
న్యూఢిల్లీ: గత టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ. 371 కోట్లను మళ్లించినట్లు ఏపీ సీఐడీ మరోసారి స్పష్టం చేసింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది.
ఆనాటి ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందని, పక్కా ప్లానింగ్‌తోనే నిధులు మళ్లించినట్లు తేలిందని ఏపీ సీఐడీ పేర్కొంది. స్కిల్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని, ఆయన కనుసన్నల్లోనే స్కాం జరిగిందని తెలిపింది ఏపీ సీఐడీ. కాగా, ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment