Sep 25, 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Hearing On Chandrababu's Cases In Various Courts And Family Meeting Today, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Sep 25, 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Mon, Sep 25 2023 6:57 AM | Last Updated on Tue, Sep 26 2023 12:47 PM

Skill Development Case: Chandrababu Naidu Arrest Sep 25 Updates - Sakshi

CBN Case Live Updates

6:52PM,  సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబుకు సింపతీ డ్రామాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌
►రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు
►ఇది వాళ్లకు కొత్తేం కాదు
►డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ
►ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి.
 

5:50 PM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబు పనులకు అక్షింతలు వేసిన కాగ్‌
► అమరావతి రాజధాని ప్లాన్‌పై కాగ్ సంచలన నివేదిక
► CRDA వల్ల రాష్ట్రం పై భారీ ఆర్థిక భారం
► వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా CRDA వల్ల ఆర్థిక భారమే
► నిపుణుల కమిటీ సిఫార్సులను నాడు చంద్రబాబు సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు
► మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు
► సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ.28 కోట్లు ఇవ్వడం తప్పు
► నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారు

5:35 PM, సెప్టెంబర్‌ 25, 2023
అమవాస్య చీకటిలో తెలుగుదేశం : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌
► చంద్రబాబు అరెస్ట్‌తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది
► బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
► టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చేయాలి
► అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ కనీస గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు
► అచ్చెన్నాయుడు పనికిరాడనే పవన్‌ను తెచ్చుకున్నట్టున్నాడు
► చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయి
► అమావాస్య చీకటిలో టీడీపీ కూరుకుపోయింది

5:15 PM, సెప్టెంబర్‌ 25, 2023
లోకేష్‌కు అరెస్ట్‌ భయం లేదు
► లోకేష్‌ ఢిల్లీలో బిజీగా ఉన్నారు : అచ్చెన్నాయుడు
► సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్‌ మాట్లాడుతున్నారు
► నేషనల్‌ మీడియాకు చెప్పేందుకు లోకేష్‌ ఢిల్లీలో ఉన్నాడు
► లోకేష్‌కు అరెస్ట్‌ అంటే భయమేమీ లేదు
► నన్ను కూడా అరెస్ట్‌ చేసినా భయమేమీ లేదు
► నాకు కూడా కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు

5:00 PM, సెప్టెంబర్‌ 25, 2023
ములాఖత్‌ ముగిసింది
► చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్
► సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం
► బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం
► కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులు వివరించిన బృందం

4:00 PM, సెప్టెంబర్‌ 25, 2023
కేసులు ఇవి, స్టేటస్‌ ఇది
► జైల్లో చంద్రబాబుకు బ్రీఫింగ్‌ ఇవ్వనున్న కుటుంబ సభ్యులు
► రిమాండ్‌ తర్వాత చంద్రబాబును మూడోసారి కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి
► లోకేష్‌ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్‌ గురించి వివరించనున్న కుటుంబ సభ్యులు
► జనసేన నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు వివరించనున్న కుటుంబ సభ్యులు

3:50 PM, సెప్టెంబర్‌ 25, 2023
భువనేశ్వరీ వ్యాఖ్యలను తప్పుబట్టిన YSRCP
► చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిందే మీ నాన్న ఎన్టీఆర్‌
► మీ నాన్న స్వయంగా చెప్పినా.. ఇంకా చంద్రబాబుకే మద్ధతిస్తారా?

3:50 PM, సెప్టెంబర్‌ 25, 2023
రాజమండ్రి జైల్లో బాబుతో ములాఖత్‌కు అచ్చెన్నాయుడు
► చంద్రబాబును కలిసేందుకు జైలుకు వచ్చిన భువనేశ్వరీ, బ్రాహ్మణి
► బాబు కుటుంబ సభ్యులతో పాటు జైలుకు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి
► పార్టీ సీనియర్‌ నేతలతో వరుసగా బాబు మంత్రాంగం
► ఇటీవలే జైల్లో యనమలతో ములాఖత్‌ అయిన చంద్రబాబు
► అనుమతి లేకపోవడంతో జైలు బయటే ఆగిపోయిన ప్రత్తిపాటి

3:45 PM, సెప్టెంబర్‌ 25, 2023
ACB కోర్టులో బాబు పిటిషన్ల హోరు
► సాంకేతిక కారణాల కోసం బాబు లాయర్ల తాపత్రయం
► అరెస్ట్‌ సమయంలో CID అధికారుల కాల్‌ డాటా కావాలంటూ పిటిషన్‌
► తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్‌
► కాల్‌ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్‌ సమయంలోనూ లూథ్రా విజ్ఞప్తి
► కాల్‌ రికార్డుల కేసులో వాదనలు వినిపిస్తోన్న బాబు లాయర్లు

3:40 PM, సెప్టెంబర్‌ 25, 2023
ACB కోర్టులో విచారణ రేపటికి వాయిదా
► చంద్రబాబుకు సంబంధించి వరుస పిటిషన్లు
► కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్‌ పిటిషన్‌
► బెయిల్‌ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని పట్టుబట్టిన బాబు లాయర్లు
► ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని చెప్పిన కోర్టు
► అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడుతామన్న కోర్టు

3:30 PM, సెప్టెంబర్‌ 25, 2023
రూల్స్‌ ఏం చెబుతున్నాయి? కస్టడీనా? బెయిలా?
► CRPC ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటున్న లాయర్లు
► జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్న లాయర్లు
► కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటోన్న లాయర్లు
► కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందంటున్న లాయర్లు

3:15 PM. సెప్టెంబర్‌ 25, 2023
షెల్‌ కంపెనీలకు డైరెక్టర్లుగా తమ్ముళ్లే : CID
► బాబు సృష్టించిన షెల్‌ కంపెనీకి డైరెక్టర్లంతా బాబు అనుచరులే
► షెల్‌ కంపెనీ డైరెక్టర్లుగా సుమన్‌ బోస్‌, వికాస్‌ కన్విల్కర్‌
► షెల్‌ కంపెనీ ఖాతాల నుంచి బాబు చెప్పిన ఖాతాలకు డబ్బు రూటింగ్‌
► ఆధారాలు చూపించి ప్రశ్నలడిగినా బాబు నోరు మెదపట్లేదు
► విచారణలో ఏ రకంగా సహకరించడం లేదు
► చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, ఘంటా సుబ్బారావు, డా.లక్ష్మీనారాయణ పాత్రలపై ఆధారాలున్నాయి
► ఈ ఆధారాలను చూపించి కుట్ర కోణం అడిగితే.. చంద్రబాబు నోరు మెదపట్లేదు

2:45PM. సెప్టెంబర్‌ 25, 2023
ఖాతాల్లోకి వచ్చిన కోట్లు ఎక్కడివి?
► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం
► నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి CID దగ్గర పక్కా ఆధారాలు
► 2014-18 మధ్య స్కిల్‌ కుంభకోణం
► 2018 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కౌంట్లకు తరలివచ్చిన భారీగా నిధులు
► ఈ అక్కౌంట్లు అన్నింటికీ సంతకం హోదా ఉన్నది చంద్రబాబుకే
► పార్టీకి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హైదరాబాద్‌ జోన్‌ ఖాతాలో భారీగా డిపాజిట్లు
► వాటి లెక్క చెప్పేందుకు నిరాకరించిన చంద్రబాబు

1:30 PM, సెప్టెంబర్‌ 25, 2023
మహిళల్లో శక్తి ఉంది, దేన్నయినా నడిపించగలరు : భువనేశ్వరీ

► టిడిపి నాయకత్వంపై చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వరీ కీలక వ్యాఖ్యలు
► దేవుడు ఉన్నాడు, నన్ను ముందుకు నడిపించగలడు
► మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగా నడిపించగలరని నమ్ముతున్నాను
► మనలో దుర్గాదేవీ శక్తి ఉంది, ఝాన్సీ రాణీ  పట్టుదల ఉంది
► నాకు పెళ్లయిన కొత్తలో హెరిటేజ్‌ బాధ్యతలు అప్పగించారు
► కేవలం మూడు నెలల్లో సంస్థను నడిపించడం నేర్చుకున్నాను
► మహిళలు కుటుంబాన్నే కాదు, దేన్నయినా నడిపించగలరు

1:30 PM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్‌

► ఏపి హైకోర్టులో శనివారం దాఖలైన చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్‌
► చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన క్వాష్ పిటిషన్
► ఇప్పటికే కస్టడీ ముగిసినందున అర్హత కోల్పోయిన పిటిషన్‌
► నేడు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

1:30 PM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబు సామ్రాజ్యం విలువ ఎంత? : YSRCP

► జగ్గంపేటలో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించిన భువనేశ్వరీ
► మా కంపెనీలో మాకున్న వంద శాతం షేర్లలో 2% అమ్ముకుంటే రూ.400 కోట్లు
► భువనేశ్వరీ లెక్క ప్రకారం 1%=రూ.200 కోట్లు, 100%=రూ.20వేల కోట్లు
► ఈ లెక్కన కేవలం హెరిటేజ్‌లో చంద్రబాబు కుటుంబానికి ఉన్న షేర్ల విలువ రూ.20వేల కోట్లు.!
► ఇవీ కాక, మెట్రో నగరాల్లో, దేశ విదేశాల్లో వందలాది ఎకరాలు, వేల కోట్ల విలువ చేసే ఇతర ఆస్తుల విలువ ఎంత?
► హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో ఇంటి విలువ ఎంత? మదీనాగూడ 14 ఎకరాల ఫాంహౌజ్‌ విలువ ఎంత?
► ఎన్నికల సంఘం లెక్కల్లో ఎన్ని ఆస్తులు చూపించారు? ఎంత విలువ కట్టారు?

1:30 PM, సెప్టెంబర్‌ 25, 2023
రంగంలోకి భువనేశ్వరీ, బ్రాహ్మణి

► లోకేష్‌ ఇప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం లేదా.?
► గత పది రోజులుగా ఢిల్లీకే పరిమితమయిన లోకేష్‌
► లోకేష్‌ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ నేతృత్వంపై చర్చ
► గత కొద్ది రోజులుగా బ్రాహ్మణి రావాలని ఎల్లో మీడియా డిమాండ్‌
► బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమయిందంట సంపాదకీయాలు
► బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఎల్లో మీడియా ప్రత్యేక డిబేట్‌
► దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణి, భువనేశ్వరీ కార్యాచరణ ప్రణాళిక
► నిన్నంతా రాజకీయ సమావేశాలు నిర్వహించిన బ్రాహ్మణి
► పొత్తులో భాగంగా జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై బ్రాహ్మణి చర్చలు
► ఇవ్వాళ జగ్గంపేట ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరీ
► భవిష్యత్‌ పార్టీ పగ్గాల విషయంలో ఎల్లోమీడియా డైరెక్షన్‌లో టిడిపికి స్పష్టత ఇస్తోన్న బ్రాహ్మణి, భువనేశ్వరీ
► చంద్రబాబు ఔట్‌ సోర్సింగ్‌ రాజకీయాలు చేస్తున్నారని YSRCP విమర్శలు

1:25 PM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబు కస్టడి పొడిగించండి : CID పిటిషన్‌

► విజయవాడ ACB కోర్టులో సీఐడీ పిటిషన్
► సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించలేదు
► మొదటి రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించ లేదు
► అందుకే మరో 3 రోజులు కస్టడీ పొడిగించాలని కోరుతున్నాము
► కేసు ఇప్పుడు కీలక విచారణ దశలో ఉంది
► కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై మా వాదనలు వినాలి : CID
► పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మెమో ఫైల్ చేయాలని CIDకి జడ్జి ఆదేశం
► ముందు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినాలి : చంద్రబాబు లాయర్లు
► కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తవగానే బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామన్న కోర్టు

1:22 PM, సెప్టెంబర్‌ 25, 2023
మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే కోర్టు మీద నిందలేస్తారా?

రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివృద్ది  ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు
► కొందరు సొంత లబ్ది కోసం జర్నలిజానికి భ్రష్టు పట్టిస్తున్నారు
► కోర్టు మీద విమర్శలు చేసి జర్నలిజాన్ని చంపేశారు
► ఓ వర్గం మీడియా సమాంతర వ్యవస్థను నడుపుతోంది, అన్నీ తాను చెప్పినట్టుగా జరగాలంటోంది
► న్యాయ వ్యవస్థను కొన్ని ఛానెల్స్ కించపరుస్తున్నాయి

1:18 PM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబు స్థాయి ఏంటో తెలుసా? : భువనేశ్వరీ

► మా కుటుంబానికి వ్యాపారాలున్నాయి
► నేను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నా
► నా సంస్థలో 2శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి
► ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారు
► ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఏటా రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాం

1:18 PM, సెప్టెంబర్‌ 25, 2023
ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? : అంబటి

► చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని అనుకుంటున్నవారికి ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి
► ఈ కేసులో సమగ్ర ఆధారాలు బయటపడుతుండడంతో ప్రజలకు అన్నీ అర్థం అవుతున్నాయి
► గతంలోలా సమాజమంతా ఎల్లో మీడియా మీద ఆధారపడనవసరం లేదు
► ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రతీ విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు
► ఒకాయిన ఢిల్లీలో ఉన్నాడు, మద్దతు ఇచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు
► స్కాముల రూపంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం జరిగింది

12:55 PM, సెప్టెంబర్‌ 25, 2023
ఇది చట్టం చేస్తున్న పని, దీనికి రాజకీయాలతో సంబంధమేంటీ?

► చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన సినీ నటుడు సుమన్‌
► మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సుమన్‌
► జైల్‌కు వెళ్లాడంటే సీఎం జగన్ చేశారంటున్నారు కానీ అది సరికాదు
► ఒకరు జైలుకు వెళ్లారంటే దాని వెనక చాలా కారణాలుండొచ్చు
► ఆ అరెస్ట్‌ గురించి నిర్ణయించే బాధ్యత కోర్టులపై ఉంటుంది
► మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అధికారులు అన్ని ఆలోచించే వుంటారు
► టైం బాగుంటే లోకల్ కోర్టులో కూడా అనుకూలంగా వస్తుంది
► టైం బాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి
► చంద్రబాబు బయటకు ఎప్పుడు వస్తాడో జ్యోతిష్యులు చెప్పగలరేమో.!

12:48 PM, సెప్టెంబర్‌ 25, 2023
మరిన్ని రోజులు కస్టడీ కోరిన సీఐడీ

►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
►బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లపై వాదనలు
►ముందు కస్టడీ పిటిషన్‌ వాదనలు వినాలని కోరిన సీఐడీ
►కస్టడీలో చంద్రబాబు సహకరించలేదంటున్న సీఐడీ
►కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను ఆదేశించిన జడ్జి
 

12:22 PM, సెప్టెంబర్‌ 25, 2023
దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు:  అంబటి
స్కిల్‌ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై మంత్రి అంబటి అసెంబ్లీలో మాట్లాడారు
►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు
►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది
►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది
►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు
►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు
►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం
►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు
► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు

12:00 PM, సెప్టెంబర్‌ 25, 2023
మరో 3 రోజులు కస్టడీ కావాలి : CID

► ACB కోర్టులో మరోసారి కస్టడీ పిటీషన్ దాఖలు చేసిన CID
► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని తెలిపిన CID
► మరో మూడు రోజులు విచారణ జరుపుతామని విజ్ఞప్తి

11:45AM, సెప్టెంబర్‌ 25, 2023
తాజా పరిణామాలపై పక్కాగా ప్రిపేరయిన CID
► ఈ కేసులో కీలకమయిన వ్యక్తులు దేశం విడిచి పారిపోతున్నారు
►శ్రీనివాస్‌, మనోజ్‌ వాసుదేవ్‌ పరారీలో ఉన్నారు
►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది.
►ఈ ఇద్దరూ షెల్‌ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు 
►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ మాట్లాడుతున్నారు
►పీవీ రమేష్‌ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది
►చంద్రబాబు బెయిల్‌ విషయంలో పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతోన్న CID

11:32AM, సెప్టెంబర్‌ 25, 2023
ACB కోర్టులో మధ్యాహ్నం తర్వాత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

► మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంద్రబాబు బెయిల్ పిటీషన్లు, పిటి వారెంట్లపై విచారణ
► బెయిల్‌పై ఇరుపక్షాల వాదనలు వింటామన్న ACB కోర్టు
► ACB కోర్టుకి చేరుకున్న కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ ఆధ్వర్యంలోని సిట్ బృందం

11:30AM, సెప్టెంబర్‌ 25, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు SLP

► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
► 284 పేజీలతో SLP దాఖలు చేసిన బాబు లాయర్ల బృందం
► చంద్రబాబుకు తక్షణం ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తి
► ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం

11:25AM, సెప్టెంబర్‌ 25, 2023
అరెస్ట్‌పై చర్చించేందుకు అసెంబ్లీకి రారా?

