సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఎమ్మెల్యేగా ఆయనపై వేటు వేయాలని పిటిషన్లు వేశారు. ధర్మపురి ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని కోరారు.
తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కాంగ్రెస్‌నేత పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కరీంనగర్ జల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌పై గెలిచారు. దీంతో వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించకముందే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, అధికారులు ఆయనకు మద్దతిచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు.
ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజవకవర్గం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ ఈ ఇద్దరు నేతలే తలపడుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈసారి గెలుపెవరిదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment