ramoji group
-
ప్రముఖుల దిగ్భ్రాంతి
రామోజీరావు మరణంతో దేశం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన ఈనాడు దినపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను నెలకొల్పిన వినూత్న వ్యాపారవేత్త. సమాజ హితంపై ఆయనకు ఉన్న దృష్టి కారణంగా పద్మ విభూషణ్ వరించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి⇒ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రామోజీరావు కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. –నరేంద్ర మోదీ, ప్రధాని⇒ భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి నా సంతాపం. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మార్చింది. – రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత⇒ మీడియా, వినోద రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. –ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ⇒ భారతీయ మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన దిగ్గజం రామోజీరావు. తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీని పెంపొందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తీరని లోటు: రేవంత్‌రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తెలుగు వారి కీర్తిని చాటిన వ్యక్తి: చంద్రబాబురామోజీ మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి ఫిలింసిటీకి వెళ్లి రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో బాబు మాట్లాడుతూ, రామోజీరావును యుగపురుషుడిగా అభివర్ణించారు. నిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి రామోజీ అని, సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటారని అన్నారు. కేసీఆర్ సంతాపం...రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.⇒ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. నేను మాత్రం ఆయనలో చిన్న పిల్లాడిని చూశాను. ఆయనకు పెన్నులంటే ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఒక పెన్ను బహూకరిస్తే దాన్ని చూసి ఆయన మురిసిపోయారు. – చిరంజీవి⇒ ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. – పవన్ కళ్యాణ్ప్రముఖుల సంతాపం..రామోజీకి నివాళులు అర్పించిన వారిలో బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి, సినీనటులు నాగార్జున, వెంకటేశ్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, కళ్యాణ్‌రామ్, నరేష్, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, బోయపాటి శ్రీను, రాజమౌళి, కీరవాణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇళయరాజా, మంచు విష్ణు, విజయేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ -
పెదపారుపూడి టు ఫిలింసిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్‌భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్‌భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
పన్ను ఎగవేసిన రామోజీ
* రూ. 77 లక్షలకు పైగా డాల్ఫిన్ హోటల్ బకాయి *విశాఖలో ఆస్తి పన్ను చెల్లించని తీరు * ‘ఈనాడు’ను, రామోజీని చూసి చర్యలకు వెనకాడుతున్న అధికారులు సాక్షి, విశాఖపట్నం: ఎదుటివారికి చెప్పేందుకే నీతులన్నాయని నమ్మేవారిలో మొదటి వ్యక్తి ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావే. పెన్ను పట్టుకుని ఇతరులపై ఇంతెత్తున లేచే రామోజీరావు... తాను మాత్రం అన్నిటికీ అతీతమనుకుంటారు. ఆఖరికి స్థానిక సంస్థలకు పన్ను కూడా కట్టకుండా ఎగవేస్తున్నారు ఈ రాజగురివింద. విశాఖలో ఈయన కబ్జా చేసిన డాల్ఫిన్ హోటల్ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నా... గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్నును మాత్రం ఎగవేస్తోంది. జీవీఎంసీ యంత్రాంగం ఎన్నిసార్లు నోటీసులిచ్చినా డాల్ఫిన్ నుంచి స్పందన మాత్రం కరువవుతోంది. అధికారులేమో ఈనాడును, రామోజీరావును చూసి చర్యలకు వెనకాడుతున్నారు. బకాయిలు రూ.77,31,252 జీవీఎంసీ 28వ వార్డులో రామోజీ గ్రూప్‌కు చెందిన డాల్ఫిన్ హోటల్‌కు మూడు డోర్ నంబర్ల పేరిట మూడు(17225, 17430, 17471) అసెస్మెంట్లున్నాయి. వీటికి 1996, 2012 ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా ఆస్తిపన్ను బకాయిలున్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాల బకాయిలు రెండేళ్ల కిందట చెల్లించినా.. అదీ అరకొరే. దీంతో వడ్డీ కూడా భారీగా పేరుకుపోయింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాటికి ఈ వార్డులో మొత్తం పన్ను బకాయిలు రూ.3.50 కోట్లుండగా.. ఇందులో ఒక్క డాల్ఫిన్ హోటల్ యాజమాన్యమే రూ.77 లక్షల 31 వేల 252 చెల్లించాల్సి ఉంది. దీనిపై జీవీఎంసీ ఎన్నిసార్లు నోటీసులిచ్చినా.. యాజమాన్యం నుంచి స్పందన అంతంతమాత్రమేనని అధికారులు చెప్తున్నారు. మిగిలిన వాణిజ్య సంస్థల బకాయిలపై తీసుకున్నంతగా కఠిన చర్యలు వీటిపై తీసుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వంత పాడటంతో తామేం చేయలేని పరిస్థితికి చేరుకున్నామని చెప్తున్నారు. నిబంధనల మేరకు ఏళ్ల తరబడి పన్ను బకాయిలున్నవారికి జీవీఎంసీ సేవల్ని నిలిపేయడంతో.. పాటు ఆర్ఆర్ చట్టం ప్రకారం ఆస్తుల వేలానికి కూడా వెళ్లొచ్చు. అయితే వీరిపై ఆ స్థాయి చర్యలకు సిద్ధపడే పరిస్థితి లేదు. వడ్డీ ఎక్కువే! మొత్తం బకాయిలు రూ.77,31,252లో వడ్డీ రూ.23,47,554 కాగా మిగిలింది ఎగవేసిన మొత్తం. ఎగవేసిన బకాయిలపై ప్రతి నెలా 2 శాతం చొప్పున వడ్డీ పెరిగేలా నిబంధనలుండటంతో మొత్తం బకాయి ఈ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వడ్డీ మినహాయింపునిస్తూ ఆస్తిపన్ను చెల్లింపునకు అవకాశం కల్పించినా.. యాజమాన్యం మాత్రం చెల్లించేందుకు మొండికేయడంతోనే.. ఈ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెప్తున్నారు. బకాయిల వివరాలు అసెస్మెంట్ నం. ఎప్పటి నుంచి బకాయి (రూ.ల్లో) 17225 2012 28,84,170 17430 2012 6,37,206 17471 1996 42,09,876 -
రామోజీపై డాల్ఫిన్ ఉద్యోగుల ఆగ్రహం
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, డాల్ఫిన్ హోటల్స్ యజమాని రామోజీరావుపై ఆ హోటల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 30 ఏళ్లయినా తమ జీతాలు ఏమాత్రం పెంచకపోగా, తమపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాపోయారు. కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో డాల్ఫిన్ హోటల్ వర్కర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల తర్వాత తామంతా 'ఆకలి కేకలు' పేరుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.