onlineregistrations
-
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్లైన్ నమోదు ప్రారంభం
సాక్షి, అమరావతి : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏపీలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం జర్నలిస్టులు ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. http://ipr.ap.gov.in/Site_Application సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ జర్నలిస్టు సంఘాలు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సైట్లు కేటాయించే ప్రక్రియలో భాగంగా ముందుగా జర్నలిస్టులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. హౌస్ సైట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నమోదు ప్రకక్రియ పప్రారంభించడం పట్ల ఏపీ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదీచదవండి..మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత -
ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం..
అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసికొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సాఫ్ట్వేర్(కార్డ్ ప్రైమ్) వాలాను ఎక్కడా అభ్యంతరాలు తలెత్తలేదన్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 23 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాతే కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని అయన తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేనివారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయచేసి ఆ అపోహలను నమ్మవద్దని కోరారు. కొత్త విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని ఎవ్వరూ చెప్పలేదని దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పాత,కొత్త రెండు విధానాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ఈ సిస్టమ్ మీద అవగాహన లేనివారే దీనిని జిరాక్స్ కాపీలంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు రోజులుగా సాగుతోన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొత్తం 700 రిజిస్ట్రేషన్లు చేస్తే అన్నిటినీ ఫిజికల్ డాక్యుమెంట్లతోనే చేశామని.. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆప్షనల్‌గా మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్ అర్హత ఏంటి’ -
ఏపీలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని మంగళవారం ఉదయం మంత్రులు ప్రారంభించారు. మంత్రులు శిద్దారాఘవరావు, దేవినేని, కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాహనం కొన్న షోరూమ్ వద్దే ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి శిద్ధా తెలిపారు. వాహనదారుడికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు డీలర్ కు ఇస్తే సరిపోతుందన్నారు. onlineregistrations, vehicles, ఆన్ లైన్ రిజిస్ట్రేసన్, వాహనాలు,