► చర్చిస్తామని చెప్పిన టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు బాయ్‌కాట్‌ చేశారు? : YSRCP
► ఈ కేసుపై సమగ్రంగా చర్చిద్దాం, రండి సభకు వచ్చి మాట్లాడండి : YSRCP

11:15AM, సెప్టెంబర్‌ 25, 2023
హైకోర్టులో తెలుగుదేశం వరుస పిటిషన్లు

► క్వాష్‌ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం నేతలు
► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు
► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు
► ఈ FIRను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న
► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో FIRను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్
► ఇప్పటికే చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

11:00AM, సెప్టెంబర్‌ 25, 2023
ఏసీబీ కోర్టులో చంద్రబాబు వరుస పిటిషన్లు

► పిటిషన్లతో కోర్టును ఇరకాటంలో పెడుతోన్న చంద్రబాబు లాయర్లు
► సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు
► ప్రతీ పిటిషన్‌ అర్జంటుగా స్వీకరించి వాదనలు వినాలంటూ విజ్ఞప్తులు
► సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్‌ దూబే
► పిటిషన్‌ ఎప్పుడు విచారించాలన్నది కోర్టు చూసుకుంటుందన్న న్యాయమూర్తి

10:55AM, సెప్టెంబర్‌ 25, 2023
సుప్రీం ముందుకు రేపు చంద్రబాబు పిటిషన్‌

► రేపు విచారణ తేదీని ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు
► త్వరంగా తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను విజ్ఞప్తి చేసిన లూథ్రా
► చంద్రబాబును ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని అడిగిన సీజే
► ఈ నెల 8న అరెస్ట్ చేశారన్న లుత్రా
► కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన సీనియర్ న్యాయవాది లూథ్రా
► సరే, ఇప్పుడెందుకు అన్ని వివరాలు రేపే మెన్షన్ చేయమన్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌
► పిటిషన్‌ను రేపు మెన్షన్‌ లిస్టులో చేరుస్తామని చెప్పిన చీఫ్‌ జస్టిస్‌

10:45AM, సెప్టెంబర్‌ 25, 2023
మధ్యాహ్నం తర్వాత ములాఖత్‌లు

► రాజమండ్రి : మధ్యాహ్నం తర్వాత సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు ములాఖత్‌
► చంద్రబాబును కలవనునున్న భువనేశ్వరీ, బ్రహ్మణి, టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
► మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న నారా భువనేశ్వరి
► అన్నవరం సత్యన్నారాయణ స్వామి వారి దర్శనం చేసుకోనున్న భువేనేశ్వరి
► అక్కడినుంచి జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లనున్న భువనేశ్వరి
► మధ్యాహ్నం తర్వాత రాజమండ్రికి వచ్చి ములాఖత్‌లో చంద్రబాబును కలవాలని ప్రోగ్రామ్‌

10:35AM, సెప్టెంబర్‌ 25, 2023
బాబు పిటిషన్లకు వెకేషన్‌ ఎఫెక్ట్‌

► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు
► సెప్టెంబర్‌ 28న మిలాదున్‌ నబీ వల్ల సెలవు
► సెప్టెంబర్‌ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు
► సెప్టెంబర్‌ 30న శని, అక్టోబర్‌ 1న ఆదివారం
► అక్టోబర్‌ 2న గాంధీ జయంతి వల్ల సెలవు
► ఇవ్వాళ బెంచ్‌ కేటాయిస్తేనే 28లోపు వాదనలు జరిగే అవకాశం
► ఇదే విషయాన్ని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించాలని సిద్ధార్ధ్ లూథ్రా నిర్ణయం
► తన పిటిషన్‌పై వెంటనే పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలని కోరనున్న సిద్ధార్ధ్ లూథ్రా

10:30AM, సెప్టెంబర్‌ 25, 2023
హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు

► ఇవాళ హైకోర్టు ముందుకు మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు
► అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ పిటిషన్
► తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ నారాయణ పిటిషన్
► నాలుగు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ

10:26AM, సెప్టెంబర్‌ 25, 2023
సుప్రీంకోర్టులో స్టేటస్‌ ఏంటీ?

► సుప్రీంకోర్టుకు మరోసారి నేడు చంద్రబాబు లాయర్లు
► చంద్రబాబు పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరనున్న న్యాయవాదులు
► ఈ నెల 23న (శనివారం) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
► చంద్రబాబు పిటిషన్‌ను ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ
► ఇవ్వాళ ఏ బెంచ్‌ అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం
► రేపు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని బాబు లాయర్ల విజ్ఞప్తి

10:16AM, సెప్టెంబర్‌ 25, 2023
ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు

►స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు ముఖ్యమైన అంశాలు
►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ
►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న సీనియర్‌ లాయర్‌ ప్రమోద్‌ దూబే
►చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న CID
►ఇంకోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారించాలని కూడా కోరిన సీఐడీ

09:48AM, సెప్టెంబర్‌ 25, 2023
ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే

►తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు?
►అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు
►ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే
:::ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

09:25AM, సెప్టెంబర్‌ 25, 2023
అవినీతి బయటపడుతుందనే.. అసెంబ్లీ బాయ్‌కాట్‌

►స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు.
►చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు.
►వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే

09:20AM, సెప్టెంబర్‌ 25, 2023
ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
►రాజమండ్రి: మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

08:59AM, సెప్టెంబర్‌ 25, 2023
సుప్రీంలో పెండింగ్ కేసుగా  కనిపిస్తున్న  బాబు పిటిషన్
►చంద్రబాబు పిటిషన్ ను త్వరగా విచారించాలని  సుప్రీంకోర్టును కోరేందుకు బాబు తరపు న్యాయవాదుల ప్రయత్నాలు
►ఓరల్  మెన్షన్ జాబితాలో కనిపించని బాబు కేసు
►ఈనెల 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు
►బాబు పిటీషన్ ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ
►పెండింగ్ కేసు గా  కనిపిస్తున్న  బాబు పిటిషన్
►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన
►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని  పిటిషన్ లో వినతి
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన 
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి

08:40AM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబుకి బెయిల్‌ ఇవ్వొద్దు: సీఐడీ

►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు
►మరో మూడు రోజులపాటు చంద్రబాబు కస్టడీ పొడిగించాలని.. ఏసీబీ కోర్టును సీఐడీ కోరే అవకాశం
►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారంటున్న సీఐడీ
►ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సీఐడీ
►మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు
►బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసిన సీఐడీ
►స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. బెయిల్‌ ఇవ్వొద్దని కౌంటర్‌లో పేర్కొన్న సీఐడీ

08:03AM, సెప్టెంబర్‌ 25, 2023
నేడు వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసులపై విచారణ

►ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాంలో సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
►ఫైబర్‌ గ్రిడ్‌ స్కాంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌
►సుప్రీం కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు
►హైకోర్టు క్వాష్‌ పిటిషన​ కొట్టివేతపై సుప్రీం కోర్టులో సవాల్‌

07:16AM, సెప్టెంబర్‌ 25, 2023
స్కిల్‌ కేసుల్లో కస్టడీ పిటిషన్‌ ఛాన్స్‌
►చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసే ఛాన్స్‌
► రెండు రోజుల విచారణలో కాలయాపన చేసినట్లు చెబుతున్న సీఐడీ వర్గాల/
► ఇంతకు ముందు ఐదు రోజులు కోరితే.. 2 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు
► శని, ఆదివారాల్లో మొత్తం కలిపి 12 గంటలపాటు  ఇంటరాగేష్‌ చేసిన సీఐడీ బృందం
►కీలక డాక్యుమెంట్లు ముందు ఉంచి ప్రశ్నించినా.. దాటవేత ప్రదర్శించిన చంద్రబాబు
► మరో మూడు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్‌ వేసే అవకాశాలు

06:52AM, సెప్టెంబర్‌ 25, 2023
చంద్రబాబుతో నేడు కుటుంబ సభ్యుల ములాఖత్‌!

►16వ రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు రిమాండ్‌
►నేడు కుటుంబ సభ్యులు ములాఖత్‌ అయ్యే అవకాశం
►ఉదయం ఎనిమిది గంటలకు ములాఖత్‌ కోసం జైళ్ల శాఖను అనుమతి కోరనున్న నారా భువనేశ్వరి

06:48AM, సెప్టెంబర్‌ 25, 2023
రిమాండ్‌ పొడిగింపుతో మరికొన్ని రోజులు జైల్లోనే చంద్రబాబు
►స్కిల్‌ స్కామ్‌ కేసులో రిమాండ్‌ పొడిగింపుతో అక్టోబర్‌ 5వ తేదీ దాకా రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు
►ఆదివారంతో ముగిసిన సీఐడీ కస్టడీ
►ఆదివారంతోనే ముగిసిన రిమాండ్‌ కూడా
►కస్టడీ ముగిశాక వర్చువల్‌గా  ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపర్చిన అధికారులు
►కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడే అంతా అయిపోలేదని చంద్రబాబుతో వ్యాఖ్యానించిన జడ్జి
► బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ చేపడతామని వ్యాఖ్య
►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి
► వరుస పిటిషన్ల నేపథ్యంతో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement