
మార్గదర్శి కుంభకోణంలో ఏ1, ఏ2లైన రామోజీరావు, శైలజాకిరణ్‌లకు..
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్‌కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది.
విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది.
మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్‌లను చేర్చింది ఏపీ సీఐడీ.
ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు