Updates:
శైలజా కిరణ్‌ను మరోసారి విచారించాల్సి ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే నోటీసులిస్తామని సీఐడీ డీఎస్సీ రవికుమార్ తెలిపారు. నేటి విచారణలో కొంతమేర సమాధానాలు మాత్రమే ఇచ్చారని, అందుచేత మరోసారి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యం సమస్య ఉందనడంతో శైలజాకిరణ్‌ను వైద్యులు పరీక్షించారని సీఐడీ డీఎస్పీ పేర్కొన్నరు.
► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈరోజు(మంగళవారం) ఈ కేసులో ఎ-2లో ఉన్న మార్గదర్శ ఎండీ శైలజా కిరణ్‌ను సుదీర్ఘంగా విచారించారు. నేటి ఉదయమే శైలజా కిరణ్ ఇంటికి చేరుకున్న అధికారులు సుమారు 10 గంటల పాటు ఆమెను విచారించారు. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు సీఐడీ అధికారులు.
►మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎ-2గా ఉన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు గత ఎనిమిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఐవో రవికుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
విచారణలో సీఐడీ ఎస్పీలు హర్షవర్ధన్‌రాజు, అమిత్ భర్ధర్లు పాల్గొన్నారు. ఒక మహిళా ఏసీపీ సహా మొత్తం 30మంది అధికారులు విచారణలో పాల్గొన్నారు. మార్గదర్శి ఖాతాదారుల నగదు దారి మళ్లింపుపై విచారణ చేపట్టారు. నిబంధనలు ఉల్గంఘనలపై సీఐడీ ప్రశ్నిస్తోంది విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న మార్గదర్శి చైర్మన్ రామోజీరావును సీఐడీ ఇప్పటికే ప్రశ్నించింది.
► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్ దారి మళ్లింపుపై విచారణ జరుగుతుండగా.. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్నారు. విచారణను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి సీఐడీ ప్రశ్నిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. మార్గదర్శికి సంబంధించిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు, చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది.
గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్)
నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించిన సీఐడీ.. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. చిట్‌ఫండ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
చదవండి: మార్గదర్శి కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయండి
Comments
Please login to add a commentAdd a comment