విభజనపై పార్లమెంటులో వాగ్వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం పార్లమెంట్ ఉభయ సభల్లో మరోసారి గురువారం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించినపుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. విభజనకు నిరసనగా నెలకుపైగా సాగుతున్న సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను, తెలంగాణ అంశంపై నాలుగు దశాబ్దాల క్రితం పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించేందుకు ఉండవల్లి ప్రయుత్నించారు.
అయితే ఉండవల్లి ప్రసంగాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీవూంధ్ర టీడీపీ సభ్యుడు సీఎం. రమేశ్ రాజ్యసభలో ప్రస్తావించారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కోస్తా,రాయలసీమల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే రాష్ట్రంలో నెల కొన్న ఉద్రిక్తతలపై ప్రసంగించేందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు స్పీకర్ అనుమతించారు.
తెలంగాణ ఏర్పాటును అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ఎంపీ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది. ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయన్న సుప్రీంకోర్టు తీర్పుతో రాజధానిలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకడం తమకు సమ్మతం కాదం టూ సీమాంధ్ర ప్రజలు 41 సంవత్సరాల క్రితం ప్రత్యే క రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని, అయితే, మొత్తం సమస్యను జాతీయ దక్ఫధంతో చూడాల్సి ఉంటుం దని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొన్నారని, ఆ డిమాండ్‌ను అంగీకరించలేదని అన్నారు. ఆమె ప్రసం గ పాఠాన్ని వినిపించేందుకు ఉండవల్లి ప్రయుత్నించా రు. అయితే, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోవుటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్యు, ఇటీవల టిఆర్ఎస్లో చేరిన వివేక్, మందా జగన్నాథం, టీడీపీ సభ్యు డు నామా నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది ప్రజాస్వామ్య విరుద్ధం: ఉండవల్లి
నెలరోజులుపైగా, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను పార్లమెంట్ ద్వారా మొత్తం జాతికి వివరించేందుకు చేసిన తన ప్రయత్నాలను అడ్డుకొన్న తెలంగాణ ఎంపీల వైఖరి ప్రజాస్వామ్య మౌలికసూత్రాలకే విరుద్ధమని ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు.