సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సోదాలు నిర్వహించాక కూడా ఎలాంటి రికార్డులు ఇవ్వలేదని, 8 ఏళ్లుగా ఎలాంటి రికార్డులు సమర్పించలేదని అధికారులు తెలిపారు. డిపాజిటర్ల సమాచారం సైతం ఇవ్వలేదన్నారు.
మరోవైపు.. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధులు మళ్లింపుపై దర్యాప్తు చేపట్టనున్నారు. తనిఖీల అనంతరం మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో 35 కంపెనీలలో అక్రమాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో 18 యూనిట్స్‌లో సోదాలు నిర్వహించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు.
ఇదీ చదవండి: ‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment