
రికార్డులను పరిశీలిస్తున్న ఉదయభాస్కరరావు
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అడిషనల్ ఐజీ ఎం.ఉదయభాస్కరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం తమ శాఖ ఆదాయ లక్ష్యం సుమారు రూ.6,336 కోట్లుగా తెలిపారు. అంతకు ముందు డిసెంబర్ నెలలో సుమారు రూ.421 కోట్ల ఆదాయం వస్తే, గతేడాది డిసెంబర్‌లో రూ.599 కోట్లు వచ్చిందని ఉదయభాస్కరరావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment