరావు, ఆయన మనుషులు, టీడీపీ ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. సామాన్యుల డబ్బు భద్రంగా ఉండటం కోసం చేసిన ఆ చట్టాలను ఉల్లంఘిస్తే ఏమవుతుందో... దేశంలో బట్టబయలైన ఎన్నో చిట్‌ఫండ్ కుంభకోణాలు, ప్రైవేట్ బ్యాంకుల ఆర్థిక దోపిడీలు నిరూపించాయి కూడా... శారదా చిట్‌ఫండ్... 4.90 లక్షల కోట్ల భారీ దోపిడీ 2013లో బట్టబయలైన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దేశంలోనే సంచలనం సృష్టించింది. పశ్చిమబెంగాల్, అసోం, త్రిపురలలో డిపాజిట్‌దారుల నుంచి ఏకంగా 4.90 లక్షల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. అధికవడ్డీల ఆశ చూపించి పోంజీ తరహా మోసానికి పాల్పడింది. 2013లో శారదా చిట్‌ఫండ్ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఏకంగా 17 లక్షల మంది ఆ సంస్థ ఖాతాదారులు నిండా మోసపోయారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా పోంజీ తరహా మోసానికే పాల్పడుతోందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో వెల్లడి కావడం గమనార్హం. రూ.6,380కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే రాష్ట్రంలో వెలుగుచూసిన మరో ఆర్థిక మోసం అగ్రిగోల్డ్. గొలుసుకట్టు తరహాలో 8 రాష్ట్రాల్లో ఏకంగా రూ.6,380 కోట్ల డిపాజిట్లు సేకరించింది. అందులో రూ.3,996కోట్లు డిపాజిట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో సేకరించినవే. ఇష్టం వచ్చినట్లుగా నిధుల్ని మళ్లించి సంస్థ బోర్డు తిప్పేసింది. ఫలితం... కష్టార్జితాన్ని దాచుకున్న 32 లక్షల మంది డిపాజిట్‌దారులు రోడ్డునపడ్డారు. వారిలో అత్యధికంగా 19.50 లక్షలమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. అగ్రిగోల్డ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని గుర్తించినా నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సంస్థకు చెందిన హాయ్లాండ్తోపాటు అమరావతిలో భూములను కొల్లగొట్టేందుకే చంద్రబాబు, లోకేశ్ ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక దశలవారీగా డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తూ వస్తోంది. పాతికేళ్ల కిందటే... ‘కృషి’ బ్యాంకు చంద్రబాబు సీఎంగా ఉండగా 2001లో కృషి బ్యాంకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఖాతాదారులను బురిడీ కొట్టించింది. అత్యధిక వడ్డీల ఆశ చూపించిన ఈ బ్యాంకు ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు... రూ.35కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ డిపాజిట్లు రూ.100 కోట్లకుపైనే ఉంటాయని సమాచారం. కొసరాజు ఆ నిధులను ఇతర సంస్థల్లోకి అక్రమంగా మళ్లించి చివరికి 2001లో చేతులెత్తేసి విదేశాలకు పారిపోయాడు. ప్రుడెన్షినల్... పాపులర్.. ఏదైనా అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2003లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో భారీ ఆర్థిక మోసం... ప్రుడెన్షియల్ బ్యాంకు. ఏకంగా రూ.550 కోట్ల మేర డిపాజిట్‌దారులను మోసం చేసింది ఆ సంస్థ. ఇక కేరళ కేంద్రంగా డిపాజిట్లు సేకరించిన పాపులర్ ఫైనాన్స్ సంస్థ ఏకంగా రూ.2వేల కోట్లమేర డిపాజిటర్లను మోసం చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 274 బ్రాంచులతో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ 2022లో బోర్డు తిప్పేసి డిపాజిటర్లను ముంచేసింది. వీటన్నింటినీ మించిపోయిన మార్గదర్శి... పైన పేర్కొన్న సంస్థలను తలదన్నే రీతిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని ఆధారాలతో సహా వెల్లడైంది. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత ఏడాది నవంబరు, డిసెంబర్లలో మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. అనంతరం సీఐడీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సోదాల్లోనూ ఈ అక్రమాలు ధ్రువపడ్డాయి. ► రశీదు ముసుగులో అక్రమ డిపాజిట్లు: చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 నుంచి 5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తుస్తోంది. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడం నేరం. మార్గదర్శి చిట్స్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఈ అక్రమ డిపాజిట్లు ఎన్ని వేల కోట్లు అన్నది లెక్కతేలాల్సి ఉంది. ► గతంలో రూ.15వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరణ: మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన నేర చరిత్ర మార్గదర్శి గ్రూపునకు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. దాంతో హడావుడిగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసేశారు. కేసు దర్యాప్తులో ఉండగా సంస్థను మూసివేయడం అంటే ఆధారాలను ధ్వంసం చేయడమే. అది క్రిమినల్ నేరం. ► చందాదారుల సొమ్ము సొంత పెట్టుబడిగా...: మార్గదర్శి చిట్స్‌కు మూడు అనుబంధ కంపెనీలున్నట్టుగా బ్యాలన్స్ షీట్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడానికే ఈ కథ. ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాకోసం పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. అంటే రామోజీరావు కుటుంబం రూపాయి పెట్టకుండా...చందాదారుల సొమ్ముతోనే సొంత వ్యాపారాలు చేస్తున్నారు. అసలు చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం–1982కు విరుద్ధం. ► మార్గదర్శి చిట్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడుతోంది. ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం. ► రికార్డుల కనికట్టు...: చట్ట విరుద్ధంగా చేస్తున్న ఈ మోసాన్ని కప్పిపుచ్చేందుకు మార్గదర్శి చిట్స్ రికార్డుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతోంది.చందాదారుల సొమ్ము చెక్కుల రూపంలో తమ వద్ద ఉన్నట్టుగా బ్యాలన్స్షీట్లో చూపిస్తోంది. ఏటా మార్చి 31న వందల కోట్ల రూపాయలు చెక్కులు వచ్చినట్టు చూపిస్తోంది. కానీ ఆ చెక్కులు ఎన్నిరోజులైనా క్యాష్ కావు. అంటే... అవి బోగస్ చెక్కులన్నమాట. అప్పటికే ఆ సొమ్మును మనీ లాండరింగ్ చేసేశారన్నది స్పష్టంగా తెలియకమానదు. ఏపీ ప్రజల సొమ్ము... పెత్తనం పక్క రాష్ట్రంలో: రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్కున్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదు. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు. రాష్ట్రంలోని మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలూ లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి ఎండీ శైలజతో పాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలలయంలోని 11మందికే ఉంది. ఇక్కడి చందాదారుల సొమ్ము భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే... తెలంగాణలో ఉంది కనక అది ఏపీ అధికారుల పరిధిలోకి రాదని చెబుతున్నారు. మరీ ఏపీ చందాదారుల సొమ్ముకు బాధ్యులెవరని అడిగితే... సమాధానం లేదు. ఒక్క బ్యాంకు ఖాతా చాలట...: చిట్‌ఫండ్ సంస్థలు తాము నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. అన్ని చిట్లకూ ఒకే బ్యాంకు ఖాతా. ఏపీకి సంబంధించి ప్రత్యేక ఖాతా కూడా లేదు. ► ఇదో పోంజీ తరహా స్కామ్: మార్గదర్శి చిట్స్ పోంజీ స్కీమ్‌కు తక్కువేమీ కాదు. చిట్టీల్లో 30 – 40శాతం టికెట్లు(సభ్యత్వాలు) యజమాన్యానివే. వాటికి తన తరఫున చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. కొత్త చిట్లు, ఇతర చిట్ల నుంచి వచ్చిన సొమ్మును తాము చెల్లించినట్టుగా రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. అంటే... ఏ రోజైనా కొత్తగా వచ్చే చందాదారులు తగ్గినా, కొత్త చిట్లు ఆగినా మార్గదర్శి తన తరఫున చెల్లించాల్సిన చందాను చెల్లించే పరిస్థితి ఉండదు. అప్పుడు చిట్ పాడుకున్నవారికి సొమ్ము చెల్లించే అవకాశమూ ఉండదు. అదేరోజున దివాలా తీసే ప్రమాదం ఉంటుంది. ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు సాధారణంగా ప్రతి చిట్కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. వాటికోసం మార్గదర్శి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. నిధులు మళ్లించామని అంగీకరించిన రామోజీ సీఐడీ దర్యాప్తులో... తాము మార్గదర్శి చిట్స్ నిధులను ఇతర సంస్థలకు మళ్లించామని రామోజీరావే అంగీకరించారు. ఆధారాలతోసహా సీఐడీ అధికారులు ప్రశ్నించేసరికి ఆయన నోటమాట రాలేదు. దాంతో నిధులు మళ్లించింది వాస్తవమేనని అంగీకరిస్తూనే అది తమ ఆర్థిక ప్రణాళిక అన్నట్టుగా బుకాయించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావే అక్రమాలు నిజమేనని సమ్మతించిన తరువాత ... మళ్లీ వక్రీకరిస్తూ వితండవాదనలెందుకు? చట్టాలు తమకు వర్తించవన్న శైలజ... మామ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివానన్నట్టుగా ఏ–2 చెరుకూరి శైలజ వ్యవహరించారు. అసలు చిట్‌ఫండ్ చట్టం తమకు వర్తించదని...తాము పట్టించుకోమని ఆమె సీఐడీ అధికారుల వద్దే వ్యాఖ్యానించడం తీవ్రమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామన్న ఆమె... పోనీ ఆ చట్ట ప్రకారమైనా అనుబంధ కంపెనీలకు నిధుల మళ్లించడం నేరమే కదా అని అంటే మాత్రం సమాధానమివ్వలేదు. -
మార్గదర్శి చిట్స్ డబ్బును సొంత పెట్టుబడిగా పెట్టామన్నశైలజ
-
Margadarsi: అవును.. మళ్లించాం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ విచారణలో శైలజా కిరణ్ దాదాపుగా అంగీకరించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు ఇప్పటికే నిధులు మళ్లించామని సీఐడీ విచారణలో పరోక్షంగా అంగీకరించారు. తాజాగా చెరుకూరి శైలజ కూడా నిధులు మళ్లించినట్టు సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దేశంలో చట్టాలకు తాము అతీతం అన్నట్టుగా ఆమె సీఐడీ అధికారుల ఎదుటే అడ్డగోలుగా వాదించడం విస్మయపరుస్తోంది. చిట్‌ఫండ్స్ వ్యాపారం చేస్తూ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం తమకు వర్తించదని దబాయించడం రామోజీరావు, ఆయన కుటుంబం బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఐడీ అధికారులకు రికార్డులు చూపించబోమని శైలజా కిరణ్ భీష్మించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజను సీఐడీ అధికారులు గురువారం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఆమె నివాసంలో విచారించారు. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్, విచారణ అధికారి రవికుమార్‌లతోపాటు 25 మంది అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారించింది. శైలజ తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులతోపాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాది కూడా విచారణ ప్రక్రియ సమయంలో ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన విచారణ ప్రక్రియను సీఐడీ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. దాదాపు 75 ప్రశ్నలకు వివరాలు రాబట్టి వాంగ్మూల పత్రంపై శైలజ సంతకం తీసుకున్నారు. గతంలో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా శైలజ నుంచి పలు కీలక విషయాలను సీఐడీ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి... చందాదారుల సొమ్మును మళ్లించాం మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీల్లో సేకరించిన పలు కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సీఐడీ అధికారులు శైలజను విచారించారు. ప్రధానంగా చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత పెట్టుబడులుగా పెట్టడం, మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడంపై ప్రశ్నించినట్లు సమాచారం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులను రామోజీ గ్రూపునకు చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ (కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నైలలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్ షీట్ నోట్ నంబర్ 40లో పేర్కొన్న విషయాన్ని ఆమెకు చూపించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏకంగా 88.5 శాతం వాటా మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిటే ఉంది. ‘‘అవును.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులను ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం..’ అని శైలజ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన అభియోగమైన అక్రమంగా నిధుల మళ్లింపునకు సంబంధించి సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్లైంది. కంపెనీల చట్టం అనుసరిస్తామంటూ... అంతలోనే తెలీదంటూ సీఐడీ అధికారులు అదే విషయంపై గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో తాము కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామని శైలజ పేర్కొనట్లు సమాచారం. చిట్‌ఫండ్స్ వ్యాపారానికి కంపెనీల చట్టంతో నిమిత్తం లేదని, అనుసరించాల్సింది కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982 కదా? అని అధికారులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. పోనీ కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నారని భావించినా... ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.5 శాతం వాటాతోపాటు మరో రెండు కంపెనీల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్ షీట్లో చూపించారు కదా? అని అధికారులు ప్రశ్నించడంతో అవునని ఆమె సమాధానమిచ్చారు. కంపెనీల చట్టం ప్రకారం 50 శాతానికి మించి వాటా కలిగి ఉంటే అనుబంధ కంపెనీగానే పరిగణిస్తారు కదా? అని తిరిగి ప్రశ్నించగా అందుకు కూడా ఆమె అవుననే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు కంపెనీల్లో 88 శాతం పెట్టుబడులు పెట్టి అనుబంధ కంపెనీగా ఉన్నట్టే కదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె మౌనం వహించినట్టు సమాచారం. అటు చిట్‌ఫండ్స్ చట్టం.. ఇటు కంపెనీల చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు ఆమె సమ్మతించినట్టైంది. ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల చెక్కులు.. విచారణ సందర్భంగా సీఐడీ మరో కీలక ఆధారాన్ని సేకరించింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లిస్తున్న రామోజీరావు, శైలజ రికార్డుల్లో మాత్రం చట్టాన్ని ఏమార్చేందుకు యత్నించారని నిరూపితమైంది. 2022 మార్చి 31న రూ.255 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాలన్స్ షీట్లో చూపించారు. కానీ ఆ చెక్కులేవీ తరువాత నగదుగా మారినట్లు (ఎన్‌క్యాష్)గా రికార్డుల్లో లేవని సీఐడీ అధికారులు గుర్తించారు. గరిష్టంగా పది రోజుల్లో చెక్కులను నగదుగా జమ చేస్తామని శైలజ పేర్కొన్నారు. మరి గతేడాది మార్చి 31న వచ్చినట్లు చూపించిన రూ.255 కోట్ల చెక్కులేవీ నగదుగా మారినట్లు రికార్డుల్లో ఎందుకు లేవని సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజ తెల్లమొహం వేశారని సమాచారం. కొన్ని దశాబ్దాలుగా ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నా అవి నగదుగా మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఏటా చందాదారులు చెల్లిస్తున్న రూ.వందల కోట్లను మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ నిధులు ఉన్నట్లుగా చూపించాల్సి రావడంతో చెక్కులు వచ్చినట్లు చూపించి కనికట్టు చేస్తోంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో మార్గదర్శి ఆడిటర్ శ్రావణ్ ఇదే విషయాన్ని అంగీకరించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి కానీ.. చూపించను లేని చెక్కులు ఉన్నట్టుగా చూపించి మోసానికి పాల్పడినట్టు నిరూపితం కావడంతో శైలజ షాక్‌కు గురయ్యారు. దాంతో సీఐడీ అధికారులను పక్కదారి పట్టించేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. ‘ఆ చెక్కుల సమాచారం అంతా ప్రధాన కార్యాలయంలో ఉంటుంది... నాకు తెలీదు’ అని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించగా ఆమె నిరాకరించారు. పోనీ మార్గదర్శి సిబ్బంది ద్వారానైనా ఆ వివరాలు అందించాలని సూచించగా అందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు. వీడియో రికార్డింగ్ ద్వారా పారదర్శకంగా చెక్కుల రికార్డులు పరిశీలిస్తామని చెప్పినా ఆమె ససేమిరా అన్నారు. అంటే చెక్కుల వివరాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో కూడా లేవా? అని ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చినట్లు సమాచారం. ఏపీ రికార్డులు ప్రత్యేకంగా లేవు చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు ఏ రాష్ట్రానికి సంబంధించిన రికార్డులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిర్వహించాలి. అక్కడి చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, చిట్టీల వివరాలు, ఆదాయ– వ్యయాలు, బ్యాలన్స్‌షీట్‌ను ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ నిబంధనను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, ఇతర వివరాలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల రికార్డులతో పాటు కలిపి నిర్వహిస్తోంది. మార్గదర్శి చందాదారుల్లో సింహభాగం అంటే 60 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు. ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రామోజీరావు కుటుంబానికి చెందిన ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ రికార్డుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించగా తాము అలాగే రికార్డులు నిర్వహిస్తామని శైలజ చెప్పినట్టు సమాచారం. నీళ్లు నమిలి... నీళ్లు తాగి సీఐడీ అధికారులు నిబంధనలు పాటిస్తూ శైలజా కిరణ్‌ను విచారించారు. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించకపోయినా సరే ఇబ్బంది పెట్టకుండా...ఒత్తిడి చేయకుండా ప్రశ్నలు సంధించారు. గురువారం రోజు మధ్యాహ్నం వరకు సాగిన మొదటి విడతలో చాలా ప్రశ్నలకు నాకు తెలియదు.. గుర్తులేదు...నాకు సంబంధం లేదు అంటూ ఆమె సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. మధ్యాహ్న భోజన విరామం తరువాత సీఐడీ అధికారులు విచారణ జోరు పెంచారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఆమె ముందు ఉంచుతూ ఒక్కొక్క అంశంపై ప్రశ్నించారు. దీంతో శైలజకు నోట మాట రాలేదు. కాదు అని చెప్పేందుకు అవకాశం లేదు. ఎదురుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దాంతో చాలా ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఆమె పలుసార్లు తనకు దాహం వేస్తోందంటూ బయటకు వెళ్లి వచ్చారు. తమ ఆడిటర్లు, ఇతరులతో సంప్రదించి వచ్చి నాకు తెలియదు.. గుర్తు లేదు అని సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. చూపు సరిగా లేదు.. కనిపించడం లేదు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ల్యాప్‌టాప్‌లో సీఐడీ అధికారులు శైలజకు చూపించారు. నిధులు మళ్లించినట్టు అందులో ఉన్న వివరాలను చూపిస్తూ అవి వాస్తవమేనా? అని అడిగారు. అయితే ఆ పత్రాలు తనకు కనిపించడం లేదని... అక్షరాలు చిన్నవిగా ఉన్నాయని ఆమె పేర్కొనడంతో సీఐడీ అధికారులు ల్యాప్‌టాప్‌లో ఎన్లార్జ్ చేసి మరీ చూపించారు. ‘నాకు చూపు సరిగా లేదు... ఆ పత్రాల్లో ఏముందో కనిపించడం లేదు’ అని శైలజ పేర్కొనడంతో సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని పిలిచి ఆ పత్రాలు చూపించారు. అవి తనకు కనిపిస్తున్నాయని ఆయన చెప్పడంతో పాటు అందులో ఏముందో చదివి వినిపించారు. దీంతో తనకు ఏమీ కనిపించడంలేదని తప్పించుకునేందుకు శైలజ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మాకు ఏ చట్టాలు వర్తించవు.. మా చట్టం మాకుంది చందాదారులు చెల్లించిన నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడం కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982కు వ్యతిరేకం కదా...! ఆ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం అందుకు రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని తెలుసు కదా..? అని సీఐడీ అధికారులు శైలజను ప్రశ్నించారు. అయితే అసలు చిట్‌ఫండ్స్ చట్టమే తనకు తెలియదని ఆమె చెప్పడంతో సీఐడీ అధికారులు విస్తుపోయారు. చిట్‌ఫండ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మీకు అసలు చిట్‌ఫండ్స్ చట్టమే తెలియదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. చిట్‌ఫండ్స్ చట్టం– 1982ను తాము అనుసరించబోమని ఆమె సమాధానం ఇవ్వడంతో నివ్వెరపోవడం సీఐడీ అధికారుల వంతైంది. మరి చిట్‌ఫండ్స్ వ్యాపారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా.. మా చట్టాలు మాకున్నాయి... వాటి ప్రకారం చేస్తున్నాం అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం. చిట్‌ఫండ్స్ కంపెనీలు అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం 1982లోనే చేసిన చట్టం గురించి కూడా తెలుసుకోకుండా... అసలు ఆ చట్టాన్ని పట్టించుకోకుండా చిట్‌ఫండ్స్ వ్యాపారం చేస్తున్నామని శైలజ చెప్పడం గమనార్హం. రామోజీ, శైలజను అమరావతిలో విచారిస్తాం ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజను త్వరలో అమరావతిలో మరోదఫా విచారిస్తాం. ఈ కేసులో ఇప్పటికే వారిద్దరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేశాం. వాటిని విశ్లేషించిన అనంతరం మరి కొన్నిసార్లు విచారించాల్సి ఉంటుంది. ఈసారి వారిద్దరూ విచారణ కోసం అమరావతికి రావాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు విచారణ కొనసాగుతోంది. శైలజ ఈ నెల 13న విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమెకు ఇప్పటికే సమాచారమిచ్చాం. ఈదఫా ఆమెను అమరావతిలో విచారిస్తాం’ – అమిత్ బర్దర్, ఎస్పీ, సీఐడీ -
విచారణకు అమరావతి రావాలని మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు అమరావతి సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. అవసరమైతే రామోజీని విచారిస్తామని, ఆయన కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్‌లోని శైలజ కిరణ్ ఇంటికి చేరుకున్న సీఐడి బృందం శైలజ కిరణ్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేశారు. ఇదిలా ఉండగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్.. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించడంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది. -
‘మార్గదర్శి’ కేసులో ఏ–2 శైలజ విచారణ నేడు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించడంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్‌ను గురువారం విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శైలజను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలోనే విచారించనున్నారు. రామోజీరావు, శైలజ స్టేట్మెంట్లను విశ్లేషించిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సీఐడీ భావిస్తోంది. వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిపించి మరీ విచారించేందుకు సీఐడీ సంసిద్ధమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆ పాయింట్ మీదే A1 రామోజీ విచారణ!
-
మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజాకిరణ్ ను విచారిస్తున్న సీఐడీ
-
రామోజీరావు, శైలజా కిరణ్‌ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం?
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజాకిరణ్‌ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణలో కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. స్థానిక రెవిన్యూ అధికారులను పిలిచిన సీఐడీ బృందం.. రెవిన్యూ అధికారుల పంచ్ విట్నెస్ తో సీజింగ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో.. సీఐడీ లీగల్ అడ్వైజర్ సమక్షంలో రామోజీ, శైలజ విచారణ జరిగింది. ఇప్పటికే నలుగురు అరెస్ట్ కాగా, దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సీఐడీ. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ సోదాల్లో భారీగా అక్రమాలు గుర్తించారు అధికారులు. మార్గదర్శి రికార్డులన్నీ అక్రమేనని తేల్చిన సీఐడీ.. ఆ మేరకు విచారణకు సిద్ధమైంది. బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతో పాటు చిట్ గ్రూప్‌లకు చెందిన ఫామ్ 21ని కూడా మార్గదర్శి సమర్పించలేదు. మొత్తంగా ఏడు మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు సీఐడీ అధికారులు. దీనిలో భాగంగానే రామోజీరావు, శైలజాకిరణ్‌లను విచారించడానికి సిద్ధమైంది. ఈ మేరకు రామోజీరావు, శైలజాకిరణ్లకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. నేడు విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్ 34, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. చదవండి: ‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్ -
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో వెలుగులోకి అక్రమాలు
-
మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావును, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ2 చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. ఈ నెల 29 లేదా 31వ తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇళ్లు లేదంటే ఆఫీస్‌లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని పేర్కొంది. -
మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల బండారం
-
మార్గదర్శి కేసులో A-1 రామోజీరావు
-
దర్శకేంద్రుడు, సుద్దాలకు డాక్టరేట్లు
విశాఖపట్నం: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. మంగళవారం విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అగ్నిక్షిపణుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త, డి.ఆర్.డి.వో డైరెక్టర్ జనరల్ అవినాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ప్రకటించింది. ఈ నెల 13న జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు గీతం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వివిధ రంగాలకు చెందిన రాఘవేంద్రరావు (సినీ రంగం), సుద్దాల అశోక్ తేజ (సాహిత్యం), శైలజాకిరణ్ (పారిశ్రామిక)లకు గౌరవ డాక్టరేట్లకు... అవినాష్ చందర్ (శాస్త్ర సాంకేతిక) డాక్టర్ ఆఫ్ సైన్స్ కి ఎంపిక చేసినట్లు గీతం పేర్కొంది.