చందాదారుల వివరాలు ఎందుకివ్వరు? | Telangana High Court Begins Hearing in Margadarsi Case | Sakshi
Sakshi News home page

చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?

Published Tue, Oct 22 2024 6:22 AM | Last Updated on Tue, Oct 22 2024 6:22 AM

Telangana High Court Begins Hearing in Margadarsi Case

పెన్‌ డ్రైవ్‌లో ఇవ్వడానికి అభ్యంతరమేమిటి?: తెలంగాణ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు ఎల­క్ట్రానిక్‌ ఫార్మాట్‌లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమి­టని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్‌ ఫార్మాట్‌లో వివరాలున్నాయని, కొన్ని ఇ బ్బం­దుల కారణంగా ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌ (పెన్‌ డ్రైవ్‌)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీని­యర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనా­న్సి­యర్స్‌ నుంచి సూచనలు పొంది చెబుతా­నని బదులిచ్చా­రు. దీంతో తదుపరి విచారణను నవంబర్‌ 4కు వా­యిదా వేసింది.

ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండి­యా (ఆర్‌బీఐ), మార్గదర్శితోపాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదే­శిం­చింది. చందాదారుల వి­వరా­లను పెన్‌ డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్‌ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు.

అలాగే తీర్పులోని కొంత భాగంపై అ భ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ రావు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్‌ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పిటిషన్లపై సోమవారంమరోసారి విచారణ ప్రారంభించింది.

లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం
విచారణకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలని  కోర్టును కోరారు. పేపర్‌ ఫార్మాట్‌లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ డొల్లగానే ఇ ృచ్చారని అన్నారు. ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు.  సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం చేస్తున్నానని చెప్పారు. మార్గదర్శి తరఫున  లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్‌ ఫార్మాట్‌లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూ చనలు పొంది చెబుతానని లూథ్రా బదులిచ్చా­రు. కాగా, ఈ కేసులో పిటిషనర్‌–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్‌రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement