అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసికొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సాఫ్ట్‌వేర్(కార్డ్ ప్రైమ్) వాలాను ఎక్కడా అభ్యంతరాలు తలెత్తలేదన్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ.
స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 23 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాతే కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని అయన తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేనివారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయచేసి ఆ అపోహలను నమ్మవద్దని కోరారు.
కొత్త విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని ఎవ్వరూ చెప్పలేదని దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పాత,కొత్త రెండు విధానాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ఈ సిస్టమ్ మీద అవగాహన లేనివారే దీనిని జిరాక్స్ కాపీలంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూడు రోజులుగా సాగుతోన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొత్తం 700 రిజిస్ట్రేషన్లు చేస్తే అన్నిటినీ ఫిజికల్ డాక్యుమెంట్లతోనే చేశామని.. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆప్షనల్‌గా మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ
ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్ అర్హత ఏంటి’
Comments
Please login to add a commentAdd a comment