Margadarsi Chit Fund Scam: AP CID Issued Notices To Ramoji Rao and Sailaja Kiran, Details Inside - Sakshi
Sakshi News home page

Margadarsi Chit Fund Case: రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

Published Thu, Jun 22 2023 1:47 PM | Last Updated on Thu, Jun 22 2023 3:12 PM

AP CID Issued Notices To Ramoji Rao and Sailaja Kiran - Sakshi

సాక్షి,  విజయవాడ:  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సీఐడీ రీజనల్‌ ఆఫీస్‌కి హాజరు కావాలని సీఐడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు ఉండగా, ఏ-2గా శైలజా కిరణ్‌లు ఉన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది సీఐడీ.ఈ నెల మొదటివారంలో ఏ-2గా ఉన్న శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. శైలజా కిరణ్‌ నివాసంలోనే ఆమెను సీఐడీ విచారించింది. 

కాగా, విచారణ కోసం శైలజ కిరణ్‌ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు  సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్‌ . ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్‌ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు.

అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు.

శైలజ కిరణ్‌ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్‌ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. 
చదవండి: రామోజీ రాసిందే రశీదు! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement