సాక్షి, అమరావతి : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏపీలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం జర్నలిస్టులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. http://ipr.ap.gov.in/Site_Application సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ జర్నలిస్టు సంఘాలు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సైట్‌లు కేటాయించే ప్రక్రియలో భాగంగా ముందుగా జర్నలిస్టులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. హౌస్ సైట్‌లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నమోదు ప్రకక్రియ పప్రారంభించడం పట్ల ఏపీ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి..మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత
Comments
Please login to add a commentAdd a comment