
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ అమల్లో ఉన్న కాలంలో స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఈ నెల 9 వరకు registration. telangana.gov.in వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకుని ముందుగా ఫీజు చెల్లించిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు మంత్రివర్గం అనుమతించిన నేపథ్యంలో లాక్‌డౌన్ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం...
- పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
- ఒక సబ్ రిజిస్ట్రార్ పనిచేసే కార్యాలయాల్లో రోజుకు 24 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేసే చోట 48 స్లాట్లు మాత్రమే మంజూరు చేస్తారు.
- స్లాట్ బుక్ చేసుకున్న వారు నిర్దేశిత సమయానికి 5 నిమిషాల ముందు సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు చేరుకోవాలి. దీనికి అవసరమైన ఈ–పాస్‌లు స్లాట్ బుక్ కాగానే జారీ అవుతాయి. వాటిని చూపిస్తే సం బంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారు.
- రిజిస్ట్రేషన్ కోసం కేవలం అమ్మకందారులు, కొనుగోలుదారులతో పాటు ఇద్దరు సాక్షులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గుంపులుగా గుమికూడకూడదు.
- రిజిస్ట్రేషన్‌కు వేలిముద్రలు తీసుకునే ముందు చేతులను శానిటైజ్ చేయాలి.
- తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈసీలు/సీసీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో ఇవ్వరు. ఆన్‌లైన్‌లో లేదా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని తీసుకోవచ్చు.
- పనివేళల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment