
సాక్షి, అమరావతి: మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం. ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదన్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నాం మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయి. చట్టం పరిధిలోనే విచారిస్తున్నాం. మేము ఎక్కడ వేధించలేదు. మేము వారి పట్ల పూర్తి మర్యాదగా వ్యవహరించి విచారిస్తున్నాం. వారికి భోజనం, టీ, మందులకు అవసరమైన స్వేచ్ఛ కూడా ఇస్తున్నాం. నిజం రాబట్టడం కోసం పారదర్శకంగా విచారణ చేస్తున్నాం. వాళ్లు సమాధానం లేక చెప్పిందే చెబుతున్నారు’’ అని రవికుమార్ పేర్కొన్నారు.
చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
‘‘నిన్న మేము విచారణకు వెళ్లినప్పుడు 10 మంది ని ఆబ్జెక్ట్ చేశారు. టెక్నికల్ ఆఫీసర్స్‌ను తీసుకెళ్లొద్దని అభ్యంతరం తెలిపారు. ఎండి శైలజ మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు.ఎండిగా ఈ సమాచారం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 25 శాతం ప్రశ్నలకు మాత్రమే ఎండి శైలజ సమాధానం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి ఎదో వంకలు పెట్టి ఆలస్యం చేస్తున్నారు. మేము మళ్లీ ఎండి శైలజను విచారణ చేస్తాం. అవసరమైనప్పుడు మళ్లీ రామోజీరావుని కూడా విచారిస్తాం’’ అని రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment