journalists houses
-
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్లైన్ నమోదు ప్రారంభం
సాక్షి, అమరావతి : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏపీలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం జర్నలిస్టులు ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. http://ipr.ap.gov.in/Site_Application సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ జర్నలిస్టు సంఘాలు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సైట్లు కేటాయించే ప్రక్రియలో భాగంగా ముందుగా జర్నలిస్టులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. హౌస్ సైట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నమోదు ప్రకక్రియ పప్రారంభించడం పట్ల ఏపీ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదీచదవండి..మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత -
దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి విర్రవీగుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే (హెచ్–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరణించిన విలేకరుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 1,950 మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్ కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం... ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. తాము కూడా మోదీ, అమిత్‌షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. తాను, ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మోదీ ఒక్కో జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు, ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మరణించిన విలేకరుల కుటుంబాలకు కేటీఆర్ చెక్కులను అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు
- వంద ఎకరాల్లో టవర్స్ నిర్మాణానికి నిర్ణయం - గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలోని స్థలం ప్రభుత్వానికి బదలాయింపు - పార్ట్‌టైం రిపోర్టర్లకూ డబుల్ బెడ్రూం ఇళ్లు - జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ పరిధిలో వంద ఎకరాల స్థలంలో నివాస గృహాల సముదాయాలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నగరంలో పనిచేసే అన్ని స్థాయిల జర్నలిస్టులకు గృహాలు సమకూరేలా బహుళ అంతస్తుల టవర్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు సంఘాల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, శైలేష్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. సీఎం సూచనల మేరకు నగరంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన జర్నలిస్టులు బుద్వేల్లోని భూములు ఇళ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనువుగా ఉన్నాయని సీఎంకు వివరించారు. వారి అభీష్టం మేరకు బుద్వేల్‌లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. బుద్వేల్లోని ఈ స్థలం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో ఉందని, దానిని ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయితీరాజ్ కార్యదర్శి ఎస్పీ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. పాత్రికేయుల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుకు సూచించారు. దశలవారీగా ఇస్తాం: సీఎం జర్నలిస్టుల్లో ఎక్కువమంది దిగువ, మధ్య తరగతికి చెందిన వారేనని, వారికి సొంత ఇళ్లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మీడియాలో పనిచేసే అన్ని విభాగాల జర్నలిస్టులకు నివాస గృహాలతో పాటు హౌజింగ్ టవర్లలో ఇతర పౌర సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులంతా మెరుగైన జీవితం గడపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటి విడతలో, తరువాత ఇతర ప్రాంతాల జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని జర్నలిస్టులకు ఇళ్లు కట్టే విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్ట్‌టైం రిపోర్టర్లకూ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఇళ్లు కట్టిస్తామని సీఎం చెప్పారు. -
'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు'
హైదరాబాద్: హైదరాబాద్‌లో జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వంద ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. శుక్రవారం జర్నలిస్టు సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రేపు(శనివారం) ఇళ్ల స్థలాలకు అనువైన స్థలం అధికారులు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. మార్చిలో జర్నలిస్టుల ఇళ్లకు శంకుస్థాపన చేసి.. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.