
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ నేత పట్టాభి రామ్ ఇవాళ రాజమహేంద్రవరంలో అతి చేశారు. స్కిల్‌స్కాంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుపై వీరవిధేయత ప్రదర్శించే క్రమంలో.. జైలు బయట పట్టాభి రాం మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై ఆయన చేసిన తొందరపాటు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇప్పుడు.
చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌లోనే.. గతంలో తాను ఉన్నానంటూ ఆ జైలుతో పట్టాభి తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. క్వాష్ పిటిషన్ చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందని పట్టాభి మాట్లాడారు. ఈరోజో లేదంటే రేపో.. కోర్టు ఫార్మాలిటీస్ పూర్తై చంద్రబాబు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారంటూ పట్టాభి వ్యాఖ్యానించారు. వచ్చిన మరుక్షణం.. జనసేన అధినేత పవన్‌తో కలిసి యుద్దం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పట్టాభి స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
అయితే కాసేపటికే ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో.. తీర్పు రాకముందే పట్టాభి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. తీర్పు రాకముందే చంద్రబాబు బయటకు వస్తారని ఎలా మాట్లాడతారు అంటూ పట్టాభిపై అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment