గుంటూరు: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు(మంగళవారం) మార్గదర్శి చిట్స్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటకొచ్చాయి. నేటి తనిఖీల్లో ఖాళీ చిట్‌ల నిర్వహణలో మార్గదర్శి గోల్‌మాల్‌ను గుర్తించారు. గుంటూరు 5 చిట్ గ్రూప్‌లను పరిశీలించగా 6 కోట్ల 98 లక్షల చెల్లింపుల రికార్డులను అధికారులకు మార్గదర్శి చూపించలేదు.
శ్రీకాకుళం బ్రాంచ్‌లో 28 చిట్స్‌లో అక్రమాలను అధికారులు గుర్తించారు. 2 కోట్ల 88 లక్షల పేమెంట్స్‌కి మార్గదర్శి ఆధారాలు చూపలేదు. ఇక విజయనగరంలో 12 చిట్‌లను పరిశీలించగా, 54 లక్షల 85 వేల చెల్లింపులకు సైతం ఆధారాలు చూపించలేదు మార్గదర్శి. ఈ అక్రమాలపై మార్గదర్శికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment