హైదరాబాద్: మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్ కాపీని సోమవారంలోగా ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్ న్యాయవాదిని ఆదేశించింది. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.
కాగా, చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.
కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..
మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.
అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు,.
Comments
Please login to add a commentAdd a comment