
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు ఆ శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రజల దృష్టిలో రిజిస్ట్రేషన్ల శాఖపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేలా చర్యలు తీసుకోవాలని, సేవలు కిందిస్థాయి వరకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు.
అలాగే, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లతో రామకృష్ణ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అవినీతి లేని నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా అదనపు ఆదాయ వనరులను గుర్తించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment