Central prison
-
పవిత్రా గౌడకు అనారోగ్యం
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో జైలుపాలైన నటి పవిత్రా గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోనే ఆసుపత్రి వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తరువాత ఆమె కోలుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌తో పాటు 17 మంది నిందితులు పరప్పన జైలులో ఉన్నారు. జూన్ 11వ తేదీన నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండువారాల పాటు తీవ్రంగా విచారించి, తరువాత జైలుకు పంపారు. మరోవైపు దర్శన్ కూడా జైలులో ఆహారం సరిపడక ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. సరిగా నిద్రపోవడం లేదని, నిరంతరం చింతిస్తున్నాడని సమాచారం. ఫలితంగా బాగా బరువు కూడా తగ్గిపోయాడు. -
Oct 21st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై 9వరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం బీ పీ 130/80 పల్స్..71/మినిట్ రెస్పిరేటరీ రేటు...13/మినిట్ ఎస్ పీ ఓటు...97శాతం ఫిజికల్ యాక్టివిటీ... గుడ్ లంగ్స్... క్లియర్ ఆర్ బీ ఎస్..138 mg/dl 7:00 PM, అక్టోబర్ 21, 2023 ఇంతకీ.. చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడిందెవరు? ► తెలుగుదేశం మీటింగ్ లో లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎల్లో మీడియా ► నా తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు తెలియదు : లోకేష్ ► గవర్నర్‌ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు : లోకేష్ ► ఇప్పుడు నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ విమర్శిస్తున్నారు : లోకేష్ ► నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని చెబుతున్నారు : లోకేష్ ► మరీ జైల్లో క్షేమంగా ఉన్న చంద్రబాబుపై సానుభూతి కోసం మీరేం ప్రచారం చేశారు? ► జైల్లో కేజీ బరువు పెరిగినా.. కొంపలు మునిగిపోతున్నాయంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించింది ఎవరు? ► మా నాన్నకు స్టెరాయిడ్లు ఇస్తున్నారు.. ఆయన ఆరోగ్యం ఏమై పోవాలి అంటూ దొంగ ఏడ్పులు ఏడ్చింది ఎవరు? ► మా భర్త చంద్రబాబు కిడ్నీలకు ప్రమాదం ఉందని ప్రకటనలు చేసిన భువనేశ్వరీకి డైరెక్షన్ ఎక్కడిది? ► దోమలు, చన్నీళ్లు, ఏసీలు అంటూ లేనివన్ని ఎందుకు అంటగట్టారు? ► ఎప్పటినుంచో ఉన్న స్కిన్ ఎలర్జీని హఠాత్తుగా తెరపైకి ఎందుకు తెచ్చారు? ► ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు అచ్చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందనుకున్నారా? ► మీరు ప్రారంభించిన విష క్రీడ మీ వరకు వచ్చేసరికి మీకు బాధ కలిగిందా? ► ఇంకెన్నాళ్లు జనాల ముందు అసత్యాలు, అబద్దాలు వల్లె వేస్తారు? 6:50 PM, అక్టోబర్ 21, 2023 అయ్యా.. మీరు పాటిస్తున్న సిద్ధాంతమేంటీ? చెబుతున్న నీతులేంటీ? ► పబ్లిక్ మీటింగ్‌ల్లో దిగజారి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ ► ఇటీవల జనసేన మీటింగ్‌లో చెప్పులు చూపించిన పవన్ కళ్యాణ్ ► తీవ్ర విమర్శలు రావడంతో కొత్త సిద్ధాంతం వల్లె వేస్తోన్న పవన్ ► అధికార ప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాలి : పవన్ ► కులాలు, మతాల గురించి పరిమితులకు లోబడి మాట్లాడాలి : పవన్ ► రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి కానీ నోరు జారొద్దు : పవన్ ► అధికార ప్రతినిధుల కోసం వచ్చే నెలలో వర్క్ షాప్ ఏర్పాటు: పవన్ కల్యాణ్ 6:35 PM, అక్టోబర్ 21, 2023 ఓటుకు కోట్లు దొంగలు వాళ్లు ► తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ► కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు ► ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగ మాటలు చెబుతున్నారు ► బిజెపితో పోరాటం మా DNAలో ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు. మరి రేవంత్ రెడ్డి DNAలో ఏముంది? ► రేవంత్ DNAలో టిడిపి ఉందా? కాంగ్రెస్ ఉందా? ► రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి DNA మ్యాచ్ కావడం లేదు ► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి 6:14 PM, అక్టోబర్ 21, 2023 ఇంతకీ తెలంగాణలో టిడిపికి ఎంత సీను? ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 5:44 PM, అక్టోబర్ 21, 2023 మన పొత్తు ఎవరితో? జనసేనలో అనుమానాలు ► జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ ► హాజరైన 21 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు ► అసలు జనసేన పార్టీ ఎవరితో పొత్తు అని పార్టీలో ప్రశ్నలు ► అధికారికంగా బీజేపీతో కొనసాగుతున్న ఒప్పందం ► రాజమండ్రి జైలు ముందు టిడిపితో పొత్తు అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఇంతకీ జనసేన పొత్తు బీజేపీతోనా? టిడిపితోనా? ► ఒక వేళ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు మిగిలే సీట్లు ఎన్ని? ► అసలు జనసేన తరపున ఖర్చు పెట్టుకోవాలా లేదా అన్నదానిపై అభ్యర్థుల్లో సందేహాలు 5:20 PM, అక్టోబర్ 21, 2023 తెలంగాణలో బీజేపీతో, ఏపీలో సైకిల్ తో ► హైదరాబాద్ : బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన ► జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీలో దాదాపుగా స్పష్టత ► కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లందు, మధిర ► కొత్తగూడెం, అశ్వరావుపేట, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, కోదాడ కేటాయించే ఛాన్స్ ► ముందు 36 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ► 36 కాస్తా 12కు వస్తాయా అన్న అనుమానాలు ► పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టలేదని పార్టీలో ప్రశ్న 5:05 PM, అక్టోబర్ 21, 2023 రాజమండ్రికి బ్రేక్ ►రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు భువనేశ్వరి, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ ►ములాఖత్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు ►నాలుగు రోజుల్లో చంద్రగిరికి వస్తానని చెప్పిన భువనేశ్వరీ 4:45 PM, అక్టోబర్ 21, 2023 ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ? ► నవంబర్ 1 నుంచి లోకేష్ ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ ► ఎవరూ పట్టించుకోకపోవడంతో గద్గద స్వరంతో లోకేష్ స్పీచ్‌లు ► నిన్నటిదాకా పీxxx అన్న లోకేష్ ఇప్పుడు సానుభూతి కోసం గేమ్‌లు ► ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకు బస్సు యాత్రలు చేస్తున్నావు? ► ముందు నువ్వు ఎమ్మెల్యే కావడానికి గ్యారంటీ ఉందా? ► మీ పార్టీ పొత్తుల్లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తుందన్న గ్యారంటీ ఉందా? ► ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించే మ్యానిఫెస్టో మాయం చేయబోరన్న దానికి గ్యారంటీ ఉందా? ► ఇచ్చిన ఏ హామీలోనైనా నిలబడడానికి గ్యారంటీ ఉందా? ► హెరిటేజ్ కోసం ప్రభుత్వ డెయిరీలు మూసివేయబోమన్నదానికి గ్యారంటీ ఉందా? ► అసలు ప్రజల ముందుకెళ్లి నాకు ఇందుకోసం ఓటు వేయండని చెప్పే గ్యారంటీ ఉందా? ► ఏం ఉద్ధరించారని ఓటేయాలని మిమ్మల్ని అడిగితే పారిపోకుండా ఉంటారని గ్యారంటీ ఉందా? ► బయటపడ్డ అన్ని స్కాంల్లో తప్పు చేయలేదని కోర్టు ముందు చెప్పుకోలేని మీ తీరుకు ఏం గ్యారంటీ? ► మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను పట్టుకుంటారా అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పవని గ్యారంటీ ఏంటీ? ► మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించి బేరాలు సాగించబోరన్నదానికి గ్యారంటీ ఉందా? 4:20 PM, అక్టోబర్ 21, 2023 రంగంలోకి భువనేశ్వరీ.. నిజంగా నిజమే చెబుతారా? ► చంద్రగిరి నుంచి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి ► మహిళల్లో సానుభూతి కోసం భువనేశ్వరీని రంగంలోకి దించిన బాబు ► నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 3:35PM, అక్టోబర్ 21, 2023 టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్ లేదు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తా అని.లోకేష్ అన్నాడు ►వాళ్ళ నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు ►పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు ►యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు ►ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్ లేదని తేలిపోయింది 2:30PM, అక్టోబర్ 21, 2023 చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►అవినీతి చేయడంలో చంద్రబాబు కాకలు తీరిన యోధుడు ► చంద్రబాబు రాష్ట్రాన్ని లూఠీ చేశారు.. అవినీతిని విశృంఖలం చేశారు ►చంద్రబాబు,లోకేష్ తోడు దొంగలు ►బాబు అవినీతి సామ్రాజ్యం...అక్రమాస్తుల మీద సీబీఐ విచారణ కోరే సత్తా ఉందా? ►బాబును అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడ తెస్తే ఒక్కడూ కూడా వెంట రాలేదు ►చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు ►చంద్రబాబు ఏనాడైనా ఎవరికైనా అండగా నిలిచారా? ►మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టే ఎవ్వరూ మీకు మద్దతివ్వడం లేదు ►ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? ►చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు ►పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు ►చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు ►చంద్రబాబు అందరివాడు కాదు ►మా వాడు అని ఆయన సామాజికవర్గం వారు చెప్పుకుంటున్నారు ►పెత్తందార్ల పక్షాన నిలబడి పేదలను విస్మరించినందునే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు ►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది ►పెత్తందారుల పక్షాన పవన్ పాలేరులా మారాడు ►ఇంగ్లిష్ మీడియంపై పవన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు ►సీఎం జగన్ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు 1:00 PM, అక్టోబర్ 21, 2023 చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ ►ములాఖత్‌లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు ►చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, రామకృష్ణ అక్టోబర్ 21, 2023, 11:57 AM న్యాయవ్యవస్థకు ఓ తలనొప్పిగా చంద్రబాబు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి సూటి ప్రశ్నలు ►న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతున్నారు ►పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నారు ►మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం ►ఇవన్నీ వింతే కదా? ►ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు ►వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి ►ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం ►పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు ►న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది ►మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు? ►వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా? అక్టోబర్ 21, 2023, 11:50 AM అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ అక్టోబర్ 21, 2023, 10:58 AM అసాంఘిక శక్తులకు గుణపాఠం నేర్పాలి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ వ్యాఖ్యలు ►నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. ►తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ►ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. ►అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. అంతేకాకుండా తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. - సీఎం వైయస్ జగన్… pic.twitter.com/OSizn9ZZR3 — YSR Congress Party (@YSRCParty) October 21, 2023 అక్టోబర్ 21, 2023, 10:40 AM టీడీపీ దృష్టిలో పవన్ వాడిపడేసే వస్తువు మంత్రి చెల్లుబోయిన వేణు కామెంట్స్ ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ►రాజకీయ విలువలకు పవన్ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ►తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం? ►పవన్‌ను టీడీపీ ఒక టూల్‌గా టీడీపీ వాడుకుంటోంది ►కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం ►ముద్రగడను చంద్రబాబు తీవ్రక్షోభకు గురి చేశారు ►మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే చంద్రబాబు ప్రయత్నం ►చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి ►చంద్రబాబు శకం ముగిసింది ►చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నారు ►దేశంలోని చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో బాబు ఉన్నారు ►18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకి నేడు బెయిల్ రావడం లేదు అక్టోబర్ 21, 2023, 08:35 AM ముందు స్కిల్.. ఆ తర్వాతే ఫైబర్‌నెట్ ►ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణంలో క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం ముందుకే.. ఫైబర్‌నెట్ పిటిషన్ కూడా ►ముందు స్కిల్ స్కామ్ పిటిషన్ తీర్పు వెల్లడిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ నవంబర్ 9కి వాయిదా అక్టోబర్ 21, 2023, 07:56 AM రాజమండ్రిలో పవన్-లోకేష్ భేటీ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►చంద్రబాబుతో ఇవాళ మరోసారి ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు ►ప్రజా స్పందన లేకపోవడంతో నిలచిపోయిన టిడిపి దీక్షలు ►జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం సిద్ధమవుతున్న టీడీపీ ►ఈనెల 23న రాజమండ్రిలో పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ అక్టోబర్ 21, 2023, 07:24 AM మనసంతా బాబే ► తెలంగాణ ప్రచారంలో బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబేనంటున్న నెటిజన్లు ► తన గురువు చంద్రబాబు జైల్లో ఉండడంతో ప్రచారంలో నీరసంగా కనిపిస్తోన్న రేవంత్ ► కీలక సమయంలో తనకు గురువు నుంచి సూచనలు లేకపోవడంతో బాధలో రేవంత్ అక్టోబర్ 21, 2023, 07:20 AM నేడు తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశం ► ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యలయంలో ఎన్టీఆర్ భవన్లో సమావేశం ► చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రజలకు ఏం చెప్పాలన్నదానిపై చర్చ ► జనసేన, తెలుగుదేశం సమన్వయం ఎలాగన్నదానిపై చర్చ ► భువనేశ్వరీ కార్యక్రమం నిజం గెలవాలి కార్యక్రమంపై వివరించనున్న లోకేష్ ► యువగళం ఎందుకు నిలిపివేశామన్న దానిపై పార్టీ నేతలకు వివరించనున్న లోకేష్ ► బాబు ష్యూరిటీ యాత్రను బస్సులో తానే నిర్వహిస్తానంటున్న లోకేష్ ► పాదయాత్ర చేసేకంటే బస్సులో యాత్ర బెటరన్న ఆలోచనలో లోకేష్ అక్టోబర్ 21, 2023, 07:18 AM నేడు బాబుతో ములాఖత్ ► నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యులు, ముఖ్యనేతల ములాఖత్ ► మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ► చంద్రబాబుతో ములాఖత్ కానున్న నారా లోకేష్, భువనేశ్వరి, టీడీపీ నేతలు అక్టోబర్ 21, 2023, 07:08 AM స్కిల్ కేసులో చంద్రబాబు ►చంద్రబాబు నాయుడిపై స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ►స్కిల్ స్కామ్‌లో కింది కోర్టుల్లో దక్కని ఊరట ►ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేత ► హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారంటూ.. 17ఏని వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపు లాయర్ల వాదన ► నేరం జరిగిన నాటికి 17ఏ సెక్షన్ లేదని.. కేసు కీలక దశలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సర్వోన్నత న్యాయస్థానానికి ఏపీ సీఐడీ విజ్ఞప్తి ►వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ►నవంబర్ 8న తీర్పు అక్టోబర్ 21, 2023, 07:05 AM చంద్రబాబు రిమాండ్ @42 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 42వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. ఐదోసారి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్‌పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్‌తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్‌పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్‌కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్‌లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్‌పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్‌కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్‌లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్‌కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌కు హైకోర్టు ఆదేశం ►లోకేష్‌పై మూడు కేసులు, రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ -
Oct 3, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Court Hearings Ground updates 6:45 PM, అక్టోబర్ 03, 2023 మాట్లాడే ప్రతీ మాటకు సాక్షాలుంటాయా? : బండారు ఎదురుదాడి ► స్పెషల్ మొబైల్ కోర్టులో బండారు సత్యనారాయణమూర్తిని హాజరు పరిచిన పోలీసులు ► విచారణలో బండారు సహకరించడం లేదు : న్యాయమూర్తికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ► ఎన్నో మాట్లాడతాం, మాట్లాడే ప్రతీదానికి సాక్ష్యాలు ఉంటాయా ? బండారు ఎదురు ప్రశ్నలు ► పోలీసుల విచారణలో బండారు తీరును న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ► ఇరువైపుల వాదనలు విన్న తరువాత ఆదేశాలు ఇవ్వనున్న న్యాయమూర్తి 6:35 PM, అక్టోబర్ 03, 2023 నోరు జారి.. పరువు తీసుకుని.. ఇప్పుడు కోర్టు మెట్లెక్కి.! ► హైకోర్టును ఆశ్రయించిన బండారు సత్యనారాయణ లాయర్ ► బండారు సత్యనారాయణ అరెస్ట్‌ను ప్రశ్నిస్తూ పిటిషన్ ► రెండు కేసుల్లో 41A నోటీసులు ఇచ్చారన్న న్యాయవాది ► కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ► పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు ఆదేశం ► విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు 6:15 PM, అక్టోబర్ 03, 2023 అది టిడిపి కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ : మంత్రి రోజా తిరుపతి : మీడియా సమావేశంలో కన్నీళ్ళ పర్యవంతమైన మంత్రి రోజా ► దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు ► మాజీ మంత్రి బండారు చేసిన వాఖ్యలు వింటే రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు ► టిడిపి లో ఉన్న మహిళలు మాత్రం బండారు వాఖ్యలు స్వాగతిస్తున్నారు ► మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరయినా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? ► మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు.. టిడిపి పార్టీ పెట్టిందే ఎన్టీఆర్, ఆయన సినిమా నుంచి రాలేదా? ► మంత్రి బండారు భార్యను అడుగుతున్నా.. ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు ► లోకేష్ ఇలాంటి వాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు, సిగ్గు చేటు ► మహిళ సాధికారతకు పాటుపడుతున్న..రాజకీయాల్లో 20 ఏళ్ళు గా ఉన్నా ► నేను రాజకీయంగా మంత్రి గా ఎదిగితే.. చూసి ఓర్వలేక వాఖ్యలు చేస్తున్నారు ► జయసుధ, జయప్రద, దివ్య వాణి ,శారదా, నేను... ► సినిమా రంగం నుంచి తెలుగుదేశంలో పనిచేశాం, ఆ పార్టీలో మమ్మల్ని అవమానించారు 6:10 PM, అక్టోబర్ 03, 2023 రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి మరో పిటిషన్ ► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ► ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ► కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ ► విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ► ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన ► కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ACB విఫలమైంది ► ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో తెలంగాణ ACB విఫలమైంది ► అందుకే ఈ కేసును CBIకి బదిలీ చేయాలని పిటిషన్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినతి 5:40 PM, అక్టోబర్ 03, 2023 ACB కోర్టులో రేపే కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► విజయవాడ : రేపు ACB కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ ► మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ పిటీషన్ వేసిన CID ► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదన్న సిఐడి ► పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా రేపు ఒకేసారి వాదనలు 5:20 PM, అక్టోబర్ 03, 2023 జైలు ముందు పవన్ పొత్తు ప్రకటిస్తే BJP స్పందించదు ► విజయవాడ : ముగిసిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ► సమావేశం అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు,దగ్గుబాటి పురంధేశ్వరి ► పవన్ చేసే ప్రతి కామెంట్‌పై స్పందించాల్సిన అవసరం లేదు ► పొత్తులపై పవన్ అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం ► పొత్తులు, పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తాం ► ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? ► ఈ అంశంపై జాతీయ నాయకత్వమే స్పష్టత ఇస్తుంది ► మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ : పురందేశ్వరీ 5:00 PM, అక్టోబర్ 03, 2023 బండారు సత్యనారాయణ @ హైకోర్టు ► బండారు సత్యనారాయణ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ► 41A నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ► కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వం ► తదుపరి విచారణ ఈనెల 5కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన మంత్రి రోజా ► ఇలాంటి నేతల వల్లే భవిష్యత్తు స్వప్నాలు నిర్ణయించుకోవడంలో బాలికలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వస్తుందన్న రోజా Four years ago..As a girl I was told it is a male dominated world and difficult to make a mark for a woman. I worked hard against entrenched misogynists. Though I lost one election, I fought back and I won as an MLA two consecutive times. Thanks to the pro women policies of… pic.twitter.com/FAULvrPpZt — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 4:50 PM, అక్టోబర్ 03, 2023 లోకేష్ @ ఫైబర్ గ్రిడ్ కేసు ► ఫైబర్ గ్రిడ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ► ఫైబర్ గ్రిడ్ కేసులో ప్రస్తుతానికి లోకేష్ నిందితుడు కాదు : అడ్వకేట్ జనరల్ ► లోకేష్‌ను నిందితుడిగా చేరిస్తే 41A నోటీసు ఇస్తాం ► 41A నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతాం ► అడ్వొకేట్ జనరల్ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని లోకేష్ పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 4:35 PM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► ఏపీ హైకోర్టు: ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు ► బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడు పిటిషన్ ► పూర్తయిన ఇరుపక్షాల వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు (చదవండి : ఇన్నర్ రింగ్ రోడ్డు మలుపుల వెనక కుంభకోణమేంటీ?) 4:15PM, అక్టోబర్ 03, 2023 GGHకు టిడిపి నేత బండారు సత్యనారాయణ ► గుంటూరు ప్రభుత్వాసుపత్రికి బండారు సత్యనారాయణ ► వైద్య పరీక్షల నిమిత్తం సత్యనారాయణను తీసుకువచ్చిన పోలీసులు ► ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట ► వైద్య పరీక్షల్లో బండారుకు హైబీపీ, సెలైన్ ఎక్కించిన వైద్యులు ► వైద్య పరీక్షల తర్వాత బండారును మొబైల్ కోర్టులో హాజరు పరిచే అవకాశం ► బండారు తరపున వాదనలు వినిపించనున్న దొడ్డాల కోటేశ్వర రావు, చుక్కపల్లి రమేష్, టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు హరిబాబు ► రోజా పై అనుచిత వ్యాఖ్యల పై బండారుపై కేసు నమోదు ► Cr.No.354/2023 U/s 153 (A), 354(A), 504, 505, 506, 509, 499 IPC, ► సెక్షన్ 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద బండారు పై కేసులు నమోదు 4:15PM, అక్టోబర్ 03, 2023 హెరిటేజ్ డాక్యుమెంట్లపై కోర్టుకు లోకేష్ ► CID ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో సవాల్ చేసిన నారా లోకేష్ ► లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని చెప్పిన న్యాయవాదులు ► కంపెనీ తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు లోకేష్ ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని చెప్పిన న్యాయవాదులు ► లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదు : సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ► తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమన్న సీఐడీ తరపు న్యాయవాదులు ► రేపు లోకేష్ విచారణకు హాజరు కావాలని కోరిన సీఐడీ తరపు న్యాయవాదులు ► ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10న విచారణకు లోకేష్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు 4:05PM, అక్టోబర్ 03, 2023 హైకోర్టు : విచారణకు లోకేష్ హాజరు కావాల్సిందే ►ఫైబర్ గ్రిడ్ స్కాం : ఏపీ హైకోర్టులో లోకేష్‌కు దక్కని ఊరట ►ఫైబర్‌గ్రిడ్ స్కామ్‌లో లోకేష్ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు ►అడ్వొకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ►41A సీఆర్పీసీ నిబంధలను పాటిస్తామన్న ఏజీ 4:00PM, అక్టోబర్ 03, 2023 హైకోర్టు : రింగ్ రోడ్డు కేసులో వాదనలు ►ఇన్నర్ రింగ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్ధ్ లూద్రా 3:15 PM, అక్టోబర్ 03, 2023 రెచ్చగొడుతున్నాడా? రెచ్చిపోవాలంటున్నాడా? ► కృష్ణా జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివాదస్పద ప్రకటనలు ► రేపు పెడన వారాహి యాత్ర సభలో నాపై రాళ్లదాడి చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది ► నాపై దాడికి రెండు నుంచి మూడు వేల మంది వస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది ► ఎవరు ఏం చేసినా జనసైనికులు ఎదురుదాడికి దిగొద్దు ► ఎవరైనా జేబులోంచి ఏమైనా తీస్తే వారిని కట్టేసి పోలీసు స్టేషన్ కు పట్టుకెళ్దాం 3:10 PM, అక్టోబర్ 03, 2023 విజయవాడ BJP కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ ► ఏపీ బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఏపి బీజీపీ కోర్ కమిటీ సమావేశం ► సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు పురంధరేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, ► ఎంపీ GVL నరసింహారావు, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, సోము వీర్రాజు ► ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చ ► టీడీపీతో పొత్తులపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ 3:00 PM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు శిష్యుడు రేవంత్‌కు సుప్రీంకోర్టులో షాక్ ► ఓటుకు కోట్లు సరే, కానీ అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదు : రేవంత్ పిటిషన్ ► రేవంత్ రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం ► రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► గతంలో రేవంత్ పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు ► హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి ► కచ్చితంగా అది అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 2:50 PM, అక్టోబర్ 03, 2023 అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌ను ఆదేశించిన హైకోర్టు ► ఈనెల 10, మంగళవారం రోజున నారా లోకేష్‌ను విచారించనున్న CID ► ఈ మేరకు సీఐడీకి ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు ► 41ఏ నోటీసులోని నిబంధనలను సవాల్ చేసిన లోకేష్ ► ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ► ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విచారించాలని ఆదేశం ► న్యాయవాదిని కూడా అనుమతించాలన్న ఏపీ హైకోర్టు ► మధ్యాహ్నం గంట పాటు లోకేష్‌కు భోజనం బ్రేక్ ఇవ్వాలన్న హైకోర్టు 2:30 PM, అక్టోబర్ 03, 2023 జనసేనతో పొత్తును ఏం చేద్దాం? : BJP ► విజయవాడ : కాసేపట్లో AP BJP కోర్ కమిటీ సమావేశం ► బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు ► జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడే పొత్తు ప్రకటన చేశారు ► ఇప్పుడు పవన్‌తో పొత్తును ఏం చేద్దాం? ► కోర్ కమిటీలో నిర్ణయం తీసుకోనున్న AP బీజేపీ నేతలు 2:00 PM, అక్టోబర్ 03, 2023 2018లోనే GST ఈ కేసు దర్యాప్తు చేపట్టింది : పొన్నవోలు ► సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మీడియాతో CID లాయర్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► ఈ కుంభకోణం బయటపెట్టింది GSTనే ► 17(A)వచ్చింది 26-07-2018 ► 05-06-2018లోనే స్కిల్ స్కామ్ విచారణను GST చేపట్టింది ► తప్పు జరిగింది, అవినీతి జరిగింది, పన్ను ఎగ్గొట్టారని GST అప్పుడే రాష్ట్రప్రభుత్వానికి సూచించింది ► స్వయంగా ముఖ్యమంత్రే తప్పు చేయడం వల్ల GST ఇచ్చిన సూచనలు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు ► రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని దుర్వినియోగం చేశారు చంద్రబాబు ► GST దర్యాప్తు ప్రారంభించింది 2018 కంటే ముందు కాబట్టి... ఇది 17a సవరణ కిందికి రాదు ► 17(A) స్కిల్ స్కాం కేసుకు అప్లై కాదు ► నేరం జరిగినప్పుడు, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు కూడా 17(A) లేదు ► హైకోర్టు ముందు కూడా దర్యాప్తు డాక్యుమెంట్‌ను సమర్పించాం ► అదే డాక్యుమెంట్‌ను సుప్రీంకోర్టు అడిగింది. హైకోర్టులో ఇచ్చిన డాక్యుమెంట్నే సర్వోన్నత న్యాయస్థానంకు సమర్పిస్తాం 1:45 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబువి పసలేని వాదనలు : లాయర్లు ► కేవలం 17A సెక్షన్ సవరణపైనే ఆధారపడ్డ చంద్రబాబు లాయర్లు ► బెయిల్ కోసం ప్రయత్నించకుండా, మొత్తం కేసునే క్వాష్ చేయాలన్న తపనలో బాబు లాయర్లు ► చంద్రబాబు తప్పు చేయలేదని ఎక్కడా చెప్పని చంద్రబాబు లాయర్లు ► కేవలం అరెస్ట్ జరిగిన విధానాన్ని తప్పుబట్టిన చంద్రబాబు లాయర్లు ► గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న వాదనను వినిపించిన బాబు లాయర్లు ► చంద్రబాబు లాయర్లలో రెండు వైఫల్యాలు ► 17A సెక్షన్ సవరణ కేవలం అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే వర్తిస్తుందన్న కోర్టు ► చంద్రబాబుపై నమోదయిన FIRలో అవినీతి నిరోధక చట్టంతో పాటు IPC సెక్షన్లు ► నేరం జరిగింది 2014-15 మధ్యకాలంలో అని స్పష్టంగా తెలిసినా 17Aపైనే ఆధారపడ్డ బాబు లాయర్లు ► ఈ కేసులో ఇంతకు మించిన బలమైన వాదన లేదన్నట్టుగా వ్యవహరించిన బాబు లాయర్లు ► బాబు లాయర్ల వాదనలతో అంగీకరించని సర్వోన్నత న్యాయస్థానం 1:24 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట ► జస్టిస్ బోసు : ఈ కేసులో హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ వేసుకోండి ► జస్టిస్ బోసు : ఈ కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నాం ► చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా : కానీ చంద్రబాబు జైల్లో ఉన్నారు. అది కదా కష్టం ► CID తరపు లాయర్ రోహత్గీ : వీళ్లు కనీసం బెయిల్ అడగడం లేదు, ఏకంగా కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు ► చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా : ఇప్పుడు చంద్రబాబును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారు, రేపు హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ లిస్టయింది. అరెస్టయిన 15 రోజుల తర్వాత కస్టడీ అడగడం సరికాదు. ► జస్టిస్ బోసు : ఈ కేసులో ఇంకా పరిశీలించాల్సిందేమీ లేదు. ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నాం. ఇరుపక్షాలు అప్పుడు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించండి. కేవియట్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలకు మద్ధతిచ్చే డాక్యుమెంట్లు సమర్పించాలి. దర్యాప్తు ముందే ప్రారంభమయిందని నిరూపించాలి ► బెంచ్ : ఈ కేసులో ఉత్తర్వులిస్తున్నాం. క్వాష్ పిటిషన్‌పై వాదనలను సోమవారం వింటాం. అలాగే హైకోర్టు ముందు CID సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాలి 1:20 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు ► జస్టిస్ బోసు : 2018కు ముందే దర్యాప్తు ప్రారంభమైందని ఎలా చెబుతారు? ► CID తరపున ముకుల్ రోహత్గీ : ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. 2017కంటే ముందే నేరం జరిగింది. 2018 జులైలో చట్టసవరణ వచ్చింది, 2021లో FIR నమోదయింది. ఈ కేసులో ఏ రకంగానూ 17ఏ వర్తించదు ►రోహత్గీ : అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ►రోహత్గీ : ఏకంగా 2000 పేజీల పిటిషన్‌ను హైకోర్టు ముందుంచారు ►రోహత్గీ వాదనలను అడ్డుకునేందుకు లూథ్రా ప్రయత్నం ►రోహత్గీ : లూథ్రా గారు, మీ వంతు వస్తుంది, ఆగండి 1:14 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు ► జస్టిస్ బోసు : FIRలో రెండు రకాలు సెక్షన్లు ఉన్నాయి ► సింఘ్వీ : కానీ అవినీతి నిరోధక సెక్షన్ల కిందే చర్య తీసుకున్నారు ► లూథ్రా : ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు, వరుసగా FIRలు నమోదు చేశారు ► జస్టిస్ బోసు : మీరు వేసిన పిటిషన్‌పైనే ఉన్నాం. కేవలం 17a వర్తిస్తుందా? లేదా అన్నదాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం ► CID తరపున ముకుల్ రోహత్గీ : ఒకసారి కేసును చూడండి. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు? (CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు) 1:10 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు ► సింఘ్వీ : ఒకసారి కేసును చూడండి. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయి ► జస్టిస్ త్రివేదీ : మేం కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు ► జస్టిస్ బోసు : ఇప్పటికిప్పుడు కేసును క్వాష్ చేయాలన్న అంశంపై మేం ఆసక్తి చూపించడం లేదు 1:05 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై CID తరపు ముకుల్ రోహత్గీ వాదనలు ► రోహత్గీ : ఈ అంశాన్ని ఇంతకుముందే సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది ► జస్టిస్ త్రివేదీ : CrPC కోడ్ ప్రకారం 17A సవరణ పాటించాలని ఎక్కడా లేదు ► సింఘ్వీ : అవినీతి నిరోధక చట్టం ఒకసారి పరిశీలించండి ► జస్టిస్ త్రివేదీ : FIRలో రెండు సెక్షన్లు ఉన్నాయి, Prevention of corruption ఉంది, అలాగే IPC ఉంది 1:01 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడి వాదనలు ► జస్టిస్ త్రివేదీ : 17A అనేది కేవలం అవినీతి నిరోధక చట్టానికే వర్తిస్తుంది, ఇండియన్ పెనల్ కోడ్ కింద నమోదయిన కేసుల సంగతేంటీ? ► సాల్వే : ఏ కేసుకయినా 17A సవరణ వర్తించాల్సిందే ► లూథ్రా : అవును, ఏ కేసుకయినా 17A సవరణ వర్తించాలి ► జస్టిస్ బోస్ : కేవలం లా పొజిషన్‌ను బట్టి మాత్రమే ముందుకు వెళ్తాం ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో కోర్టు పరిశీలించాల్సింది ఒకే ఒక అంశం. IPC కింద నమోదయిన కేసులకు 17A సవరణ వర్తిస్తుందా? లేదా? (సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు లాయర్ సింఘ్వీ వాదనలు) 12:53 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడి వాదనలు ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ AM సింఘ్వీ ఎంట్రీ ► రఫెల్ కేసు సమయంలో యశ్వంత్ సిన్హా కేసును ఉదహరించిన సింఘ్వీ ► జస్టిస్ త్రివేదీ : చంద్రబాబు కోసం ఎంత మంది సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు? ► సాల్వే : నలుగురు లాయర్లు ఉన్నారు, అయినా మేం ముకుల్ రోహత్గీకి సరిపోం ► యశ్వంత్ సిన్హా కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన తీర్పును చదివి వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ సాల్వే ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగింది? ► లూథ్రా : 2015-16 మధ్య జరిగింది 12:43 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు హరీష్ సాల్వే వాదనలు ► కానీ చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు చేశారు ► కచ్చితంగా సెక్షన్ 17A దీనికి వర్తించాలి ► అరెస్ట్ చేసిన విధానం తప్పు అని హైకోర్టుకు కూడా తెలిపాం ► కానీ హైకోర్టు మా వాదనతో అంగీకరించలేదు ► 17A సవరణ వల్ల వచ్చే ప్రొటెక్షన్ చంద్రబాబుకు వర్తించాల్సిందే ► గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ అరెస్ట్ వర్తించదు ► విచారణ ప్రారంభమైన తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలి ► మంత్రిమండలి అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారన్నారు ► చంద్రబాబు సూచనలతోనే కొందరని ఎక్స్ అఫిషియోలుగా తీసుకొచ్చారని అభియోగాలు మోపారు (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు తరపున సాల్వే వాదనలు) 12:42 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టు : సాల్వే వాదనలపై జస్టిస్ త్రివేదీ ప్రశ్నలు ► ఈ నేరం 2015-16 మధ్య జరిగింది ► 17A చట్ట సవరణ 2018లో జరిగింది ► అలాంటప్పుడు 17A ఏ రకంగా వర్తిస్తుంది? 12:40 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు హరీష్ సాల్వే వాదనలు ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు తప్పు ► ఈ కేసు విచారణను సెప్టెంబర్ 7, 2021న ప్రారంభించినట్టు ADGP లెటర్‌ను బట్టి తెలుస్తోంది 17A చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే 12:35 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ ► తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ► కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ► రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ ► CID దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున కేసు క్వాష్ చేయలేమని తీర్పునిచ్చిన హైకోర్టు ► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదనలు ► తొలుత వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే 12:32 PM, అక్టోబర్ 03, 2023 హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ ► ఏపి హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► మధ్యాహ్నం లోకేష్ పిటిషన్ పై విచారణ ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో CID నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్ ► CID 41ఏ నోటీసుల్లో ఉన్న నిబంధనలపై లోకేష్ అభ్యంతరం ► హెరిటేజ్ బ్యాంక్ లావాదేవీలు తీసుకురావలనడంపై పిటిషన్ 12:12 PM, అక్టోబర్ 03, 2023 జనసేనతో ప్రతీ టిడిపి కార్యకర్త టచ్‌లో ఉండాలి : చినరాజప్ప ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో చినరాజప్ప ములాఖత్, అనంతరం మీడియాతో మాట్లాడిన రాజప్ప ఆరోగ్యం గురించి : చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారు, చంద్రబాబుకు అందరూ మద్ధతివ్వాలి రాజకీయాల గురించి : జనసేనతో త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తాం పవన్ కళ్యాణ్ గురించి : క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యవర్గమంతా జనసేనతో టచ్‌లో ఉండాలని సూచించాం చంద్రబాబు గురించి : జైల్లో ఉన్నా రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు బాధపడుతున్నారు కార్యకర్తలకు ఏం చెబుతారు? : ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు జైల్లో చాలా బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు 11:25 AM, అక్టోబర్ 03, 2023 హైకోర్టులో నారాయణకు దక్కని ఊరట ► ఏపీ హైకోర్టులో నారాయణ లంచ్ మోషన్ పిటిషన్ 16వ తేదీకి వాయిదా ► అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ వాయిదా ► నారాయణ ముందస్తు బెయిల్, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని వేసిన పిటిషన్లపై విచారణ ఈనెల 16కు వాయిదా ► రేపటి గైర్హాజరుకు అనుమతించాలని నారాయణ విజ్ఞప్తి, అంగీకరించని హైకోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణకు సంబంధించి మినహాయింపు విజ్ఞప్తి ► 60 ఏళ్ల వయస్సు వచ్చింది కాబట్టి స్టేషన్‌కు రానంటున్న నారాయణ ► పోలీసులే ఇంటికి వచ్చి విచారణ జరపాలంటూ లంచ్ మోషన్లో విజ్ఞప్తి ► అమరావతి భూదందాలో నారాయణదే కీలక పాత్ర : YSRCP MP విజయసాయి 11:20 AM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో పుంగనూరు అల్లర్ల కేసు విచారణ ► ఢిల్లీ: సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ ► నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం ► దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ► దాడి కేసులో చల్లా బాబుపై 7 కేసులు నమోదు ► 4 కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ► కేసులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు 11:10 AM, అక్టోబర్ 03, 2023 అరెస్ట్ అనగానే గుర్తుకొచ్చిన అనారోగ్యం ► హఠాత్తుగా బండారు సత్యనారాయణను పేషేంటును చేసిన తెలుగుదేశం నేతలు ► బండారు సత్యనారాయణ హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నాడంటూ కలరింగ్ ► మరి నోరు జారేప్పుడు హైబీపీ, మధుమేహం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన YSRCP ► గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు వచ్చిన సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు 11:06 AM, అక్టోబర్ 03, 2023 ముందస్తు బెయిల్ కావాలంటూ లోకేష్ మరో పిటిషన్ ► హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు ► ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ విజ్ఞప్తి ► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు రేపు విజయవాడ వస్తోన్న లోకేష్ ► చంద్రబాబు అరెస్టయిన మూడు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్ ► దాదాపు మూడు వారాలుగా ఢిల్లీలోనే కాలక్షేపం చేస్తోన్న లోకేష్ 11:05AM, అక్టోబర్ 03, 2023 ఇవ్వాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందా? లేదా? ► సుప్రీంకోర్టులో ఆఖరు నెంబర్‌గా లిస్టయిన చంద్రబాబు పిటిషన్ ► జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ ► 63వ నెంబర్ కేటాయించిన రిజిస్ట్రీ, చివరి కేసుగా బెంచ్ ముందుకు ► ఈ కేసు కంటే ముందు ఏ ఒక్క కేసులో సుదీర్ఘ వాదనలు జరిగినా ఈ కేసు వాయిదా పడే అవకాశం ► చంద్రబాబు తరఫున వాదించేందుకు సిద్ధమైన దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా ► జాబితాలో చిట్టచివరన ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత 10:46AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబుతో కుటుంబం ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవనున్న నారా భువనేశ్వరి ,బ్రాహ్మణి ►వారితోపాటు ఇవాళ చంద్రబాబును కలవనున్న టీడీపీ నేత చినరాజప్ప ►ఇప్పటికే చంద్రబాబు కలిసిన యనమల, అచ్చం నాయుడు, నారాయణ ►సత్యమేవ జయతే దీక్ష వివరాలు చంద్రబాబుకు తెలియజేయునన్న భువనేశ్వరి 10:25AM, అక్టోబర్ 03, 2023 చట్టాలకు ఆయనేం అతీతుడు కాదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ►విశాఖ: అవినీతి చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు ►చట్టాలకు చంద్రబాబు అతీతుడేం కాదు ►బాబు అవినీతికి ఆధారాలు దొరికాయి కాబట్టే అరెస్ట్ చేశారు ►అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు ►పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు ►భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ►అవినీతిపరుడు కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారు ►లంచాలు తిని కంచాలు కొడటే చేసిన తప్పులు పోతాయా? ►భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే ►కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా.. చంద్రబాబు ► చంద్రబాబు.. ఓ ఆర్థిక ఉగ్రవాది ►చంద్రబాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతి ముత్యం ►దీక్ష పేరుతో నారా భువనేశ్వరి.. ఎస్సీ ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు ►చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు ►అవినీతి చక్రవర్తికి అబద్దాల భార్య అని భువనేశ్వరికి పేరు పెడితే బాగుంటుంది ►30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది ►చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి ►చంద్రబాబు మించిన అవినీతి సైకో మరొకరు లేరు 10:14AM, అక్టోబర్ 03, 2023 రేపు ఉదయం విజయవాడకు నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ ► దాదాపు రెండు వారాల తర్వాత.. రేపు ఉదయం విజయవాడకు రాక ► ఢిల్లీలో ఇంతకాలం లీగల్ సంప్రదింపులంటూ టీడీపీ శ్రేణుల ప్రచారం ► అరెస్ట్ భయంతోనే పరారైనట్లు రాజకీయ వర్గాల చర్చ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు నారా లోకేష్ సీఐడీ విచారణ ► సెప్టెంబర్ 30న CRPC 41A కింద ఢిల్లిలో లోకేష్‌కు నోటీసులు ► ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోస్ చేసి.. విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించిన ఏపీ హైకోర్టు 09:40AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు అరెస్ట్.. ఎవరూ పట్టించుకోరేం? ► చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో దృష్టి దక్కకపోవడంపై టీడీపీలో చర్చ ► పార్టీకి ఇంతటి దుస్థితి ఎందుకు అని సీనియర్ల ఆవేదన ► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి? ► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు? 09:00AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు జైలు నిద్రలతో.. : విజయసాయిరెడ్డి ►చిన్న వాగులా మొదలై కడలిని చేరేలోగా అఖండ జలరాశిలా పోటెత్తుతుంది నది. ►కాలంతో పాటు ఉరకలువేసే మనిషి జీవితమైనా, సమాజపు ప్రస్థానమైనా తరంగిణిలా సాగిపోతుంది. ►ప్రకృతి నియమం అది. ►చంద్రబాబు గారు లాక్కున్న టీడీపీ మాత్రం.. ఆయన జైలు నిద్రలతో ఎండిపోయిన చెలిమెలా తయారైంది. చిన్న వాగులా మొదలై కడలిని చేరేలోగా అఖండ జలరాశిలా పోటెత్తుతుంది నది. కాలంతో పాటు ఉరకలువేసే మనిషి జీవితమైనా, సమాజపు ప్రస్థానమైనా తరంగిణిలా సాగిపోతుంది. ప్రకృతి నియమం అది. చంద్రబాబు గారు లాక్కున్న టీడీపీ మాత్రం ఆయన జైలు నిద్రలతో ఎండిపోయిన చెలిమెలా తయారైంది. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2023 08:50AM, అక్టోబర్ 03, 2023 బండారు అరెస్ట్‌పై పచ్చ బ్యాచ్ ఓవరాక్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రి రోజాపై విశాఖ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు ►సోమవారం రాత్రి అరెస్ట్ ►గుంటూరు పీఎస్‌కు తరలింపు ►బండారును నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారంటూ పచ్చ మీడియా గగ్గోలు ►పీఎస్ బయట మంగళవారం ఉదయం టీడీపీ నేతల ఓవరాక్షన్ 08:20AM, అక్టోబర్ 03, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డులో బెయిల్ కోసం చంద్రబాబు ►ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్ ►ఐఆర్ఆర్ స్కాంలో ఏ1గా చంద్రబాబు ►బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ ►మరోవైపు ఏ2 నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై కూడా ►రేపు నారాయణ-నారా లోకేష్‌ను విచారించనున్న ఏపీ సీఐడీ ► ఇప్పటికే నోటీసుల అందజేత 07:50AM, అక్టోబర్ 03, 2023 టీడీపీ డ్రామాల్ని పట్టించుకోవట్లేదు ►సత్యమేవ జయతే దీక్ష పేరుతో చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఒకరోజు ఆందోళన చేపట్టిన టీడీపీ ►చంద్రబాబు అరెస్ట్ నుంచి టీడీపీ చేపట్టిన ఏ ఒక్క ఆందోళన విజయవంతం కాని వైనం ►సత్యమేవ జయతే దీక్షను సక్సెస్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు ►పట్టించుకోని రాజమండ్రి వాసులు ►అంతకు ముందు.. మోత మోగిద్దాంకూ అదే పరిస్థితి ►జైల్లో చంద్రబాబు దీక్ష చేపట్టారు.. ఒక్క పూట మాత్రమే ఉపవాసం 07:39AM, అక్టోబర్ 03, 2023 సుప్రీంలో పుంగనూరు దాడి కేసు విచారణ ►నేడు సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ ►నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం ►టీడీపీ నేతలు దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ ► దాడి కేసులో చల్లా బాబు పై 7 కేసులు నమోదు ► నాలుగు కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు. ► పుంగనూరులో సరెండర్ అయిన చల్లా బాబు 07:32AM, అక్టోబర్ 03, 2023 మా వాదనలు వినాలి: ఏపీ ప్రభుత్వం ►సుప్రీంలో చంద్రబాబు ఎస్ఎల్పీపై నేడు విచారణ ►సర్వోన్నత న్యాయస్థానంలోని 6వ నంబర్ కోర్టులో లిస్ట్ ►మరోవైపు పిటిషన్‌పై.. కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం ► తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి ► నేటి పిటిషన్ల జాబితాలో చిట్టచివరగా లిస్ట్(నెంబర్ 63) అయిన చంద్రబాబు పిటిషన్ ► విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత 07:10AM, అక్టోబర్ 03, 2023 నేడు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ►నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు ►రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు ►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం ►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ ►ఈ కేసులో చంద్రబాబు సైతం ఇన్వాల్వ్ అయిన వైనం 07:08AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు పాపి.. చిరాయువు ►భువనేశ్వరి స్పీచ్‌కు ‘అమ్మా..’అంటూనే వైఎస్సార్సీపీ కౌంటర్ ►చంద్రబాబు అమాయకుల ఉసురు పోసుకున్నారు ►బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రాణాలను తన ఖాతాలో వేసుకున్నారు ►చంద్రబాబు పాపి.. కాబట్టి చిరాయువుగా శిక్షలు అనుభవిస్తారు ►చంద్రబాబు ప్రజలకోసం బతకలేదు.. కేవలం నారా ఫ్యామిలీ కోసమే బతుకుతున్నారు ►రెండు శాతం షేర్ల ధర 400 కోట్లు అవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది ఆయన మీ ఆయుష్షు పోసుకోవడం కాదమ్మా.. ఇప్పటి వరకూ ఎంతోమంది అమాయకుల ఉసురు పోసుకున్నారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రాణాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయినా పాపి చిరాయువు అంటారు కదా.. ఆ పాపాలకు శిక్ష అనుభవించాలి కాబట్టి చిరకాలం ఉంటారు లెండి. ఇక ఆయన ప్రజలకోసం… https://t.co/SmR3hK8fnL — YSR Congress Party (@YSRCParty) October 2, 2023 07:06AM, అక్టోబర్ 03, 2023 ఏంటీ పరిస్థితి ►అమరావతిలో రాత్రి టీడీపీ హడావిడి సమావేశం ►రాత్రి 11గంటలకు అచ్చెన్న ఆధ్వర్యంలో టిడిపి నేతల సమావేశం ►బాబు అరెస్ట్ తర్వాత మెరుగుపడని పార్టీ పరిస్థితి ►సర్వేల్లోనూ బోల్తా కొడుతున్న సైకిల్ ►కిమ్ కర్తవ్యం అనే దానిపైనే అచ్చెన్న చర్చ 07:00AM, అక్టోబర్ 03, 2023 నారాయణ పిటిషన్లపై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుIRR కుంభకోణంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి నారాయణ ►IRR కేసులో ఏ2గా నారాయణ ►పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే ఛాన్స్ ►అలాగే.. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ►రెండు పిటిషన్లపై విచారణ జరిగే అవకాశాలు 06:58AM, అక్టోబర్ 03, 2023 కంచాల మోత.. దొంగ దీక్షలు ►చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ రోజుకో డ్రామా ►జనాల అటెన్షన్ కోసం తీవ్ర యత్నాలు ►మోత మోగిద్దాంకు దక్కని స్పందన ►గాంధీ జయంతిని దీక్షల పేరిట డ్రామాలు ►బాబు రాజమండ్రి జైల్లో.. భార్య భువనేశ్వరి రాజమండ్రిలో.. కొడుకు లోకేష్ ఢిల్లీలో ఏడు గంటల దీక్ష ►అవినీతి చేసి సత్యాగ్రహ దీక్షలు చేయడంపై ముక్కున వేలేసుకుంటున్న జనం ►టీడీపీ నుంచే దక్కని స్పందన.. లైట్ తీసుకున్న నేతలు ►వందల కోట్లు నొక్కేసి సత్యాగ్రహ దీక్ష చేస్తే సరిపోతుందా? అంటున్న జనం 06:50AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ ►నేడు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్ విచారణ ►స్కిల్ స్కాంలో తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదన ► హైకోర్టులో ఎదురుదెబ్బ తర్వాత.. ఆ తీర్పును ఆశ్రయిస్తూ సుప్రీంకెళ్లిన చంద్రబాబు ►ఎస్ఎల్పీని విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ►చంద్రబాబు తరఫున దేశంలో నే అత్యంత ఖరీదైన లాయర్ లు సిద్ధార్థ్ లూత్రా, హరీశ్ సాల్వే వాదనలు ►నేడు చివరి పిటిషన్‌గా.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు 06:48AM, అక్టోబర్ 03, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @24 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ► నేటితో (అక్టోబర్ 3)తో 24వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ -
Oct 2nd 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Ground updates 07:59PM ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ ►సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు ►బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.. ►400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు. ►బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు గుంటూరు నుండి వచ్చిన పోలీసులు ►చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్న బండారు ►బండారును గుంటూరు తీసుకెళ్తున్న పోలీసులు 7:01PM ►టిడిపి నేత బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ వైఎస్సార్సీపీ నాయకుల నిరసన ►పుత్తూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు బండారి సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం ►పెద్ద ఎత్తున నినాదాలతో బండారు సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ ►బండారు సత్యనారాయణ దిష్టిబొమ్మను చెప్పులతో సన్మానించారు వైసీపీ మహిళా నేతలు ►గాంధీ జయంతి సందర్భంగా పుత్తూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు 6:33PM ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై మరో కేసు నమోదు ►అరండల్‌పేట పీఎస్ లో 153A , 294, 504, 505 ఐపీసీ, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు ►బండారుకు 41బి, 41ఏ కింద నోటీసులివ్వనున్న పోలీసులు ►బండారు సత్యనారాయణ నివాసానికి చేరుకున్న గుంటూరు పోలీసులు ►తలుపులు వేసుకుని పోలీసులకు సహకరించని బండారు సత్యనారాయణ 5:54 PM, అక్టోబర్ 02, 2023 అనకాపల్లిలో బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత ► పోలీసులను అడ్డుకునేందుకు భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ► నోటీసులు ఇచ్చేందుకు లోపలికి వెళ్లాలనుకున్న పోలీసులను అడ్డగించిన టిడిపి నేతలు 5:50 PM, అక్టోబర్ 02, 2023 త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర ► ప్రజల కోసం మా నాన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు ► మా కుటుంబ సభ్యులు నలుగురూ.. నాలుగు దిక్కులు అయిపోయాం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 105 మంది హఠాన్మరణం పాలయ్యారు ► చంద్రబాబును బాగా అభిమానించే వారంతా ప్రాణాలు కోల్పోయారు ► మరణించిన 105 కుటుంబాలను నేను త్వరలోనే పరామర్శిస్తాను 3:50PM, అక్టోబర్ 02, 2023 భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి ధ్వజం ►ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకురావడం ఆశ్చర్య మేస్తోంది ►భువనేశ్వరి నీకు నిజంగా తండ్రి,తల్లి మీద గౌరవం ఉంటే నీ భర్త లక్షల కోట్ల అవినీతి బయటపెట్టు ►నీతండి, నీ తల్లి నిజంగా పుణ్యదంపతులు ►ఆ పుణ్యదంపతుల కడుపున పనికిమాలిన సంతానం పుట్టారు ►నువ్వు,నీ అక్క దోపిడీవర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులు ►లక్షల కోట్లు నీ భర్త స్వయంగా సంపాదించాడా? ►నిజాయితీపరుడైన నీ తండ్రికి సేవ చేసిన నేను అదృష్టవంతురాలిని ►ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ముకాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా? ►బస్సుయాత్ర ద్వారా ఏం చెప్తావ్ నువ్వు ? ►నీ భర్త,కొడుకు మీద చూపించిన జాలి...నీ తండ్రి పై చూపించి ఉంటే ఆయన ఎంతో సంతోషపడేవారు 1:35 PM, అక్టోబర్ 02, 2023 రేపు, ఎల్లుండి సుప్రీంకోర్టు ముందుకు ఓటుకు కోట్లు కేసు ► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ► నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు ► రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు ► విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ► ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు ► లంచం ఇచ్చాం కానీ, కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ► ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టుకు ఇచ్చామంటున్న తెలంగాణ ప్రభుత్వం ► అక్టోబర్ 4న ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ► మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని ఇప్పటికే నిర్దారించిన ఫోరెన్సిక్ లాబ్ 1:30 PM, అక్టోబర్ 02, 2023 ఎట్టకేలకు బాబు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు : సజ్జల ► ఒక అవినీతిపరుడు అడ్డంగా బుక్కయ్యాడు : సజ్జల ► ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు విశ్వసించి జైలుకు పంపింది ► అటువంటి వ్యక్తికి కొందరు జోకర్లు మద్దతిస్తున్నారు ► దీక్షలు చేయడం బరితెగింపు ► జగన్ తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు ► తన పాలనలో మేలు జరిగితేనే మద్దతివ్వాలని జగన్ ధైర్యంగా చెబుతున్నారు ► మా చేతుల్లో అధికారాలు లేవు... జగన్ ప్రజలకు ఇచ్చేశారు ► గ్రామ/వార్డు సచివాలయాల్లో పాలన ఎలా సాగుతుందో చూస్తున్నాం ► జగనన్న సురక్ష ద్వారా 90 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయి ► ఇప్పుడు జగనన్న సురక్షా క్యాంపెయిన్ జరుగుతోంది ► ఇవన్నీ గ్రామ/వార్డు సచివాలయాల వల్లే సాధ్యమవుతోంది 1:25 PM, అక్టోబర్ 02, 2023 తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► టిడిపి సీనియర్ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం ► పవన్‌కళ్యాణ్ తప్ప చంద్రబాబుకు ఇంకో దిక్కు లేదా? ► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా? ► ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా జైల్లో పొత్తు పెట్టుకోవాలా? ► జనసేన మద్ధతు లేకపోతే మనం ఏమి చేయలేమా? ► ఎల్లో మీడియాలో ఎందుకు బ్రాహ్మణి జపం చేస్తున్నారు? ► ఇన్నాళ్లు నాయకుడని చెప్పిన లోకేష్‌ను ఎందుకు వెనక్కి నెడుతున్నారు? ► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా? ► ఒక్క అరెస్ట్‌కే అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి? ► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ► నాడు మోదీని నానా మాటలు ఎందుకు అనాలి? ఇప్పుడెందుకు కాళ్లు పట్టుకోవాలి? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు? ► ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా చంద్రబాబు కాంగ్రెస్ మిత్రపక్షాలకు అనుకూలంగా ప్రచారం చేశారు కదా.? ► రాహుల్, సోనియా ఎందుకు బాబును మరిచిపోయారు? ఎందుకు మాట్లాడడం లేదు? ► మన స్థాయి రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులేనా.? 1:05 PM, అక్టోబర్ 02, 2023 సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు ► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ ► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ ► Case No: SLP(Crl) No. 012289 - / 2023 Registered on 23-09-2023 ► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదయిన కేసు కొట్టేయాలని చంద్రబాబు పిటిషన్ ► తమ వాదన విన్న తర్వాతే కేసులో నిర్ణయం తీసుకోవాలంటూ ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం ► ఐటెం నెంబర్ 63గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు ► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని పిటిషన్ ► తనను అరెస్ట్ చేసిన విధానం తప్పని చంద్రబాబు లాయర్ల వాదన ► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్ లో వాదన 12:55 PM, అక్టోబర్ 02, 2023 పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి విమర్శలు ► పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ ► రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు ► పవన్‌కు 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టే దమ్ముందా? ► చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టి మళ్లీ వారి పక్కనే చేరాడు ► అవినీతికి పాల్పడి లోనికెళ్లిన చంద్రబాబుతో జైల్లో పొత్తు పెట్టుకున్నారు ► పవన్ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : వెల్లంపల్లి 12:50 PM, అక్టోబర్ 02, 2023 పార్ట్ నర్ కోసం పవన్ కళ్యాణ్ దీక్ష మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో పవన్‌కల్యాణ్ దీక్ష తెలుగుదేశం కోసం పవన్‌తో పాటు సంఘీభావంగా జనసేన నేతలు అర్జంటుగా చంద్రబాబును విడిచిపెట్టాలన్న డిమాండ్ తో దీక్ష అవినీతి వ్యతిరేక పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం పదవి కోసం తన పొత్తుదారుడు చంద్రబాబు కోసం ఎజెండా విషయంలో రాజీ 12:45 PM, అక్టోబర్ 02, 2023 మార్పు ముందు బాబు ఇంటి నుంచి రావాలి : పోసాని కృష్ణ మురళి ► నారా కుటుంబం ఎన్నాళ్లు శాసిస్తుంది? : పోసాని కృష్ణ మురళి ► భారతదేశానికి ఒకరే గాంధీ... కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ► ఒకరు చంద్రబాబు, లోకేష్, వారింట్లో భర్తలను మించిన రాజకీయ నాయకురాలు భువనేశ్వరీ, బ్రాహ్మణి ► చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి కారణమెవరు? ► చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్ళేటప్పుడు భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు? ► నాన్న ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టినా.. భువనేశ్వరి ఎందుకు అడుగలేదు? ► అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లు ► పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు ► పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా టిడిపి పొత్తు పెట్టుకుంది కేవలం కాపు ఓట్ల కోసమే ► కాపులు ఎవరి మైకంలోకి వెళ్ళకండి... ఎవరు మంచి చేస్తే వాళ్ళను గెలిపించండి 12:30 PM, అక్టోబర్ 02, 2023 అనకాపల్లిలో టిడిపి నేతల దౌర్జన్యం ► అనకాపల్లిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద టిడిపి నేతల దౌర్జన్యం ► ఓ మహిళా కానిస్టేబుల్ ను నెట్టేసిన టిడిపి నేతలు ► అనుమతి లేదంటున్నా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం ► అడ్డుకున్న పోలీసులపౌ దౌర్జన్యం ► టిడిపి నేతల తోపులాటలో కింద పడిపోయిన మహిళా కానిస్టేబుల్ 11:45AM, అక్టోబర్ 02, 2023 దీక్షకు టీడీపీ నేతల డుమ్మా.! ►గాంధీ జయంతి నాడు.. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ దీక్షలు ►ఇప్పటికే జనం ముక్కున వేలేసుకుంటున్న వైనం ►చంద్రబాబుకు సంఘీభావంగా చేపట్టిన దీక్షను లైట్ తీసుకుంటున్న టీడీపీ శ్రేణులూ ►ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇన్‌ఛార్జి స్థాయి దాకా నేతల డుమ్మా ►కర్నూలు పత్తికొండ నియోజకవర్గం ఇంఛార్జి శ్యామ్ బాబు దూరం ►చాలాచోట్ల మొక్కుబడి నిరసనలు 11:37AM, అక్టోబర్ 02, 2023 దొంగ దీక్షలను ప్రజలు గమనించాలి : మంత్రి రోజా ►గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు ►విద్యార్థుల సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు ►చంద్రబాబు దీక్ష గాంధీజీని అవమానించడమే ►టీడీపీ నేతల దొంగ దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలి ►చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. టీడీపీ సత్యాగ్రహ దీక్షలపై తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా కామెంట్స్ 11:10AM, అక్టోబర్ 02, 2023 చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ ►రేపు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ ►కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ►ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు ►తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదన 11:10AM, అక్టోబర్ 02, 2023 జైల్లో బాబు.. బయట భార్య.. ఢిల్లీలో కొడుకు ►చంద్రబాబు అరెస్ట్‌పై దీక్షలతో పరువు తీసుకుంటున్న టీడీపీ ►గాంధీ జయంతి నాడు.. సత్యమేవ జయతే పేరిట ఏడు గంటల దీక్ష ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు దీక్ష ►రాజమండ్రిలో సతీమణి నారా భువనేశ్వరి దీక్ష ►మరోవైపు ఢిల్లీలో తనయుడు నారా లోకేష్ దీక్ష ►చంద్రబాబు ఏం చేసి జైలుకు వెళ్లారని నిలదీస్తున్న జనం ►టీడీపీ శ్రేణుల నుంచే సరిగ్గా స్పందన దక్కని వైనం 10:39 AM అక్టోబర్ 02, 2023 టీడీపీ దీక్షపై మంత్రి అంబటి సెటైర్ ►జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్! జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్!@naralokesh @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) October 2, 2023 10:35AM, అక్టోబర్ 02, 2023 హే రామ్.. ►గాంధీ జయంతి నాడు టీడీపీ కొత్త డ్రామా ►అవినీతి కేసులో అరెస్ట్ అయితే.. సత్యాగ్రహ దీక్షలా! ►టీడీపీ దీక్షలతో గాంధీ ఆత్మ ఘోషిస్తోందంటున్న జనం ►టీడీపీ నిరసనలపై విస్తుపోతున్న జనం ►ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ ►మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువు ►ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా టీడీపీ దక్కని సానుభూతి 10:15AM, అక్టోబర్ 02, 2023 IRR కేసులో నారాయణకు మళ్లీ నోటీసులు ►ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ2గా ఉన్న నారాయణ ► బెయిల్‌పై బయట ఉన్న నారాయణ ► మరోసారి నోటీసులు పంపిన దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ ► ఈనెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసులు ► ఇదే స్కామ్‌లో అదే తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విచారణ ► ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌కు నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం 09:58AM, అక్టోబర్ 02, 2023 సుప్రీంకోర్టులో రేపే ఓటుకు కోట్లు కేసు విచారణ ►మళ్లీ తెరపైకి చంద్రబాబు నోటుకు ఓటు కేసు ►సుప్రీం కోర్టు లో అక్టోబర్ 3న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ►రేవంత్ పిటిషన్‌ను విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం ►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ ►మరోవైపు.. అక్టోబర్ 4న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ►ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ ►విచారణ చేయనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం 09:20AM, అక్టోబర్ 02, 2023 రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం: నారా లోకేష్ ►జైల్లో చంద్రబాబు గారిని చూసి షేక్ అయ్యాను ►చంద్రబాబు అరెస్ట్‌లో ఇతరుల హస్తంపై ఏం మాట్లాడలేను ►అరెస్ట్‌పై సిగ్గుపడడం లేదు ►ఇది రాజకీయాల్లో భాగమని భావించడంలేదు ►రాజకీయాల్లోకి రావడం బ్రహ్మాణి ఇష్టం ►తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటింది ►గల్లా ఇంట్లో ఆదివారం రాత్రి ఢిల్లీలో విలేకర్లుతో నారా లోకేష్ ►స్కామ్‌లపై మాత్రం దాటవేత సమాధానాలు 9:00 AM, అక్టోబర్ 02, 2023 దయనీయ స్థితిలో టీడీపీ: ఎంపీ విజయసాయిరెడ్డి ► అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ► త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. ► 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ► ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు. అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2023 08:56AM, అక్టోబర్ 02, 2023 జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము ► ఐదు చానెల్స్‌తో నిత్యం టీవీ చూస్తున్న బాబు ►రాజమండ్రి జైల్లో 23వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు ►వేడి నీళ్లు స్నానం ►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి భోజనము ► కానీ, ఇవాళ జైల్లో ఒక్కరోజు దీక్ష 08:53 AM, అక్టోబర్ 02, 2023 నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికీ ఇంకో న్యాయ మా? ►సానుభూతి కోసం టీడీపీ నానా తంటాలు ►ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర యోచనలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ►రేపు సుప్రీం కోర్టులో జరిగే పరిణామాల తర్వాత తుది నిర్ణయం ► అన్ని జిల్లా కేంద్రాల్లో పర్యటన చేసేలా రూట్‌మ్యాప్ ► కుప్పం నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టేలా టీడీపీ ప్లాన్ ► ఇప్పటి వరకూ ఏ సమస్యపై బయటకు రాని భువనేశ్వరి, బ్రహ్మణి భువనేశ్వరి, బ్రహ్మణిలకు YSRCP సూటి ప్రశ్నలు బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు ఈ ఇద్దరూ ఎందుకు బయటకు రాలేదు? పుష్కర్ ఘాట్‌లో చంద్రబాబు కుటుంబం స్నానానికి వెళ్లినప్పుడు.. అమాయకులు 30 మంది చనిపోయినపుడు ఎందుకు రాలేదు? ఎరుపాడులో సామాన్యులు చనిపోయినపుడు ఎందుకు రాలేదు? ఇరుకు సందులో మీటింగ్ పెట్టి.. జనాల్ని బలిగొన్నప్పుడు ఎందుకు రాలేదు? సొంత పార్టీ వినోద్ కుమార్ జైన్ వేధింపులతో ఓ చిన్నపాప చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు? ►ఎపుడు.. ఎప్పుడూ.. అయ్యోపాపం అనలేదు. బయటకు వచ్చి విజిల్స్, హారన్లు కొట్టలేదు ఈ ఇద్దరూ. ► నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికి ఇంకో న్యాయమా? YSRCP challenge 08:41 AM, అక్టోబర్ 02, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టే :పేర్ని నాని ►సిట్టింగ్ జడ్జితో నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా స్టేBN ? ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే. ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే. ►2003లో కన్నా లక్ష్మీనారాయణ పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే. ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు వేశాడు. ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ..దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? 08:41 AM, అక్టోబర్ 02, 2023 బండారు నివాసం వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత ►Chandrababu కేసు తర్వాత మంత్రి రోజా పై బండారు నీచమైన వ్యాఖ్యలు ► డీజీపీ ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ► ఫిర్యాదు ఆధారంగా చర్యలకు ఉపక్రమించిన పోలీసులు ► విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ►ఇంట్లో నుంచి బయటికి రాని బండారు ►గడి పెట్టుకొని రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్న బండారు ► సోమవారం ఉదయం బండారు నివాసం వద్ద ఉద్రిక్తత ► అయినా.. ఇంటి నుంచి బయటకు రాని బండారు సత్యనారాయణ మూర్తి ► ఇంటి ఆవరణలోనే వేచి చూస్తున్న పోలీసులు ► 41ఏ నోటీస్‌లు ఇస్తారా? లేదంటే స్టేషన్‌కు తీసుకెళ్తారా? ►బండారును కలిసి నోటీస్ ఇస్తామంటున్న పోలీసులు 08:12 AM, అక్టోబర్ 02, 2023 భువనేశ్వరి బస్సు యాత్ర! ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధం ►భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు? ►ఈ వారంలోనే చేపట్టే అవకాశం ►ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన ►మేలుకో తెలుగోడా అనే పేరు ఖరారు! ►ఇలాగైనా ప్రజల అటెన్షన్ దక్కించుకోవాలని టీడీపీ నేతల తాపత్రయం ►కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం 07:29 AM, అక్టోబర్ 02, 2023 కోర్టుల్లో చంద్రబాబు, లోకేష్‌బాబు పిటిషన్ల అప్డేట్స్ ►నారా లోకేష్‌పై మూడు కేసులు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నోటీసులు ►లోకేష్‌కు ఢిల్లీలో CID నోటీసులు, 4న విజయవాడ రావాలని సూచన ►స్కిల్ స్కాం కేసు : లోకేష్‌ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ►హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ అక్టోబర్ 4కు వాయిదా ►హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్ IRR కేసులో A1 చంద్రబాబు బెయిల్‌పై వాదనలు ► IRR కేసులో రేపు అక్టోబర్ 3న హైకోర్టులో విచారణ ►హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు అక్టోబర్ 4కి వాయిదా ►ఉండవల్లి పిటిషన్‌కు బెంచ్ కేటాయించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ►సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంకా విచారణకు లిస్టింగ్‌కాని వైనం 06:57 AM, అక్టోబర్ 02, 2023 జైల్లో చంద్రబాబు.. బయట భువనేశ్వరి ►గాంధీ జయంతి సందర్భంగా సెంట్రల్ జైల్లో నేడు చంద్రబాబు ఒక్కరోజు నిరసన ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు పలు కుంభకోణాల్లో చంద్రబాబుపై అభియోగాలు ►మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతంలో బాబు సతీమణి భువనేశ్వరి నిరసన ► ‘సత్యమేవ జయతే’ పేరుతో భువనేశ్వరి దీక్ష ►రాజమండ్రి లోకేశ్ శిబిరంలో ఇప్పటికే భువనేశ్వరి బస 06:45 AM, అక్టోబర్ 02, 2023 టీడీపీ నేత బండారు అరెస్ట్‌కి రంగం సిద్ధం ►విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ►కాసేపట్లో అరెస్టు చేసే అవకాశం ►మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు ►బండారు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలు ►బండారు సత్యనారాయణ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ►బండారుని అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్న వాసిరెడ్డి పద్మ.. 06:33 AM, అక్టోబర్ 02, 2023 ఇది టీడీపీకి అంతమే: YSRCP ►మేం వద్దు… మా ఓట్లు కావాలా? ► మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ►నెల్లూరు పర్యటనలో అవకాశవాద రాజకీయాన్ని ప్రశ్నించిన మూలపేట ప్రజలు ►మొహం చాటేసి పారిపోయిన వైనం ► ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న నారాయణ.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. మేం వద్దు… మా ఓట్లు కావాలా? “టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అవకాశవాద రాజకీయాన్ని నిలదీసిన నెల్లూరు ప్రజలు” మూలపేట పర్యటనకు వెళ్లిన ఆయన్ను ‘చాన్నాళ్లకు వచ్చారు, కరోనా టైములో మేం ఎన్నో అవస్థలు పడ్డాం కానీ మీరు ఇటు రానే లేదు. మళ్ళీ ఎప్పుడొస్తారో.. మా బాధలు వినే ఓపిక లేదా?’ అని… pic.twitter.com/MWTpptyQUp — YSR Congress Party (@YSRCParty) October 1, 2023 06:33 AM, అక్టోబర్ 02, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @23 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 09వ తేదీ పొద్దున అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ► రిమాండ్ విధించి.. రెండుసార్లు పొడిగించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ► సీఐడీ రెండు రోజుల కస్టడీలో ఇంటరాగేషన్‌కు ఏమాత్రం సహకరించని వైనం ►మరో ఐదురోజులు కస్టడీకి కోరిన వైనం.. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ► నేటితో (అక్టోబర్ 2)తో 23వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► కోర్టు ఆదేశాల ప్రకారం.. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, ఇంటి భోజనం 06:30 AM, అక్టోబర్ 02, 2023 పవన్.. నీ కుల కామెంట్లేందో? ►పవన్ కుల స్టేట్మెంట్ల వైవిధ్యం ► కులం అంటే నచ్చదంటూనే.. సొంత కులస్తులే ఓడించారని గతంలో పవన్ కామెంట్లు ► కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ వ్యాఖ్య ► గుర్తు చేసుకుంటున్న జనసైనికులు ► కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్.. ప్రసంగాలు మాత్రం కులం చుట్టురానే! ►పవన్ స్టేట్మెంట్లపై ముక్కున వేలేసుకుంటున్న జన సైనికులు. కులం అంటే తనకు నచ్చదు అని చెప్పే @pawankalyan తనను సొంత కులస్తులే ఓడించారని గతంలో నిష్టూరమాడాడు. కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ అతను గతంలో చేసిన కామెంట్లను యువత గుర్తు చేసుకుంటోంది. తనకు కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్ ప్రసంగాలు యావత్తూ కులం… pic.twitter.com/nGLv1dNbRv — YSR Congress Party (@YSRCParty) October 1, 2023 -
Sep 28, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand, Court matters and Ground updates 6:43 PM, సెప్టెంబర్ 28, 2023 మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ నేతల భేటీ ► తెలుగుదేశం పొత్తుపై నాదెండ్ల మనోహర్ చర్చలు ► జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి పొత్తు ప్రకటించారు ► ఎన్ని సీట్లు అడుగుదాం?, ఏ ఏ జిల్లాల్లో అడుగుదాం? ► కనీసం 75 సీట్లు తక్కువ కాకుండా సీట్లు అడగాలన్న యోచనలో నేతలు ► తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టొద్దన్న పవన్ సూచనలను గుర్తు చేసిన నాదెండ్ల ► లోకేష్, బాలకృష్ణ పక్కన నిలబడ్డంత మాత్రాన ఎక్కువ ఊహించుకోవద్దంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసినట్టు సమాచారం ► జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం మద్ధతు ఎలా తీసుకోవాలన్న దానిపై చర్చ 6:12 PM, సెప్టెంబర్ 28, 2023 కేవియట్ పిటిషన్‌తో తెలుగుదేశం బేజారు ► అక్టోబర్ 3పై కోటి ఆశలు పెట్టుకున్నతెలుగుదేశం ► అన్యాయం జరిగిపోయిందని కలరింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు ► గగ్గోలు పెట్టి స్టే తెచ్చుకోవాలని వ్యూహం ► ఈ కేసులో తమ వాదనలు వినాలంటూ ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్ ► మొత్తం ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచనున్న ఏపీ సర్కారు ► చంద్రబాబు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో తెలియజేస్తూ సమగ్ర పిటిషన్ ► కేసు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే టిడిపికి చెప్పిన సీనియర్ లాయర్లు ► ఈ కేసులో తమకు రిలీఫ్ దొరకడం కష్టమేనని తెలుగుదేశం ఆందోళన 4:20 PM, సెప్టెంబర్ 28, 2023 రింగ్ రోడ్డు పేరిట దోపిడి చేశారు : YSRCP ► రింగ్ రోడ్డును తమకు అనుకూలంగా మలుపులు తిప్పారు ► రోడ్డు పక్కనే ఉన్న తమ భూములకు విలువ పెంచుకున్నారు ► భారీ లాభాలతో విక్రయించారు : YSRCP అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడుగా నారా లోకేశ్ కీలక పాత్ర వహించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. లోకేశ్ పాత్రకు సంబంధించి 129 ఆధారాలను గుర్తించి జప్తు చేసింది. ఐఆర్ఆర్ లో లోకేశ్… pic.twitter.com/r8R8fu07cB — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 4:05 PM, సెప్టెంబర్ 28, 2023 పాదయాత్ర లేదు.. పార్టీ ప్రోగ్రాం లేదు.. ► పాదయాత్రను వాయిదా వేసాం : అచ్చెన్నాయుడు ► కేసులో లోకేష్ పేరు పెట్టారు ► చంద్రబాబునాయుడిపై PT వారంటు జారీ చేశారు ► వీటిన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొవాలి ► ఢిల్లీలో సుప్రీంకోర్టులో లాయర్లతో లోకేష్ మాట్లాడాలి ► లోకేష్‌ను వాయిదా వేసుకొమ్మని మేమే కోరాం 3:52 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING చినబాబుకు భయం పట్టుకుంది.! పాదయాత్ర వాయిదా ► లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా ► యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని తెలుగుదేశం నిర్ణయం ► ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే పునఃప్రారంభించాలని నిర్ణయం ► అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని యోచిస్తోన్న లోకేష్ ► రాజమండ్రికి వస్తే జైలుకు పోవడమొక్కటే మిగిలిందని లోకేష్‌కు సూచించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా టాప్ మేనేజ్మెంట్లు ► అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచన ► ఢిల్లీలో మంచి లాయర్లను ముందస్తు బెయిల్ కోసం మాట్లాడుకొమ్మని సలహా ► ఇప్పుడే పాదయాత్రకు వెళ్లాలనుకుంటే అరెస్ట్ అవుతారని సూచన ► టీడీపీ నాయకులు, పచ్చమీడియా మేనేజ్మెంట్ల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ ► పాదయాత్ర సంగతి తర్వాత చూద్దాం, ఢిల్లీ హోటల్లోనే ఉంటానన్న లోకేష్ పాదయాత్ర ఘనంగా ప్రారంభిస్తామని నిన్నటిదాకా ట్వీట్లు వేసిన తెలుగుదేశం అద్భుత ప్రజాదరణతో జైత్రయాత్రలా కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కారణంగా ఆగింది. కానీ అది చిన్న విరామం మాత్రమే. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ సెప్టెంబర్ 29, 2023, రాత్రి 8.15 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు నారా లోకేష్ గారు#YuvaGalamPadayatra… pic.twitter.com/cSDQONUG8s — Telugu Desam Party (@JaiTDP) September 26, 2023 3:12 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING సుప్రీంకోర్టు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవియట్ ► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి ► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు ► నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి ► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ ► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం : ఏపీ ప్రభుత్వం 3:10 PM, సెప్టెంబర్ 28, 2023 తిట్టలేదట కానీ అన్నాడట : అదీ బుచ్చయ్య సంస్కారం.! ► నేను జడ్జిని తిట్టలేదు : గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నాను ► నాకు కోర్టు నోటీసులు వచ్చాక, పరిశీలించి మాట్లాడుతా ► చంద్రబాబుని జైల్లో పెట్టి పొందేది తాత్కాలిక ఆనందమే 1:10 PM, సెప్టెంబర్ 28, 2023 జవాబులు చెప్పండి ప్లీజ్.! తెలుగుదేశం లీగల్ సెల్‌కు సగటు తెలుగు ప్రజల 10 ప్రశ్నలు.. 1. ఏ కోర్టులో అయినా బాబు లాయర్లు సెక్షన్ 17A అంటున్నారు, మరో వాదన వినిపించడం లేదేందుకు? 2. అరెస్ట్ చేసిన తీరును తప్పుబడుతున్నారు కానీ తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు? 3. దేశంలోనే అత్యంత ఖరీదైన హరీష్ సాల్వేను పెట్టుకున్నా.. మీ కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన కారణం దొరకడం లేదా? 4. మీడియా మీటింగ్‌ల్లో మీరు చేసే ప్రకటనలను కోర్టు ముందు ఎందుకు చెప్పడం లేదు? 5. Yes, మేం తప్పు చేయలేదు, ఈ డబ్బులు మా ఖాతాల్లో పడలేదు, ఈ సంతకాలు బాబు పెట్టలేదు అని కోర్టుకు చెప్పడం లేదెందుకు? 6. మీరు అన్నీ కరెక్ట్‌గానే చేస్తే.. మీ మనుష్యులు శ్రీనివాస్, మనోజ్ తదితరులంతా దేశం విడిచి ఎందుకు పారిపోయారు? 7. ప్రపంచమంతా అన్ని దేశాల్లో నిరసనలు చేస్తున్నారని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్న మీరు జర్మనీలో సీమెన్స్ కంపెనీ ముందు ఎందుకు ధర్నాలు చేయడం లేదు? 8. కనీసం సీమెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఒక్క మెయిల్ అయినా రాయలేదేందుకు? 9. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది ఒప్పందం నుంచి ఎందుకు తొలగించారో.. ఏ మీడియా సమావేశంలో చూపించడం లేదెందుకు? 10. మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను శిక్షిస్తారా అన్న డొంక తిరుగుడు వాదన లోకేష్ ఎందుకు చేస్తున్నారు? 1:10 PM, సెప్టెంబర్ 28, 2023 అమరావతిలో రింగ్ అంతా లోకేష్‌దే ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో లోకేష్ కుట్ర సుస్పష్టం ► కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి ► లోకేష్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు ► ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు ► అప్పటి అధికారులు, అలైన్ మెంట్ లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు ► పక్కా పన్నాగంతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు ► హెరిటేజ్‌కు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి ► వారి భూములను ఆనుకొని వెళ్లేలా IRRలో మార్పులు ► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా బహుమానంగా ఇచ్చిన లింగమనేని మాస్టర్ ప్లాన్ లోని ఇన్నర్ రింగు రోడ్డును ఇష్టానుసారం మార్చేసింది ప్రజల కోసం ఏమాత్రం కాదు. ఆ ప్రాంతాల్లోని నారాయణ కాలేజీల కోసమే ఈ ప్లాను.. తద్వారా నారాయణతో పాటు @naralokesh , @ncbn సైతం లబ్ది పొందారు. #CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam… pic.twitter.com/HwytVjPaVR — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 1:00 PM, సెప్టెంబర్ 28, 2023 పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా.! ► లోకేష్ తీరుపై తెలుగుదేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం ► ఇప్పటివరకు నడిచిన క్రెడిట్ అంతా పోతోందని ఆవేదన ► ఏపీ నుంచి ఢిల్లీ పారిపోయారన్న అపఖ్యాతి వద్దంటున్న టిడిపి క్యాడర్ ► ఎల్లో మీడియాలో వస్తున్న అప్డేట్స్ ప్రకారం టిడిపి ఇన్సైట్స్ ఇలా ఉన్నాయి రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి రాజమండ్రికి రప్పించాలి రెండో వర్గం : పాదయాత్రను కనీసం వారం పాటు వాయిదా వేయాలి ఒక వర్గం : లోకేష్‌ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణితో పాదయాత్ర చేయించాలి రెండో వర్గం : ముందస్తు బెయిల్ వచ్చే వరకు లోకేష్‌ను ఢిల్లీలోనే ఉంచాలి ఒక వర్గం : లోకేష్ కంటే బ్రాహ్మణి బరిలో దిగితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, నారా+నందమూరి కుటుంబాలకు వారసురాలిగా గుర్తింపు వస్తుంది రెండో వర్గం : ఇన్నాళ్లు లోకేష్‌ను లీడర్‌గా ప్రచారం చేసి ఇప్పుడు వెనక్కు జరిపితే క్యాడర్ మనోస్థైర్యం దెబ్బ తింటుంది 12:45 PM, సెప్టెంబర్ 28, 2023 మా చినబాబు మంచోడే, కొనాలని ముందే కల పడింది : టిడిపి ► అమరావతిలో భూములు కొనాలని లోకేష్ ముందే అనుకున్నారు : పట్టాభి ► భూముల విషయంలో టిడిపి నేత పట్టాభి అధికారిక ప్రకటన ► అవును, నారా లోకేష్‌తో పాటు హెరిటేజ్ కూడా భూములు కొనుగోలు చేశారు ► సంస్ధ విస్తరణ కోసం అనేక చోట్ల హెరిటేజ్ భూములు కొంటుంది ► అదేవిధంగా ఆనాడు అమరావతి ప్రాంతంలోనూ భూములు కొనుగోలు చేసింది ► FIR ఫైల్ కాగానే CIDకి కూడా హెరిటేజ్ సంస్ధ అన్ని వివరాలతో లేఖ రాసింది ► జులై1న హెరిటేజ్ 7.21 ఎకరాలు కొనుగోలు చేసింది ► జులై 31తర్వాత మరి కొన్ని ఎకరాలు భూమి కొనుగోలు చేసింది ► లింగమనేని నుంచి కూడా 4.55 ఎకరాలు కొనుగోలు చేసింది ► ఈ భూమికి సంబంధించి లీగల్ ఇష్యూ ఉందని ఒప్పందం రద్దు చేసుకుంది ► లీగల్ ఇష్యూ ఉందని కోట్లు విలువచేసే 4.5 ఎకరాలను హెరిటేజ్ వదులుకుంది ► లింగమనేని భూమి ఒప్పందం రద్దుచేసుకున్నాక హెరిటేజ్‌కు మిగిలింది 9.6 ఎకరాలు ► కొనాలని ముందే అనుకున్నారు కాబట్టి తప్పు జరిగిందని ఎలా చెబుతారు? చంద్రబాబు అప్పట్లో అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు గ్రాఫిక్స్‌తో అందర్నీ నమ్మించాడు. కానీ.. చివరికి అమరావతి అంతర్జాతీయ స్కామ్‌గా మిగిలిపోయింది. ఈ స్కామ్‌కి డైరెక్షన్ చంద్రబాబు.. పర్యవేక్షణ నారా లోకేష్. - మంత్రి ఆదిమూలపు సురేష్#APAssembly#CorruptBabuNaidu… pic.twitter.com/XaSGHK5b8o — YSR Congress Party (@YSRCParty) September 27, 2023 12:30 PM, సెప్టెంబర్ 28, 2023 కిం కర్తవ్యం.? ► రేపు నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం ► ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న నారా లోకేష్ ► చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ ► పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చ ► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా? ► లోకేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.? ► లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా? ► ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా? ► చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? ► భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? ► ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా? ► లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా? ► బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్‌లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు? ► జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు? ► పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు? 12:00 PM, సెప్టెంబర్ 28, 2023 లోకేష్ యువగళానికి మంగళం.! ► మరింత వాయిదా దిశగా లోకేష్ పాదయాత్ర యువగళం ► ఢిల్లీలో చేసిన ప్రకటన ప్రకారం రేపు రాత్రి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయం ► అరెస్ట్ భయంతో ఇప్పట్లో ఢిల్లీ నుంచి రాలేనంటున్న చిన బాబు ► పాదయాత్ర మధ్యలో నిలిపివేస్తే పరువు పోతుందంటున్న తెలుగుదేశం నేతలు ► హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తేనే ఏపీకి వస్తానని తేల్చి చెబుతోన్న లోకేష్ ► అరెస్ట్ అయితే మరింత సానుభూతి వస్తుందంటున్న టిడిపి నేతలు ► చంద్రబాబు అరెస్ట్‌కే రాలేదు, నాకేం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోన్న లోకేష్ ► యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నారని ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌లు ► వారం వాయిదా వేస్తేనే బాగుంటుందని కొందరు నేతలు లోకేష్‌కు సూచించారు : ఎల్లో మీడియా ► ఎవరా కొందరు.? ఎందుకు వాయిదా? అన్న వివరాలు వెల్లడించని ఎల్లో మీడియా 11:45AM, సెప్టెంబర్ 28, 2023 ఏసీబీ జడ్జిపై పోస్టు.. మరో టీడీపీ నేత అరెస్ట్ ►ఏసీబీ జడ్జిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నేత ►టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న కంకిపాడు పోలీసులు ►మచిలీపట్నం సైబర్ బ్రాంచ్ కి అప్పగించిన పోలీసులు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయమూర్తి 10:20AM, సెప్టెంబర్ 28, 2023 ఏ వయస్సులో చేసినా నేరం నేరమే ►చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి ►ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది ►కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం ►బాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి ►చంద్రబాబుకు 23 లక్కీ నంబర్ ►మా పార్టీకి చెందిన 23 మందికి లాక్కున్నాడు ►2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23 ►జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే ►చంద్రబాబు అరెస్ట్ పై జంప్ అయిన ఎమ్మెల్యే ల హడావుడి ఎక్కువైంది. ►మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు ►తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు ►ఏ వయస్సులో చేసినా తప్పు తప్పే.. నేరం నేరమే.. ►భవిష్యత్తు లో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది :: ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ 07:30AM, సెప్టెంబర్ 28, 2023 రింగ్‌రోడ్డు కేసులో లోకేష్ పాత్రపై 129 ఆధారాలు ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లోకేశ్ కుట్ర సుస్పష్టం ►ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి ►లోకేశ్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు ►ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు ►అప్పటి అధికారులు, అలైన్మెంట్లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు ►పక్కా పన్నాగంతోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులు ►హెరిటేజ్‌కు, లింగమనేని రమేశ్ కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం ►వారి భూములను ఆనుకొని వెళ్లేలా ఐఆర్ఆర్లో మార్పులు ►క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా ఇదీ చదవండి: హెరిటేజ్ అంటేనే నారా కుటుంబం 07:00AM, సెప్టెంబర్ 28, 2023 సుప్రీం జడ్జిల వద్ద బాబు లాయర్ల పట్టు.. నో రిలీఫ్ ►నిన్న(బుధవారం) సుప్రీంలో చంద్రబాబు లాయర్ల ఇబ్బందికర ప్రవర్తన ►తక్షణ ఉపశమనానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌పై ఒత్తిడి ► తిరస్కరించిన సీజేఐ ►కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని నియంత్రించలేమని స్పష్టీకరణ ►అక్టోబర్ 3వ తేదీనే ఎస్ఎల్పీపై విచారణ జాబితాలోకి అని బాబు లాయర్లకు చెప్పిన చీఫ్ జస్టిస్ ►అంతకు ముందు.. బాబు పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ►సోమవారం జాబితా చేయాలని బాబు లాయర్ హరీష్ సాల్వే పట్టు ►సాధ్యం కాదని.. వచ్చే వారమే లిస్ట్ చేస్తామని స్పష్టం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 06:45AM, సెప్టెంబర్ 28, 2023 ఏసీబీ జడ్జిపై పోస్టులు.. టీడీపీ నేత అరెస్ట్ ► చంద్రబాబు కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించిన టీడీపీ నేత ►సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ ► జడ్జిపై అనుచిత పోస్ట్ చేసినందుకు టీడీపీ నేత ముల్లా ఖాజాను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు ►ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన ఖాజా హుస్సేన్ ►టీడీపీ తరపునే పోస్ట్ చేసినట్లు ఒప్పుకోలు! ►నేడు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు. ఇదీ చదవండి: జడ్జిలపై కులం పేరుతో దూషణల పర్వం 06:30AM, సెప్టెంబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @19 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడి రిమాండ్ 19వ రోజుకి చేరుకుంది ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► ఇప్పటికే రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు టీడీపీ & గ్యాంగ్ చిల్లర వేషాలు: వైఎస్సార్సీపీ ►చంద్రబాబు ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. ►అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు. ►ఇప్పుడు చంద్రబాబుకి రిమాండ్ విధించగానే.. కోర్టులు చెడ్డవి అయిపోయాయా? ►జడ్జిలపై టీడీపీ నేతలు అసభ్యకర కామెంట్స్ పెట్టడం.. వాళ్ల పైశాచికత్వానికి నిదర్శనం చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో టీడీపీ అండ్ గ్యాంగ్ చిల్లర వేషాలు వేస్తోంది. @ncbn ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు.. ఇప్పుడు బాబుకి రిమాండ్ విధించగానే కోర్టులు చెడ్డవి అయిపోయాయా? గౌరవ జడ్జిలపైనే సోషల్… pic.twitter.com/1PjfV0rabV — YSR Congress Party (@YSRCParty) September 27, 2023 -
Sep 26, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
CBN Arrest: Chandrababu Petitions Hearing Live Updates 9:25PM, సెప్టెంబర్ 26, 2023 ►రేపు(బుధవారం)సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 8:20PM, సెప్టెంబర్ 26, 2023 ►కొందరి భూముల ధరలను పెంచాలనే ఉద్దేశంతో ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ పూర్తిగా మార్చేశారు: సీఐడీ అధికారులు ►లింగమనేని భూములు కొన్నప్పుడు లోకేష్ హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్నారు ►తండ్రి చంద్రబాబుతో కలిసి లోకేస్ కుట్రపూరితంగా హెరిటేజ్ ద్వారా భూములు కొనుగోలు చేశారు ►కరకట్ట వద్ద లింగమనేని ఎస్టేట్‌ను అటాచ్ చేస్తూ ఇప్పటికే సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు కాదు: ఏజీ శ్రీరామ్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు కాదు ►కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది ►కింది కోర్టులో పీటీ వారెంట్‌పై పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సరికాదు 7:20 PM, సెప్టెంబర్ 26, 2023 రేపు చంద్రబాబుకు కోర్టుల్లో అత్యంత కీలకమైన రోజు ► సుప్రీంకోర్టులో రేపు బెంచ్ మీదకు రానున్న స్పెషల్ లీవ్ పిటిషన్ ► వాదనలు వింటారా, లేక కౌంటర్ ఫైల్ చేయమంటారా? ► హైకోర్టులో రేపు రింగ్ రోడ్ కేసులో మిగతా వాదనలు విననున్న న్యాయస్థానం ► హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో వాదనలు పూర్తి, బెయిల్‌పై తీర్పు రిజర్వ్ ► ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు బెంచ్ మీదకు వచ్చే అవకాశం ► త్వరలో ఉండవల్లి పిటిషన్, CBI, EDకి ఇవ్వాలంటూ కేసు బెంచ్ మీదకు వచ్చే అవకాశం 7:00 PM, సెప్టెంబర్ 26, 2023 బాబుకు గ్రహణం పట్టింది : మురళీ మోహన్ ► చంద్రబాబుకు గ్రహణం పట్టింది ► చంద్రుడికి గ్రహణం పడుతుంది, అయితే అది కొద్దిసేపే ► చంద్రబాబుకు పట్టిన గ్రహణం త్వరలోనే వీడుతుంది 6:30 PM, సెప్టెంబర్ 26, 2023 తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ ► పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం తర్వాత తొలి భేటీ ► హాజరైన యనమల, అచ్చెన్న, బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, బీసీ జనార్థన్ రెడ్డి ► జైల్లో చంద్రబాబు ఇచ్చిన బ్రీఫింగ్ను సభ్యులకు వివరించిన యనమల, అచ్చెన్న ► చంద్రబాబు అరెస్టు, ఇతర కేసు పరిణామాల పై చర్చ ► కోర్టుల్లో ఎందుకు ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి? ► అంత పక్కాగా ఆధారాలతో సహా చంద్రబాబు ఎలా దొరికిపోయాడు? ► లోకేష్ ఎందుకు ఢిల్లీలో ఉంటున్నాడు? అరెస్ట్ భయం ఇంకెన్నాళ్లు? ► లోకేష్‌ను A14గా నమోదు చేసిన ప్రభావం ఎలా ఉండొచ్చు? ► అచ్చెన్నాయుడు, నారాయణ, గంటా కేసుల సంగతేంటీ? ► ఎవరు జైల్లో ఉంటారు? ఎవరు బయట తిరుగుతారు? ► ఇప్పుడు జనసేనతో పొత్తు సంగతి ఎవరు తేలుస్తారు? ► పొత్తులో భాగంగా ఎవరి సీట్లు ఇవ్వాలి? ఏ ఏ జిల్లాపై ప్రభావం? ► క్షేత్రస్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ ► జనసేనతో ఎవరు సమన్వయం చేయాలి? ► ఎవరెవరు సీట్లు త్యాగాలు చేయాలి? ► అసంతృప్తి నేతలను ఎవరు బుజ్జగించాలి? ఆర్థిక వనరులెవరు అందించాలి? ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన లోకేష్, పార్టీ నేతలకు పలు సూచనలు 6:00 PM, సెప్టెంబర్ 26, 2023 రేపు సుప్రీంకోర్టులో లిస్ట్ అయిన బాబు పిటిషన్ ► కేసు డెయిరీ నెంబర్ 39500/2023 ► ఫైల్ : శనివారం, సెప్టెంబర్ 23, 2023 ► కేసు నెంబర్ : SLP(Crl) 012289/2023 ► కేసు లిస్టింగ్ : 27 సెప్టెంబర్ 2023 ► కేటగిరీ : అవినీతి నిరోధక చట్టం గురించిన క్రిమినల్ మ్యాటర్ 5:00 PM, సెప్టెంబర్ 26, 2023 నేను ఢిల్లీలో ఎందుకు ఉన్నానంటే.. : లోకేష్ ► మాపై పెట్టిన కేసుల గురించి లాయర్లతో మాట్లాడుతున్నాను ► ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నేతలను, ప్రముఖులను కలుస్తున్నాను ► వాళ్లందరికి మా కేసుల గురించి వివరిస్తున్నాను ► అందులో భాగంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశాం ► రింగు రోడ్డు కేసులో నన్ను చేర్చారు, కొన్ని పుకార్లు బయటికి వదులుతున్నారు ► అసలు రింగు రోడ్డే లేదు, నాపై కేసు ఎలా ఉంటుంది? ► తెలంగాణలో మా వాళ్లు శాంతియుతంగా ఆందోళన చేశారు ► దానికి కెటిఆర్ ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ► శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలిగించలేదు ► యువగళం పాదయాత్ర కోసం మళ్లీ అనుమతి కోరాం ► రేపు సుప్రీంకోర్టులో మా కేసు ఉంది 4:30 PM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా ► AP హైకోర్టు : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లోద్రా ► ప్రభుత్వం తరఫున రేపు వాదనలు వినిపించనున్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► రేపు 2.15pmకు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న AG శ్రీరామ్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ రేపటికి వాయిదా ► రేపు మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు రానున్న కేసు (చదవండి : రింగ్ రోడ్డు పేరిట అక్రమ మలుపులు) 4:20 PM, సెప్టెంబర్ 26, 2023 మార్గదర్శి కేసు: సుప్రీంకోర్టులో వాదనలు ► సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసు విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ► రెండు వారాలపాటు వాయిదా వేయాలని కోరిన రామోజీరావు న్యాయవాది ► సవాల్ చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి ► RBI నిబంధనలకు విరుద్ధంగా HUF పేరుతో రామోజీరావు డిపాజిట్లు సేకరించాడు ► డిపాజిటర్ల చెల్లింపుల వివరాలన్నిటిని సమర్పించాలని గత విచారణలో రామోజీ రావుకు ఆదేశం ► అసలు డిపాజిట్ల సేకరణ తప్పు : ఉండవల్లి ► తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్న ధర్మాసనం (చదవండి : మార్గదర్శి కుంభకోణమేంటీ.? రామోజీ సృష్టించిన మాయా ప్రపంచమేంటీ?) 4:00 PM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధమేంటీ? : మంత్రి KTR ► చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంశం ► చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ధర్నాలు, ర్యాలీలేంటీ? ► ఇక్కడి ఉద్యోగులకు చెబుతున్నా.. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దు ► హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయొద్దని చెబుతున్నాను ► ఇక్కడి ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరియర్ పాడు చేసుకోవద్దు ► తెలంగాణకు ఏపీ రాజకీయాలు తెచ్చి అంటించొద్దు ► ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వాలని లోకేష్ అడిగారు ► రాజకీయాల కంటే శాంతిభద్రతలే మాకు ముఖ్యమని చెప్పాం ► ఏపీ రాజకీయాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.? ► కోర్టులో ఉన్న సబ్ జ్యుడిష్ మ్యాటర్ మీద ఐటీ ఉద్యోగులు ఎందుకు రోడ్డెక్కాలి? ► ఇక్కడ ఉన్న వారికి కక్ష కార్పణ్యాలను నేర్పి రోడ్డు మీదకు ఎందుకు వదులుతున్నారు? ► తెలంగాణ ఉద్యమంలోనే ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు ► ఇప్పుడు ఐటి కారిడార్‌లో పరిస్థితిని దెబ్బతీసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ► సున్నిత అంశం అంటూ లోకేష్ ఫోన్ చేశారు, ఇలాంటివాటిపై సున్నితంగానే ఉండాలి 3:45 PM, సెప్టెంబర్ 26, 2023 AP హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లూథ్రా వాదనలు ► ఇన్నర్ రింగు రోడ్డు స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ► ఏపీ హైకోర్టులో వర్చువల్ గా బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు ► రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారు ► ఇన్నర్ రింగు రోడ్డు ఫైనల్ అలైన్మెంట్ జరిగి ఆరేళ్లవుతోంది ► ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటి వరకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు 3:35 PM, సెప్టెంబర్ 26, 2023 అప్పుడెందుకు రెచ్చిపోయాడు? ఇప్పుడెందుకు సానుభూతి? ► లోకేష్ తీరును తప్పుబట్టిన కొడాలినాని ► చంద్రబాబు అరెస్టైయితే లోకేష్ బిత్తర చూపులు చూస్తున్నాడు ► పీకండి....కొట్టండి....జైల్లో పెట్టండి అన్నాడు ► ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ► ఢిల్లీలో దాక్కుని ట్వీట్లు వేసుకుంటున్నాడు ► లోకేష్ పాదయాత్ర చేస్తే కేసులు పెట్టాల్సిన పనేముంది.? ► లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నాడు ► మేం లోకేష్ పేరు చిత్తు కాగితంపై కూడా రాయము..! ► ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని ప్రకటించిన లోకేష్ తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు? ► చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా? 3:30PM, సెప్టెంబర్ 26, 2023 ఇంకా కేరాఫ్ ఢిల్లీనే.. చినబాబు మదిలో ఎన్నో సందేహాలు ► ఇంకా దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమయిన నారా లోకేష్ ► అక్కడి నుంచే టీడీపీ ఎంపీలు, ముఖ్య నేతలతో మంతనాలు ► ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తారా? ► అరెస్ట్ చేస్తే ఏ జైలుకు పంపే ఆస్కారం ఉంటుంది? ► ఏపీకి రాకుండా ఢిల్లీలోనే గడిపిస్తే వచ్చే నష్టమేంటీ? ► ఏపీ పోలీసులు ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే అవకాశాలుంటాయా? ► నన్ను అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష అని ప్రచారం చేసుకోవచ్చా? ► చంద్రబాబునే పట్టించుకోవడం లేదు, రేపు నన్నెవరు పట్టించుకుంటారు? ► ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే నష్టమేంటీ? లాభమేంటీ? ► ఒక వేళ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తే.. వెంటనే అరెస్ట్ చేస్తారా? ► నేరుగా ప్రజల్లోకి వెళ్తే అందరి మధ్య అరెస్ట్ చేసే అవకాశముంటుందా? ► అసలు A14ని అరెస్ట్ చేయాలంటే ముందున్న 13 మంది తర్వాతేనా? లేక ఎప్పుడయినా చేయవచ్చా? ► టిడిపి ఎమ్మెల్యేలు, నేతలను ప్రశ్నలతో వేధిస్తోన్న లోకేష్ ► తప్పుడు కేసులు తెలుగుదేశాన్ని ఏం చేయలేవంటూ ప్రకటనలు ఇవ్వాలని సూచన 3:10 PM, సెప్టెంబర్ 26, 2023 యువగళం ఎందుకు చేయలేకపోతున్నానంటే.? : లోకేష్ ► నా పాదయాత్రను అడ్డుకునేందుకే జీవో నం.1 తెచ్చారు ► మళ్లీ యువగళం ఆరంభిస్తామనేసరికి కొత్త అడ్డంకులు ► రింగ్ రోడ్డు కేసులో నన్ను నిందితుడిగా (A14) చేర్చారు ► రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జి మూసేయించారు ► కేసులు పెట్టి అరెస్టులు చేసినా యువగళం ఆగదు 2:30PM, సెప్టెంబర్ 26, 2023 తప్పు చేయలేదని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? : TDPకి YSRCP సూటి ప్రశ్న ►చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారు: అసెంబ్లీలో మంత్రి గుడివాడ్ అమర్నాథ్ ►స్కిల్ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయి ►ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపింది. ►సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు ►సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదు ►చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్ టెండర్ కట్టబెట్టారు ►షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ►హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్లుగా పనిచేశారు ►2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎండగట్టారు 1:58 PM, సెప్టెంబర్ 26, 2023 స్కిల్ స్కామ్.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ► చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ► కొందరిని కొంతకాలం పాటే మోసం చేయగలరు ►చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చారు ►పక్కా ప్లానింగ్‌తోనే స్కిల్ స్కామ్ జరిగింది ►చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు ►ఏ విధంగా స్కిల్ స్కామ్ చేశారనేది అందరికీ అర్థమైంది ►లోకేష్ విదేశాల్లో చదివి ఫేక్ స్కామ్‌లపై స్పెషలైజేషన్ చేశాడు ►ఫేక్ ఎంవోయూలు ఎలా చేయాలో లోకేష్‌కు బాగా నేర్చుకున్నాడు ►కక్ష సాధింపు ప్రభుత్వానికి అవసరం లేదు ►స్కిల్ స్కామ్.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్‌గా మారిపోయింది :::దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య కామెంట్స్ 1:20 PM, సెప్టెంబర్ 26, 2023 అంగళ్లు కేసులో వాదనలు పూర్తి ► ఏపీ హైకోర్టులో అంగళ్ల విధ్వంసం కేసుకు సంబంధించి వాదనలు పూర్తి ► బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు విజ్ఞప్తి ► దాడికి ఉసిగొల్పింది, చేయించింది చంద్రబాబేనని వెల్లడించిన ప్రభుత్వ లాయర్ల ►అంగళ్లు విధ్వంసం కేసులో పోలీసుల తరఫున పొన్నవోలు వాదనలు ►అంగళ్లు విధ్వంసానికి కారణం చంద్రబాబే ►టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు: పొన్నవోలు ►చంద్రబాబు బెదిరించిన వీడియోను కోర్టకు చూపించిన పొన్నవోలు ► పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు 1:20 PM, సెప్టెంబర్ 26, 2023 ఆరు వ్యాక్యాల్లో అంగళ్లు కేసు 1. ప్రాజెక్టుల పరిశీలన పేరిట జులై/ఆగస్టు నెలల్లో గ్రౌండ్లోకి చంద్రబాబు, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అల్లర్లకు కుట్ర, ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్, పుంగనూరు హైవేపై మీటింగ్ పెట్టుకుని పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం 2. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో దాడి చేయాలని కుట్ర, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు 3. ఆగస్టు 4, శుక్రవారం మధ్యాహ్నం బాబు ఆదేశాలతో తెలుగుదేశం మూకదాడులు, తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డ పోలీసులు, కన్ను కోల్పోయిన కానిస్టేబుల్, మొత్తమ్మీద ఆస్పత్రి పాలైన 27 మంది 4. ముందుగానే 2వేలకు మందిని సమకూర్చుకున్న టిడిపి, ఘటనా స్థలంలో 5వేల సిమ్‌లు పని చేశాయని దర్యాప్తులో వెల్లడి 5. అన్నమయ్య జిల్లా అంగళ్లులో పోలీసులు, ప్రజలపై దాడులు, కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో అల్లర్లు, దాడులు, విధ్వంసం, టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు ఉన్నట్టు గుర్తింపు 6. పోలీసు వాహనాలు, ఆస్తుల విధ్వంసం, తగులబెట్టిన తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసుల కాల్పులకు దారి తీస్తేనే మైలేజ్ వస్తుందని భావించిన చంద్రబాబు, సంయమనం పాటించి ఆగిపోయిన పోలీసులు 12:50 PM, సెప్టెంబర్ 26, 2023 హైకోర్టు: అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ పిటిషన్ ► అన్నమయ్య జిల్లా అంగళ్లు గ్రామంలో అల్లర్లకు ఉసిగొల్పిన చంద్రబాబు ► ఈ ఘటనలో అమాయకులతో పాటు పోలీసులపై దాడి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు ► చంద్రబాబు ఉసిగొల్పడం, పక్కాగా కుట్ర చేసి దాడి చేసినట్టు ఆధారాలు ► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 12:30 PM, సెప్టెంబర్ 26, 2023 హైకోర్టు: రింగ్ రోడ్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ ► హైకోర్టులో అమరావతి రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసు ► మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వినే అవకాశం ►ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 12:15 PM, సెప్టెంబర్ 26, 2023 న్యాయస్థానాలపై నిందలు వేస్తారా? ► క్రిమినల్ కంటెంప్ట్ పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ ► హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన అడ్వొకేట్ జనరల్ ► చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరిన ఏజీ ► కేసును డివిజన్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన ఏజీ ► రేపు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణలకు దిగిన ఎల్లో గ్యాంగ్ ► క్రిమినల్ కంటెంప్ట్‌గా పరిగణించి చర్య తీసుకోవాలని కోరిన ఏజీ ► ఇప్పటికే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం ► జడ్జిలపై నిందలు, కామెంట్లు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన చీఫ్ సెక్రటరీని ఆదేశించిన రాష్ట్రపతి కార్యాలయం 12:10 PM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టులో బాబు భవితవ్యం ► రేపు సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయ్యే అవకాశం ► హైకోర్టులో రద్దయిన క్వాష్ పిటిషన్‌తోనే సుప్రీం తలుపు తట్టిన బాబు ► సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు 3 విన్నపాలు ► తనపై నమోదైన FIRను కొట్టేయాలని విజ్ఞప్తి ► జ్యూడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి ► తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి 12:05 PM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టు : బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ వల్ల సెలవు ► సెప్టెంబర్ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు ► సెప్టెంబర్ 30న శని, అక్టోబర్ 1న ఆదివారం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి వల్ల సెలవు ► రేపు వాదనలు జరగకపోతే అక్టోబర్ 3కు వాయిదా పడే అవకాశం ఉందంటున్న లాయర్లు 12:00 PM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు ► కాసేపట్లో సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై విచారణ ► విచారణ చేయనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ► కేసును 2 వారాల వాయిదా వేయాలని కోర్టుకు రామోజీ రావు తరపు న్యాయవాది లెటర్ ► RBI నిబంధనలకు విరుద్ధంగా HUF పేరుతో రామోజీరావు డిపాజిట్లు సేకరించడాన్ని పిటిషన్ లో సవాల్ చేసిన మాజీ MP ఉండవల్లి ► డిపాజిటర్ల చెల్లింపుల వివరాలన్నిటిని సమర్పించాలని గత విచారణలో రామోజీ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు ► అసలు డిపాజిట్ల సేకరణ తప్పని వాదిస్తున్న ఉండవల్లి ► గత విచారణలో ప్లీడింగ్స్ పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయస్థానం 11:26AM, సెప్టెంబర్ 26, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో లోకేష్ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 14వ నిందితుడిగా నారాలోకేష్ (A-14) ►నారా లోకేష్ పేరు చేరుస్తూ ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID (అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు వివరాలేంటీ?) 11:26AM, సెప్టెంబర్ 26, 2023 ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►కస్టడీ పిటిషన్‌పై విచారణ సైతం వాయిదా వేసింది ► జడ్జి లీవ్‌లో ఉండడంతో విచారణ వాయిదా ►నేడు విచారణ చేపట్టడం సాధ్యం కాదన్న ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ► కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా 10:52AM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టులో మెన్షన్ కాని చంద్రబాబు కేసు ►సుప్రీంకోర్టు లో ప్రారంభమైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ►విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ►చీఫ్ జస్టిస్ ముందుకు రాని చంద్రబాబు కేసు మెన్షనింగ్ ► సాధారణ కేసుల విచారణ ఇవాళ ఉండబోదని స్పష్టీకరణ ► ఇక రేపే సుప్రీం బెంచ్ ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ► రేపు లేకుంటే గనుక అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే ఛాన్స్ 10:44AM, సెప్టెంబర్ 26, 2023 ఏసీబీ కోర్టుకి చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న ప్రమోద్ కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ ►చంద్రబాబు కస్టడీ పొడిగింపుపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన బాబు లాయర్లు ►ఏసీబీ జడ్జి లీవ్‌తో.. నేడు విచారణ ఉంటుందా రేపటికి వాయిదా పడుతుందా? అనే దానిపై కొనసాగుతున్న సందిగ్దత 10:25AM, సెప్టెంబర్ 26, 2023 ఏసీబీ కోర్టులో పిటిషన్లు వాయిదా పడే ఛాన్స్? ►స్కిల్ స్కాంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మరోవైపు సీఐడీ కస్టడీ పిటిషన్ ►నేడు కూడా ఇరు పిటిషన్లపై కొనసాగాల్సిన వాదనలు ►అయితే ఇవాళ వ్యక్తిగత కారణాలతో ఏసీబీ జడ్జి సెలవు ►ఇన్చార్జిగా వేరే న్యాయమూర్తికి బాధ్యత అప్పగించే ఛాన్స్ ►లేకుంటే విచారణ రేపటికి వాయిదా ►వేరే జడ్జి బెంచ్‌పై కూర్చుంటే.. బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలని కోరనున్న చంద్రబాబు లాయర్లు ►మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరనున్న సీఐడీ ►చంద్రబాబు విచారణకు సహకరించట్లేదని ఇప్పటికే కోర్టుకు తెలియజేసిన సీఐడీ ►సీఐడీ పిటిషన్‌పై కౌంటర్ వేసిన బాబు లాయర్లు 09:30AM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంలో బాబు పిటిషన్‌పై నో క్లారిటీ ►సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై కొనసాగుతున్న అస్పష్టత ►నేటి చీఫ్ జస్టిస్ కోర్టు మెన్షన్ లిస్టు వెలువరించని రిజిస్ట్రీ ►చీఫ్ జస్టిస్ కోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిగే అవకాశం ►ఇప్పటివరకు చంద్రబాబు కేసును ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ►విచారణ తేదీని ఖరారు చేయని రిజిస్ట్రీ ►ఎల్లుండి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టు సెలవులు 09:17AM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు కేసు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో.. హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల వ్యవహారం ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన అడ్వొకేట్ జనరల్ ►ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో వెల్లడి ►గడచిన రెండు వారాల్లో పరిణామాలను వివరిస్తూ పిటిషన్ ►కోర్టుల గౌరవానికి భంగం కలిగించారు ►న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారు ►న్యాయవ్యవస్థకున్న విలువలను ధ్వంసంచేసేలా వ్యవహరించారు ►చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరిన ఏజీ 08:50AM, సెప్టెంబర్ 26, 2023 లీవ్‌లో ఏసీబీ జడ్జి.. సుప్రీం హాలీడేస్.. టీడీపీ నేతల్లో టెన్షన్ ►ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ ►ఇప్పటికే రెండు రోజుల కస్టడీ ఇంటరాగేషన్ చేపట్టిన సీఐడీ ►కానీ, విచారణలో సహకరించకపోవడంతో మరో ఐదురోజులు ఇవ్వాలని పిటిషన్ ►పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పైనా ఒకేసారి వాదనలు ►అయితే.. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు జడ్జి ఒకరోజు సెలవు! ►వాదనలు జరుగుతాయా లేదా రేపటికి వాయిదా పడతాయా అనే దానిపై రాని క్లారిటీ ►టీడీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్ ►సుప్రీంకోర్టులో మరో తరహా పరిస్థితి ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ తేదీని ఇవ్వనున్న సుప్రీంకోర్టు ►ఎల్లుండి నుంచి అక్టోబర్ రెండు వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 08:25AM, సెప్టెంబర్ 26, 2023 జడ్జిలను ట్రోలింగ్ చేస్తే ఉపేక్షించొద్దు ►సోషల్ మీడియాలో చంద్రబాబు కేసులపై వాదనలు వింటున్న జడ్జిల ట్రోలింగ్ ►జడ్జిలను ట్రోల్ చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రపతికి న్యాయవాదుల ఫిర్యాదు ►జడ్జిలను ట్రోల్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించిన రాష్ట్రపతి 08:04AM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై అసదుద్దీన్ ఒవైసీ ►చంద్రబాబు అరెస్ట్‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ►ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారు ►ఆయన ఎందుకు జైలుకెళ్లారో అందరికీ తెలుసు ►చంద్రబాబును నమ్మలేం, ప్రజలు కూడా నమ్మొద్దు ►ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయి... వైసీపీ, టీడీపీ ►ఏపీలో సీఎం జగన్ పాలన బాగుంది 08:02AM, సెప్టెంబర్ 26, 2023 నేడు టీడీఎల్పీ సమావేశం ►కిమ్ కర్తవ్యం? ►మన వాదన అంత బలంగా లేదు ►కేసు లో మనకు వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలు ►మద్ధతు కోసం చంద్రబాబు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు ►మన పార్టీ ని నమ్ముకున్న కొందరికి ఇప్పుడు మొండి చెయ్యి ►ఏమి చేద్దాం.. ఎలా ఒప్పిద్దాం? 08:00AM, సెప్టెంబర్ 26, 2023 అసలు గంట పాత్ర ఏంటి? ►గంటా అంటే గయ్ గయ్ ►నారాయణ పేరెత్తినా చంద్రబాబు చిర్రుబుర్రులు ►స్కిల్ స్కామ్ లో వారిద్దరి ప్రమేయంపై దాటవేత ►గంటా సుబ్బారావుకు ఏకకాలంలో నాలుగు పోస్టులు ►రిటైర్ట్ అధికారి, బాబు బాల్య మిత్రుడు లక్ష్మీనారాయణది కీలకపాత్ర ►వారిద్దరి ద్వారానే నకిలీ కుంభకోణం ►నిధుల తరలింపులో కీలకంగా పెండ్యాల, పార్ధసాని, యోగేష్ గుప్తా ►వారి ప్రస్తావన తేగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన చంద్రబాబు 07:52AM, సెప్టెంబర్ 26 సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు ►స్కిల్ స్కాం కేసులో సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడంతో పాటు ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ ►ఆగమేఘాల మీద ముందుకు రావడంతో నిన్న క్వాష్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించని చీఫ్ జస్టిస్ బెంచ్ ►నేడు లిస్టింగ్‌లో చేరుస్తామని బాబు లాయర్ లూథ్రాకు స్పష్టీకరణ ►అన్ని విషయాలూ మెన్షన్ చేయాలని లూథ్రాకు సీజేఐ సూచన ► సుప్రీంలో నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారణ స్వీకరించే అంశంపై రానున్న స్పష్టత 07:48AM, సెప్టెంబర్ 26 ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో పాటు అంగళ్లు విధ్వంసం కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం లో A1 గా ఉన్న చంద్రబాబు నాయుడు 07:37AM, సెప్టెంబర్ 26 ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కస్టడీ పిటిషన్, చంద్రబాబు బెయిల్ పిటిషన్లు 07:19AM, సెప్టెంబర్ 26 నిన్న కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబును సోమవారం ములాఖత్‌లో కలిసిన భార్య భువనేశ్వరి ,కోడలు బ్రాహ్మణి, పార్టీ నేత అచ్చెన్నాయుడు ►జైలు వేదికగా రాజకీయ చర్చలు ►బయటకు వచ్చాక అచ్చెన్నాయుడి ఓవరాక్షన్ ► జైలు అధికారులు పదే పదే చెబుతున్నా.. చంద్రబాబు భద్రతపై సందేహాలు ► సీఐడీ కస్టడీపైనా లేనిపోని ఆరోపణలు 06:30AM, సెప్టెంబర్ 26 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @17 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 17వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► జైలు శాఖ పటిష్ట భద్రత నడుమ చంద్రబాబు ►రోజూ ఇంటి భోజనానికి కోర్టు అనుమతి ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు ► రెండు రోజుల సీఐడీ కస్టడీలో కాలయాపన చేసిన వైనం ► దీంతో మరోసారి కస్టడీకి కోరిన ఏపీ సీఐడీ తప్పు చేయకుంటే.. ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా!: YSRCP ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఐడీ అధికారులు కూడా రెండేళ్లపాటు సుధీర్ఘంగా విచారణ చేశారు ►చంద్రబాబు పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు ►పాత్ర ఉందనడానికి తగిన రుజువులు కోర్టుకు సమర్పించారు ►కాబట్టే బాబును న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. ► తదనంతరం సీఐడీ కస్టడీకి అనుమతిచ్చింది. ►చంద్రబాబు ఏమాత్రం తప్పు చేయకపోతే పిటిషన్ల మీద పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ధైర్యంగా కేసును ఎదుర్కోవచ్చు కదా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఐడీ అధికారులు కూడా రెండేళ్లపాటు సుధీర్ఘంగా విచారణ చేసి.. చంద్రబాబు పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మీ నాయకుడిని అరెస్టు చేశారు @JaiTDP. ఈ స్కామ్‌లో @ncbn పాత్ర ఉందనడానికి తగిన రుజువులు కోర్టుకు సమర్పించారు కాబట్టే ఆయన్ను న్యాయస్థానం జ్యుడీషియల్… https://t.co/6UHlDX77nD — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 -
Sep 25, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
CBN Case Live Updates 6:52PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకు సింపతీ డ్రామాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు ►ఇది వాళ్లకు కొత్తేం కాదు ►డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ ►ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 5:50 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు పనులకు అక్షింతలు వేసిన కాగ్ ► అమరావతి రాజధాని ప్లాన్‌పై కాగ్ సంచలన నివేదిక ► CRDA వల్ల రాష్ట్రం పై భారీ ఆర్థిక భారం ► వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా CRDA వల్ల ఆర్థిక భారమే ► నిపుణుల కమిటీ సిఫార్సులను నాడు చంద్రబాబు సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు ► మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు ► సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ.28 కోట్లు ఇవ్వడం తప్పు ► నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారు 5:35 PM, సెప్టెంబర్ 25, 2023 అమవాస్య చీకటిలో తెలుగుదేశం : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ► చంద్రబాబు అరెస్ట్‌తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది ► బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ► టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చేయాలి ► అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ కనీస గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు ► అచ్చెన్నాయుడు పనికిరాడనే పవన్‌ను తెచ్చుకున్నట్టున్నాడు ► చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయి ► అమావాస్య చీకటిలో టీడీపీ కూరుకుపోయింది 5:15 PM, సెప్టెంబర్ 25, 2023 లోకేష్‌కు అరెస్ట్ భయం లేదు ► లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు : అచ్చెన్నాయుడు ► సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడుతున్నారు ► నేషనల్ మీడియాకు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు ► లోకేష్‌కు అరెస్ట్ అంటే భయమేమీ లేదు ► నన్ను కూడా అరెస్ట్ చేసినా భయమేమీ లేదు ► నాకు కూడా కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు 5:00 PM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ ముగిసింది ► చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్ ► సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం ► బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం ► కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులు వివరించిన బృందం 4:00 PM, సెప్టెంబర్ 25, 2023 కేసులు ఇవి, స్టేటస్ ఇది ► జైల్లో చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇవ్వనున్న కుటుంబ సభ్యులు ► రిమాండ్ తర్వాత చంద్రబాబును మూడోసారి కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి ► లోకేష్ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్ గురించి వివరించనున్న కుటుంబ సభ్యులు ► జనసేన నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు వివరించనున్న కుటుంబ సభ్యులు 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 భువనేశ్వరీ వ్యాఖ్యలను తప్పుబట్టిన YSRCP ► చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిందే మీ నాన్న ఎన్టీఆర్ ► మీ నాన్న స్వయంగా చెప్పినా.. ఇంకా చంద్రబాబుకే మద్ధతిస్తారా? నక్కను తెచ్చి మీరు సింహం అని లేనిపోని ఎలివేషన్లు ఇవ్వకండి మేడం. ముసలి నక్క గర్జించినా ఏమీ కాదు. ఆయనేమీ చేసేది ఉండదు. ఆయన్ను గొడ్డుకన్నా హీనం.. పశువుకన్నా ఘోరం అని మీ నాన్న ఎన్టీఆర్ గారే స్వయంగా చెబితే మీరేమో ఆయన్ను సింహం అంటుంటే ప్రజలకు నవ్వొస్తోంది.. మీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో మీ… https://t.co/bJHolk6EM3 — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 రాజమండ్రి జైల్లో బాబుతో ములాఖత్‌కు అచ్చెన్నాయుడు ► చంద్రబాబును కలిసేందుకు జైలుకు వచ్చిన భువనేశ్వరీ, బ్రాహ్మణి ► బాబు కుటుంబ సభ్యులతో పాటు జైలుకు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి ► పార్టీ సీనియర్ నేతలతో వరుసగా బాబు మంత్రాంగం ► ఇటీవలే జైల్లో యనమలతో ములాఖత్ అయిన చంద్రబాబు ► అనుమతి లేకపోవడంతో జైలు బయటే ఆగిపోయిన ప్రత్తిపాటి 3:45 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో బాబు పిటిషన్ల హోరు ► సాంకేతిక కారణాల కోసం బాబు లాయర్ల తాపత్రయం ► అరెస్ట్ సమయంలో CID అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్ ► తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్ ► కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ లూథ్రా విజ్ఞప్తి ► కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపిస్తోన్న బాబు లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో విచారణ రేపటికి వాయిదా ► చంద్రబాబుకు సంబంధించి వరుస పిటిషన్లు ► కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని పట్టుబట్టిన బాబు లాయర్లు ► ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని చెప్పిన కోర్టు ► అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడుతామన్న కోర్టు 3:30 PM, సెప్టెంబర్ 25, 2023 రూల్స్ ఏం చెబుతున్నాయి? కస్టడీనా? బెయిలా? ► CRPC ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటున్న లాయర్లు ► జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్న లాయర్లు ► కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటోన్న లాయర్లు ► కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందంటున్న లాయర్లు 3:15 PM. సెప్టెంబర్ 25, 2023 షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తమ్ముళ్లే : CID ► బాబు సృష్టించిన షెల్ కంపెనీకి డైరెక్టర్లంతా బాబు అనుచరులే ► షెల్ కంపెనీ డైరెక్టర్లుగా సుమన్ బోస్, వికాస్ కన్విల్కర్ ► షెల్ కంపెనీ ఖాతాల నుంచి బాబు చెప్పిన ఖాతాలకు డబ్బు రూటింగ్ ► ఆధారాలు చూపించి ప్రశ్నలడిగినా బాబు నోరు మెదపట్లేదు ► విచారణలో ఏ రకంగా సహకరించడం లేదు ► చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, ఘంటా సుబ్బారావు, డా.లక్ష్మీనారాయణ పాత్రలపై ఆధారాలున్నాయి ► ఈ ఆధారాలను చూపించి కుట్ర కోణం అడిగితే.. చంద్రబాబు నోరు మెదపట్లేదు 2:45PM. సెప్టెంబర్ 25, 2023 ఖాతాల్లోకి వచ్చిన కోట్లు ఎక్కడివి? ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం ► నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి CID దగ్గర పక్కా ఆధారాలు ► 2014-18 మధ్య స్కిల్ కుంభకోణం ► 2018 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కౌంట్లకు తరలివచ్చిన భారీగా నిధులు ► ఈ అక్కౌంట్లు అన్నింటికీ సంతకం హోదా ఉన్నది చంద్రబాబుకే ► పార్టీకి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, హైదరాబాద్ జోన్ ఖాతాలో భారీగా డిపాజిట్లు ► వాటి లెక్క చెప్పేందుకు నిరాకరించిన చంద్రబాబు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 మహిళల్లో శక్తి ఉంది, దేన్నయినా నడిపించగలరు : భువనేశ్వరీ ► టిడిపి నాయకత్వంపై చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వరీ కీలక వ్యాఖ్యలు ► దేవుడు ఉన్నాడు, నన్ను ముందుకు నడిపించగలడు ► మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగా నడిపించగలరని నమ్ముతున్నాను ► మనలో దుర్గాదేవీ శక్తి ఉంది, ఝాన్సీ రాణీ పట్టుదల ఉంది ► నాకు పెళ్లయిన కొత్తలో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు ► కేవలం మూడు నెలల్లో సంస్థను నడిపించడం నేర్చుకున్నాను ► మహిళలు కుటుంబాన్నే కాదు, దేన్నయినా నడిపించగలరు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► ఏపి హైకోర్టులో శనివారం దాఖలైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన క్వాష్ పిటిషన్ ► ఇప్పటికే కస్టడీ ముగిసినందున అర్హత కోల్పోయిన పిటిషన్ ► నేడు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు సామ్రాజ్యం విలువ ఎంత? : YSRCP ► జగ్గంపేటలో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించిన భువనేశ్వరీ ► మా కంపెనీలో మాకున్న వంద శాతం షేర్లలో 2% అమ్ముకుంటే రూ.400 కోట్లు ► భువనేశ్వరీ లెక్క ప్రకారం 1%=రూ.200 కోట్లు, 100%=రూ.20వేల కోట్లు ► ఈ లెక్కన కేవలం హెరిటేజ్‌లో చంద్రబాబు కుటుంబానికి ఉన్న షేర్ల విలువ రూ.20వేల కోట్లు.! ► ఇవీ కాక, మెట్రో నగరాల్లో, దేశ విదేశాల్లో వందలాది ఎకరాలు, వేల కోట్ల విలువ చేసే ఇతర ఆస్తుల విలువ ఎంత? ► హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఇంటి విలువ ఎంత? మదీనాగూడ 14 ఎకరాల ఫాంహౌజ్ విలువ ఎంత? ► ఎన్నికల సంఘం లెక్కల్లో ఎన్ని ఆస్తులు చూపించారు? ఎంత విలువ కట్టారు? మా కుటుంబం అంతా ఒకటే నమ్ముతాం... మా కుటుంబానికి ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ముకు ఆశపడితే ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది. #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/SqVhXhFpte — Telugu Desam Party (@JaiTDP) September 25, 2023 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 రంగంలోకి భువనేశ్వరీ, బ్రాహ్మణి ► లోకేష్ ఇప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం లేదా.? ► గత పది రోజులుగా ఢిల్లీకే పరిమితమయిన లోకేష్ ► లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ నేతృత్వంపై చర్చ ► గత కొద్ది రోజులుగా బ్రాహ్మణి రావాలని ఎల్లో మీడియా డిమాండ్ ► బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమయిందంట సంపాదకీయాలు ► బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఎల్లో మీడియా ప్రత్యేక డిబేట్ ► దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణి, భువనేశ్వరీ కార్యాచరణ ప్రణాళిక ► నిన్నంతా రాజకీయ సమావేశాలు నిర్వహించిన బ్రాహ్మణి ► పొత్తులో భాగంగా జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై బ్రాహ్మణి చర్చలు ► ఇవ్వాళ జగ్గంపేట ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరీ ► భవిష్యత్ పార్టీ పగ్గాల విషయంలో ఎల్లోమీడియా డైరెక్షన్లో టిడిపికి స్పష్టత ఇస్తోన్న బ్రాహ్మణి, భువనేశ్వరీ ► చంద్రబాబు ఔట్ సోర్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని YSRCP విమర్శలు “చంద్రబాబు అవుట్ సోర్సింగ్ రాజకీయాలు” చంద్రబాబు రాజకీయాలు మొత్తం పక్కరాష్ట్రం నుంచి అవుట్ సోర్సింగ్ మీదనే నడిపిస్తున్నారు. అయన ఏపీ నివాసి కాదు, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి సైతం హైదరాబాదీలే.. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో… — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 1:25 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు కస్టడి పొడిగించండి : CID పిటిషన్ ► విజయవాడ ACB కోర్టులో సీఐడీ పిటిషన్ ► సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించలేదు ► మొదటి రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించ లేదు ► అందుకే మరో 3 రోజులు కస్టడీ పొడిగించాలని కోరుతున్నాము ► కేసు ఇప్పుడు కీలక విచారణ దశలో ఉంది ► కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై మా వాదనలు వినాలి : CID ► పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మెమో ఫైల్ చేయాలని CIDకి జడ్జి ఆదేశం ► ముందు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలి : చంద్రబాబు లాయర్లు ► కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తవగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామన్న కోర్టు 1:22 PM, సెప్టెంబర్ 25, 2023 మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే కోర్టు మీద నిందలేస్తారా? ► రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు ► కొందరు సొంత లబ్ది కోసం జర్నలిజానికి భ్రష్టు పట్టిస్తున్నారు ► కోర్టు మీద విమర్శలు చేసి జర్నలిజాన్ని చంపేశారు ► ఓ వర్గం మీడియా సమాంతర వ్యవస్థను నడుపుతోంది, అన్నీ తాను చెప్పినట్టుగా జరగాలంటోంది ► న్యాయ వ్యవస్థను కొన్ని ఛానెల్స్ కించపరుస్తున్నాయి 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు స్థాయి ఏంటో తెలుసా? : భువనేశ్వరీ ► మా కుటుంబానికి వ్యాపారాలున్నాయి ► నేను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నా ► నా సంస్థలో 2శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి ► ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారు ► ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఏటా రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాం 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? : అంబటి ► చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని అనుకుంటున్నవారికి ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి ► ఈ కేసులో సమగ్ర ఆధారాలు బయటపడుతుండడంతో ప్రజలకు అన్నీ అర్థం అవుతున్నాయి ► గతంలోలా సమాజమంతా ఎల్లో మీడియా మీద ఆధారపడనవసరం లేదు ► ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు ► ఒకాయిన ఢిల్లీలో ఉన్నాడు, మద్దతు ఇచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ► స్కాముల రూపంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం జరిగింది 12:55 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది చట్టం చేస్తున్న పని, దీనికి రాజకీయాలతో సంబంధమేంటీ? ► చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన సినీ నటుడు సుమన్ ► మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సుమన్ ► జైల్‌కు వెళ్లాడంటే సీఎం జగన్ చేశారంటున్నారు కానీ అది సరికాదు ► ఒకరు జైలుకు వెళ్లారంటే దాని వెనక చాలా కారణాలుండొచ్చు ► ఆ అరెస్ట్ గురించి నిర్ణయించే బాధ్యత కోర్టులపై ఉంటుంది ► మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అధికారులు అన్ని ఆలోచించే వుంటారు ► టైం బాగుంటే లోకల్ కోర్టులో కూడా అనుకూలంగా వస్తుంది ► టైం బాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ► చంద్రబాబు బయటకు ఎప్పుడు వస్తాడో జ్యోతిష్యులు చెప్పగలరేమో.! 12:48 PM, సెప్టెంబర్ 25, 2023 మరిన్ని రోజులు కస్టడీ కోరిన సీఐడీ ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు ►ముందు కస్టడీ పిటిషన్ వాదనలు వినాలని కోరిన సీఐడీ ►కస్టడీలో చంద్రబాబు సహకరించలేదంటున్న సీఐడీ ►కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను ఆదేశించిన జడ్జి 12:22 PM, సెప్టెంబర్ 25, 2023 దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు: అంబటి స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మంత్రి అంబటి అసెంబ్లీలో మాట్లాడారు ►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు ►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది ►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది ►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు ►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు ►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం ►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు ► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు 12:00 PM, సెప్టెంబర్ 25, 2023 మరో 3 రోజులు కస్టడీ కావాలి : CID ► ACB కోర్టులో మరోసారి కస్టడీ పిటీషన్ దాఖలు చేసిన CID ► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని తెలిపిన CID ► మరో మూడు రోజులు విచారణ జరుపుతామని విజ్ఞప్తి 11:45AM, సెప్టెంబర్ 25, 2023 తాజా పరిణామాలపై పక్కాగా ప్రిపేరయిన CID ► ఈ కేసులో కీలకమయిన వ్యక్తులు దేశం విడిచి పారిపోతున్నారు ►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు ►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతున్నారు ►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది ►చంద్రబాబు బెయిల్ విషయంలో పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతోన్న CID 11:32AM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో మధ్యాహ్నం తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ ► మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంద్రబాబు బెయిల్ పిటీషన్లు, పిటి వారెంట్లపై విచారణ ► బెయిల్‌పై ఇరుపక్షాల వాదనలు వింటామన్న ACB కోర్టు ► ACB కోర్టుకి చేరుకున్న కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ ఆధ్వర్యంలోని సిట్ బృందం 11:30AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు SLP ► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ► 284 పేజీలతో SLP దాఖలు చేసిన బాబు లాయర్ల బృందం ► చంద్రబాబుకు తక్షణం ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తి ► ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 11:25AM, సెప్టెంబర్ 25, 2023 అరెస్ట్‌పై చర్చించేందుకు అసెంబ్లీకి రారా? ► చర్చిస్తామని చెప్పిన టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు బాయ్‌కాట్ చేశారు? : YSRCP ► ఈ కేసుపై సమగ్రంగా చర్చిద్దాం, రండి సభకు వచ్చి మాట్లాడండి : YSRCP స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 11:15AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో తెలుగుదేశం వరుస పిటిషన్లు ► క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం నేతలు ► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు ► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు ► ఈ FIRను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న ► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో FIRను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్ ► ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు 11:00AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబు వరుస పిటిషన్లు ► పిటిషన్లతో కోర్టును ఇరకాటంలో పెడుతోన్న చంద్రబాబు లాయర్లు ► సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు ► ప్రతీ పిటిషన్ అర్జంటుగా స్వీకరించి వాదనలు వినాలంటూ విజ్ఞప్తులు ► సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే ► పిటిషన్ ఎప్పుడు విచారించాలన్నది కోర్టు చూసుకుంటుందన్న న్యాయమూర్తి 10:55AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీం ముందుకు రేపు చంద్రబాబు పిటిషన్ ► రేపు విచారణ తేదీని ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు ► త్వరంగా తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను విజ్ఞప్తి చేసిన లూథ్రా ► చంద్రబాబును ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని అడిగిన సీజే ► ఈ నెల 8న అరెస్ట్ చేశారన్న లుత్రా ► కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన సీనియర్ న్యాయవాది లూథ్రా ► సరే, ఇప్పుడెందుకు అన్ని వివరాలు రేపే మెన్షన్ చేయమన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ► పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని చెప్పిన చీఫ్ జస్టిస్ 10:45AM, సెప్టెంబర్ 25, 2023 మధ్యాహ్నం తర్వాత ములాఖత్‌లు ► రాజమండ్రి : మధ్యాహ్నం తర్వాత సెంట్రల్ జైల్లో చంద్రబాబు ములాఖత్ ► చంద్రబాబును కలవనునున్న భువనేశ్వరీ, బ్రహ్మణి, టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ► మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న నారా భువనేశ్వరి ► అన్నవరం సత్యన్నారాయణ స్వామి వారి దర్శనం చేసుకోనున్న భువేనేశ్వరి ► అక్కడినుంచి జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లనున్న భువనేశ్వరి ► మధ్యాహ్నం తర్వాత రాజమండ్రికి వచ్చి ములాఖత్‌లో చంద్రబాబును కలవాలని ప్రోగ్రామ్ 10:35AM, సెప్టెంబర్ 25, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ వల్ల సెలవు ► సెప్టెంబర్ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు ► సెప్టెంబర్ 30న శని, అక్టోబర్ 1న ఆదివారం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి వల్ల సెలవు ► ఇవ్వాళ బెంచ్ కేటాయిస్తేనే 28లోపు వాదనలు జరిగే అవకాశం ► ఇదే విషయాన్ని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించాలని సిద్ధార్ధ్ లూథ్రా నిర్ణయం ► తన పిటిషన్‌పై వెంటనే పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలని కోరనున్న సిద్ధార్ధ్ లూథ్రా 10:30AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► ఇవాళ హైకోర్టు ముందుకు మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ పిటిషన్ ► తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ నారాయణ పిటిషన్ ► నాలుగు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ 10:26AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో స్టేటస్ ఏంటీ? ► సుప్రీంకోర్టుకు మరోసారి నేడు చంద్రబాబు లాయర్లు ► చంద్రబాబు పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరనున్న న్యాయవాదులు ► ఈ నెల 23న (శనివారం) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ► చంద్రబాబు పిటిషన్‌ను ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ► ఇవ్వాళ ఏ బెంచ్ అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ► రేపు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని బాబు లాయర్ల విజ్ఞప్తి 10:16AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు ముఖ్యమైన అంశాలు ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ప్రమోద్ దూబే ►చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న CID ►ఇంకోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారించాలని కూడా కోరిన సీఐడీ 09:48AM, సెప్టెంబర్ 25, 2023 ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే ►తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? ►అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు ►ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే :::ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 09:25AM, సెప్టెంబర్ 25, 2023 అవినీతి బయటపడుతుందనే.. అసెంబ్లీ బాయ్‌కాట్ ►స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. ►చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. ►వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 09:20AM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి: మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి 08:59AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంలో పెండింగ్ కేసుగా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరేందుకు బాబు తరపు న్యాయవాదుల ప్రయత్నాలు ►ఓరల్ మెన్షన్ జాబితాలో కనిపించని బాబు కేసు ►ఈనెల 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు ►బాబు పిటీషన్ ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ►పెండింగ్ కేసు గా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 08:40AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దు: సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ►మరో మూడు రోజులపాటు చంద్రబాబు కస్టడీ పొడిగించాలని.. ఏసీబీ కోర్టును సీఐడీ కోరే అవకాశం ►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారంటున్న సీఐడీ ►ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సీఐడీ ►మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు ►బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్లో పేర్కొన్న సీఐడీ 08:03AM, సెప్టెంబర్ 25, 2023 నేడు వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసులపై విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కాంలో సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ స్కాంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు క్వాష్ పిటిషన కొట్టివేతపై సుప్రీం కోర్టులో సవాల్ 07:16AM, సెప్టెంబర్ 25, 2023 స్కిల్ కేసుల్లో కస్టడీ పిటిషన్ ఛాన్స్ ►చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసే ఛాన్స్ ► రెండు రోజుల విచారణలో కాలయాపన చేసినట్లు చెబుతున్న సీఐడీ వర్గాల/ ► ఇంతకు ముందు ఐదు రోజులు కోరితే.. 2 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు ► శని, ఆదివారాల్లో మొత్తం కలిపి 12 గంటలపాటు ఇంటరాగేష్ చేసిన సీఐడీ బృందం ►కీలక డాక్యుమెంట్లు ముందు ఉంచి ప్రశ్నించినా.. దాటవేత ప్రదర్శించిన చంద్రబాబు ► మరో మూడు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేసే అవకాశాలు 06:52AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుతో నేడు కుటుంబ సభ్యుల ములాఖత్! ►16వ రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు రిమాండ్ ►నేడు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ►ఉదయం ఎనిమిది గంటలకు ములాఖత్ కోసం జైళ్ల శాఖను అనుమతి కోరనున్న నారా భువనేశ్వరి 06:48AM, సెప్టెంబర్ 25, 2023 రిమాండ్ పొడిగింపుతో మరికొన్ని రోజులు జైల్లోనే చంద్రబాబు ►స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ దాకా రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు ►ఆదివారంతో ముగిసిన సీఐడీ కస్టడీ ►ఆదివారంతోనే ముగిసిన రిమాండ్ కూడా ►కస్టడీ ముగిశాక వర్చువల్‌గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపర్చిన అధికారులు ►కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడే అంతా అయిపోలేదని చంద్రబాబుతో వ్యాఖ్యానించిన జడ్జి ► బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపడతామని వ్యాఖ్య ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ► వరుస పిటిషన్ల నేపథ్యంతో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి సీరియస్ -
మరో 11 రోజులు జైల్లోనే చంద్రబాబు
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను ఆదివారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 05 తేదీ దాకా ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ జడ్జి.. తక్షణమే ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆయన మరో 11 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఈ తరుణంలో రెండు రోజుల కస్టడీ విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఆదివారం సాయంత్రం వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టారు. చంద్రబాబు విచారణలో సహకరించలేదని.. అందుకే ఆయన రిమాండ్‌ను పొడిగించాలని మోమో దాఖలు చేసింది సీఐడీ. పరిశీలించిన న్యాయమూర్తి, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబును ఆరా తీసిన జడ్జి వర్చువల్‌గా హాజరైన చంద్రబాబును జడ్జి కొన్ని విషయాలు అడిగారు. విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని చంద్రబాబును ప్రశ్నించగా.. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అలాగే.. వైద్య పరీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించగా.. నిర్వహించారు అని సమాధానం ఇచ్చారాయన. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా?.. ఏమైనా అసౌకర్యం అనిపించిందా? అనే ప్రశ్నలకు.. అలాంటిదేమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దీంతో జడ్జి.. ‘‘మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు, మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఇప్పుడే అంతా అయిపోలేదు. బెయిల్ పిటిషన్‌పై రేపు(సెప్టెంబర్ 25, సోమవారం) వాదనలు వింటాం’’ అని చంద్రబాబుకి స్పష్టం చేసింది. చంద్రబాబు లాయర్లపై అసహనం సీఐడీ పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో.. సదరు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? అని బాబు లాయర్లను ప్రశ్నించారు ఏసీబీ జడ్జి. ‘‘ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది’’అని చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని, ఏసీబీ జడ్జి మందలించారు. అదే సమయంలో ‘‘ విచారణలో ఇప్పటిదాకా ఏం గుర్తించారనేది బయటపెట్టాలి’ అని చంద్రబాబు, ఏసీబీ జడ్జిని కోరారు చంద్రబాబు. అయితే.. విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి, ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ ఇప్పటికే సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పత్రాలను మీ లాయర్లను అడిగి తీసుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. కస్టడీ పొడిగింపు కోరాల్సి ఉంది సీఐడీ కస్టడీలో.. విచారణకు చంద్రబాబు సహకరించలేదు. అందుకే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం. చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. సీఐడీ కస్టడీ పొడిగించమని కోరలేదు. రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం అని సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద మీడియాకు వెల్లడించారు. -
ఇంటరాగేషన్‌లో ముద్దాయికి 50 ప్రశ్నలు!
సాక్షి, తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రథమ ముద్దాయి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తొలిరోజు సీఐడీ కస్టడీ విచారణ Interrogation ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబును.. శనివారం మొత్తంగా ఏడు గంటలపాటు ప్రశ్నించింది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడి నేతృత్వంలోని బృందం. అలాగే.. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే విచారణ ముగించిన సీఐడీ.. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబు విచారణ కొనసాగింది. శనివారం ఉదయం, మధ్యాహ్నాం రెండు దఫాలుగా ప్రశ్నించారు అధికారులు. ఫస్ట్ హాఫ్‌లో దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. భోజన విరామంతో పాటు విచారణలో మొత్తం నాలుగుసార్లు బ్రేకులు ఇచ్చారు. బాబు వయసు రీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ.. యాభై ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా చంద్రబాబును ప్రశ్నించింది సీఐడీ. స్కిల్ స్కాంలో కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు.. సాక్ష్యాధారాల మాయంపైనా సీఐడీ ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?. ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా.. నిధులు ఎందుకు విడుదల చేశారు?. యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?.. లాంటి ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. సుమన్ బోస్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?. ఆయనతో గంటా సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి?. సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?. ఈ స్కామ్‌లో బాబుతో పాటు అచ్చెన్నాయుడి పాత్ర ఏంటి?. మూడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్.. డిస్కౌంట్‌గా ఎందుకు మారింది?. రూ. 3 వేల కోట్ల గురించి అడగొద్దని అధికారుల్ని ఎందుకు దబాయించారు? లాంటి ప్రశ్నలూ సంధించినట్లు సమాచారం. అయితే వాటిని ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించారనేది సీఐడీ కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాతే తెలిసేది. బాబు తరపు లాయర్లు దమ్మలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో.. చంద్రబాబు స్టేట్మెంట్ను పకడ్బందీగా రికార్డ్ చేశారు సీఐడీ అధికారులు. మరోవైపు విచారణ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల అలర్ట్ అయ్యారు. విచారణ జరిగాక.. స్థానిక గెస్ట్‌హౌజ్‌కి వెళ్లింది సీఐడీ అధికారుల బృందం. రేపు(సెప్టెంబర్ 24, ఆదివారం) కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబును విచారించనుంది సీఐడీ. ఇదీ చదవండి: ఫస్ట్ టైం.. ‘బ్లూజీన్’తో కోర్టులో హాజరైన చంద్రబాబు -
వ్యూహాత్మకంగా చంద్రబాబు విచారణకు సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో.. చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? ఎలా విచారించాలి? అనేదానిపై సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన నిందితుడు.. అంతిమ లబ్ధిదారుడు కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కస్టడీ నుంచి వీలైనంత కీలక సమాచారం రాబట్టాలని భావిస్తోంది ఏపీ సీఐడీ. చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో ఏం జరగబోతోంది?.. ఏ విధంగా సీఐడీ విచారణ చేయనుంది? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు పర్మిషన్ లభించిన నేపథ్యంలో సీఐడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారుల బృందం వెళ్లనుంది. మెరికల్లాంటి అధికారుల్ని ఇప్పటికే ఏపీ సీఐడీ కస్టడీ విచారణ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో చంద్రబాబును ప్రశ్నించే అధికారుల జాబితాను ఇప్పటికే సీఐడీ కోర్టుకు సమర్పించింది కూడా. శనివారం ఉదయం నుంచే ఆధికారులు విచారణ చేపట్టే విధంగా సిద్ధం అవుతున్నారు. కోర్టు నిర్దేశించిన టైం ప్రకారం ఉదయం 9.30గం. నుంచి సాయత్రం 5గంటల దాకా.. తిరిగి ఆదివారం సైతం ఇదే సమయంలోనే విచారణ చేపట్టనుంది. లంచ్, టీ బ్రేక్‌లకు మినహా మిగిలిన సమయం అంతా విచారణకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. కోరింది ఐదురోజులు అయినప్పటికీ.. రెండే రోజులు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాబట్టి.. తక్కువ సమయం ఉండటం వల్ల వీలైనంత ఎక్కువ సమయం విచారణకు వాడుకోవాలనేది సీఐడీ వ్యూహంగా కనిపిస్తోంది. రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి వీలైనంత ఎక్కువగా సమాచారం రాబట్టాలి.. ఇది ఇప్పుడు సీఐడీ ముందున్న టాస్క్. ఈ మేరకు ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు ఏ విధంగా ముడుపులు చేరాయో తేల్చే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ విధంగా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వరకు వచ్చిందో తేల్చడమే కస్టడీలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు పాత్రపైన సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో చంద్రబాబు మీటింగ్‌లపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వద్దన్నా.. ఎందుకు అలా చేశారు? కేవలం షెల్ కంపెనీలు ముడుపుల వ్యవహారం మాత్రమే కాకుండా… కేసులో ఏవిధంగా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి చేశారనే విషయంపైనా సీఐడీ దృష్టి సారించింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటులో క్యాబినెట్ అప్రూవల్ లేకపోడం నుంచి మొదలు ఏవిధంగా అధికార దుర్వినియోగం జరిగిందనే విషయంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు బలవంతపెట్టి వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో సీఐడీ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిపి విచారించేందుకు ఈ కేసులో ఉన్న నిందితులను పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్‌బీ కూడానా? కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించపోతే ఏం చేయాలి?.. ఈ విషయంపైనా సీఐడీ అధికారులు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ప్లాన్ బీ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే.. కస్టడీ పిటిషన్ పొడిగించాలనే విజ్ఞప్తితో పాటు విచారణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని కోర్టుకు తెలపాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. సీఐడీ విచారణలో చంద్రబాబును షాక్ గురిచేసే కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పక్కా ఆధారాలతో ఈ స్కామ్‌లో దొరికిన చంద్రబాబును కస్టడీకి తీసుకోవడం ద్వారా కీలకమైన విషయాలనే సీఐడీ బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
పట్టాభిరామ్ ఓవరాక్షన్‌పై టీడీపీ నేతల సీరియస్
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ నేత పట్టాభి రామ్ ఇవాళ రాజమహేంద్రవరంలో అతి చేశారు. స్కిల్‌స్కాంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుపై వీరవిధేయత ప్రదర్శించే క్రమంలో.. జైలు బయట పట్టాభి రాం మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై ఆయన చేసిన తొందరపాటు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇప్పుడు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌లోనే.. గతంలో తాను ఉన్నానంటూ ఆ జైలుతో పట్టాభి తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. క్వాష్ పిటిషన్ చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందని పట్టాభి మాట్లాడారు. ఈరోజో లేదంటే రేపో.. కోర్టు ఫార్మాలిటీస్ పూర్తై చంద్రబాబు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారంటూ పట్టాభి వ్యాఖ్యానించారు. వచ్చిన మరుక్షణం.. జనసేన అధినేత పవన్‌తో కలిసి యుద్దం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పట్టాభి స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే కాసేపటికే ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో.. తీర్పు రాకముందే పట్టాభి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. తీర్పు రాకముందే చంద్రబాబు బయటకు వస్తారని ఎలా మాట్లాడతారు అంటూ పట్టాభిపై అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది. -
మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్
సాక్షి, చెన్నై: మదురై కేంద్ర కారాగారంలో రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు న్యాయవాది పుగలేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఖైదీలు సిద్ధం చేసిన వస్తువుల్ని ప్రభుత్వ ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు తరలించినట్టుగా గణాంకాల్లో జైళ్లశాఖపేర్కొని ఉన్నట్టు సమాచార హక్కు చట్టం మేరకు వివరాల్ని పుగలేంది సేకరించారు. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) ఈ లెక్కలు తప్పుల తడకగా ఉండడంతో కోర్టు తలుపు తట్టారు. మదురై కారాగారంలో 2016–2020 మార్చి వరకు రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు, జైళ్ల శాఖలోని కొందరి మాయా జాలంతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హోం శాఖ, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సూచించారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న గణాంకాలే అవినీతి జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని, తక్షణం కేసును ఏసీబీ విచారణకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సాధ్యమైనంతవరకు త్వరిగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. (చదవండి: అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!) -
సెంట్రల్ జైలులో మృత్యుఘోష
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఖైదీలు మృత్యువాతపడుతున్నారు. జైలు పరిమితికి మించి అధికసంఖ్యలో ఖైదీలు ఉండడంతో వారికి సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కలిపి మొత్తం 1400 మంది ఉన్నారు. 1200 మందికి çసరిపోయే సెంట్రల్ జైలులో అదనంగా 200 మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జైలుకు అతి సమీపంలో ప్రభుత్వ జిల్లా అసుపత్రి ఉన్నప్పటికి ఖైదీలను సకాలంలో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేదు. జైలు నిబంధనల వల్లే ఆసపత్రులకు తరలించడంలో ఆలస్యమై మరణాలు సంభవిస్తున్నాయని పలువురు ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఖైదీని ఆసుపత్రికి తరలించాలంటే జైలు అధికారులు స్థానిక ఎస్పీకి లెటర్ పెట్టాలి. ఆ లెటర్ ఆధారంగా ఏఆర్ కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. జైలులోని ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఏ ఒక్క డాక్టరూ అందుబాటులో ఉండడం లేదని ఖైదీలు చెబుతున్నారు. షిఫ్టులవారీగా డాక్టర్లు డ్యూటీలు చేస్తున్నట్టు రికార్డులు నిర్వహిస్తున్నప్పటికీ రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో లేక ఖైదీలకు ప్రాణాలమీదకు వస్తోందంటున్నారు. సెంట్రల్ జైలులోగల ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు ఫార్మసిస్ట్‌లు, ఎంఎన్ఓలు ముగ్గురు, ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు ఉన్నారు. ఏటా ఖైదీల కోసం రూ. 17 లక్షల మెడికల్ బడ్జెట్ కేటాయిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న 58 పడకల ఆసుపత్రి సెంట్రల్ జైలులో 58 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. దీంతో పాటు జైలు అసుపత్రిలో డాక్టర్లను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. గుండె సంబంధిత (కార్డియాలజిస్ట్) డాక్టర్, మానసిక వైద్యుడిని నియమించాల్సి ఉంది. వైద్య సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంది. సకాలంలో ఖైదీలను ఆసుపత్రికి తరలించేందుకు నిబంధనలు సడలించాలని పలువురు ఖైదీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సెంట్రల్ జైలు వద్ద నిరంతరం సెక్యూరిటీని ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన ఖైదీలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. -
కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ నేషనల్ అకాడమికి చెందిన 33 మంది ట్రైనీ ఐపీఎస్‌లు హైదరాబాద్ కేంద్ర కారాగారాన్ని బుధవారం సందర్శించారు. జైలులో భద్రత, సంక్షేమ కార్యకలాపాలు, పరిపాలన గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా జైలు సూపరిటెండెంట్ అధికారి అర్జున్రావ్ పలు అంశాలపై వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో యువ ఐపీఎస్ అధికారులకు అవగాహన కల్పించారు. దర్యాప్తు, న్యాయ వ్యవస్థ, విచారణ, శిక్షా స్మృతి, ఖైదీల సంస్కరణ, పునరావాసంలో పోలీసుల పాత్రను అర్జున్రావ్ ట్రైనీ ఐపీఎస్‌లకు వివరించారు. ఖైదీల రోజు వారి కార్యక్రమాలు, పెరోల్, సెలవుల విధానం గురించి జైల్ అధికారులు వారికి తెలియజేశారు. యువ ఐపీఎస్‌లు వారికున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు శ్రీనివాస్ రావ్, వెంకటేశం పాల్గొన్నారు. -
జైళ్లు.. హౌస్‌ఫుల్!
- ఖైదీలతో కిక్కిరిసిపోతున్న కారాగారాలు - వీరిలో శిక్ష పడిన వారు మూడో వంతే.. రాష్ట్రంలోని కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. సెంట్రల్ జైలు మొదలుకుని జిల్లా, సబ్‌జైళ్లు అన్నీ కూడా ఖైదీలతో నిండిపోయాయి. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగారాలతో పాటు మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి 6,848 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు జైళ్లు నిండిపోయాయి. కేంద్ర కారాగారాల్లో అయితే సామర్థ్యం కంటే అధికంగా ఖైదీలు ఉన్నారు. మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 3,500 మందితో కిక్కిరిసిపోయాయి. మహిళా కేంద్ర కారాగారం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉమెన్ సెంట్రల్ జైలు కెపాసిటీ 220 కాగా.. ప్రస్తుతం 250 మంది ఉన్నారు. అయితే జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలో మాత్రం సామర్థ్యం కంటే కాస్త తక్కువగానే ఖైదీలు ఉన్నారు. - సాక్షి, హైదరాబాద్ శిక్షపడిన వారు 2,124 మందే జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీల్లో న్యాయస్థానాల్లో శిక్షపడిన వారు మూడో వంతు మాత్రమే. సుమారు 6,800 మంది ఖైదీలకుగానూ శిక్షపడిన వారు 2,124 మందే. మిగతా వారంతా కేసుల విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. శిక్షపడిన ఖైదీల్లో అత్యధికంగా హత్యానేరం కింద శిక్ష అనుభవిస్తున్న వారు 1,180 మంది. దొంగతనం(198), అత్యాచారం(154), వరకట్న హత్యలు(90) వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారూ ఉన్నారు. సిబ్బందిపై పనిభారం.. రాష్ట్రంలోని అన్ని జైళ్లూ ఖైదీలతో నిండిపోయిన నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేక జైళ్ల శాఖ సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకుగానూ 1,500 మంది సిబ్బందితోనే జైళ్ల శాఖ నెట్టుకొస్తోంది. 400 పోస్టులు ఖాళీగా ఉండటంతో పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఐజీ ర్యాంకు స్థాయిగల అధికారి పోస్టు కూడా ఖాళీగానే ఉంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపకపోవడంతో ఉన్నతాధికారులు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ఖైదీల మరణాలు.. మహా పరివర్తన్ పేరిట జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అవలంబిస్తున్న చర్యల ద్వారా ఖైదీల్లో మార్పు వస్తోంది. తెలిసో, తెలియకో తప్పు చేసి జైళ్లకు వచ్చే వారిని మరోసారి తప్పిదం చేయకుండా ఉండేందుకు మానసిక నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వివిధ రకాల దురలవాట్లు, ఆరోగ్యం దెబ్బతిన్న వారు జైలుకు వచ్చాక పరిస్థితి మరింత విషమించి, సమయానికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులకు దూరమై మనోధైర్యం కోల్పోయి.. వివిధ వ్యాధులకు గురై మరణిస్తుంటారు. అయితే గత ఏడాది కాలంగా యోగా, మానసిక నిఫుణుల శిక్షణల వల్ల మరణాల రేటు కూడా సగానికి పైగా తగ్గింది. 2014లో 52 మంది ఖైదీలు మరణించగా, 2015లో 26 మంది వివిధ కారణాల వల్ల మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎనిమిది మంది మాత్రమే మరణించినట్లు సమాచారం. -
సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరార్
నాగ్‌పూర్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. సరిగ్గా అర్థరాత్రి దాటకా 2 నుంచి 4గంటల ప్రాంతంలో వారు జైలులో నుంచి తప్పించుకున్నారు. వీరిలో ముగ్గురిపై ఎంసీవోసీఏ (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైం యాక్ట్) కింద కేసులు నమోదై ఉండగా మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, దొంగతనం కేసులు ఉన్నాయి. తప్పించుకుపోయిన ఖైదీల్లో ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తాగా గుర్తించారు. మరో ఇద్దరు మాత్రం నేపాల్‌కు చెందిన ఆకాశ్ ఘోలు, ప్రేమ్ అని గుర్తించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురిపై 425 సెక్షన్(ఆయుధాల చట్టం), 392 సెక్షన్ (దొంగతనం) కింద కేసులు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీసులు వారికోసం సమీపంలోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, ప్రైవేట్ బస్ స్టేషన్లలో అప్రమత్తత ప్రకటించి గాలింపు చర్యలు ప్రారంభించారు. -
సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డీఐజీ తనిఖీ
వరంగల్‌క్రైం : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం(సెంట్రల్ జైలు)ను జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ కేశవనాయుడు మూడు రోజులుగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం తనిఖీలో భాగంగా గార్డింగ్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. వారి పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలుగుతూ తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజల కు సరైన సేవలు అందించాలని కోరారు. అనంతరం జైలులోపల తిరిగి ఖైదీల విన్నపాలను స్వీకరించి అధికారులకు పరిష్కారం చూపారు. అనంతరం కారాగారంలో రికార్డులను పరి శీలించారు. కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి ఎంఆర్.భాస్కర్, ఉప పర్యవేక్షణాధికారి ఎన్.శివకుమార్‌గౌడ్, మహిళా ఉప పర్యవేక్షణాధికారిణి టి.వెంకటలక్ష్మి , డాక్టర్లు టి.మదన్మోహన్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, జైలర్లు వి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్, ఎ.సాంబశివరావు, పి.వేణుగోపాల్, డిప్యూటీ జైలర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది, గార్డింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పలమనేరు నరహంతుకుల ఘాతుకాలెన్నో!
వేలూరు సెంట్రల్ జైలులోనే ప్లానింగ్ రూ.కోట్ల విలువైన కాపర్ లారీలే టార్గెట్ ఇప్పటికీ వెలుగుచూడని కేసులెన్నో పలమనేరు: లారీలను హైజాక్ చేసి డ్రైవర్లను కిరాతకంగా హత్య చేసే పలమనేరుకు చెందిన నరహంతకుల ఘాతుకాలు ఇప్పటివి కావు. ఏడేళ్లుగా ఇలాం టి ఘటనలకు పాల్పడుతూనే ఉంది. పలమనేరులో కాపురముండే గుండుగల్లు శ్రీరాములే ఈ ముఠాకు నాయకుడు. ఇతను తయారు చేసిన ఎందరో శిష్యులు ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో కీలకంగా మారారు. 12 మంది సభ్యులున్న ఈ ముఠా రెండు జట్లుగా విడిపోయి లారీ హైజాక్‌లకు పాల్పడుతోంది. ఇప్పటికే 12కు పైగా హత్యలకు పాల్పడిన ఈ గ్యాంగ్ వెనుక వెలుగుచూడని కేసులెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. ముఠాలో మొత్తం 12 మంది సభ్యులు గుండుగల్లు శ్రీరాములు ఈ నేరాలకు ఆధ్యుడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తొలుత చిన్నచిన్న మోసాలతో ప్రారంభమై ప్రస్తుతం నరహంతక ముఠాకు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. హత్యలు చే యడంలో సిద్ధహస్తుడు. సెంట్రల్ జైలు లోనే పలు ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. తనకు అవసరమైన అనుచరులను జైలు నుంచే సిద్ధం చేసుకుంటాడు. ఇప్పుడు ఇతని గ్యాంగ్‌లో ఉన్న పలువురు వేలూరు సెంట్రల్ జైలు లో పరిచయమైన వారుగా తెలుస్తోంది. శివకుమార్, రోషన్, జనార్ధన్, మురళి, భరత్ ఓ జట్టుగా, సేట్ అలియాస్ జియావుద్దీన్, గోపి, మహబూబ్‌బాషా, ఆచారిబాషా, వరదరాజులు, సిరాజ్ మరో జట్టుగా హైజాక్‌లకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు శ్రీకాళహస్తి జైలులో ఉన్నారు. కోట్ల విలువైన కాపర్ లారీలే వీరి టార్గెట్.. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతం లో పలు కాపర్ కర్మాగారాలున్నాయి. అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు కాపర్‌తో బయల్దేరే లారీల గురించి స్థానికంగా ఉన్న కొందరు వీరికి సమాచారం అందజేస్తారు. రహదారిలోని డాబాల వద్ద కాపర్ లారీలు ఆగినపుడు అక్కడ ప్రయాణికుల వలే ఆ లారీల డ్రైవర్లకు పరిచయమవుతారు. ముగ్గురు లేదా నలుగురు ఆ లారీలో బయల్దేరితే ఆ లారీని ఫాలో చేస్తూ మరికొందరు ఎస్కార్ట్‌గా వెళతారు. ఇంతవరకు వెలుగుచూడని కేసులెన్నో ఈ గ్యాంగ్‌కు సంబంధించి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల్లో 12కు పైగా హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు వెలుగుచూడని కేసులు మరో పది దాకా ఉన్నట్టు సమాచారం. వీరు హత్య చేసిన డ్రైవర్లను ఏ మాత్రమూ అనుమానం రాకుండా పూడ్చిపెడతారు. అవి బయటపడితే తప్ప వీరి వ్యవహారం వెలుగుచూడదు. పరారైన వారికోసం గాలింపు.. తమిళనాడు డ్రైవర్ల హత్య కేసులో నెల్లూరు జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి పరారైన జనార్ధన్, మురళి, భరత్ కోసం గాలిస్తున్నారు. వీరందరూ పలమనేరుకు చెందిన వారు కావడంతో ఇక్కడి పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. కొందరి కొత్త యువకుల పేర్లు సైతం వెలుగుచూడడంతో వారి గురించి కూడా విచారిస్తున్నారు. -
తీరుమారని సెంట్రల్ జైలు
►ఖైదీల వద్ద దొరుకుతున్న సెల్ఫోన్లు ►గంజాయి తెస్తున్న కోర్టు ఖైదీలు ►నియంత్రణ శూన్యం కోటగుమ్మం (రాజమండ్రి) : సంస్కరణలకు నిలయంగా ఆదర్శంగా ఉండాల్సిన సెంట్రల్ జైలు అంసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొందరు ఇక్కడ నుంచే తమ దందాలు నడుపుతున్నారు. దాంతో సెల్ఫోన్ల వినియోగం ఎక్కువైంది. వారికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 21వ తేదీన టవర్ వద్దగల 2ఏ బ్లాక్‌లో ఆల్తాఫ్ హుసేన్ బక్షీ అనే ఖైదీ వద్ద చైనా ఫోన్, రెండు ఛార్జర్లు, ఒక బ్యాటరీ దొరికాయి. రెండు రోజుల అనంతరం జరిగిన తనిఖీల్లో స్నేహా, గౌతమి బ్లాక్‌ల్లో సెల్ ఫోన్లు దొరికాయి. అరకేజీ గంజాయితో దొరికిన ఖైదీ చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్నపలివెల సత్తిబాబు అనే ఖైదీని ఒక కేసులో విచారణ కోసం ఈ నెల 26న ఆలమూరు కోర్టుకు తీసుకువెళ్లారు. తిరిగి జైల్లోకి తీసుకువచ్చేటప్పుడు జైలు గేటు వద్ద సిబ్బంది జరిపిన తనిఖీలలో సత్తిబాబు అండర్ వేర్లో పొట్లం కట్టిన అరకేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జైలులో గంజాయి సిగరెట్లకు విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్కొక్క సిగరెట్టు రూ 50, బీడీ రూ 25 చొప్పున అమ్ముతున్నారు. దీంతో కోర్టు విచారణకు వెళ్లిన ఖైదీలు తిరిగి జైలుకు వచ్చే సమయంలో గంజాయిని తీసుకు వస్తున్నారు. ఇలాగే మద్యం బాటిళ్లు కూడా సెంట్రల్ జైలులో దొరకడం సాధారణంగా మారింది.