మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. వెండితెరపై హీరో గొప్పదనం చూసి చప్పట్లు కొడతాం.
నిజ జీవితంలో అలాంటి హీరోలు కనిపించినప్పుడు, వారి గురించి తెలిసినప్పుడు పెద్దగా పట్టించుకోం. రీల్ హీరోలు ఎక్కడైనా కనిపించినా ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీ కోసం నానాయాతన పడతాం. అదే రియల్ హీరోలను చూసినప్పుడు, వారి పోరాట పటిమ తెలిసినా సరే ఎక్కడో ఏవో అనుమానాల కారణంగా శెభాష్ అనడానికి మొహమాటపడతాం.
ఒక్కోసారి వారు చనిపోయిన తర్వాత వారి గొప్పదనం గురించి తెలిసి, వారు వీరు చెబుతుంటే విని, వావ్ అనిపిస్తుంది. అంతటితో రియల్ హీరోల కథ సమాప్తం. కానీ రియల్ హీరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూస్తే అలా అనిపించడం లేదు.
ఆయన స్పెషల్ రియల్ ఫైటర్. ఆయన నిజమైన అసాధారణ పోరాట యోధుడు. Created history with great fighting spirit. మార్గదర్శి అవకతవకల్ని వెలికితీయడంద్వారా ఆర్ధికరంగ నేరాలపై తనదైన శైలిలో సామాన్యులకు సైతం చక్కటి అవగాహన కల్పించిన సామాన్యుడు. ఆయన చెప్పే పాయింట్లలో ఒక్క మాట కూడా తప్పు పట్టేలా లేదు. సామాన్యుల్లో అసామాన్యుడు. ప్రజాప్రతినిధిగా పదికాలాలపాటు నిలిచిపోయే పని చేశారు.
ఆర్ధిక రంగ నేరాలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించిన ధన్యజీవిగా కీర్తి సంపాదించారు. కేవలం చట్టాలను నమ్ముకొని, న్యాయవ్యవస్థమీద నమ్మకంతో ప్రజాప్రతినిధిగానే కాదు లాయర్ గా కూడా మార్గదర్శిపై పట్టుదలగా పోరాటం చేసి చరిత్రలో తనకంటూ మంచి పేరు ఆర్జించారు. నాకు రాజ్యాంగం పట్టదు, నేను చెప్పిందే చట్టం, నేను సంకల్పించిందే సక్రమం అనుకునే మోనార్క్‌లలో కనీసం ఒక్కరినైనా నేలమీదకు ఈడ్చుకొచ్చిన మహర్షి ఉండవల్లి.
మార్గదర్శి సక్రమంగా పని చేస్తోంది కదా! ఎలాంటి ఫిర్యాదులు లేవు కదా!! ఏంటీ ఈ ఉండవల్లికి వచ్చిన నొప్పి అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. సమస్య లోతుపాతులు తెలిసిన తర్వాత ఇంతకాలం జరిగిన మోసం తెలిస్తే వళ్లు గగుర్పొడుస్తుంది.
అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అంతిమంగా దెబ్బతినేది ప్రజలు. లాభపడేది ఆ మోసాలు చేసినవారు, అంతో ఇంతో లబ్ధి పొందేది వారికి చప్పట్లుకొట్టేవారు. ఆ స్పృహతో చూసినప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన పోరాటం అసాధారణం, అమోఘం, అద్వితీయం. మాటలతో చెప్పలేనిది.
సెల్యూట్ టు ఉండవల్లి అరుణ్‌కుమార్ సార్.
undavalli arun kumar on margadarshi, on ramoji, on chit funds, on chits, on margadarshi financiers ..అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.. మీకు చాలా వీడియోలు లభ్యమవుతాయి. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత సమాచారం వాటిలో లభ్యమవుతుంది.
అయినా సరే మీడియా మొఘల్ రామోజీయే కరెక్ట్ అని ఎవరైనా అంటే ఎవరైనా చేయగలిగిందేమీలేదు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవడమే.
-చెమికెల రాజశేఖరరెడ్డి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment