సాక్షి, విజయవాడ: అమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయనుంది.
కోర్టు నుంచి అనుమతులు రాగానే.. సీఐడీ తదుపరి ప్రక్రియ చేపట్టనుంది. ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను అంచనా వేసేందుకు సిద్ధమైంది సీఐడీ. తద్వారా ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను ప్రత్యక్షంగా లెక్కించనుంది.
ఇప్పటికే చంద్రబాబు కరకట్ట నివాసంతో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను ఎటాచ్ చేసింది ప్రభుత్వం. రెంటల్ అగ్రిమెంట్ లేకుండా కరకట్ట నివాసంలో ఉంటున్న చంద్రబాబు.. లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా కరకట్ట నివాసం తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: చంద్రబాబు క్విడ్ ప్రోకో.. అసలేం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment