సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్లు, ఆడిటర్లు పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది.
అనంతపురం బ్రాంచిలో రెండు, అరండల్‌పేటలో 1, నరసరావుపేటలో 3, రాజమహేంద్రవరంలో 2, తణుకులో 1, విశాఖ డాబా గార్డెన్స్, కూర్మన్నపాలేల్లో ఒక్కొక్కటి, విశాఖ ఎన్‌ఏడీ బ్రాంచిలో రెండు, విశాఖ సీతంపేట బ్రాంచిలో 10 చిట్ గ్రూపులు రద్దయ్యాయి. ఈ చిట్ గ్రూపులు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి.
తాజా అక్రమాలివే
గ్రూపు ప్రారంభించినప్పుడు అన్ని టికెట్లు నిండకపోయినా నిండినట్లు చిట్ రిజిస్ట్రార్‌కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్‌మెన్లు డిక్లరేషన్లు ఇచ్చారు. అలాగే చిట్ గ్రూపులు ప్రారంభమైనప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను కంపెనీ తనపేరు మీదే ఉంచుకుంటుంది.
అలా తన పేరున ఉన్న టికెట్లకు సంబంధించిన చందాలను కట్టాల్సి ఉన్నా.. కమిషన్‌పోగా కట్టాల్సిన సొమ్మును కట్టకుండా కంపెనీ చందాదారులను మోసం చేసింది. అలా డబ్బు కట్టకపోవడం వల్ల మిగతా గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పాట పాడుకున్న చందాదారులకు ఆ సొమ్ము ఇవ్వకుండా రశీదుల పేరుతో ఆ సొమ్మును డిపాజిట్లుగా ఉంచారు. అన్ని నెలలు చిట్ చందా కట్టినవారినే పాటకు అనుమతించాలి.
కానీ మార్గదర్శిలో కొన్ని నెలలు కట్టి మధ్యలో కట్టకుండా ఉన్న వారిని కూడా పాటకు అనుమతించి, వారు పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును తమకు చెల్లించాల్సిన దానిగా కట్టించుకున్నారు. కొన్ని గ్రూపుల్లో వేలం పాట నిర్వహించకుండానే ప్రతినెలా చందాలు కట్టించుకున్నారు. ఇవన్నీ చిట్‌ఫండ్ చట్టానికి విరు ద్ధమే. ఈ ఉల్లంఘనలున్న చిట్ గ్రూపులను రద్దు చేశారు. దీంతో రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తా యి. వాటితో కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఇప్పటికే రామోజీరావు సహా పలువురిపై కేసు నమోదు
ఇప్పటికే మార్గదర్శిలో భారీగా అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్ ఆడిటర్ తని ఖీలు చేసి ఇచ్చిన నివేదికలో మార్గదర్శి యాజమా న్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్ర భుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొ మ్మును తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది.
మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీల సమయంలో కంపెనీ మేనేజర్లు రిజి స్ట్రేషన్ల శాఖకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టారు. అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. సమాచా రం, వివరాలన్నీ హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీ సులోనే ఉన్నాయంటూ తనిఖీ బృందాలకు సహక రించలేదు. దీంతో అధికారులు కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. బ్యాలెన్స్‌షీట్లు, వెబ్‌సైట్‌లో వివరాలను బట్టి మరి కొంత సమాచారం సేకరించారు.
అన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్గదర్శికి చెందిన విశాఖ, కాకి నాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం బ్రాంచిలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ సహా పలువురు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసులు నమోదు చేసి అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తోంది. జరిగిన ఆడిట్‌లో మరిన్ని మోసాలు బయటపడడంతో 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది.
చదవండి: Margadarsi: 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు
Comments
Please login to add a commentAdd a comment