Pattabhiram
-
టీడీపీ పట్టాభి కామెంట్స్ కి వేణుగోపాలరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
బ్రెయిన్ లో ఏ కెమికల్ తేడా ఉన్నాయో చెప్పే టెక్నాలజీ
-
టీడీపీ నేత పట్టాభికి కోర్టు చీవాట్లు
తణుకు: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు శనివారం 41(ఎ) నోటీసులిచ్చారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో పట్టాభి ఎట్టకేలకు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయనకు నోటీసులు అందజేసిన పోలీసులు సుమారు మూడు గంటల పాటు స్టేషన్లోనే విచారించారు. ఈ ఏడాది మే ఆరో తేదీన టీవీ–5 చానెల్లో డిబేట్లో పాల్గొన్న పట్టాభిరాం.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వీరమల్లు ఫణీంద్రకుమార్ మే 8న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 153, 153(ఎ), 505(2), 504, 120(బి) రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద అప్పటి పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టాభిరాం ఎ–1 కాగా, యాంకర్ మూర్తి ఎ–2, టీవీ–5 యాజమాన్యం ఎ–3గా ఉన్నారు. అప్పట్లో ఎ–1 పట్టాభిరామ్‌కు 41(ఎ) నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించకపోగా తనను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తణుకు పోలీసులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులు తీసుకోకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ తక్షణమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నోటీసులు తీసుకుని సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శనివారం తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పట్టాభిరాంకు పోలీసులు నోటీసులు అందించారు. తాడేపల్లిగూడెం ఇన్చార్జి రూరల్ సీఐ మూర్తి నేతృత్వంలో తణుకు పట్టణ ఎస్ఐ కె.శ్రీనివాస్ నోటీసులిచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. -
పట్టాభిరామ్ ఓవరాక్షన్‌పై టీడీపీ నేతల సీరియస్
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ నేత పట్టాభి రామ్ ఇవాళ రాజమహేంద్రవరంలో అతి చేశారు. స్కిల్‌స్కాంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుపై వీరవిధేయత ప్రదర్శించే క్రమంలో.. జైలు బయట పట్టాభి రాం మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై ఆయన చేసిన తొందరపాటు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇప్పుడు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌లోనే.. గతంలో తాను ఉన్నానంటూ ఆ జైలుతో పట్టాభి తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. క్వాష్ పిటిషన్ చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందని పట్టాభి మాట్లాడారు. ఈరోజో లేదంటే రేపో.. కోర్టు ఫార్మాలిటీస్ పూర్తై చంద్రబాబు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారంటూ పట్టాభి వ్యాఖ్యానించారు. వచ్చిన మరుక్షణం.. జనసేన అధినేత పవన్‌తో కలిసి యుద్దం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పట్టాభి స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే కాసేపటికే ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో.. తీర్పు రాకముందే పట్టాభి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. తీర్పు రాకముందే చంద్రబాబు బయటకు వస్తారని ఎలా మాట్లాడతారు అంటూ పట్టాభిపై అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది. -
టీడీపీ నేత పట్టాభి అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు: చికోటి
సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్‌లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్‌లాండ్‌లో కేసు ముగిసిందన్నారు. ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు. చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు. చదవండి: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు -
పట్టాభీ.. ఏంటిది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. అన్నీ ఇలాగే చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ముందే దూరం పెట్టి ఉంటే పార్టీ ఇంతగా భ్రష్టుపట్టింది కాదని కూడా అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అంతేనా! గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు పేరిట ప్రజలకు విడుదలచేసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో మాటవరసకైనా పట్టాభి పేరును ప్రస్తావించకపోవడం పరిశీలనాంశం. గన్నవరం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయిందని జిల్లా నాయకులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నాయకుల పనితీరునూ తూర్పారపట్టిన ఆయనకు ఆ తరువాత పలు విషయాల గురించి తెలియవచ్చింది. జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు కొందరు కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న అంశాలను, అంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణ పరిణామాలను ఏకరువు పెట్టడంతో పాటు సీనియర్లుగా తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు మీకిలాంటివి ఏమీ పట్టలేదని, అప్పుడే కొంతయినా సరిచేసి ఉంటే ఇంతలా పరిస్థితులు ఇప్పుడు తలెత్తేవి కావని అనడంతో చంద్రబాబు కూడా మౌనం వహించారని తెలిసింది. ముఖ్యమంత్రిని ఇతర నాయకులను ఇష్టానుసారం పరుషపదజాలంతో మాట్లాడటం సరికాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పడంతో తమ నాయకుడు మారుమాట్లాడలేదని సమాచారం. అలా చేయడం ముమ్మాటికీ తప్పే.. బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగా పార్టీ ఆదేశిస్తే తానే పోటీచేస్తానంటూ పట్టాభి ఇష్టానుసారం మాట్లాడటంతో నియోజకవర్గానికి చెందిన వారు కూడా అంటీముట్టనట్లు ఉన్నారని విశ్లేషించారు. తనంతట తాను గొప్ప నాయకునిగా పోల్చుకుంటూ రాష్ట్ర, జిల్లాలోని సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, కేశినేని నాని కార్యాలయంలో ఉంటూ పలు ఆరోపణలను ఎదుర్కోవడం, వివాదాలకు కారకుడనే గుర్తింపు తెచ్చుకోవడం తదితరాలతో పాటు పట్టాభి గతంలో అమెరికాకు వెళ్లి ఎన్ఆర్ఐల వద్ద పార్టీపేరు చెప్పి స్వీయ ప్రయోజనాలు పొందారని వివరించడంతో, అవునా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. ‘పట్టాభి గురించి తెలియాల్సిన అంశాలన్నీ మా సార్‌కు ఇప్పటికి తెలిసొచ్చాయి. అతను అంత యూజ్లెస్ నా అంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో ముందే జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అతని మాటలవల్లే కదా మంగళగిరి, గన్నవరంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయి’ అని ప్రస్తావనకు వచ్చిందని ఓ సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలాంటివన్నీ అవసరమా? మొత్తం డైవర్ట్ అయిపోయిందిగా. పార్టీ కూడా బాగా బదనాం అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యంగా పట్టాభికి సంబంధించిన ఆ పాత ఫొటోలు ఎవరు పోస్ట్ చేశారో.. అన్నివిధాలా చాలా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యనాయకుల వద్ద బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పట్టాభి పేరు కూడా లేదాయె... ‘గన్నవరం విధ్వంసం– ప్రజలకు బహిరంగ లేఖ’ అంటూ చంద్రబాబు పేరిట ఇదివరకే పార్టీ విడుదల చేసింది. నాలుగు పేజీల ఆ లేఖలో పట్టాభి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా పేరు మాత్రం రెండు చోట్ల ప్రముఖంగా ఉంది. దీన్నిబట్టి పట్టాభి విషయంలో పార్టీ ఎలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటుందో స్పష్టమైపోతోందని విజయవాడకు చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు. పట్టాభి వ్యవహార శైలిని జిల్లా నాయకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేషన్ కమిటీని అధిష్టానం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో తక్షణం నియమించినట్లు స్పష్టమవుతోంది. -
‘సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలి’
తాడేపల్లి: చిత్తూరు డెయిరీని చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆ స్థానంలో హెరిటేజ్ డెయిరీని చంద్రబాబు తెచ్చుకున్నారని మంత్రి విమర్శించారు. సంగం డెయిరీని ప్రభుత్వం కచ్చితంగా స్వాధీనం చేసుకుని తీరుతుందని మంత్రి తెలిపారు. సంగం డెయిరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు. ‘ టీడీపీ నేత పట్టాభి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో జనానికి తెలియాలి. పాడి రైతుల డబ్బుతో స్థలం కొని డెయిరీ ప్రారంభించారు. మిల్క్ యూనియన్‌కి అధ్యక్షుడైన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కథ నడిపారు. పది ఎకరాల స్థలాన్ని సొంతానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉంటే వాటిని తిరిగి ఇచ్చేసి, కలెక్టర్ దగ్గర నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాకనే మ్యాక్స్ చట్టంలోకి ఏ డెయిరీ అయినా వెళ్తుంది. కానీ అవేమీ జరగకుండానే మ్యాక్స్ చట్టంలోకి తెచ్చి, ఆ తర్వాత సొంతానికి మార్చుకున్నారు. అది కూడా పూర్తిగా చట్ట విరుద్దం. ఎలాంటి ఎన్వోసీలు లేకుండా కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంగం డెయిరీ ని లాగేసుకున్నారు. చిత్తూరు డెయిరీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారు. పట్టాభి భాషకీ, బాడీ లాంగ్వేజ్ కీ ఏదైనా సంబంధం ఉందా?, సీఎం గురించి ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది జాగ్రత్త. చిత్తూరు డెయిరీని ఎవరు నాశనం చేశారో ముందు అది తెలుసుకో. చంద్రబాబు హయాంలో చాలా ప్రభుత్వ ఆస్థులను ప్రయివేటు పరం చేశారు.పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు. -
టీడీపీ నేత పట్టాభి పై RGV ఫైర్
-
పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థునుల ఆందోళన
-
టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
-
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు. ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని. సీఎం జగన్ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా’’ అని ప్రశ్నించారు. (చదవండి: టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి) ‘‘పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు. (చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని ) ‘‘టీడీపీ డీఎన్ఏలోనే లోపం ఉందేమో.. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదు. పట్టాబి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి. సహానానికి కూడా హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని సజ్జల తెలిపారు. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. 'సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంని దూషించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. (చదవండి: AP: దుర్భాషలపై జనాగ్రహం) ఈ క్రమంలో విజయవాడ జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఓ మహిళ పట్టాభిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ఓ గే అన్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో ఓడిపోయారు.. భవిష్యత్తులో కూడా ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుంది. ఫోకస్ అవ్వడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు. సీఎం జగన్‌ని దూషించిన పట్టాభి ఇప్పుడు నిజంగానే ఫోకస్ అవుతున్నాడు. ఇంతకు ముందు వరకు తను ఎవరో తెలియదు. తను హైలెట్ అవ్వడం కోసం ఈ పని చేశాడు. ఈ పట్టాభి ఎవరు అని ఆరా తీయగా మాకు సంచలన విషయాలు తెలిశాయి’’ అని తెలిపారు. (చదవండి: పట్టాభి చేసింది తప్పే; టీడీపీలో సీనియర్ల అసహనం) ‘పట్టాభి ఓ గే. అతడు 1997లో ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయిని లైంగికంగా వేధించాడు. దాంతో కాలేజీ వాళ్లు పట్టాభిని సస్పెండ్ చేశారు. అతడు సస్పెండ్ అయినప్పుడు అతని తండ్రి చలసాని ఆజాద్ కాలేజీకి వచ్చాడు. ఇప్పుడేమో కొమ్మారెడ్డి పట్టాభి అని ఉంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ -
సీఎంపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు
-
పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం: సుచరిత
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కోవిడ్ సమయంలో సీఎం తీసుకున్న నిర్ణయాలకు ప్రశంసలు వచ్చాయన్నారు. కుట్ర ప్రకారం ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారన్నారు. (చదవండి: ‘ఏపీలో అలజడులకు చంద్రబాబు కుట్ర’) ‘‘డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అసత్యాలను వండివార్చి టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వారు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని’’ మంత్రి సుచరిత అన్నారు. ‘‘టీడీపీ నేత నక్కా ఆనందబాబు తప్పుడు ప్రకటనలపై నోటీసులిచ్చాం. పదేపదే బురద జల్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విధానపరంగా ప్రశ్నించకుండా.. కుట్రలు చేస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యలను సభ్య సమాజం హర్షించదు. చంద్రబాబు ఫిర్యాదుపై డీజీపీ స్పందించలేదనడం అవాస్తవం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని’’ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. చదవండి: పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళన -
పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళన
-
పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత పట్టాభి.. ఇవాళ మరింత దిగజారి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంను ఏకవచనంతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. తిరుపతి: సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. తిరుపతి ఆర్టీసి బస్టాండ్ కూడలి లోని గాంధీ విగ్రహం ముందు చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. నిరసన కార్యక్రమం లో పెద్దఎత్తున వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.. విశాఖ: విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు: టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బాబు డైరెక్షన్లో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీలో ‘విద్యార్హతల’ చిచ్చు!.. పట్టాభిరాంపై ఫైర్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్లు ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా కార్యాలయంలో మీడియా ఎదుట కూర్చుని ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ పార్టీని, నాయకులను బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (కేపీ) విద్యార్హత గురించి తీవ్ర పదజాలంతో పదే పదే ప్రస్తావించడం పార్టీకి తలవంపులు తెచ్చేవిధంగా ఉందని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పట్టాభి తీరు చూస్తుంటే తమ విద్యార్హతలను కూడా ఏదో విధంగా తెరపైకి తెచ్చి అందరి నోళ్లలో నానేలా చేయాలనే దురుద్ధేశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. సెల్ఫ్ గోల్.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విద్యార్హత గురించి అంతగా గుచ్చి గుచ్చి మాట్లాడటమంటే పరోక్షంగా ఎంపీ కేశినేని నానిని ఎద్దేవా చేయడమేనని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఎంపీ విద్యార్హత కూడా పదో తరగతే. తన ఎన్నికల అఫిడవిట్లో పది పాస్ అయినట్లు పేర్కొన్నారు. అంతేకాదు బొండా ఉమామహేశ్వరరావు ఎనిమిదో తరగతి పాస్ అయినట్లు చూపారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకటేశ్వరరావు (వెంకన్న) అయిదు వరకు చదివినట్లు పేర్కొన్నారు. టీడీపీకే చెందిన పెనమలూరు, కైకలూరు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జయమంగళ వెంకటరమణలు పదో తరగతి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎనిమిది వరకు చదివినట్లు వారి ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా తెలిపారు. టార్గెట్ కేశినేని! తమ ఎంపీ కేశినేని నాని, నగరంలోని ఇతర సీనియర్ల విద్యార్హతలను పరోక్షంగానైనా తెరపైకి తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ విధంగా విమర్శలు చేసినట్లు స్వపక్షీయులు అభిప్రాయపడుతున్నారు. క్వారీ రగడ గురించి మాట్లాడటం, అందులో లోపాలను ఎత్తిచూపడం వరకు అభ్యంతరం లేదంటున్నారు. పట్టాభి తీరువల్లే లోకేశ్ చదువు గురించి తాజాగా చర్చనీయాంశంగా మారిందంటున్నారు. అధికార ప్రతినిధిగా బాధ్యతలను పార్టీ అప్పగిస్తే దాన్ని స్వపక్షీయుల మీదే తన వ్యక్తిగత రాజకీయ విభేదాలకు వాడుకుంటున్నారని, దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎంపీ వర్గీయులతో పాటు సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం. ‘అతను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో, ఏయే వ్యవహారాలు ఎలా చక్కబెట్టాడో మాకు తెలియకేమీ కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. లెక్కలన్నీ సరిపోతాయి’ అని కేశినేని ముఖ్య అనుచరుడు ‘సాక్షి’వద్ద అభిప్రాయపడ్డారు. -
పరిమళించిన స్నేహం
తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తు్తకొచ్చేపేరు అదృష్ట దీపక్! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్ మొక్క’లాంటివాడు! నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటిపేర్లతోనే పిలుచుకునేవాళ్లం. ఒరేయ్ భావరాజు, గరికిపాటి, కర్రి, నల్లమిల్లి, గోగినేని, ముద్దంశెట్టి, కటకం... ఇలా ఉండేవి పిలుపులు. కానీ పేరుతో పిలిపించుకున్నవాడు ఒక్కడే – అదృష్ట దీపక్! దీపక్ అనీ, దీపూ అనీ పిలిచేవాళ్లం. మేం ఇద్దరమూ ఒకే బెంచీలో కూర్చునేవాళ్లం. యిద్దరికీ కొన్ని కామన్ టేస్టులుండేవి. ఖాళీ సమయాల్లో విద్యార్థులు అందరూ రకరకాల వ్యాపకాలతో ఉంటే, మేము పత్రికలతో, సినిమా కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్లం. అప్పటికే పత్రికలలో వాడు రాసిన చిన్న చిన్న రచనలు అచ్చవుతూ ఉండేవి. ఏవేవో రాయాలని నాకు కూడా పెద్ద పెద్ద కోరికలు మొదలయ్యాయి. ఈ విషయంలో వాడే నాకు ఇన్స్పిరేషన్! ఆ వయసులో మేము పంపిన చిట్టి కథల్నీ, హాస్యరచనల్నీ ప్రచురించి జోకర్, బుడుగు, పకపకలు, నవ్వులు పువ్వులు పత్రికలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాస్టారు కవులెందరినో తీసుకొచ్చి మా స్కూల్లో సాహిత్యసభలు ఏర్పాటు చేసేవారు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ ప్రసంగం–మాకేమీ తలకెక్కలేదు. బయటకొచ్చేసి రాజగోపాల్ థియేటర్లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు చెక్కేశాం. తరువాత ఒకసారి ఆరుద్రను తీసుకొచ్చారు. ఆ ఉపన్యాసం మాత్రం ఎంజాయ్ చేశాం. దీపక్ మేనమామ కళాకారుడు. మా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన ప్రభావంతో దీపక్ బాలనటుడిగా రంగస్థలం మీద అనుభవం సంపాదించాడు. స్కూల్లో ప్రదర్శించే నాటికల్లో ప్రధాన పాత్రధారి మాత్రమే కాదు– దర్శకుడూ వాడే! గొల్లపూడి మారుతిరావు ‘అనంతం’ నాటికలో నాచేత వేషం వేయించి, నన్ను కూడా స్టేజ్ యాక్టర్‌ని చేశాడు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక వాడు రామచంద్రపురంలోనే ఉండిపోయాడు. నేను కాకినాడ, ఆ తరువాత హైదరాబాద్ వెళ్లిపోయాను. అయినా మా స్నేహం చెక్కుచెదరకుండా ఈరోజుకీ ఎంతో ఫ్రెష్‌గా ఉంది. దీపక్ కాలేజ్ లెక్చరర్ వృత్తిలో కొనసాగాడు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నాడు. ఉద్యోగ జీవితంలో విద్యార్థులతో ఏర్పడిన అనుబంధాల ముందు ఈ అవార్డులు, రివార్డులు పనికిరావు అంటాడు.ప్రవృత్తిలో దీపక్ సాహిత్యం, నాటకాల వైపు మళ్లితే, నేను మేజిక్, మనస్తత్వ విశ్లేషణారంగాల వైపు మళ్లాను. మా రంగాలలో కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీవారు హైదరాబాద్‌లో మా యిద్దరికీ ఒకే వేదికమీద ‘కీర్తి’ పురస్కారాలు యిచ్చి సత్కరించడం మరపురాని అనుభవం! దీపక్ సినిమా పాటలు రాస్తున్న విషయం నాకు చాలా రోజుల తరువాత ఇంకా చెప్పాలంటే ‘మానవత్వం పరిమళించే/ మంచి మనసుకు స్వాగతం’ ఆంధ్ర దేశాన్ని పరిమళ భరితం చేసినప్పుడు మాత్రమే ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా తెలిసింది. ఫోన్ చేసి ‘‘ఏరా నువ్వు సినిమాలకు పాటలు రాస్తున్నావా?’’ అని అడిగితే కూల్‌గా అవును అన్నాడు. ‘‘ఈసారైనా మొహమాటం విడిచిపెట్టి నలుగురినీ కలుసుకో!’’ అంటే ‘‘అవసరం లేదు’’ అన్నాడు. ‘‘వాళ్లు పిలిస్తే, వెళ్లి రాసి వస్తున్నా. అవకతవక పాటలు రాయడం నాకు యిష్టంలేదు. నాకు నచ్చితేనే రాస్తా. నచ్చకపోతే రాయనని చెప్పి వచ్చేస్తున్నా. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు’’ అన్నాడు. ఇదీ వాడి మనస్తత్వం! కవిగా, వక్తగా, సినీగేయ రచయితగా, నాటకరంగ న్యాయనిర్ణేతగా, భాషాపరమైన గళ్లనుడికట్టు నిర్వాహకునిగా దీపక్‌కు మంచి గుర్తింపు ఉంది. ఎందరో అభిమానులున్నారు. (నేను ఎప్పుడూ అదృష్టదీపుడి అభిమానినే!) ఇన్ని ప్రత్యేకతలున్నా తన గురించి గొప్పలు చెప్పుకోడు. ‘లో ప్రొఫైల్’ మెయిన్‌టెయిన్ చేస్తాడు. డెబ్బై యేళ్ల నిత్య చైతన్య స్ఫూర్తి, మంచిమనసున్న స్నేహదీప్తి అదృష్ట దీపక్ పరిచయం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తా. సప్తతి నడుస్తున్న వేళ వాడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బి.వి.పట్టాభిరామ్ -
ఆసక్తి కలిగిస్తున్న ‘రామాయణ–2020’
సాక్షి, సిటీబ్యూరో : రామాయణాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయం చేస్తూ, చిన్నారులకు చక్కగా అర్థమయ్యేలా పదకొండున్నరేళ్ల బాలుడు మాస్టర్ విక్రమ్ నాగరాజన్ రచించిన ‘రామాయణ–2020’ పుసక్తం చిన్నారుల్లో ఆసక్తి రెకేత్తిస్తోంది. ఆధునిక ప్రపంచానికి రామాయణాన్ని ఎలా అన్వయం చేసుకోవాలో ఈ పుస్తకంలో వివరించడం విశేషం. ఈ పుస్తకాన్ని చమన్న పబ్లికేషన్స్ ప్రచురించింది. వెల రూ.315. పుస్తక రచయిత విక్రమ్ నాగరాజన్ ప్రస్తుతం అమెరికాలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇతనికి గణితం, జాగ్రఫీ, జువాలజీ, చరిత్ర, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర అంశాల్లోనూ ఆసక్తి ఉందని పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎం.పట్టాభిరామ్ తెలిపారు. పుస్తక కాపీలకు చమన్న పబ్లికేషన్స్, కేరాఫ్ ఎం.పట్టాభిరామ్, 4ఎఫ్, ముస్సోరీహిల్ కౌంటీ, నిజాంపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్–500090, 9502196347 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
విజయాన్ని చిత్రించుకోండి...
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పరీక్షల రోజులు దగ్గర పడుతున్నకొద్దీ పిల్లల్లో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఉండటం సహజమే. అది స్టూడెంట్‌కి ప్రేరణ కలిగించేలా ఉండాలి. కానీ అది ఎక్కువైతే మంచిది కాదు. If you think you can... yes you can, If you think you can not.. yes you are righ్ట అంటారు విజ్ఞులు. మీరు చేయగలరనుకుంటే అద్భుతాలు చేయగలరు. చేయలేననుకుంటే అక్షరాలా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మీ ఒత్తిడికి చెక్‌పెట్టండి. దీనికి పదే పదే సానుకూల సందేశాలు ఇచ్చుకోవాలి. లేదా వాటిని పేపరు మీద రాయాలి. ఉదాహరణకు ఇక్కడ కొన్ని సందేశాలు చదవండి... ‘నాలో ఎటువంటి ఒత్తిడి లేదు’, ‘నేను చదివిన పుస్తకాల్లోని ప్రశ్నలకే సమాధానాలు రాయబోతున్నాను’, ‘నాకు ఎలాంటి టెన్షన్ లేదు’, ‘నేను స్వేచ్ఛాజీవిని’, ‘ఎటువంటి భయభ్రాంతులకు లోను కాను’, ‘నాలో ధైర్యం ఎంతో ఉంది. నేను పరీక్షల్ని సమర్థవంతంగా రాయగలుగుతాను.’ ఇలా ఉండాలి ఆ సందేశాలు. విజువలైజేషన్: ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ముందు విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు మీరు ఎంతో ప్రశాంతమైన స్థితిని హాయిగా అనుభవిస్తున్నారు. రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్. మీరు రాయబోయే పరీక్ష... వెళ్లబోయే ఇంటర్వ్యూ.. ఏదైనా సరే మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీరెంతో ప్రశాంతంగా ఉన్నారు. రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్.. మీ పరీక్షలు దగ్గర పడ్డాయి. మీలో ఆనందం క్షణ క్షణానికి అధికమవుతుంది. పరీక్ష రోజు వచ్చింది. మీరెంతో ఆనందంగా లేచారు. ఇక మళ్ళీ చదవాల్సినదేమీ లేదు. ఆఖరి నిమిషంలో చదివేది ఏమీ లేదు. ఇవన్నీ 364 రోజుల పాటు చదివినవే. రిలాక్స్.. రిలాక్స్.. ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్లారు. మీ ముఖం మీద చిరునవ్వు అలాగే ఉంది. సంతోషంగా హాల్లో అడుగుపెట్టారు. మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. మిగతా విద్యార్థులు కూడా ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటున్నారు. చాలా మంది మొహంలో ఏదో టెన్షన్... అది చూస్తే మీకు నవ్వు వస్తుంది. మనం రాయబోయే పరీక్ష మనం చదివిన పుస్తకాల్లోదే కదా! మరెందెకు టెన్షన్! రాయబోయే పరీక్ష మనం చదువుకున్న భాషలోనే రాస్తాం కదా? ఇంకెందుకు భయం? అని మీకు అనిపిస్తుంది కదూ! రిలాక్స్.. రిలాక్స్.. ఇంతలో గంట మ్రోగింది. ప్రశ్నాపత్రాలు మీ అందరికీ పంచారు. మీరు నవ్వుతూ మీ ప్రశ్నాపత్రం తీసుకున్నారు. అది చూడగానే ఆనందంతో గట్టిగా అరవాలనిపించింది. ఎందుకంటే ప్రశ్నాపత్రం చాలా ఈజీగా ఉంది. అన్నీ చదివినవే. అన్నీ గుర్తున్నవే. ఇంకేం! ఆన్సరు పత్రం మీద, ముందుగా హాల్‌టికెట్ నంబరువేసి, సమాధానాలు రాయటం మొదలెట్టారు. రిలాక్స్.. రిలాక్స్.. ఆశ్చర్యం! సమాధానాలు చకచకా రాస్తున్నారు. రిలాక్స్... రిలాక్స్... మొత్తానికి పేపరంతా తృప్తికరంగా రాశారు. సమయం ఇంకా పదినిమిషాలు ఉంది. రాసిన పేపరునంతా ఒకసారి చూశారు. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు, స్పెల్లింగులు ఉంటే దిద్దారు. ఇంతలో బెల్ మ్రోగింది. ఇన్విజిలేషన్ అధికారికి మీ పేపరు ఇచ్చేశారు. ఆనందంగా బయటకు వచ్చారు. ఇంటికి వచ్చాకా మీ సమాధానాలు సరి చూసుకున్నారు. ఆల్ కరక్టు.. ఆల్ కరక్టు. అదే విధంగా మిగతా పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేశారు. సెలవులిచ్చారు. హాయిగా కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఒకరోజు మీ ఇంటి కాలింగ్‌బెల్లు ఎవరో నొక్కారు. మీ వాళ్ళు వెళ్ళి తలుపుతీశారు. ఆయనొక కొత్త వ్యక్తి. ‘మీరెవరు?’ అని అడిగారు. ‘నేను ఫలానా టీవీ ఛానెల్ నుంచి వచ్చాను. మీ అబ్బాయి/ అమ్మాయికి స్టేట్ ర్యాంకు వచ్చిందని తెలిసింది, ఇంటర్వ్యూ కోసం వచ్చాను’ అన్నాడు. ఒక పక్క నాన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి, అమ్మ ఆనంద బాష్పాలు.. ఎంత అదృష్టవంతులు మీరు? ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? వాళ్లకి మనం ఇంతకన్నా ఇంకేమి ఇవ్వగలం? మీకు కూడా తెలియకుండానే కళ్ళవెంట ఆనందబాష్పాలు జల జల రాలుతున్నాయి. రిలాక్స్.. రిలాక్స్... (ఇలా ఒకటి రెండు నిమిషాల తరువాత తిరిగి మామూలు స్థితికి రావాలి) ఇప్పుడు మీరు నెమ్మది నెమ్మదిగా మామూలు స్థితికి రాబోతున్నారు. నేనిప్పుడు ఐదు నుండి ఒకటి వరకు అంకెలు లెక్కబెడుతున్నాను. ఒకటి అనేసరికి మీరు కళ్లు తెరవగలుగుతారు. సహజస్థితిలోకి రాగలుగుతారు. ఐదు.. నాలుగు.. మూడు.. రెండు.. ఒకటి.. కళ్ళు తెరవండి. వెరీగుడ్. కళ్లు తెరిచిన తరువాత, ఆ విద్యార్థిలో ఎంతో ఆత్మవిశ్వాసం మనం గమనించవచ్చు. జాకబ్సన్ రిలాక్సేషను ద్వారా, ఒక ప్రశాంతమైన స్థితికి పంపి, ఆ తరువాత విజువలైజేషన్ ద్వారా తామనుకుంటున్న స్థితిని ఊహించేలా చేయగలిగితే ఎవరికైనా ఎటువంటి భయాలనైనా పోగొట్టవచ్చునని కౌన్సెలింగ్‌లో రుజువైంది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్.ఎల్.పి) అనే ప్రక్రియలో మనసులో నాటుకుపోయి ఉన్న భయాలను, భ్రాంతులను ఇదే పద్ధతిలో తీసి వేయవచ్చునని శాస్త్ర పరిశోధకులైన రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండరులు రుజువు చేశారు. వారు చెప్పేవాటిలో ముఖ్యమైనది.. దేశపటం దేశం కాజాలదు...అంటే- దేశపటంలో చూపినట్లు ఆ వంపులు, వాగులు అక్షరాలా అలాగే ఉండవు. అదేవిధంగా మన మనసులోనున్న భయాలు భ్రాంతులన్నీ నిజం కావు. అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు. వాటిని మనం సవరించుకోవచ్చు’ అంటారు వారు. ఇది కేవలం స్టూడెంట్స్‌కే కాదు, టీచర్లు, కరస్పాండెంట్ల్లు, ఇతరులు కూడా సాధన చేయవచ్చు. తాము గొప్ప టీచరు అయినట్లు ప్రెసిడెంటు అవార్డు తీసుకుంటున్నట్లు తమ పిల్లలు విజయాలను సాధించినట్లు ఊహించుకోవచ్చు. ఈ సాధన వలన మనసులో ముద్రపడిన అనవసరమైన నె గెటివ్ భావాలు, పాజిటివ్‌గా మారటం ఖాయం. ప్రయత్నాలు కూడా అలాగే చేస్తారు. విజయాలు సాధిస్తారు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, bvpattabhiram@yahoo.com ఫోన్: 040-23233232, 23231123 -
విలువలతోనే విద్యకు సాకారం
= పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు =తల్లిదండ్రులకు ప్రముఖ సైకాలజిస్టు పట్టాభిరామ్ గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో సంస్కృతి, విలువలు, ఆత్మీయత, సంప్రదాయాలపై అవగాహన పెంచినప్పుడే వారి విద్యకు సాకారం లభిస్తుందని ప్రముఖ సైకాలజిస్టు బి.వి.పట్టాభిరామ్ అన్నారు. శనివారం రాత్రి విశ్వభారతి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరగడం, తల్లిదండ్రులపై గౌరవం, ఉపాధ్యాయులపై భయభక్తులు తగ్గడానికి కారణం కేవలం వారిపై తల్లిదండ్రులు తెస్తున్న ఒత్తిడేనని చెప్పారు. కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మానసిక వైద్యుల అవసరం సమాజానికి ఉండేది కాదన్నారు. తాత నిష్ణాతుడైన సైకాలజిస్టుగా ఆ కుటుంబంలో ఉండటం వల్ల వారిలో సంప్రదాయాలు, విలువలు ఉండేవని చెప్పారు. తల్లిదండ్రులు అత్సుత్యాహంతో తమ కుమారుడు ఏ ర్యాంకులో ఉన్నాడనే దానిపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప దాని దుష్పరిణామం ఎలా ఉంటుందో గమనించలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. దాని ఫలితాలే వృద్ధాశ్రమాలు, తల్లిదండ్రుల సామూహిక ఆత్మహత్యలు, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం వంటి వికృత పోకడలు అని వివరించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి, వ్యక్తి మనుగడకు వినియోగించాల్సింది పోయి ఫేస్‌బుక్‌లు, ఇతర చాటింగ్‌లు అంటూ యువత పెడదోవ పడుతున్నారన్నారు. ఇవి సమాజపు కళ్లు మూస్తాయని, నోరు నొక్కేస్తాయని తెలిపారు. యువత ఒక స్థితికి చేరాల్సిన సమయంలో సమయం వృథా చేయడం వల్ల అతని స్థితిగతులనే మార్చేస్తున్నాయని చెప్పారు. పిల్లలకు కొంత సమయం వెచ్చించాలి... పిల్లలకు విలువలు నేర్పేందుకు తల్లిదండ్రుల వారితో విధిగా కొంత సమయం గడపాలని పట్టాభిరామ్ సూచించారు. ప్రధానంగా విద్యలో ఏబీసీడీలతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మరో కొత్త కోణంలో ఏబీసీడీలు నేర్పించాలని సమాజానికి తాను సూచిస్తున్నానని వివరించారు. అవి ఎ ఫర్ ఆటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ క్రియేటివిటీ, డి ఫర్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ ఎగ్జిస్టెన్స్ అంటూ వీటి అర్థాలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పినప్పుడే వారి భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. విశ్వభారతి విద్యాసంస్థ ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల్లో విలువలు పెంచడానికి కృషిచేస్తోందన్నారు. విశ్వభారతి చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు తేవాలని టీచర్లపై ఒత్తిడి తేవడం కంటే వారిలో విలువలు తేవాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. స్కూల్ సీఈఓ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.