
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి విషయంలో ఏపీ సీఐడీ విచారణపై స్టే ఇవ్వలేమని, దర్యాప్తు కొనసా గించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు 30 మంది మేనేజర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. ఈ మే రకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నిధులను చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాలకు మళ్లిస్తున్నారని పే ర్కొంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుల్లో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ మార్గదర్శి చైర్మ న్ రామోజీరావు (ఏ1), ఎండీ శైలజ (ఏ2) ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. దర్యాప్తులో భాగంగా విచారణకు రావా లని 30 మంది మార్గదర్శి మేనేజర్లకు సీఐడీ తాజా గా నోటీసులు జారీచేసింది.
ఈ నోటీసులను సవాల్ చేస్తూ రామోజీరావు, శైలజ మంగళవారం ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్‌ను లంచ్ మోషన్‌గా దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సు ప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వా దనలు వినిపిస్తూ.. ఉద్యోగులకు జారీచేసిన నోటీ సులను కొట్టేయాలన్నారు. మార్గదర్శి కేసు దర్యాప్తు ను మరో రాష్ట్రానికి బదిలీచేసి.. స్వతంత్ర ఏజెన్సీకి అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.
పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు..
ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘గత విచారణ సందర్భంగా హైకోర్టు కేవలం రామోజీ, శైలజకు మాత్ర మే ఉపశమనం కలిగించింది. ఇతరులకు ఈ ఇది వ ర్తించదు. దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి పిటి షన ర్లు పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్ర భుత్వానికి సమయం ఇవ్వకుండానే పిటిషనర్లకు అ నుకూలంగా ఆదేశాలు జారీ అవుతున్నాయి.
ఈ కే సు లో ఏపీ అడ్వొకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారు. ఏపీ వాదన విన్న తర్వాతే మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ సీఐడీ నుంచి నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఎవరో, ఎప్పు డు నోటీసులు అందుకున్నారో.. లాంటి వివరాలు ఏమీలేకుండానే పిటిషన్ వేశారు. వివరా లు తెలీకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. మార్గదర్శి నిధులను మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్స్‌ల్లోకి మళ్లించడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడింది. కౌంటర్ దాఖలు చేసే వరకైనా మాకు సమయం ఇవ్వాలి’ అని గోవింద్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
దర్యాప్తును అడ్డుకోవడం లేదుకదా..
‘మీకు (ఏపీ సర్కార్) అభ్యంతరం ఉంటే రేపే వెకేట్ స్టే పిటిషన్ వేయండి. హౌస్‌మోషన్ మూవ్ చేయండి.. మా ఆదేశాల సవరణకు పిటిషన్ వేయండి.. విచారణ చేపట్టడానికి మాకెలాంటి అభ్యంతరంలేదు. మేం దర్యాప్తును అడ్డుకోవడంలేదు కదా. మా ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేయడం సరికాదు’.. అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment