గతంలో వ్యవసాయ భూముల విలువలు తప్పుగా నమోదు
ఎకరాలను చదరపు గజాల్లో నమోదు చేయడంతో రిజిస్ట్రేటేషన్ తిప్పలు
ఇప్పుడు ఆ తప్పులను సవరించే పనిలో క్షేత్రస్థాయి కమిటీలు
ప్రస్తుతానికి షెడ్యూల్ యథాతథం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్‌లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్‌లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్‌లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది.
ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి.
నాలుగింటిలో మూడు క్లియర్
రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.
ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.
29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం
రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్‌లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment