Chandrababu Naidu Arrest Remand & AP Political Updates
తూర్పుగోదావరి జిల్లా.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై 9వరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు
నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
బీ పీ 130/80
పల్స్..71/మినిట్
రెస్పిరేటరీ రేటు...13/మినిట్
ఎస్ పీ ఓటు...97శాతం
ఫిజికల్ యాక్టివిటీ... గుడ్
లంగ్స్... క్లియర్
ఆర్ బీ ఎస్..138 mg/dl
7:00 PM, అక్టోబర్ 21, 2023
ఇంతకీ.. చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడిందెవరు?
► తెలుగుదేశం మీటింగ్ లో లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎల్లో మీడియా
► నా తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు తెలియదు : లోకేష్
► గవర్నర్‌ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు : లోకేష్
► ఇప్పుడు నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ విమర్శిస్తున్నారు : లోకేష్
► నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని చెబుతున్నారు : లోకేష్
► మరీ జైల్లో క్షేమంగా ఉన్న చంద్రబాబుపై సానుభూతి కోసం మీరేం ప్రచారం చేశారు?
► జైల్లో కేజీ బరువు పెరిగినా.. కొంపలు మునిగిపోతున్నాయంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించింది ఎవరు?
► మా నాన్నకు స్టెరాయిడ్‌లు ఇస్తున్నారు.. ఆయన ఆరోగ్యం ఏమై పోవాలి అంటూ దొంగ ఏడ్పులు ఏడ్చింది ఎవరు?
► మా భర్త చంద్రబాబు కిడ్నీలకు ప్రమాదం ఉందని ప్రకటనలు చేసిన భువనేశ్వరీకి డైరెక్షన్ ఎక్కడిది?
► దోమలు, చన్నీళ్లు, ఏసీలు అంటూ లేనివన్ని ఎందుకు అంటగట్టారు?
► ఎప్పటినుంచో ఉన్న స్కిన్ ఎలర్జీని హఠాత్తుగా తెరపైకి ఎందుకు తెచ్చారు?
► ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు అచ్చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందనుకున్నారా?
► మీరు ప్రారంభించిన విష క్రీడ మీ వరకు వచ్చేసరికి మీకు బాధ కలిగిందా?
► ఇంకెన్నాళ్లు జనాల ముందు అసత్యాలు, అబద్దాలు వల్లె వేస్తారు?
6:50 PM, అక్టోబర్ 21, 2023
అయ్యా.. మీరు పాటిస్తున్న సిద్ధాంతమేంటీ? చెబుతున్న నీతులేంటీ?
► పబ్లిక్ మీటింగ్‌ల్లో దిగజారి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్
► ఇటీవల జనసేన మీటింగ్‌లో చెప్పులు చూపించిన పవన్ కళ్యాణ్
► తీవ్ర విమర్శలు రావడంతో కొత్త సిద్ధాంతం వల్లె వేస్తోన్న పవన్
► అధికార ప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాలి : పవన్
► కులాలు, మతాల గురించి పరిమితులకు లోబడి మాట్లాడాలి : పవన్
► రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి కానీ నోరు జారొద్దు : పవన్
► అధికార ప్రతినిధుల కోసం వచ్చే నెలలో వర్క్ షాప్ ఏర్పాటు: పవన్ కల్యాణ్
6:35 PM, అక్టోబర్ 21, 2023
ఓటుకు కోట్లు దొంగలు వాళ్లు
► తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి
► కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు
► ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగ మాటలు చెబుతున్నారు
► బిజెపితో పోరాటం మా DNAలో ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు. మరి రేవంత్ రెడ్డి DNAలో ఏముంది?
► రేవంత్ DNAలో టిడిపి ఉందా? కాంగ్రెస్ ఉందా?
► రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి DNA మ్యాచ్ కావడం లేదు
► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి
6:14 PM, అక్టోబర్ 21, 2023
ఇంతకీ తెలంగాణలో టిడిపికి ఎంత సీను?
► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా
► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 )
► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు?
► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?
5:44 PM, అక్టోబర్ 21, 2023
మన పొత్తు ఎవరితో? జనసేనలో అనుమానాలు
► జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ
► హాజరైన 21 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు
► అసలు జనసేన పార్టీ ఎవరితో పొత్తు అని పార్టీలో ప్రశ్నలు
► అధికారికంగా బీజేపీతో కొనసాగుతున్న ఒప్పందం
► రాజమండ్రి జైలు ముందు టిడిపితో పొత్తు అని ప్రకటించిన పవన్ కళ్యాణ్
► ఇంతకీ జనసేన పొత్తు బీజేపీతోనా? టిడిపితోనా?
► ఒక వేళ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు మిగిలే సీట్లు ఎన్ని?
► అసలు జనసేన తరపున ఖర్చు పెట్టుకోవాలా లేదా అన్నదానిపై అభ్యర్థుల్లో సందేహాలు
5:20 PM, అక్టోబర్ 21, 2023
తెలంగాణలో బీజేపీతో, ఏపీలో సైకిల్ తో
► హైదరాబాద్ : బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన
► జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీలో దాదాపుగా స్పష్టత
► కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లందు, మధిర
► కొత్తగూడెం, అశ్వరావుపేట, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, కోదాడ కేటాయించే ఛాన్స్
► ముందు 36 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్
► 36 కాస్తా 12కు వస్తాయా అన్న అనుమానాలు
► పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టలేదని పార్టీలో ప్రశ్న
5:05 PM, అక్టోబర్ 21, 2023
రాజమండ్రికి బ్రేక్
►రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు భువనేశ్వరి, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ
►ములాఖత్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు
►నాలుగు రోజుల్లో చంద్రగిరికి వస్తానని చెప్పిన భువనేశ్వరీ
4:45 PM, అక్టోబర్ 21, 2023
ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ?
► నవంబర్ 1 నుంచి లోకేష్ ‘భవిష్యత్ కు గ్యారెంటీ’
► ఎవరూ పట్టించుకోకపోవడంతో గద్గద స్వరంతో లోకేష్ స్పీచ్‌లు
► నిన్నటిదాకా పీxxx అన్న లోకేష్ ఇప్పుడు సానుభూతి కోసం గేమ్‌లు
► ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకు బస్సు యాత్రలు చేస్తున్నావు?
► ముందు నువ్వు ఎమ్మెల్యే కావడానికి గ్యారంటీ ఉందా?
► మీ పార్టీ పొత్తుల్లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తుందన్న గ్యారంటీ ఉందా?
► ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించే మ్యానిఫెస్టో మాయం చేయబోరన్న దానికి గ్యారంటీ ఉందా?
► ఇచ్చిన ఏ హామీలోనైనా నిలబడడానికి గ్యారంటీ ఉందా?
► హెరిటేజ్ కోసం ప్రభుత్వ డెయిరీలు మూసివేయబోమన్నదానికి గ్యారంటీ ఉందా?
► అసలు ప్రజల ముందుకెళ్లి నాకు ఇందుకోసం ఓటు వేయండని చెప్పే గ్యారంటీ ఉందా?
► ఏం ఉద్ధరించారని ఓటేయాలని మిమ్మల్ని అడిగితే పారిపోకుండా ఉంటారని గ్యారంటీ ఉందా?
► బయటపడ్డ అన్ని స్కాంల్లో తప్పు చేయలేదని కోర్టు ముందు చెప్పుకోలేని మీ తీరుకు ఏం గ్యారంటీ?
► మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను పట్టుకుంటారా అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పవని గ్యారంటీ ఏంటీ?
► మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించి బేరాలు సాగించబోరన్నదానికి గ్యారంటీ ఉందా?
4:20 PM, అక్టోబర్ 21, 2023
రంగంలోకి భువనేశ్వరీ.. నిజంగా నిజమే చెబుతారా?
► చంద్రగిరి నుంచి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి
► మహిళల్లో సానుభూతి కోసం భువనేశ్వరీని రంగంలోకి దించిన బాబు
► నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP
► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి
► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి
► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి
► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి
► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి
► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి
► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి
► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి
► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి
► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి
3:35PM, అక్టోబర్ 21, 2023
టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్ లేదు: మంత్రి ఆదిమూలపు సురేష్
►టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తా అని.లోకేష్ అన్నాడు
►వాళ్ళ నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు
►పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు
►యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు
►ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్ లేదని తేలిపోయింది
2:30PM, అక్టోబర్ 21, 2023
చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్
►అవినీతి చేయడంలో చంద్రబాబు కాకలు తీరిన యోధుడు
► చంద్రబాబు రాష్ట్రాన్ని లూఠీ చేశారు.. అవినీతిని విశృంఖలం చేశారు
►చంద్రబాబు,లోకేష్ తోడు దొంగలు
►బాబు అవినీతి సామ్రాజ్యం...అక్రమాస్తుల మీద సీబీఐ విచారణ కోరే సత్తా ఉందా?
►బాబును అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడ తెస్తే ఒక్కడూ కూడా వెంట రాలేదు
►చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు
►చంద్రబాబు ఏనాడైనా ఎవరికైనా అండగా నిలిచారా?
►మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టే ఎవ్వరూ మీకు మద్దతివ్వడం లేదు
►ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
►చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు
►పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు
►చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు
►చంద్రబాబు అందరివాడు కాదు
►మా వాడు అని ఆయన సామాజికవర్గం వారు చెప్పుకుంటున్నారు
►పెత్తందార్ల పక్షాన నిలబడి పేదలను విస్మరించినందునే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు
►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది
►పెత్తందారుల పక్షాన పవన్ పాలేరులా మారాడు
►ఇంగ్లిష్ మీడియంపై పవన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు
►సీఎం జగన్ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు
1:00 PM, అక్టోబర్ 21, 2023
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
►రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబుతో ములాఖత్
►ములాఖత్‌లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు
►చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, రామకృష్ణ
అక్టోబర్ 21, 2023, 11:57 AM
న్యాయవ్యవస్థకు ఓ తలనొప్పిగా చంద్రబాబు
సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి సూటి ప్రశ్నలు
►న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతున్నారు
►పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నారు
►మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం
►ఇవన్నీ వింతే కదా?
►ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు
►వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి
►ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం
►పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు
►న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది
►మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు?
►వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా?
అక్టోబర్ 21, 2023, 11:50 AM
అన్ని పిటిషన్లు విచారణ వాయిదా!
►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న
►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న
►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న
►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా
►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు
►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్
అక్టోబర్ 21, 2023, 10:58 AM
అసాంఘిక శక్తులకు గుణపాఠం నేర్పాలి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ వ్యాఖ్యలు
►నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి.
►తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి.
►ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి.
►అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది.
నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. అంతేకాకుండా తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది.
— YSR Congress Party (@YSRCParty) October 21, 2023
- సీఎం వైయస్ జగన్… pic.twitter.com/OSizn9ZZR3
అక్టోబర్ 21, 2023, 10:40 AM
టీడీపీ దృష్టిలో పవన్ వాడిపడేసే వస్తువు
మంత్రి చెల్లుబోయిన వేణు కామెంట్స్
►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
►రాజకీయ విలువలకు పవన్ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
►తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం?
►పవన్‌ను టీడీపీ ఒక టూల్‌గా టీడీపీ వాడుకుంటోంది
►కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం
►ముద్రగడను చంద్రబాబు తీవ్రక్షోభకు గురి చేశారు
►మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే చంద్రబాబు ప్రయత్నం
►చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి
►చంద్రబాబు శకం ముగిసింది
►చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నారు
►దేశంలోని చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో బాబు ఉన్నారు
►18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకి నేడు బెయిల్ రావడం లేదు
అక్టోబర్ 21, 2023, 08:35 AM
ముందు స్కిల్.. ఆ తర్వాతే ఫైబర్‌నెట్
►ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు
► స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణంలో క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం ముందుకే.. ఫైబర్‌నెట్ పిటిషన్ కూడా
►ముందు స్కిల్ స్కామ్ పిటిషన్ తీర్పు వెల్లడిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం
►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ నవంబర్ 9కి వాయిదా
అక్టోబర్ 21, 2023, 07:56 AM
రాజమండ్రిలో పవన్-లోకేష్ భేటీ
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ప్రతిరోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు
►చంద్రబాబుతో ఇవాళ మరోసారి ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు
►ప్రజా స్పందన లేకపోవడంతో నిలచిపోయిన టిడిపి దీక్షలు
►జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం సిద్ధమవుతున్న టీడీపీ
►ఈనెల 23న రాజమండ్రిలో పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ
అక్టోబర్ 21, 2023, 07:24 AM
మనసంతా బాబే
► తెలంగాణ ప్రచారంలో బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబేనంటున్న నెటిజన్లు
► తన గురువు చంద్రబాబు జైల్లో ఉండడంతో ప్రచారంలో నీరసంగా కనిపిస్తోన్న రేవంత్
► కీలక సమయంలో తనకు గురువు నుంచి సూచనలు లేకపోవడంతో బాధలో రేవంత్
అక్టోబర్ 21, 2023, 07:20 AM
నేడు తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశం
► ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యలయంలో ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం
► చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రజలకు ఏం చెప్పాలన్నదానిపై చర్చ
► జనసేన, తెలుగుదేశం సమన్వయం ఎలాగన్నదానిపై చర్చ
► భువనేశ్వరీ కార్యక్రమం నిజం గెలవాలి కార్యక్రమంపై వివరించనున్న లోకేష్
► యువగళం ఎందుకు నిలిపివేశామన్న దానిపై పార్టీ నేతలకు వివరించనున్న లోకేష్
► బాబు ష్యూరిటీ యాత్రను బస్సులో తానే నిర్వహిస్తానంటున్న లోకేష్
► పాదయాత్ర చేసేకంటే బస్సులో యాత్ర బెటరన్న ఆలోచనలో లోకేష్
అక్టోబర్ 21, 2023, 07:18 AM
నేడు బాబుతో ములాఖత్
► నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యులు, ముఖ్యనేతల ములాఖత్
► మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు
► చంద్రబాబుతో ములాఖత్ కానున్న నారా లోకేష్, భువనేశ్వరి, టీడీపీ నేతలు
అక్టోబర్ 21, 2023, 07:08 AM
స్కిల్ కేసులో చంద్రబాబు
►చంద్రబాబు నాయుడిపై స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసు
►స్కిల్ స్కామ్‌లో కింది కోర్టుల్లో దక్కని ఊరట
►ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేత
► హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్
► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారంటూ.. 17ఏని వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపు లాయర్ల వాదన
► నేరం జరిగిన నాటికి 17ఏ సెక్షన్ లేదని.. కేసు కీలక దశలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సర్వోన్నత న్యాయస్థానానికి ఏపీ సీఐడీ విజ్ఞప్తి
►వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
►నవంబర్ 8న తీర్పు
అక్టోబర్ 21, 2023, 07:05 AM
చంద్రబాబు రిమాండ్ @42
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్
► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం
► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో 42వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్
► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి
►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి
►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు
►తాజాగా.. ఐదోసారి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
►నవంబర్ 1వరకు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment