
విజయవాడ: మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.మార్గదర్శి చిట్ ఫండ్ లో నిధుల మల్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. మార్గదర్శి చిట్‌ఫండ్ 37 బ్రాంచ్‌లలో ఆడిటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దానిలో భాగంగా ప్రత్యేక ఆడిటర్ నియమించింది.
కాగా, మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సీఐడీ విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్‌స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment