![Margadarsi Chits Case: AP CID Officials Reveals Sensational Details - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/20/apcid.jpg.webp?itok=NHaQKcUp)
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్‌లలో.. మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్‌లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని లొసుగులు బయటపడ్డాయి. వేలంపాటలోనూ అవకతవకలు కనిపించాయి. సెక్షన్ 17 ప్రకారం.. చిట్‌ఫండ్ స్టార్టింగ్‌లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. ప్రజలకు, చందాదారులకు ఇలాంటి అవకతవకలను తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు.
సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ..
మార్గదర్సి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. మూడు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
► మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పిఎస్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు.
► అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు
► రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎంపై 179/23...409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం
ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్ కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని తెలిపారాయన.
సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ..
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని సీఐడీ ఎస్సీ అమిత్ బర్దార్ తెలిపారు. శారదా కుంభకోణం తర్వాత చిట్స్ చట్టంలో మార్పులు చేసినా.. మార్గదర్శిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. డిపాజిట్ దారులు కానివారి డాక్యుమెంట్స్ ఉపయోగించి అక్రమాలకి పాల్పడ్డారు. డిపాజిట్ దారులకి తెలియకుండా మార్గదర్సి చిట్ ఫండ్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కేసులో డిపాజిట్ దారుడికి తెలియకుండానే అతనిని మరో డిపాజిట్ దారుడికి ష్యూరిటీగా పెట్టారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఫోర్ మెన్లకి నిర్దిష్టమైన విధులువున్నాయి. డిపాజిట్ దారులకి అవగాహన కల్పించాల్సిన ఫోర్ మెన్ లు మోసం చేస్తున్నారని తెలిపారాయన. చిట్ ఫండ్ మోసాలు, అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. చిట్‌ఫండ్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరించింది. బ్రాంచ్ మేనేజర్లు తమకేమీ తెలియదని చెబుతున్నారు. రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర రికార్డ్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9493174065 అని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment