సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు.
చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం
మరోవైపు.. హైదరాబాద్‌లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్‌లకు సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు.
చదవండి: మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్
Comments
Please login to add a commentAdd a comment