మార్గదర్శి-మణిపూస
జీవన కాలమ్
సరిగ్గా 19 సంవత్సరాల కిం దట దత్తా సోదరులు-అంటే పెద్దాయన శివ శక్తిదత్తా, విజ యేంద్ర ప్రసాద్ దర్శకత్వం వ హించిన చిత్రం ‘అర్థాంగి’లో మంచి పాత్రలో నటించాను. ఆ చిత్రానికి కో డెరైక్టర్ రాజ మౌళి. వారిద్దరి మధ్య ఆయన కాశీవిశ్వేశ్వరరావు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. చివరి రోజుల్లో ఒక రోజంతా మా ఇంట్లో ఉండినా ‘సాయంకాలమైంది’ నవల చదివారు. శివశక్తిదత్తా గొప్ప కవి. విజయేంద్ర ప్రసాద్ మంచి కథా రచయిత. ఇది నేపథ్యం.
ఇప్పటి ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఒక మణి పూస- ఏ విధంగా చూసినా. హీరోని ధీరోదాత్తుడిగా, సర్వ శక్తిసంపన్నుడిగా చూసి చూసి విసిగిపోయిన ప్రేక్ష కులకి - ఎక్కువ చేతకాని, చాలా విషయాలు తెలియని, అబద్ధం చెప్పకూడదని నేర్చుకున్న ఓ నేలబారు పాత్ర గొప్ప రిలీఫ్. అతను ఆంజనేయభక్తుడు. రామభక్తుడు కావచ్చు కదా! సాయిభక్తుడు కావచ్చు కదా! ముందు సీనుల్లో తాలింఖానాలో కుస్తీలు చూసి మురిసిపోయే (పాల్గొనే కాదు) హీరోని పరిచయం చేశారు. ఓ మూగ పిల్ల కనబడింది. విచిత్రంగా అతనికి ముడిపడింది. వదిలించుకోవాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. ఆమెను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి. ఎలాగో తెలియని అమాయకుడు. కానీ రాజీలేని నిజాయితీపరుడు. ఆ పిల్ల తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో ఉన్నారని తెలిసింది. పాకి స్తాన్ ఎలా వెళ్లాలో తెలీదు. డబ్బు పుచ్చుకున్న ఏజెంటు ఆ పిల్లని వ్యభిచార గృహానికి అమ్మి చేతులు కడుక్కో వాలనుకున్నాడు.
ఒక్కసారి- ఒకే ఒక్కసారి (కనీసం మొదటిభాగంలో) హీరో చెయ్యి చేసుకున్నాడు. తాలిం ఖానా అనుభవాన్ని, ఆంజనేయభక్తుడిని ఇక్కడ వాడా రు రచయిత. తన శక్తి చూపడానికి కాదు. కేవలం తన కోపాన్ని ప్రదర్శించడానికి. హీరో మాటలు రాని పసి పిల్లని పక్క దేశానికి తీసుకువెళ్లడానికి ప్రేక్షకులంతా ఒకటై నిలిస్తే అతని అశక్తతలోంచి క్షణక్షణం బయటపడు తున్న కొద్దీ ఆనందంతో తన్మయులయ్యారు. ఒక గొప్ప ఆదర్శం అసమర్థతని జయించడం ప్రేక్షకులకి ఆకర్షణ, ఈ చిత్రం విజయ రహస్యం. క్లైమాక్స్‌లో హీరో గారు ధీరోదాత్తులై దుర్మార్గుల్ని చావగొట్టడం ఫార్ములా. కాని ఇక్కడ పోలీసుల చేతుల్లో హీరో చిత్తుగా దెబ్బలు తిన్నా డు. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తృప్తి అత నిది. అంటే ప్రేక్షకులది. పాత్రీకరణా, నటుడూ ఏకమై లక్ష్యాన్ని సాధించిన పాత్ర. మూగపిల్ల నిస్సహాయత, అతి పవిత్రంగా, వికసించిన పువ్వులాగా మెరిసిన హర్షా లీ మల్హోత్రా హీరోకి దీటుగా కథని అలంకరించింది.
పొరుగు దేశానికి అన్ని రంగాలలోను చుక్కెదురవు తున్నా- పాక్ నాయకులు పదవిలోకి వచ్చాక ప్రజల్ని మెప్పించే నినాదం, పోరాటం - కశ్మీర్. ఇది అక్కడి రాజ కీయ నాయకుల వైఫల్యాలను కప్పిపుచ్చే మలామా. కాని ప్రజల స్థాయిలో, వారి మనస్సులలో, వారి జీవన విధానంలో - మానవీయ విలువల పతనం లేదని నిరూ పించిన చక్కటి కథ ఇది. ఈ కారణానికే ఈ కథ రెండు దేశాలనూ ఆకర్షించింది.
దౌత్యవర్గాలు, రాజకీయ నాయకులు, తుపాకులు, హింసాకాండ, మతం సాధించలేని అతి పెద్ద సమస్యని కేవలం మానవత్వం జయించగలదని, జయించి చూపించిన చిత్రం ‘భజరంగీ భాయిజాన్’. హ్యాట్సాఫ్ టు విజయేంద్రప్రసాద్. స్క్రీన్‌ప్లే, దర్శకుడు కబీర్ ఖాన్.
మతాలకు అతీతంగా మానవత్వ విలువలకు అద్దం పట్టే ఈ చిత్రంలో మరిచిపోవాలన్నా మరిచి పోలేని గొప్ప ఆకర్షణ - హనుమంతుడి భక్తుడిగా చేసిన హీరో ముస్లిం. ముస్లిం అమ్మాయిగా చేసిన నటి- హిందువు. ఖీజిజీట జీట ్చ జట్ఛ్చ్ట ట్ట్చ్ట్ఛఝ్ఛ్ట.
ఈ కథకి కొసమెరుపు- ఇలాంటి పరిస్థితులలోనే 15 సంవత్సరాల కిందట పాకిస్తాన్‌లో ఉండి పోయిన మరో మూగ, చెవిటి పిల్ల కథ బయటికి రావడం. ఆ అమ్మాయి రెండు దశాబ్దాలుగా మాతృదేశాన్ని గురించి కలలు కంటూ మరో భజరంగీ కోసం ఎదురుచూడడం. అయితే ఈసారి భజరంగీ అక్కరలేదు. ప్రభుత్వమే మేలుకుంది. విదేశాంగ మంత్రి స్పందించారు.
మంచి సినీమా మార్గదర్శి, సూచన. ఇందులో వినో దం ఉంది. హాస్యం ఉంది. తగు మాత్రపు రొమాన్స్ ఉం ది. ఫైట్స్ ఉన్నాయి. గేలరీస్‌ని లొంగదీసుకోవాలన్న ప్రలోభం లేదు. అన్నిటికన్నా ముఖ్యం- ఒక గొప్ప దృశ్య ప్రక్రియ చేయవలసిన, చేయగలిగిన గొప్ప సామా జిక స్పృహ ఉంది. సినీమా సుమతీ శతకం కానక్కర లేదు. కేవలం ఊసుపోయే వినోదమూ కానక్కరలేదు. ప్రయోజనం ప్రక్రియకి రేంజ్‌నిస్తుంది. పెద్దరికాన్ని ఇ స్తుంది. బాధ్యతని ఇస్తుంది. జాతికి ఉపకారం చేస్తుంది.
ఇంత గొప్ప ప్రయోజనాన్ని సినీమా మరిచిపోయి ఎన్నాళ్లయింది!!
- గొల్లపూడి మారుతీరావు