సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్‌బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్‌యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు.
ఆర్‌బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు.
ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment