Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? | What Is Going On Behind Eenadu Ramoji Rao Businesses? Know In Details - Sakshi
Sakshi News home page

Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?

Published Wed, Oct 18 2023 5:00 PM | Last Updated on Tue, Feb 20 2024 5:43 PM

So Many Companies For Ramoji - Sakshi

మార్గదర్శి చిట్‌ఫండ్‌ చైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది.
అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? 

రికార్డుల్లో ఏముంది?

హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్‌ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్‌, నవంబర్‌ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్‌ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్‌ రిసివెబుల్స్‌ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్‌ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. 

కొన్ని వెబ్‌సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌​‍(తెలంగాణ)-రూ.20.20కోట్లు
  • డాల్ఫిన్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.36.32కోట్లు
  • మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌(తమిళనాడు)-రూ.50లక్షలు
  • మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌(కర్ణాటక)-రూ.50లక్షలు
  • మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ లీజింగ్‌ కో ప్రైవేట్‌ లిమిటెడ్‌-రూ.52.02లక్షలు
  • మార్గదర్శి ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.75లక్షలు
  • ఉషాకిరణ్‌ మూవీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.99లక్షలు
  • బాలాజీ హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఆంధ్రప్రదేశ్‌)-రూ.65.06లక్షలు
  • ప్రియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)​‍-రూ.1లక్ష
  • రామోజీ మల్టీమీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.2.06కోట్లు
  • ఓం స్ప్రిచ్‌వల్‌ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు
  • ఓం స్ప్రిచ్‌వల్‌ సిటీ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.26లక్షలు
  • మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.44.77కోట్లు
  • ఉషోదయ షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.1.80కోట్లు
  • రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.9.44కోట్లు
  • మార్గదర్శి హౌజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.3.88కోట్లు
  • మాన్‌పవర్‌ సెలక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.1లక్ష
  • వెరైటీ మీడియా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఆంధ్రప్రదేశ్‌)-రూ.1లక్ష
  • బాల్‌భారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.1లక్ష,
  • బాల్‌భారత్‌ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు
  • రామోజీ కిరణ్‌ ఫిల్మ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.50లక్షలు
  • ఈనాడు టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.24.87కోట్లు.

ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్‌​ విలువ చాలారెట్లు ఎక్కువ. 

ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. 

  • మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు
  • ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు
  • విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు
  • రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు.
  • చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. 
  • చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక.
  • పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. 

ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు.

ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement