సాక్షి, తాడేపల్లి: మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీ రావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రామోజీ.. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారని స్పష్టం చేశారు.
కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది. రామోజీ రావు అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. రామోజీ అక్రమాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయి. 2024 ఎన్నికలను కూడా శాసించాలని రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు. వాళ్లు సృష్టించిన అబద్ధాలనే బ్యానర్ కథనంగా ఇస్తున్నారు. అంతేకానీ, మార్గదర్శి గురించి చిన్న వార్త అయినా ఈనాడులో రాశారా?. అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను పాటించలేదు. రామోజీ ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారా? అని ప్రశ్నించారు.
వాలంటీర్లపై తప్పుడు రాతలు రాశారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారు. ఒక్కప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు. ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు. నాలుగు ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు విషయం కక్కారు. ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయి. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఉంటారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయి.
చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైంది. గొడవలు వాళ్లు సృష్టించి మాపై నిందలు వేస్తున్నారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం సాధిస్తుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారు. వృద్ధులు చనిపోతే వైఎస్సార్‌సీపీకి అంటగట్టాలని చూస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ గొడవలు సృష్టిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment