Attachment of assets
-
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ ఉన్నారు. కుంభకోణంలో నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో వారి ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఏపీ, తెలంగాణలో టెరాసాఫ్ట్ కంపెనీ, తుమ్మల గోపీచంద్ తదితరుల పేరిట ఉన్న రూ.114 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను హోం శాఖ ఆమోదించింది. దాంతో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు న్యాయస్థానం అనుమతినివ్వడంతో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ సిద్ధమవుతోంది. చంద్రబాబు పన్నాగమే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి సీఎం చంద్రబాబు తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్‌నెట్ టెండర్లను కట్టబెట్టారు. మొత్తం రూ.3,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. మొదటి దశ కింద రూ.330 కోట్ల ప్రాజెక్టును టెండర్లలో ఎల్–1గా వచ్చిన బిడ్డర్‌ను కాదని మరీ టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టారు. అందుకోసం బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీని ఆ జాబితా నుంచి తొలగించి, టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించారు. ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీయే టెండర్లలో పాల్గొని, పనులు దక్కించుకుంది. ఇది పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధం. టెరాసాఫ్ట్ కంపెనీ పనులు కూడా నాసిరకంగా చేసి, రూ.144.53 కోట్లను దారి మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అటాచ్ చేయాలనినిర్ణయించిన ఆస్తులు ♦ ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చదరపు అడుగుల ఇంటి స్థలం. ♦ కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్. ♦ టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, ఆయన పేరిటే యూసఫ్‌గూడలో ఉన్న మరో ఫ్లాట్. ♦ తుమ్మల గోపీచంద్ భార్య పవన దేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి. -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
అమరావతి స్కాం.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయనుంది. కోర్టు నుంచి అనుమతులు రాగానే.. సీఐడీ తదుపరి ప్రక్రియ చేపట్టనుంది. ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను అంచనా వేసేందుకు సిద్ధమైంది సీఐడీ. తద్వారా ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను ప్రత్యక్షంగా లెక్కించనుంది. ఇప్పటికే చంద్రబాబు కరకట్ట నివాసంతో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను ఎటాచ్ చేసింది ప్రభుత్వం. రెంటల్ అగ్రిమెంట్ లేకుండా కరకట్ట నివాసంలో ఉంటున్న చంద్రబాబు.. లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా కరకట్ట నివాసం తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబు క్విడ్ ప్రోకో.. అసలేం జరిగిందంటే.. -
డీఎంకే మంత్రి అనిత’కు ఈడీ షాక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే హయాంలో చేసిన తప్పులు.. ప్రస్తుత డీఎంకే మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్‌ను వెంటాడుతున్నాయి. ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆస్తులను అటాచ్ చేస్తూ శనివారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనిత ఆర్ రాధాకృష్ణన్. అన్నాడీఎంకేలో కొన్నేళ్ల పాటూ ఆ జిల్లా కీలక నేతగా ఆయన చక్రం తిప్పారు. 2001 నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో పశుసంవర్థక, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరకు డీఎంకేలో చేరి ఓటమి ఎరుగని నేతగా తూత్తుకుడిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలోకి రావడంతో ఆయన మత్స్యశాఖ మంత్రి అయ్యారు. వెంటాడుతున్న ఈడీ.. 2001–2006 మధ్య కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను అనిత ఆర్ రాధాకృష్ణన్ గడించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఏడుగురిపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే, మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. అయితే దశాబ్దం కాలం ఎలాంటి పురోగతి లేకుండా ఉన్న ఈకేసు.. ఇటీవల మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు అక్రమ సంపాదనతో 160 ఎకరాల స్థలాన్ని ఆయన కొన్నట్లు తేల్చింది. అలాగే, మరో 18 చోట్ల కూడా స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఆ స్థలాలతో పాటుగా రూ. 6 కోట్ల మేరకు ఉన్న మరికొన్ని ఆస్తులను అటాచ్ చేస్తూ గతంలో ఈడీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ అనిత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే గత నెల మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు వైద్యనాథన్, జగదీశ్ చంద్ర నేతృత్వంలోని బెంచ్ ముందు స్టే ఎత్తి వేత కోసం ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అనిత తరపు న్యాయవాదులు తమ వాదనను కోర్టుకు వినిపించారు. అయితే, స్టేను ఎత్తి వేస్తున్నామని, ఈడీ విచారణకు ఆదేశిస్తున్నామని కోర్టు ప్రకటించడంతో అనితకు షాక్ తప్పలేదు. అస్సలే తూత్తుకుడి డీఎంకే రాజకీయాలు రచ్చకెక్కి ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు అనితను చిక్కుల్లో పడేశాయి.ఈ సమయంలో శనివారం ఈడీ మరో అడుగు ముందుకు వేసింది. ఆయనకు చెందిన రూ. 6.54 కోట్ల విలువైన 160 ఎకరాల స్థలం, మరో 18 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
షారూక్ ఖాన్ కేకేఆర్ జప్తు!
న్యూఢిల్లీ: రోజ్‌వ్యాలీ స్కామ్‌పై విచారణలో భాగంగా రూ.70 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రకటించింది. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (కేకేఆర్)తోపాటు మల్టిపుల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లు జప్తు అయిన ఆస్తుల్లో ఉన్నట్లు ఈడీ తెలిపింది. జప్తు అయిన మూడు ఆస్తుల తాలూకు ఖాతాల్లో దాదాపు 16.20 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, ఇందులో రూ.11.87 కోట్లు షారూక్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌దని వివరించారు. ఐపీఎల్ క్రికెట్ టీమ్ యాజమాన్య కంపెనీలో షారూక్‌ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్, సినీనటి జూహీ చావ్లా భర్త జై మెహతా సీఈవో వెంకటేష్ మైసూర్‌లతోపాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. కేసుకు సంబంధించి మైసూర్‌ను గత అక్టోబరులో ఈడీ ప్రశ్నించిన విషయం తెల్సిందే. -
ఆస్తులు చేతులు మారాక అటాచ్ చేస్తారా?
సర్కారు వైఖరిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులు చేతులు మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటాచ్మెంట్ ఆస్తులు ప్రకటించడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. అగ్రిగోల్డ్ అక్రమాలపై నెల్లూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యేంతవరకు చంద్రబాబు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారో చెప్పాలని డిమాండ్ చేసింది. సోమవారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పనలు మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుపట్టిన తర్వాత ప్రభుత్వం స్పందించిందని, అయితే చివరకు బాధితులకు మనోవేదనే మిగిల్చిందని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ విషయంలో హైకోర్టు సీఐడీని ఆక్షేపించిందని, బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం కలగడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ బినామీల పేరిట ఆస్తుల్ని బదలాయించిన తర్వాత ప్రభుత్వం అటాచ్మెంటు ఆస్తులు ప్రకటించడం దారుణమని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ 14 ఎకరాల విలువైన భూములు కొనుగోలు చేసిన తర్వాత, తిరుపతిలో రూ.14 కోట్ల అత్యంత విలువైన ఆస్తులు తమ పార్టీ నేతలు చేజిక్కించుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. భూ కుంభకోణాల్లో తన పేరే వెలుగులోకి వస్తోందని మంత్రి పుల్లారావు నిండు సభలో వాపోతున్నారని, అయితే భార్య దందాలు మార్మోగడమే ఇందుకు కారణమనే విషయాన్ని మంత్రి గుర్తెరగాలని అన్నారు. తమ అక్రమాలు ఎక్కడ వెలుగు చూస్తాయోనన్న భయంతోనే అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు ప్రభుత్వం భయపడుతోందని పిన్నెల్లి అన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి 155 కంపెనీలుంటే, కేవలం ముగ్గురిని అరెస్ట్ చేశారంటే ప్రభుత్వం నిందితులను కాపాడుతున్నట్లా? కాదా? అని ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు. సర్కారు రహస్య ఎజెండా: కోటంరెడ్డి అగ్రిగోల్డ్ అక్రమాలపై సభలో చర్చించేందుకు టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీకి అవకాశం ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ రహస్య ఎజెండా ఏమిటో అర్ధమవుతోందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ప్రభుత్వ పాత్ర ఎంతగా లేకపోతే మిత్రపక్షమైన బీజేపీ నోరు కూడా నొక్కేస్తుందని ప్రశ్నించారు.