Stamps and registration department
-
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి తావివ్వొద్దని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పనిచేయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే బకాయిల విడుదల ఇటీవల బదిలీలు జరిగిన విషయం గుర్తుచేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులందరూ వీలైనంత త్వరగా కొత్త స్థానాల్లో సర్దుబాటు కావాలని పొంగులేటి చెప్పారు. బాగా పని చేసిన వారికి పదోన్నతులు కల్పిస్తామని, బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. వచ్చే ఐదేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని, దశల వారీగా నిర్మాణాలు చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలకు అద్దెలు, విద్యుత్, వాటర్ చార్జీలు, వాహనాల అద్దె లాంటి బకాయిలను త్వరలోనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. భూముల విలువల సవరణ ప్రక్రియ విషయంలో థర్డ్ పార్టీ నివేదిక వచ్చిన తర్వాత త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి శాఖ పనితీరు గురించి మంత్రికి వివరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను మంత్రి పొంగులేటి విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విలువలే కాదు.. తప్పులూ సవరణ..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది. ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి. నాలుగింటిలో మూడు క్లియర్ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. -
AP: పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలిరోజే పది వేల డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున వీఆర్ఓలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా ముద్రించారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో మొట్టమొదటగా తాతపూడి అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ విలువ రూ. 4.46 లక్షలు కాగా, భూసేకరణ విలువ రూ. 11.61 లక్షలుగా అందులో పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ, యూజర్ ఛార్జిలను ప్రభుత్వమే భరిస్తోంది. అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన రూ. 11.61 లక్షల విలువైన ఆస్తికి సాధారణంగా అయితే ఆమె రూ. 18,600 స్టాంప్ డ్యూటీ, రూ. 2,325 రిజిస్ట్రేషన్ ఛార్జి, రూ. 500 యూజర్ ఛార్జి కలిపి మొత్తం రూ. 21,425 చెల్లించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వమే భరించింది. రిజిస్ట్రేషన్ చేసిన కన్వేయన్స్ డీడ్ 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి.. పదిహేనురోజుల్లో 30.61 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రిజిస్ట్రేషన్లను మరింత వేగంగా చేయనున్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లను (కన్వేయన్స్ డీడ్స్) లబ్ధిదారులకు అందించనున్నారు. రూ. 10 స్టాంప్ పేపర్లపై ఈ డీడ్ల ప్రింటింగ్‌ను రిజిస్ట్రేషన్లు అయినదాన్ని బట్టి జిల్లాల్లోనే చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత నియోజకవర్గాలు, సచివాలయాల స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ డీడ్స్‌ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
చిట్‌ఫండ్ మోసాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి’ వంటి కంపెనీల మోసాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి కళ్లెం వేస్తోంది. చిట్‌ఫండ్ వ్యవహారాలను కట్టుదిట్టం చేసేందుకు.. ఈ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సదరు కంపెనీలు నిర్వహించే చిట్ల వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా ఆన్లైన్ విధానాన్ని రూపొందించి ‘ఈ–చిట్స్’ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ చిట్‌ఫండ్ కంపెనీల్లో చిట్లు కట్టే చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా దీన్ని అమలుచేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. ఇకపై చిట్‌ఫండ్ కంపెనీలు తమ చిట్స్ వివరాలన్నింటినీ ఈ అప్లికేషన్లో నమోదు చేయాల్సిందే. మొన్నటివరకు చిట్స్ రిజిస్ట్రార్ల అనుమతితో ఆ కంపెనీలు రికార్డులు నిర్వహించేవి. గ్రూపుల వారీగా అనుమతి తెచ్చుకుని వాటి రిజిస్టర్లను తమ ఇష్టానుసారం మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ రిజిస్టర్లకు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకపోవడం, తీసుకున్నా వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం, ఆ వివరాలను చందాదారులకు తెలియకుండా దాచడం వంటి అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ఆ కంపెనీల్లో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు చిట్‌ఫండ్ కంపెనీలు బోర్డు తిప్పేయడం, లక్షలాది మంది చందాదారులు తమ శ్రమను ధారపోసి కట్టిన సొమ్మును నష్టపోవడం చాలా సందర్భాల్లో జరిగాయి. ఇలాంటి చిట్‌ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. మోసాలు అరికట్టడమే లక్ష్యం.. దీంతో.. రాష్ట్రంలో చిట్‌ఫండ్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఆన్లైన్ చిట్స్ పర్యవేక్షణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నిర్వహించే ఈ నూతన ఎలక్ట్రానిక్ విధానాన్ని రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని స్పష్టంచేశారు. చిట్‌ఫండ్ కంపెనీలు తమ లావాదేవీలను ఈ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి వుంటుంది. ఏదైనా చిట్‌ఫండ్ కంపెనీ తమ చిట్లకు అనుమతులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వాటిని చిట్ రిజిస్ట్రార్లు ఆన్లైన్లోనే పరిశీలించి ఆమోదిస్తారు. ప్రతి చిట్కు సంబంధించిన గ్రూపు వివరాలు, మార్పులు, చేర్పులు, ప్రతినెలా జరిగే వేలం పాటలు వంటివన్నీ ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఈ వివరాలన్నింటినీ చందాదారులు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ప్రతినెలా తాను కట్టే చిట్ వివరాలను ఆన్లైన్లోనే చూసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడంలోనూ వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడంలోనూ ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు. ఇప్పటికే ఉన్న చిట్ గ్రూపుల వివరాలను కూడా త్వరలో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయనున్నారు. చందాదారులు తమ అనుమానాలను దీనిద్వారానే నివృత్తి చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలున్నా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. -
ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం..
అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసికొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సాఫ్ట్వేర్(కార్డ్ ప్రైమ్) వాలాను ఎక్కడా అభ్యంతరాలు తలెత్తలేదన్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 23 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాతే కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని అయన తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేనివారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయచేసి ఆ అపోహలను నమ్మవద్దని కోరారు. కొత్త విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని ఎవ్వరూ చెప్పలేదని దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పాత,కొత్త రెండు విధానాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ఈ సిస్టమ్ మీద అవగాహన లేనివారే దీనిని జిరాక్స్ కాపీలంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు రోజులుగా సాగుతోన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొత్తం 700 రిజిస్ట్రేషన్లు చేస్తే అన్నిటినీ ఫిజికల్ డాక్యుమెంట్లతోనే చేశామని.. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆప్షనల్‌గా మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్ అర్హత ఏంటి’ -
‘ఘోస్ట్’ చందా.. మార్గదర్శి దందా!
సాక్షి, అమరావతి: ఈయన పేరు సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామస్తుడు. బాపట్ల జిల్లా చీరాలలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఓ చిట్టీ గ్రూపులో చందాదారుగా నమోదయ్యారు. ఈయన ఏనాడూ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయానికి వెళ్లలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుగా చేరనే లేదు. కానీ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో మాత్రం ఆయన్ను చందాదారుగా నమోదు చేయడం గమనార్హం. విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిఖార్సైన నిజం. దేశంలో ఇంత వరకు ఏ చిట్ ఫండ్స్ సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేయని రీతిలో వినూత్న రీతిలో మార్గదర్శి సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు ఇది తాజా నిదర్శనం. ఇలా ఎందుకు చేశారంటే.. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా ఎలా చేసిందనే సందేహం రావడం సహజం. ఎలా అంటే సుబ్రహ్మణ్యం ఆధార్ కార్డును తమ ఏజంట్ల ద్వారా సేకరించి ఆయనకు తెలియకుండానే చిట్టీ గ్రూపులో చందాదారునిగా చేర్చింది. ఇలాంటి వారిని ‘ఘోస్ట్ చందాదారులు’ అని వ్యవహరిస్తారు. అంటే చందాదారులు లేకుండానే వారి పేరిట చిట్టీ గ్రూపుల్లో సభ్యత్వం కొనసాగిస్తారు. అయితే తాను చందాదారునిగా ఉన్నానని సుబ్రహ్మణ్యానికి తెలియదు కాబట్టి ఆయన చందా చెల్లించరు. ఆయన్ని ఎవరూ అడగరు కూడా. దాంతో అసలు విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పేరిట ఉన్న చిట్టీకి ప్రతి నెలా మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చందా చెల్లించకపోయినా, చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తుంది. ప్రతి నెల చందాదారునికి వచ్చే డివిడెండ్‌ను మాత్రం సుబ్రహ్మణ్యం పేరిట తానే తీసుకుంటుంది. ఒక నెల సుబ్రహ్మణ్యం పేరిట చిట్టీ పాట పాడతారు. ఆ చిట్టీ పాట మొత్తం (ప్రైజ్‌మనీ) మార్గదర్శి యాజమాన్యం తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది. అంటే రూపాయి చందా చెల్లించకుండానే.. ప్రతి నెల డివిడెండ్ మొత్తం తీసుకోవడంతోపాటు చిట్టీ పాట పేరిట ప్రైజ్ మనీ కూడా కొల్లగొడుతోంది. ఇలా వెలుగు చూసింది.. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాల్లో భాగంగా సందేహం కలిగిన చందాదారులను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆ విధంగా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం చీరాలలో చిట్టీ గ్రూపులో సభ్యుడిగా ఉండటం ఏంటనే సందేహం వచ్చి అధికారులు సంప్రదించడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచీల పరిధిలో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు భారీగా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఘోస్ట్ చందాదారుల దందాతోపాటు చందాదారులను దురుద్దేశంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా ఇక్కట్ల పాటు చేస్తోందని కూడా ఈ సోదాల్లో వెల్లడైంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘోస్ట్ చందాదారులు, చందాదారులకు తెలియకుండానే వారిని ష్యూరిటీగా చూపించడం తదితర మోసాలకు పాల్పడిన ఫిర్యాదులతో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘోస్ట్ చందాదారులతో భారీగా అక్రమాలు వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్ చందాదారుల పేరిట డివిడెండ్లతోపాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కూడా. ఎందుకంటే ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వారికి తక్కువ డివిడెండ్ వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ఘోస్ట్ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం (ప్రైజ్‌మనీ) వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు. అప్పుల ఊబిలోకి చందాదారులు చిట్టీ గ్రూపు ప్రారంభంలోనే చందాదారుల నుంచి సంతకాలు తీసుకుని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏకంగా చందాదారుల ఆస్తులను తమ పేరిట రాయించుకోవడం మార్గదర్శి చిట్‌ఫండ్స్ దారుణాలకు నిదర్శనం. ముందుగా తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేస్తూ ఓ చందాదారునికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను మరో చందాదారునికి ష్యూరిటీగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దాంతో చిట్టీ పాట పాడిన చందాదారుడు వాయిదాలు చెల్లించ లేదు కాబట్టి, ష్యూరిటీగా పేర్కొన్న చందాదారుడు చెల్లించాలని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఓ చిట్టీ పాట పాడిన చందాదారు ప్రైజ్‌మనీ తీసుకుని రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలిన వాయిదాలు చెల్లించకపోతే.. ఆ చిట్టీ పాటను రద్దు చేసి సంబంధిత నెలకు కొత్తగా చిట్టీ పాట నిర్వహించాలని చట్టం చెబుతోంది. కానీ దీన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్టించుకోవడం లేదు. చిట్టీ వాయిదాలు చెల్లించలేని చందాదారులతో మాట్లాడి వారిని మరో చిట్టీ గ్రూపులో సభ్యులుగా చేరుస్తోంది. ఆ కొత్త గ్రూపులో డివిడెండ్‌తో పాత గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చు అని చెబుతోంది. ఇలా ఒక చందాదారుని లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా చూపిస్తోంది. దాంతో ఆ చందాదారు మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు భారీగా బకాయిలు పడేట్టు చేస్తోంది. అతి సామాన్య పూజారిని ఏకంగా 22 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చారు. మరో వ్యక్తిని ఏకంగా 60 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చూపించినట్టు సోదాల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమాలకు అంతే లేదు. ఆ చందాదారుడు ఓ చిట్టీలో పాటపాడినప్పటికీ అతి తక్కువ అంటే నామమాత్రంగానే ప్రైజ్‌మనీ పొందుతున్నారు. ఎంతగా అంటే రూ.50 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడైన ఓ చందాదారుడు రూ.46 లక్షలకు చిట్టీ పాట పాడితే ఆయనకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చేతికి ఇచ్చింది కేవలం రూ.20 మాత్రమే. మరో చందాదారుడు రూ.18 లక్షలకు చిట్టీ పాట పాడితే చేతికి వచ్చింది కేవలం రూ.200. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఇలాంటి అక్రమాలు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. వందకుపైగా ఫిర్యాదులు చందాదారుల నుంచి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఖండించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పాల్పడుతున్న మోసాలపై పెద్ద సంఖ్యలో చందాదారులు పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మూడు రోజుల్లోనే దాదాపు వంద మందికిపైగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, చందాదారులు పూర్తి వివరాలతో ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9493174065 కేటాయించింది. మూడు చోట్ల చీటింగ్ కేసులు నమోదు చీరాల, అనకాపల్లి, రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్)లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమన్యాంపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ మూడు బ్రాంచిల మేనేజర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ► సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారునిగా నమోదు చేసినందుకు చీరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ► అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తర్వాత ఆయన రూ.4,61,989కు చిట్టీ పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తం ఆయన ష్యూరిటీ ఇచ్చిన మిగిలిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని చెప్పినా, బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు చూపించారు. ఆ కాపీలు కావాలని అడిగినా సరే ససేమిరా అన్నారు. దాంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ► కోరుకొండ విజయ్‌కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించాక 2020 జూన్‌లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్ తిరస్కరించారు. విజయ్‌కుమార్ తన స్నేహితుడు మల్లికార్జున రావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ఆయనకు ప్రైజ్‌మనీ ఇవ్వమని చెప్పారు. అసలు మల్లికార్జునరావు చిట్టీ మొత్తం గడువు తీరనే లేదని తెలిసింది. తనను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం మోసం చేసిందని విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఓ ‘నల్ల’ ఖజానా సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ నల్ల కుబేరుల అడ్డా అన్నది బట్టబయలైంది. తవ్వేకొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ సంపాదనను దాచుకునేందుకు రామోజీరావు సృష్టించిన ఓ మినీ స్విస్ బ్యాంకు అని ఆధారాలతో స్పష్టమవుతోంది. ఉభయతారకంగా నల్లకుబేరులు, రామోజీరావు ఈ బ్లాక్ మనీ దందా సాగిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు చందదారుల సొమ్మును భారీగా తమ సొంతానికి మళ్లించుకున్న గుట్టు కూడా రట్టు అవుతోంది. శని, ఆదివారాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా వెల్లడి కావడం గమనార్హం. రూ.కోటి కంటే అధికంగా చిట్టీలు వేసిన, అక్రమ డిపాజిట్లు చేసిన వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్టు ఇప్పటి వరకు గుర్తించినట్టు సమాచారం. వారి మార్గదర్శి లెడ్జర్ పుస్తకాల్లోగానీ, ఆ చందాదారులకు ఇచ్చిన పాస్బుక్లోగానీ వారి పాన్ నంబర్లు, ఆధార్ నంబర్లు నమోదు చేయనే లేదన్నది వెల్లడైంది. కొందరు చందాదారులను సీఐడీ అధికారులు పిలిచి విచారించగా వారికి అన్ని కోట్ల రూపాయలు ఏలా వచ్చాయన్నది చెప్పలేకపోయారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నిస్తే వారు విస్మయకర సమాధానమిచ్చారు. ఈ అక్రమాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలోని ఓ బ్రాంచి మేనేజర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దాంతో రామోజీరావుతోసహా మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం హడలెత్తిపోయింది. ఆ మేనేజర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ మేనేజర్ చాలా మంది పెద్దలకు బినామీ అన్నది స్పష్టమవుతోంది. ఇలా పలువురు మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, కొందరు బ్రాంచి మేనేజర్లు చందాదారుల చందా మొత్తాలను తమ సొంతానికి వాడుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. విశాఖపట్నంలో దీనిని నిర్ధారించారు. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. పలు చోట్ల అవకతవకలకు సంబంధించి లెడ్జర్ ఖాతాలు, చిట్టీ పాటల మినిట్స్ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు. చీటింగ్‌కు ‘మార్గదర్శి’గా కడప మేనేజర్ కడప అర్బన్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. చందాదారులను మోసం చేసి అక్రమార్జనకు పాల్పడటంలో మార్గదర్శి యాజమాన్యమే కాదు.. సంస్థలో కొందరు మేనేజర్లు కూడా సిద్ధహస్తులేనన్న విషయాన్ని ఆ సంస్థ పూర్వపు ఉద్యోగులు వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ వైఎస్ఆర్ జిల్లాలో కడప బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న డి. శేషుబాబు అక్రమార్జనను వివరిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీబీఐ విజయవాడ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఏజెంట్స్ కోడ్లతో చిట్లు భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించాడని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలివీ.. శేషుబాబు ఆయన సొంత ఏజెంట్ వి. శ్రీనివాసులరెడ్డి (ఏజెంట్ కోడ్ నం: సిపి0000160) కోడ్ ద్వారా ఎక్కువ మంది చిట్ సభ్యులను చేర్పించారు. ఎన్.వి బాలాజీ (ఏజెంట్ కోడ్ నం. జె0000088), గౌరి (ఏజెంట్ కోడ్ నం: జె0000167), ఎ.వి మహేష్ (ఏజెంట్ కోడ్ నం: సిపి000077)తో పాటు ఇంకా ఇతర ఏజెంట్ కోడ్లలో కూడా చిట్లు వేసి విపరీతంగా సంపాదించాడు. తనకు అనుకూలమైన వారికి తక్కువ బిడ్ అమౌంట్ కేటాయిస్తారు. మిగిలిన వారికి (స్టాఫ్) ఎక్కువ బిడ్‌ను మేనేజరే ఇంత అని నిర్ణయిస్తారు. పాట సమయానికి కస్టమర్ వచ్చినప్పుడు కూడా బిడ్ ఎక్కువగా వచ్చేట్లు ఉద్యోగులతో పాడిస్తాడు. ఈ విధంగా సంపాదించిన సొమ్ముతో బంగారం, బెంగళూరులో సొంత ఇల్లు, కడపలో స్థలాలు, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు కూడా కొన్నారు. మిగిలిన మార్గదర్శి ఉద్యోగులను స్టాఫ్ కోడ్లతో చిట్స్ వేయమనీ వేధిస్తాడు. చెప్పినట్లు చేయకుంటే దుర్భాషలాడతాడు. దీంతో కొందరు సీనియర్ స్టాఫ్ వేరే సంస్థలకు వెళ్లిపోయారు. శేషుబాబు కొందరు ఖాతాదారులకు ఇవ్వాల్సిన గిఫ్ట్‌లను కూడా అమ్మేసుకున్నారు. ఆయనకు అనుకూలమైన ఉద్యోగులైన శివసతీష్, రిసెప్షనిస్టు వరలక్షుమ్మ కూడా ఏజెంట్ కోడ్లలో వేసుకోవడానికి ప్రాధాన్యత కల్పించాడు. శివసతీష్ చిట్టీ కమీషన్ డబ్బులను వడ్డీలకు ఇచ్చి మరింత సంపాదిస్తున్నాడు. పాట పాడటానికి ఎవ్వరూ రాకపోతే శేషుబాబు, శివసతీష్, వరలక్షుమ్మ కలిసి తక్కువ బిడ్ పోతున్నా ఎక్కువ బిడ్ పోయేలా చేస్తారు. దీనిద్వారా అసలైన చందాదారులకు వడ్డీ ఎక్కువ పడుతుంది. కస్టమర్లకు బిడ్ వచ్చిన తర్వాత కూడా డబ్బు ఇవ్వడానికి వీరు ఇబ్బందులకు గురిచేస్తారని వారు సీబీఐకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. మార్గదర్శి మేనేజర్ అరెస్ట్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్‌లో చిట్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్న వైనం బహిర్గతమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు బ్రాంచ్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రి ఏఆర్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కోరుకొండ విజయ్‌కుమార్ మార్గదర్శిలో మోసంపై శనివారం టూటౌన్ సీఐ గణేష్‌కు ఫిర్యాదు చేశారు. విజయ్‌కుమార్ మార్గదర్శి చిట్స్‌లో 2019లో రూ.5 లక్షల చిట్ వేశారు. 50 నెలల కాల వ్యవధిలో నెలకు రూ.10 వేల చొప్పున చిట్కు నగదు చెల్లించాలి. తనకున్న ఆర్థిక అవసరాల రీత్యా ఆయన 2020 జూన్ 21వ తేదీన రూ.3 లక్షలకు చిట్ పాడారు. చిట్ డబ్బులు చెల్లించాల్సిన మార్గదర్శి మేనేజర్, బ్రాంచ్ అధికారులు ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. అదేమని ప్రశ్నిస్తే ఇద్దరి ష్యూరిటీ కావాలన్నారు. వాళ్ల కోరిక మేరకే ఇద్దరి ష్యూరిటీ తీసుకువచ్చారు. ఇప్పుడైనా చీటీ డబ్బులు ఇవ్వాలని కోరగా.. మీరు ఇతరులకు ష్యూరిటీ పెట్టారు. అది క్లియర్ చేస్తే మీ చీటీ డబ్బులు ఇస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. ష్యూరిటీకి సంబంధించిన డబ్బులు హెడ్ కానిస్టేబుల్ స్నేహితుడు చెల్లించేశారు. అయినా.. ఇతనికి రావాల్సిన రూ.3 లక్షలు ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్‌లలో.. మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్‌లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని లొసుగులు బయటపడ్డాయి. వేలంపాటలోనూ అవకతవకలు కనిపించాయి. సెక్షన్ 17 ప్రకారం.. చిట్‌ఫండ్ స్టార్టింగ్‌లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. ప్రజలకు, చందాదారులకు ఇలాంటి అవకతవకలను తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. మార్గదర్సి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ► మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పిఎస్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. ► అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు ► రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎంపై 179/23...409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్ కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని తెలిపారాయన. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని సీఐడీ ఎస్సీ అమిత్ బర్దార్ తెలిపారు. శారదా కుంభకోణం తర్వాత చిట్స్ చట్టంలో మార్పులు చేసినా.. మార్గదర్శిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. డిపాజిట్ దారులు కానివారి డాక్యుమెంట్స్ ఉపయోగించి అక్రమాలకి పాల్పడ్డారు. డిపాజిట్ దారులకి తెలియకుండా మార్గదర్సి చిట్ ఫండ్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కేసులో డిపాజిట్ దారుడికి తెలియకుండానే అతనిని మరో డిపాజిట్ దారుడికి ష్యూరిటీగా పెట్టారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఫోర్ మెన్లకి నిర్దిష్టమైన విధులువున్నాయి. డిపాజిట్ దారులకి అవగాహన కల్పించాల్సిన ఫోర్ మెన్ లు మోసం చేస్తున్నారని తెలిపారాయన. చిట్ ఫండ్ మోసాలు, అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. చిట్‌ఫండ్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరించింది. బ్రాంచ్ మేనేజర్లు తమకేమీ తెలియదని చెబుతున్నారు. రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర రికార్డ్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9493174065 అని అధికారులు తెలిపారు. -
మార్గదర్శిలో రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం
-
రిజిస్ట్రేషన్ కాగానే యాజమాన్య హక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మ్యుటేషన్ (యాజమాన్య హక్కు బదిలీ) విధానాన్ని సులభతరం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇప్పుడున్న విధానంలో క్లిష్టతరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, నిర్దిష్ట గడువులో ఆ శాఖ దాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోంది. మధ్యలో కొన్ని వివాదాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎంతో ప్రహసనంగా ఉన్న మ్యుటేషన్ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం సమీక్షలతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తీసుకు రానున్నారు. రూపొందిన ప్రత్యేక అప్లికేషన్.. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌కు, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించారు. తత్ఫలితంగా ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లోనూ యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. రెవెన్యూ వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన మార్పుగా చెబుతున్నారు. ఆటో మ్యుటేషన్ విధానాన్ని తొలుత భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యుటేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
23 మార్గదర్శి చిట్ గ్రూపులు రద్దు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్లు, ఆడిటర్లు పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది. అనంతపురం బ్రాంచిలో రెండు, అరండల్‌పేటలో 1, నరసరావుపేటలో 3, రాజమహేంద్రవరంలో 2, తణుకులో 1, విశాఖ డాబా గార్డెన్స్, కూర్మన్నపాలేల్లో ఒక్కొక్కటి, విశాఖ ఎన్ఏడీ బ్రాంచిలో రెండు, విశాఖ సీతంపేట బ్రాంచిలో 10 చిట్ గ్రూపులు రద్దయ్యాయి. ఈ చిట్ గ్రూపులు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. తాజా అక్రమాలివే గ్రూపు ప్రారంభించినప్పుడు అన్ని టికెట్లు నిండకపోయినా నిండినట్లు చిట్ రిజిస్ట్రార్‌కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్మెన్లు డిక్లరేషన్లు ఇచ్చారు. అలాగే చిట్ గ్రూపులు ప్రారంభమైనప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను కంపెనీ తనపేరు మీదే ఉంచుకుంటుంది. అలా తన పేరున ఉన్న టికెట్లకు సంబంధించిన చందాలను కట్టాల్సి ఉన్నా.. కమిషన్పోగా కట్టాల్సిన సొమ్మును కట్టకుండా కంపెనీ చందాదారులను మోసం చేసింది. అలా డబ్బు కట్టకపోవడం వల్ల మిగతా గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పాట పాడుకున్న చందాదారులకు ఆ సొమ్ము ఇవ్వకుండా రశీదుల పేరుతో ఆ సొమ్మును డిపాజిట్లుగా ఉంచారు. అన్ని నెలలు చిట్ చందా కట్టినవారినే పాటకు అనుమతించాలి. కానీ మార్గదర్శిలో కొన్ని నెలలు కట్టి మధ్యలో కట్టకుండా ఉన్న వారిని కూడా పాటకు అనుమతించి, వారు పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును తమకు చెల్లించాల్సిన దానిగా కట్టించుకున్నారు. కొన్ని గ్రూపుల్లో వేలం పాట నిర్వహించకుండానే ప్రతినెలా చందాలు కట్టించుకున్నారు. ఇవన్నీ చిట్‌ఫండ్ చట్టానికి విరు ద్ధమే. ఈ ఉల్లంఘనలున్న చిట్ గ్రూపులను రద్దు చేశారు. దీంతో రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తా యి. వాటితో కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రామోజీరావు సహా పలువురిపై కేసు నమోదు ఇప్పటికే మార్గదర్శిలో భారీగా అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్ ఆడిటర్ తని ఖీలు చేసి ఇచ్చిన నివేదికలో మార్గదర్శి యాజమా న్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్ర భుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొ మ్మును తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీల సమయంలో కంపెనీ మేనేజర్లు రిజి స్ట్రేషన్ల శాఖకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టారు. అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. సమాచా రం, వివరాలన్నీ హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీ సులోనే ఉన్నాయంటూ తనిఖీ బృందాలకు సహక రించలేదు. దీంతో అధికారులు కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. బ్యాలెన్స్షీట్లు, వెబ్సైట్లో వివరాలను బట్టి మరి కొంత సమాచారం సేకరించారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్గదర్శికి చెందిన విశాఖ, కాకి నాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం బ్రాంచిలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ సహా పలువురు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసులు నమోదు చేసి అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తోంది. జరిగిన ఆడిట్లో మరిన్ని మోసాలు బయటపడడంతో 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చదవండి: Margadarsi: 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు -
20% గ్రామాల్లోనే స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో మాత్రమే స్థిరాస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 80 శాతం గ్రామాల్లో మార్కెట్ విలువలను సవరించడం లేదు. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో మాత్రమే మార్కెట్ విలువలను సవరించనున్నారు. అదికూడా ఆయా ప్రాంతాల్లో పెరిగిన భూముల విలువలను బట్టి స్వల్పంగానే సవరించాలని నిర్ణయించారు. ఈ సవరణ 10 నుంచి 30 శాతం లోపే ఉండనుంది. రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆయా ప్రాంతాల్లో పెరిగిన మార్కెట్ విలువను అక్కడి రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ శాఖాధికారుల కమిటీలు నిర్థారించాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కొత్తగా ఏర్పడిన రహదారులు, విస్తరిస్తున్న అర్బన్ ఏరియాల్లో రిజిస్టర్ విలువలకు, మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ జిల్లాల్లో భారీగా మార్కెట్ విలువ పార్వతీపురం మన్యం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల అయితే మార్కెట్ విలువల, రిజిస్టర్ విలువల మధ్య వ్యత్యాసం 75 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా గతం కంటే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిన గ్రామాలు, అర్బన్ ఏరియాల్లోనే మార్కెట్ విలువల్ని సవరించనున్నారు. ఈ ఏడాది సవరణలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ 1వ తేదీ నుంచి మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. కమిటీల ప్రతిపాదనలు ఇలా.. సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు లేదా పట్టణాల్లో వచ్చిన మార్పులను బట్టి అర్బన్ ఏరియాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరిస్తుంది. మూడేళ్లుగా కరోనా ఇతర కారణాల రాష్ట్రంలో పూర్తిస్థాయి సవరణ చేపట్టలేదు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేక సవరణ నిర్వహించింది. ఈ పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ రివిజన్ చేపట్టింది. అర్బన్ ఏరియాల్లో జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా.. మునిసిపల్ కమిషనర్/వుడా/సీఆర్డీఏ అధికారులు, సంబంధిత ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా ఉండే కమిటీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే దానిపై పరిశీలన జరిపాయి. గ్రామాల్లో ఆర్డీవోలు కన్వీనర్లుగా.. జిల్లా పరిషత్ సీఈవో, సంబంధిత ఎండీపీడీవో, ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్లతో ఏర్పడిన కమిటీలు ఆయా ప్రాంతాల్లోన్ని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే విషయాన్ని పరిశీలించాయి. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గడచిన ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగిన పట్టణ ప్రాంతాలు, గ్రామాలను ఈ కమిటీలు గుర్తించాయి. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి (ఏదైనా పరిశ్రమ, సంస్థ రావడం, హైవేలు, ప్రధాన రహదారులు ఏర్పాటు కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వంటి అనేక కారణాలు) అనే వివరాలను కమిటీలు సేకరించాయి. ఆయా కారణాలను విశ్లేషిస్తూ.. లావాదేవీలు ఎక్కువ జరుగుతున్న సర్వే నంబర్లను బట్టి మార్కెట్ విలువలను ప్రతిపాదించాయి. ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్న 20 శాతం ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి. జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు లేదా ఆర్డీవోల ఆధ్వర్యంలోని కమిటీలు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు సంబంధిత ప్రతిపాదనలు పంపించగా.. వాటిని ఉన్నతాధికారులు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించారు. -
మార్గదర్శి అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నోటీసులు
గుంటూరు: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు(మంగళవారం) మార్గదర్శి చిట్స్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటకొచ్చాయి. నేటి తనిఖీల్లో ఖాళీ చిట్ల నిర్వహణలో మార్గదర్శి గోల్మాల్ను గుర్తించారు. గుంటూరు 5 చిట్ గ్రూప్‌లను పరిశీలించగా 6 కోట్ల 98 లక్షల చెల్లింపుల రికార్డులను అధికారులకు మార్గదర్శి చూపించలేదు. శ్రీకాకుళం బ్రాంచ్‌లో 28 చిట్స్‌లో అక్రమాలను అధికారులు గుర్తించారు. 2 కోట్ల 88 లక్షల పేమెంట్స్‌కి మార్గదర్శి ఆధారాలు చూపలేదు. ఇక విజయనగరంలో 12 చిట్లను పరిశీలించగా, 54 లక్షల 85 వేల చెల్లింపులకు సైతం ఆధారాలు చూపించలేదు మార్గదర్శి. ఈ అక్రమాలపై మార్గదర్శికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. -
మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం
విజయవాడ: మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.మార్గదర్శి చిట్ ఫండ్ లో నిధుల మల్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. మార్గదర్శి చిట్‌ఫండ్ 37 బ్రాంచ్‌లలో ఆడిటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దానిలో భాగంగా ప్రత్యేక ఆడిటర్ నియమించింది. కాగా, మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సీఐడీ విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
చందాదారుల సొమ్ముతో దందా!
సాక్షి, అమరావతి: మార్గదర్శి యాజమాన్యం చందాదారుల డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చట్ట ప్రకారం చిట్‌ఫండ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే చిట్స్ రిజిస్ట్రార్‌కు మార్గదర్శి యాజమాన్యం సహకరించడం లేదని తెలిపారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తమ బాధ్యతని, ఇదే ధోరణి కొనసాగితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిధుల దుర్వినియోగం, మోసం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తాము నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు న్యాయస్థానం కూడా రిమాండ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో చందాదారుల సొమ్మును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. అందుకు ఇక్కడ బాధ్యులు ఉండరు. ఇతర రాష్ట్రాల్లో అడిగితే మీకు సంబంధం లేదంటున్నారు. అంటే చందాదారులు చెల్లిస్తున్న సొమ్ముకు ఎలాంటి భద్రతా లేదు’ అని పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వివరించారు. ♦ చిట్‌ఫండ్ చట్టం సామాజిక, ఆర్థికపరమైన చట్టమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. చందాదారుల హక్కుల పరిరక్షణ, చిట్‌ఫండ్ కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఈ చట్టం చేశారని పేర్కొంది. చిట్‌ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీ బ్రాంచిలోని మేనేజర్ (ఫోర్మేన్) చందాదారులు చెల్లించే సొమ్ముకు పరిరక్షకుడు. చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్యవేక్షకుడు. ♦ బ్యాంక్ లావాదేవీల నిర్వహణ, నిధుల చెల్లింపులన్నీ ఫోర్మేన్ నిర్వహించాలి. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉన్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో తనిఖీలు చేశాం. చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదన్న విషయం అందులో వెల్లడైంది. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేశారు. ♦ మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తోసహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. ♦ఇక్కడున్న చందాదారుల సొమ్ముల భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే తెలంగాణలో ఉన్న ప్రధాన కార్యాలయం ఏపీ అధికారుల పరిధిలోది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారులు చెల్లిస్తున్న డబ్బులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. సొమ్ము రాష్ట్ర ప్రజలది...పెత్తనం పక్క రాష్ట్రంలో వారిది. ♦మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు చెందిన సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చారెŠట్‌డ్ అకౌంటెంట్ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. ♦ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఫోర్మెన్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. గుంటూరు మినహా మిగతా మూడు చోట్లా న్యాయస్థానాలు నిందితులకు రిమాండ్ విధించాయి. నిందితులపై సీఐడీ మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని రిమాండ్‌కు అనుమతిస్తూ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సీఐడీ కేసు డైరీలో పేర్కొన్న అంశాలతో తాము సంతృప్తి చెందినట్లు, వారిని అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొన్నాయి. ♦ మార్గదర్శి యాజమాన్యం నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ, చిట్స్ రిజిస్ట్రార్‌కు సహాయ నిరాకరణ కొనసాగిస్తే చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్న అంశంతో మాకు నిమిత్తం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే మా విధి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. కేసు దర్యాప్తులో పురోగతికి అనుగుణంగా ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 చెరుకూరి శైలజను కూడా విచారించడంతోపాటు ఇతర చర్యలను తగిన సమయంలో తీసుకుంటాం. ఇదో.. పోంజీ తరహా స్కామ్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం పోంజీ స్కామ్ తరహా అక్రమాలకు పాల్పడుతోంది. చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15 వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. చందాదారుల నుంచి ఫిర్యాదులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ చిట్‌ఫండ్ చట్టం, ఇతర చట్టాలను అనుసరించి మార్గదర్శిపై స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఒక్క చిట్‌ఫండ్ చట్టమే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించారు. సీఐడీ కేసు నమోదు చేయగానే పలువురు చందాదారులు తాము మోసపోయామని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 8 మంది చందాదారులు ఫిర్యాదు చేశారు. ఓ చందాదారుడు తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలను ఆర్నెల్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. మార్గదర్శి మేనేజర్లకు రిమాండ్ సాక్షి ప్రతినిధి, విజయవాడ/కాకినాడ లీగల్/విశాఖ లీగల్: నిబంధనలకు విరుద్ధంగా చిట్స్ నిర్వహిస్తున్న కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన మార్గదర్శి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ (ఫోర్‌మెన్)ను రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి స్ట్రేట్ సునందమ్మ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మార్గదర్శి మేనేజర్‌కు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. కాగా, మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్‌ను కాకినాడ రెండో అదనను జూనియర్ సివిల్ జడ్జి కమ్ సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఎం.ప్రసన్నలక్ష్మి ఎదుట సీఐడీ పోలీసులు సోమవారం హాజరుపర్చారు. రవిశంకర్‌కు ఒకరోజు రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కాకినాడ సీఐడీ కోర్టు పరిధిలో విచారణ చేయకూడని కొన్ని సెక్షన్లు ఉండటంతో.. సంబంధిత రికార్డును రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో రవిశంకర్‌ను రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టులో హాజరు పరచనున్నారు. పోలీస్ కస్టడీకి అనుమతి విశాఖపట్నం సీతంపేటలోని మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ కామినేని రామకృష్ణను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సోమవారం అంగీకరించింది. మంగళ, బుధవారాలలో రెండు రోజులపాటు ఆయనను పోలీసులు విచారించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. -
రిజిస్ట్రేషన్లూ ఆన్లైన్లోనే.. కర్నూలుకు ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్
ఆస్తుల క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయమూ ఎక్కువే. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రజలకు సులభంగా.. అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రీమియం రిరిజిస్ట్రేషన్ సర్వీసు సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పాసుపోర్టు సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయి హంగులతో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో మొత్తం 9 ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రీమియం రిజస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ సేవలు విజయవంతం కావడంతో మిగిలిన ఏడు చోట్ల ప్రీమి యం రిజిస్ట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలులో ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు కర్నూలు నగరంలో ప్రజలకు అనువైన ప్రాంతం, 1,000 చదరపు అడుగుల భవనం కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచి ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు.. ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ ఫ్రంట్ ఎండ్‌లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ఉండి పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా.. తర్వాత అన్ని ఆన్లైన్ సేవలే ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అంతేకాక ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్‌విండో కింద రిక్వెస్టు పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినయోగదారులే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళ్తుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఆస్తుల వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెస్సేజ్ వెళ్తుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అవినీతికి తావుండదు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – కల్యాణి, డీఐజీ, రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ -
‘మార్గదర్శి’ ప్రధాన కార్యాలయంలో సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సోదాలు నిర్వహించాక కూడా ఎలాంటి రికార్డులు ఇవ్వలేదని, 8 ఏళ్లుగా ఎలాంటి రికార్డులు సమర్పించలేదని అధికారులు తెలిపారు. డిపాజిటర్ల సమాచారం సైతం ఇవ్వలేదన్నారు. మరోవైపు.. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధులు మళ్లింపుపై దర్యాప్తు చేపట్టనున్నారు. తనిఖీల అనంతరం మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో 35 కంపెనీలలో అక్రమాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో 18 యూనిట్స్‌లో సోదాలు నిర్వహించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు. ఇదీ చదవండి: ‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు -
‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ చిట్స్ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా, అడిగిన సమాచారం ఇవ్వకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఏమిటని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి రామకృష్ణ ప్రశ్నించారు. తాము అడిగిన సమాచారం వారు ఇచ్చి ఉంటే, అది తాము సంతృప్తి చెందేలా ఉంటే సంతోషించే వారిలో తానే ప్రథముడినని చెప్పారు. అలా జరగనందునే పలు సందేహాలొస్తున్నాయని, అందువల్ల చిట్స్ వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన చిట్‌ఫండ్ చట్టంపై చిట్స్ డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నమ్మకం, అవమానం, నిప్పు, అబద్ధాలు.. వంటి కొన్ని పదాలు వాడారని, వాటితో తమకు పని లేదన్నారు. నిజాలు, సమాచారం, అంకెలు ఆధారంగానే తాము పని చేస్తామని చెప్పారు. వాస్తవాలు చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు ఇచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటే సరిపోదని, తాము అడిగిన సమాచారం ఇవ్వాలని, బ్యాలెన్స్ షీట్లు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐజీ ఇంకా ఏమన్నారంటే.. అది మా బాధ్యత.. – ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేయాలని లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు మేము ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చు.. చేస్తాం కూడా. ప్రతి ఏడాది వారు వివరాలు సమర్పించాలి. మేము అడిగిన సమాచారం ఇవ్వనందునే ఇదంతా చెప్పాల్సి వస్తోంది. వారు సమాచారాన్ని ఇవ్వక పోవడం వల్లే సందేహించాల్సి వస్తోంది. తప్పులు జరిగాయని భావించాల్సి వస్తోంది. అందువల్ల చిట్లు వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఒకవేళ ఫిర్యాదు వస్తే.. సీబీఐ, ఈడీ, పోలీసు వంటి సంస్థలు దర్యాప్తు చేస్తాయి. – మార్గదర్శి కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఏపీకి సమాచారం ఇచ్చేది లేదని ప్రకటనలో పేర్కొంటే కుదరదు. ఏపీలో మార్గదర్శి కంపెనీ లక్ష మంది చందాదారులతో 2,345 చిట్లు నిర్వహిస్తోంది. వాటన్నింటినీ ఇక్కడి నుంచి నిర్వహిస్తూ బ్యాలెన్స్ షీట్లు ఎక్కడ ఇస్తారు? రిజిస్ట్రార్‌కి రికార్డులు ఇచ్చామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ లెక్కన వాటిని తెలంగాణ, కర్ణాటక అధికారులకు ఇచ్చారా? – మార్గదర్శి యాజమాన్యం వారికి అనుకూలంగా నిబంధనలను చూపిస్తోంది. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 21ని చూపిస్తూ తమ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఏపీకి జవాబుదారీ కాదనడం సరికాదు. సెక్షన్ 19, 24లను కూడా వారు చదవాలి. ఇక్కడి కార్యకలాపాలకు మాకు బ్యాలెన్స్ షీట్లు ఇవ్వాల్సిందే. ఫోర్మెన్స్కు అధికారాలు లేవంటే ఎలా? – ఏపీలో మార్గదర్శి నిర్వహించే కార్యకలాపాలపై ఏదైనా సమస్య వస్తే తెలంగాణ, కర్ణాటక అధికారులు చూస్తారా? ఫోర్మెన్స్కు ఎటువంటి అధికారాలు లేవని చెబుతున్నారు. ఇది సరికాదు. అలాగైతే కొత్త చిట్స్‌కు అనుమతి ఇవ్వం. డిపాజిట్లు ఎక్కడున్నాయో, వాటిని ఎలా వినియోగిస్తున్నారో ఫోర్మెన్లకు తెలియాల్సిందే. – ఎవరూ అడక్కుండానే చిట్‌ఫండ్ కంపెనీలు తమ కార్యకలాపాలు, బ్యాలెన్స్ షీట్ల వివరాలను చిట్స్ రిజిస్ట్రార్లకు ఇవ్వాలి. కానీ ఎనిమిదేళ్లుగా మార్గదర్శి రికార్డులను సమర్పించడం లేదు. అందువల్ల త్వరలో హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో నిపుణులతో ఆడిట్ నిర్వహిస్తాం. – అన్నీ సక్రమంగా నిర్వహిస్తుంటే ఎందుకు భయపడుతున్నట్లు? ఆ కంపెనీ పబ్లిక్ డొమైన్లో ఉంచిన డాక్యుమెంట్ ప్రకారం చిట్‌ఫండ్ నిధులు ఇతర సంస్థలకు మళ్లించినట్లు స్పష్టమైంది. మార్గదర్శి సహా రాష్ట్రంలోని 35 చిట్‌ఫండ్ కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించాం. ఒక్క మార్గదర్శి తో తప్ప మిగిలిన కంపెనీలతో ఎటువంటి సమస్యా రాలేదు. ఈ ప్రశ్నలకు బదులేదీ? – చిట్స్ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఏమిటి? – అందులో మీకు అనుకూలంగా చెప్పుకుంటారా? మీకు మీరే సెల్ఫ్ సర్టిఫికేషనా? – మీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటే ఏపీలో రికార్డులు చూపరా? – మీరు ఏపీలోనూ చిట్‌ఫండ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది నిజం కాదా? – ఏ రిజిస్ట్రార్‌కు బ్యాలెన్స్ షీట్లు ఇచ్చారు? కర్ణాటక రిజిస్ట్రార్కా.. లేక తెలంగాణ రిజిస్ట్రార్కా? – ఎలాంటి అధికారాలు ఇవ్వకుండానే ఫోర్‌మెన్ (మేనేజర్ తరహా పోస్టు)లను నియమించారా? – రాష్ట్ర విభజన తర్వాత నుంచి మీరు ఏపీలో రికార్డులు చూపక పోవడం నిజం కాదా? – చిట్‌ఫండ్ నిధులు ఇతర సంస్థలకు మళ్లించడం నిజం కాదా? – రాష్ట్రంలో 35 చిట్‌ఫండ్ కంపెనీల్లో మీరొక్కరే ఎందుకు సహకరించడం లేదు? – అంతా సరిగ్గా ఉంటే ఎందుకు భయపడుతున్నారు?. -
చిట్ ఫండ్ కంపెనీలకు కొంత గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది
-
మోసాల మార్గదర్శి
-
మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా?.. ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: మార్గదర్శిలో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ అన్నారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉంది. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్ చేయలేదని.. మార్గదర్శి ఆర్థికస్థితిపై అనుమానాలున్నాయి. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుంది. ఒక చిట్కు సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదని ఐజీ తెలిపారు. ‘‘ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టినట్టు పేర్కొన్నారు. మార్గదర్శి ప్రజలను చీట్ చేసినట్టుగానే పరిగణించాలి. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని తప్పుడు వార్తలు రాశారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇస్తాం. మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్ ఆడిట్ చేయాలని ఆదేశించాం’’ అని ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. ‘‘తెలంగాణ అధికారుల సహకారంతో హైదరాబాద్ సంస్థలో తనిఖీలు చేస్తాం. మాకు ఏ సంస్థపైనా వివక్ష ఉండదు. 2018లో కపిల్‌చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకున్నాం. 2022 వరకు కపిల్ చిట్‌ఫండ్స్‌కు కొత్త చిట్కు అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఈ రోజుకి కూడా మార్గదర్శి సెకండ్ అకౌండ్ వివరాలు ఇవ్వలేదు’’ అని ఐజీ రామకృష్ణ తెలిపారు. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? -
రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కార్యాలయాల్లో సోదాలు చేశాం
-
బయటపడిన మార్గదర్శి మోసాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో మోసాలు బట్టబయలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందాలు మూడు రోజులపాటు చేసిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణయ్యాయి. రాష్ట్రంలోని పలు చిట్‌ఫండ్ కంపెనీల్లో అధికారులు మూడు విడతలుగా తనిఖీలు చేశారు. మూడో విడతలో మార్గదర్శి సంస్థల్లో మూడురోజులు తనిఖీలు నిర్వహించారు. 1982 చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఉన్న రికార్డులు, మెటీరియల్‌ను అధికారులు సీజ్ చేశారు. చిట్ల రూపంలో కట్టిన నిధులను మళ్లించడం, జీఎస్టీ ఎగవేయడం, కంపెనీ పాడిన చిట్లకు గ్యారెంటీ చూపకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో వాటిపై పూర్తి ఆధారాలను సేకరించారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ ఆదేశించారు. కాగా తనిఖీల సందర్భంగా మార్గదర్శి అన్ని బ్రాంచీలలోనూ తమ గ్రూపు సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులను మోహరించారు. సాధారణంగా ఇలా దాడులు జరిగే సమయంలో అధికారులే వీడియో సాక్ష్యాలను చిత్రీకరిస్తుంటారు. కానీ మార్గదర్శి బ్రాంచీలలో ఈ మీడియా ప్రతినిధులు కూడా వీడియోలు తీస్తూ అధికారులను బెదిరించే ధోరణిలో హల్చల్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు తనిఖీల సందర్భంగా జరిపే పంచనామా పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా మార్గదర్శి సిబ్బంది నిరాకరించారని అధికారులు తెలిపారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా సంతకాలకు నిరాకరించి ఉంటారని, తమకు తెలియకుండానే పంచనామా తతంగాన్ని పూర్తి చేశారని ఆరోపించేందుకే అలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. -
చిట్‌ఫండ్ కంపెనీల్లో కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి/తణుకు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని చిట్‌ఫండ్ సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చిట్ల రిజిస్టర్లు, అకౌంట్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పలు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ కంపెనీల ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడంతో వెంటనే సమాచారం రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అనుమానాల నివృత్తి, ఉల్లంఘనలు తెలుసుకునేందుకు తనిఖీ అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది. చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లించిన తీరుపై లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరే రకంగా వినియోగించుకున్నట్లు ఈ తనిఖీల్లో స్పష్టమైనట్లు తెలిసింది. గ్యారెంటీ చూపించలేని చందాదారులుఎ పాడుకున్న సొమ్మును ప్రత్యేక ఖాతాల్లో ఉంచి అదే రోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టుగా తేలింది. ఈ కంపెనీల నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు, ఓచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు నిర్థారించుకున్నట్లు తెలిసింది. జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో జీఎస్టీ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత సొమ్ము దారి మళ్లింది, ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేర నష్టం కలిగిందనే అంశాలను పూర్తిగా అంచనా వేస్తున్నారు. తనిఖీల్లో అధికారులకు అవసరమైన సమాచారం ఇంకా రావాల్సి ఉండడంతో గురువారం కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉంది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయంలో బుధవారం కూడా తనిఖీలు కొనసాగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. రెండ్రోజులుగా కార్యాలయంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్ములు కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీను చెల్లిస్తున్నట్లుగా గుర్తించారు. మరోవైపు డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన మొత్తానికి జీఎస్టీ ఎగవేస్తున్నట్లుగా గుర్తించారు. పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నట్టు తేలింది. అలాగే ఏలూరు నగరంలోని నరసింహరావుపేటలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చిట్స్ సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఉదయం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. -
వెలుగులోకి ‘చీట్’ ఫండ్స్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తిరుపతి: చిట్‌ఫండ్ కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొద్దిరోజులుగా రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అక్టోబర్ 21, 31 తేదీల్లో డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులతో కలిసి రెండు విడతలుగా తనిఖీలు చేసి పలు అవకతవకలను గుర్తించింది. దానికి కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలోని 18 సంస్థల్లో తనిఖీలు చేసింది. ప్రాథమిక పరిశీలనలో ఆయా కంపెనీల 2021–22 బ్యాలెన్స్ షీట్లను పరిశీలించినప్పుడు పెద్దఎత్తున నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్మును కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్టు తేలింది. చిట్ పాడుకున్న చందాదారుల నుంచి గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీలు, తాము చిట్‌ను పాడినప్పుడు మాత్రం ప్రభుత్వానికి గ్యారంటీ చూపించడంలేదని స్పష్టమైంది. చందాదారులు ఆలస్యంగా చిట్ సొమ్ము కట్టారనే సాకు చూపించి పెనాల్టీలు వసూలు చేసి దానికి జీఎస్టీ చెల్లించకపోవడం, పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి ఎక్కువ సొమ్మును వసూలు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉల్లంఘనలెన్నో! పలు చిట్ కంపెనీలు 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో స్పష్టమైంది. చిట్ల సొమ్మును ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు గుర్తించారు. చిట్ల సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, రుణాలు ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఈ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెందిన చిట్ల సొమ్మును అనుబంధంగా కంపెనీలకు మళ్లించి వాడుకుంటున్నాయి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. మార్గదర్శిలోనూ సోదాలు విశాఖ జిల్లాలోని మార్గదర్శితో పాటు ఇతర చిట్‌ఫండ్ కంపెనీల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంటున్నారని, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తేల్చారు. -
ఏపీ వ్యాప్తంగా చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు