సాక్షి, విజయవాడ: స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ‘రామోజీరావు మార్గదర్శిలో అక్రమాలు’ అంశంపై సదస్సు జరిగింది.
కాగా, ఈ సదస్సుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్. సత్యనారాయణ ప్రసాద్, స్వర్ణాంధ్ర దినపత్రిక ఎడిటర్ కె.బి.జి. తిలక్, పలువురు మేధావులు, విద్యావంతులు, పౌరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్. సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ.. రామోజీరావు నిందితుడు.. నేరం చేశానని ఒప్పుకుంటున్నారు. గతంలో డిపాజిట్లు సేకరించాం.. ఇప్పుడు సేకరించడం లేదంటున్నారు. నిబంధనల ప్రకారం డిపాజిట్ల సేకరణ చేయకూడదు. చందదారుల డబ్బు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చందాదారుల భద్రత కోసం బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చందాదారుల డబ్బును రామోజీ తన సొంత అవసరాలకు వాడుకున్నారు. చిట్‌ఫండ్ డబ్బును రామోజీరావు దారి మళ్లించారు.
సీనియర్ జర్నలిస్ట్ తిలక్ మాట్లాడుతూ.. మార్గదర్శిపై పోరాటంలో ఉండవల్లి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఉండవల్లి పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతుంది. ఉండవల్లి పోరాటానికి మనమంతా మద్దతివ్వాలి. రామోజీ పొరపాట్లను ప్రశ్నిస్తే వ్యక్తిగత హననానికి పాల్పడతారు. పత్రికలను అడ్డం పెట్టుకొని రామోజీరావు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పత్రికలు వాడుకోవడం సరికాదు. చట్టాలు తమకు వర్తించవన్న ధోరణి మంచిది కాదు.
ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడంలో రామోజీది ప్రముఖ పాత్ర. చందాదారుల డబ్బు చెల్లిస్తే పేర్లు వెల్లడించడానికి సమస్య ఏంటి?. చందాదారుల డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాలని చట్టంలో ఉంది. ఈ చట్టం తనకు వర్తించదని రామోజీరావు అంటున్నారు. డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధం అన్నందుకు నాపై రూ.50 లక్షలకు దావా వేశారు. తప్పు చేసినా అది తప్పుకాదని వాదిస్తారు. ఇదే కొనసాగితే మాఫియా తయారవుతుంది. చంద్రబాబు చేసిన నేరాలు ఈనాడుకు కనపడవా?. ఏపీ విభజన చట్ట విరుద్ధమని చంద్రబాబుకు చెప్పినా వినలేదు. తెలంగాణలో కేసీఆర్‌ను పొగుడ్తూ ఈనాడులో వార్తలు రాస్తారు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment